Roti
-
హెల్దీ డైట్- మొరింగా రోటీ–దాల్
కావలసినవి: మల్టీ గ్రెయిన్ పిండి – కప్పు; మునగ ఆకులు– కప్పు; నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు – రుచిని బట్టి; నీరు – అర కప్పు.తయారీ: ∙మునగాకు కడిగి చిల్లుల పాత్రలో వేయాలి ∙ఒక పాత్రలో పిండి, ఉప్పు, మునగాకు వేసి కలిపి నీటిని పోస్తూ ముద్ద చేయాలి ∙పిండిని వత్తి పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుంటే మొరింగా రోటీ రెడీ. మొరింగా దాల్ కోసం... కందిపప్పు – కప్పు, మునగాకు– కప్పు, పచ్చిమిర్చి– 2, వెల్లుల్లి రేకలు–2, నిమ్మరసం– టీ స్పూన్, ఉప్పు– రావు టీ స్పూన్, పసుపు– చిటికెడు, నూనె– టేబుల్ స్పూన్, ఆవాలు– ΄ావు టీ స్పూన్, జీలకర్ర – రావు టీ స్పూన్, ఇంగువ– చిటికెడు– వెన్న– టేబుల్ స్పూన్‌తయారీ: పప్పును ఉడికించి మెదిపి పక్కన ఉంచాలి. బాణలిలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఇంగువ, మునగాకు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. కప్పు నీరు ΄ోసి ఉడికించి మెదిపిన పప్పు కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించి నిమ్మరసం కలిపి దించేయాలి.పోషకాలు: ∙పప్పులో..ప్రోటీన్లు–10.36 గ్రా, ఫైబర్–8.7 గ్రా. రోటీలో...ప్రోటీన్లు– 3 గ్రా, కార్బోహైడ్రేట్లు , విటమిన్లు – 15 గ్రా, మునగాకులో క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్‌తో΄ాటు డైటరీ ప్రోటీన్లు, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు... మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.డాక్టర్ కరుణ న్యూట్రిషనిస్ట్ – వెల్నెస్ కోచ్ -
అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది?
బరువు తగ్గాలని చాలామంది తీసుకునే ఆహారం విషయంలో చాలా మార్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కేలరీల తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు అదుపులో ఉంటుందన్న భావంతో రైస్‌కి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలామంది రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. చాలా వరకు చపాతీ లేదా రోటీలతో సరిపెడతారు. నిజానికి బరువు తగ్గడంలో అన్నం, రోటీలలో ఏది బెటర్. ఈ రెండింటిలో ఏదీ కీలకపాత్ర పోషిస్తుంది అంటే..వెయిట్ లాస్ జర్నీలో రెండింటిలో ఏది మంచిదంటే..ముందుగా బియ్యం, రోటీల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో చూద్దాం.అన్నం..బియ్యం అనేది తృణధాన్యం. ఇది చాలా రకాలుగా వస్తుంది. సర్వసాధారణంగా తెలుపు, గోధుమ రంగుల్లో ఉంటుంది. వంద గ్రాముల వైట్ రైస్‌లో ఇవి ఉంటాయి:కేలరీలు: 356 కిలో కేలరీలుకార్బోహైడ్రేట్లు: 78.2గ్రాప్రోటీన్: 7.9 గ్రాఫైబర్: 2.8గ్రాగ్లైసెమిక్ ఇండెక్స్ (GI): 70-80 (అధిక)రోటీ..రోటీని సాధారణంగా గోధుమ పిండితో తయారుచేస్తారని నిపణుల చెబుతున్నారు. వంద గ్రాముల హోల్ వీట్ రోటీలో ఇవి ఉంటాయి:కేలరీలు: 320 కిలో కేలరీలుకార్బోహైడ్రేట్లు: 64.17గ్రాప్రోటీన్: 10.5 గ్రాఫైబర్: 11.3గ్రాగ్లైసెమిక్ ఇండెక్స్ (GI): 55-60 (మధ్యస్థం)క్యాలరీ కంటెంట్: రోటీలో అన్నం కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నం, పోషకాలు తక్కువగా ఉండటం వలన, ఎక్కువ మొత్తంలో తినడానికి దారి తీస్తుంది. ఫలితంగా అధిక కేలరీలు తీసుకునేందుకు కారణమవుతుంది. ఫైబర్ కంటెంట్: బరువు తగ్గడానికి ఫైబర్ కీలకం. ఎందుకంటే ఇది సంపూర్ణత్వం భావనను కలుగజేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోటీని గనుక ముఖ్యంగా సంపూర్ణ గోధుమలతో తయారు చేసినదైతే..దీనిలో తెల్ల బియ్యం కంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ అధిక ఫైబర్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. రోజంతా అధిక క్యాలరీలను తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ప్రొటీన్ కంటెంట్: బరువు తగ్గే సమయంలో కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి ప్రోటీన్ చాలా అవసరం. సంతృప్తికరమైన భావాలను కూడా పెంచుతుంది. రోటీలో అన్నం కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ఇది మంచి ఆకలి నియంత్రణకు దోహదపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్: గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అనేది ఆహారం ద్వారా రక్తంలో ఎంత వేగంగా చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయనేది కొలుస్తుంది. తక్కువ జీఐ ఉన్న ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి మంచివిగా పరిగణిస్తారు వైద్యులు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేసి, తక్కువ ఇన్సులిన్ స్పైక్‌లకు దారితీస్తాయి. రోటీ సాధారణంగా తెల్ల బియ్యం కంటే తక్కువ జీఐని కలిగి ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్: వైట్ రైస్ అనేది శుద్ధి చేసిన ధాన్యం. అంటే దీనిలొ ఊక, జెర్మ్ పొరలను తొలగించడంతో దాని పోషక విలువను తగ్గుతుంది. హోల్ వీట్ రోటీని ఎక్కువ పోషకాలు, ఫైబర్‌ని ఉండేలా తక్కువ ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు. మోతాదుని నియంత్రించొచ్చు: రోటీ ప్రామాణిక పరిమాణం, ఆకృతి ఎంత మేర తీసుకుంటే చాలనేది నిర్ణయించగలం. బియ్య ప్రత్యేకించి ఎంత వరకు తీసుకుంటే మంచిదని సవాలుగా ఉంటుంది. ఒక్కోసారి తెలియకుండానే ఎక్కువ తినేందుకు దారితీస్తుంది.బరువు తగ్గడానికి అన్నం కంటే రోటీకి అనేక ప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఏ ఒక్క ఆహారం వల్ల బరువు తగ్గిపోమని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. నాణ్యతతో కూడిన సమతుల్య ఆహారం, సాధారణ శారీరక శ్రమ ఆరోగ్యకరమైన బరువును సాధించడంలో, నిర్వహించడంలో కీలకమైన అంశాలు.రైస్ కావాలనుకుంటే..ఎక్కువ ఫైబర్, పోషకాల కోసం తెలుపు బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా తృణధాన్యాలని ఎంచుకోండి.అలాగే మోతాదులో తీసుకునేందుకు చిన్న చిన్న కప్పులను వినియోగించండి.పోషక విలువలను పెంచడానికి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, కూరగాయలతో బియ్యం జత చేయండి.అదే రోటీని ఎంచుకోవాలనుకుంటే:గరిష్ట పోషక ప్రయోజనాల కోసం మొత్తం గోధుమ పిండితో తయారు చేయబడిందని నిర్ధారించుకోండి.వండేటప్పుడు లేదా వడ్డించే సమయంలో జోడించిన కొవ్వుల పట్ల జాగ్రత్త వహించండి.సమతుల్య భోజనం కోసం లీన్ ప్రోటీన్లు, కూరగాయలతో జత చేయండి.బియ్యం, రోటీ రెండూ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే. అయితే గోధుమ రోటీలో అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, సులభమైన తక్కువ మోతాదులో తీసుకునే వెసులుబాటు కారణంగా బరువు తగ్గేందుకు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ ఆరర్యోకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే మాత్రం, సమతుఇఉల్య ఆహారం, మంచి జీవన శైలి తదితరాలే కీలకమైనవని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడ బెస్ట్ ఆయిల్స్ ఇవే..!) -
పర్ఫెక్ట్ చపాతీ! మేడమ్‌జీ, ఐడియా అదుర్స్ : వీడియో వైరల్
ఇంటా బయటా మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఉన్న సమయంలో అటు వంట చేస్తూనే, ఇటు పిల్లల్ని స్కూలుకు రడీ చేస్తూ, తాను ఉద్యోగానికి సిద్ధ మవుతూ ఈ విషయంలో శతావధానం చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సమయంలోనే వారి బుర్రల్లో ఐడియాలు కూడా భలే తళుక్కు మంటాయి. ఈ క్రమంలో రోటీ మేకింగ్‌లో ఈజీ ట్రిక్ ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది. ఆ కథా కమామిష్షు ఏంటో చూస్తే మీరు కూడా వావ్..! అంటారు. పర్ఫెక్ట్గా, రౌండ్‌గా చపాతీలు చేయడం అంటే కత్తిమీద సామే. దీనికి చాలా టైం కూడా పడుతుంది. అందుకే చపాతీలు రౌండ్‌గానే ఉండాలా ఏంటి? టేస్టీగా ఉంటా చాలదా అని సరిపెట్టేసుకుంటాం కదా. కానీ రోటీ తయారీలో ఒక మహిళ తెలివిగా వ్యవహరించింది. శ్రమను, సమయాన్ని ఆదా చేసేలా స్మార్ట్‌గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మాయింది. దాదాపు మూడుకోట్లపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Chandni⚡Vinay (@rajput_jodi_) రాజ్‌పుత్ జోడీ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వైరల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలోని మిసెస్ పెర్ఫెక్ట్ మేడమ్... గోధుమ పిండిని మృదువుగా కలుపుకొని ఒక్కొక్కటి విడిగా విడిగా గాకుండా, చపాతీ కర్రతో చాలా వెడల్పుగా ఒక పెద్ద రోటీ లాగా వత్తుకుంది. ఆ తరువాత గుండ్రని ప్లేట్ సాయంతో పెద్ద చపాతీని కాస్తా గుండ్రటి చిన్న చపాతీలుగా కట్ చేసి పెట్టుకుంది. తరువాత చక్కగా కాల్చింది. ఈ సింపుల్ ట్రిక్ చూసి నెటిజన్లు అద్భుతం,సూపర్ అంటూ వ్యాఖ్యానించారు. -
ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
రోటీలు లేదా చపాతీలు చేయడం అంటే అబ్బో పెద్దపని అనుకుంటాం. ఎందుకంటే పిండి కలపాలి కొద్దిసేపు నానివ్వాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి చక్కటి గుండ్రటి షేపులో చెయ్యడం కాల్చడం ఓ ఎత్తు. ఇక ఇంట్లో ఎక్కువ మంది జనం ఉంటే.. ఆ ఇల్లాలు వంటింట్లోనే గంటల తరబడి ఉండిపోవాల్సిందే. ఓ పట్టాన ఆ పని అవ్వదు. ఎవరైన సాయం చేస్తే ఓకే లేదంటే అంతే సంగతి. ఒకవేళ రోటీ మిషన్ ఏదైన ఉంటే సులువుగా అయిపోతుందనుకోండి. ఐతే అందరి వద్ద ఉండొచ్చు లేకపోవచ్చు. అలాంటప్పుడూ ఈ టెక్నిక్ ఫాలోకండి సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ వ్యక్తి గోధుమ పిండిని చక్కగా ముద్దగా కలుపుకోని తనకు కావాల్సిన రోటీల సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టకున్నాడు. ఆ తర్వాత ఒక్కో పిండికి ఎక్కువ మొత్తంలో పొడి పిండి అంది పక్కకు ఉంచాడు. ఇక ఐదు గోధుమ పిండి ఉండల్ని ఒక దానిపై పెట్టి చక్కగా రోల్ చేస్తూ గుండ్రటి షేప్‌లోకి వచ్చేలా నైపుణ్యంగా చేశాడు. అయితే ఇక్కడ ఇలా అన్నింటిని ఒకేసారి చపాతీల్లా చేసినా అవేమీ అతుక్కోలేదు. చక్కటి ఒకేసారి ఐదు రోటీలు గుండ్రటీ షేప్‌లో వచ్చేశాయి. పైగా సెపరేట్‌గా చేసిన వాటిల్లా ఉన్నాయి కూడా. ఈ వీడియోని చేసినా నెటిజన్లు వాట్ ఏ జీనియస్ గురూ. భలే చేశావు అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరూ అలా అస్సలు కుదరదు అని కామెంట్ చేస్తున్నారు. అది వీడియో మాయ అని కూడా అంటున్నారు. అయితే ఇలా ఒకేసారి ఐదు రోటీలు చేయాలంటే మంచి స్కిల్ ఉంటేనే సాద్యం లేదంటే కష్టమే!. View this post on Instagram A post shared by Megha Singh🦋✨ (@hack_it_with_megha) (చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?) -
1,000 మందిని లైంగికంగా వేధించానా? నేనేమైనా 'శిలాజిత్' రోటీలు తింటున్నానా?
న్యూఢిల్లీ: రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదట 100 మందిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడేమో ఎకంగా 1,000 మందిని వేధించానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇంత మందిని అలా చేయడానికి తానేమైనా శిలాజిత్‌తో తయారు చేసిన రోటీలు తింటున్నానా? అని నోరుజారారు. దీంతో బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని అతనిపై ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ సత్యవార్ట్ కదియాన్ మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఏడగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మొదట బ్రిజ్‌పై కేసు నమోదు చేయేలదు. కానీ చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు నిరసన చేస్తే తాను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కాగా.. మహిళ రెజ్లర్లకు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. వారి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. నలుపు రంగులో ఉండే శిలాజిత్ పౌడర్‌ను ఉపయోగిస్తే సామర్థ్యం పెరుగుతుందని అంటారు. ఇవీ క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఇది తింటే పురుషుల శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయంటారు. చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..! -
అబ్బో.. గాల్లో చపాతి చేసిన మాస్టర్ చెఫ్!
-
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రోటీ చేస్తే ఎలా ఉంటుంది? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నారు. ఒక ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం చెఫ్ అవతార మెత్తారు. ప్రముఖ చెఫ్ ఈటన్ బెర్నాథ్‌తో కలిసి రోటీలు చేసిన వాటిని నేతితో ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు రోటీ ఎలా చేయాలో నేర్చుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి వాటిని ఆరంగించారు. చాలా బాగున్నాయంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గేట్స్ ఒక వీడియోను పంచుకున్నారు, దీనిలో రోటీని ఎలా తయారు చేయాలో బెర్నాథ్ గేట్స్‌కు నేర్పించారు. ‘‘మేం కలిసి భారతీయ రోటీని తయారు చేసాం. ఈటాన్ భారతదేశంలోని బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు, అక్కడ అతను గోధుమ రైతులను కలుసుకున్నాడు, కొత్త ప్రారంభ విత్తే సాంకేతికతలతో దిగుబడి గణనీయంగా పెరిగింది’’ అని గేట్స్ క్యాప్షన్‌లో రాశారు.అలాగే 'దీదీ కి రసోయ్' కమ్యూనిటీ క్యాంటీన్ల మహిళలను కూడా కలుసుకున్నారు. అటు పాప్యులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘నేను భారతదేశంలోని బీహార్ కు వెళ్లి వచ్చా.. అక్కడ గోధుమలను పండించే రైతులను కలిశాను. రోటీని తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని పంచుకున్న ‘దీదీ కీ రసోయి’ క్యాంటీన్లకు ధన్యవాదాలు’’ అని ఆయన రాశారు. .@BillGates and I had a blast making Indian Roti together. I just got back from Bihar, India where I met wheat farmers whose yields have been increased thanks to new early sowing technologies and women from "Didi Ki Rasoi" canteens who shared their expertise in making Roti. pic.twitter.com/CAb86CgjR3 — Eitan Bernath (@EitanBernath) February 2, 2023 -
తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్
కావలసినవి: చికెన్ – అర కిలో ; నిమ్మకాయ– ఒకటి ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినట్లు. మసాలా కోసం: బాదం – పది ; పిస్తా – పది ; చిరోంజి– 2 టీ స్పూన్లు ; పచ్చిమిర్చి– 3 ; దాల్చిన చెక్క– అర అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఏలకులు –4 ; మిరియాలు – అర టీ స్పూన్. గ్రేవీ కోసం: నూనె– 3 టేబుల్ స్పూన్లు ; నెయ్యి – 2 టీ స్పూన్లు ; పెరుగు– పావు కప్పు ; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (వేయించాలి) ; టొమాటో పేస్ట్ – అర కప్పు ; రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు ; గ్రీన్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూన్; షాజీరా– టీ స్పూన్ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; వేయించిన జీలకర్ర పొడి – టీ స్పూన్ ; కశ్మీర్మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; కొత్తిమీర తరుగు – కప్పు ; తాజా మీగడ– 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ► చికెన్‌ను శుభ్రం చేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలపాలి. ► మందపాటి బాణలిలో మసాలా దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో తగినంత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ► ఈ మసాలా పేస్టును చికెన్‌కు పట్టించాలి. అందులో నూనె, నెయ్యి, మీగడ మినహా గ్రేవీ కోసం తీసుకున్న అన్నింటినీ వేసి కలిపి రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ► బాణలిలో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్‌ను వేసి మీడియం మంట మీద అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల సేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మీగడ వేసి దించేయాలి. గ్రేవీ చిక్కదనం చూసుకుని అవసరమనిపిస్తే మరిగించిన నీటిని తగినన్ని పోసి కలుపుకోవాలి. నోరూరించే తెలంగాణ రెడ్ చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, బగారా రైస్లకు మంచి కాంబినేషన్. (క్లిక్ చేయండి: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..) -
చలిని తరిమేసే... వేడి వేడి విందు
చలి గడ్డకట్టిస్తోంది. దవడలు బిగుసుకుపోతున్నాయి. పళ్లు కటకటలాడుతున్నాయి. ఈ కాలంలో దేహానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం తినాలి. ఆ ఆహారం రుచిగానూ ఉండాలి. గుజరాతీ మేథీ తెప్లా, యూపీ మీఠారోటీ, తెలుగింటి మునగాకు సూప్, ఆల్ ఇండియా చికెన్ షోర్బా... ఈ వారం ట్రై చేద్దాం. మీఠా రోటీ కావలసినవి: గోధుమపిండి– ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము– 8 టేబుల్ స్పూన్లు; నువ్వులు – టీ స్పూన్; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ► మందపాటి పెనంలో బెల్లం తురుము, కొద్దిగా నీరు పోసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ బెల్లం కరిగే వరకు వేడి చేసి దించేయాలి. ► చల్లారిన తరవాత గోధుమ పిండి, నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసి తగినంత నీటిని వేస్తూ ముద్దగా చపాతీల పిండిగా కలపాలి. ► పది నిమిషాల తర్వాత పిండిని నాలుగు భాగాలు చేసి ఒక్కో భాగాన్ని చపాతీల పీట మీద వేసి కొంచెం మందంగా వత్తుకోవాలి. ► పెనం మీద నెయ్యి వేడి చేసి మీడియం మంట మీద రొట్టెలను రెండు వైపులా తిరగ వేస్తూ దోరగా కాలనివ్వాలి. కొద్దిగా నెయ్యి రాసి వేడిగా తినాలి. మేథీ తెప్లా కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పు ; శనగపిండి– ముప్పావు కప్పు; మెంతి ఆకులు – కప్పు (తరగాలి); మిర్చి పొడి– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ► గోధుమ పిండి, శనగపిండిని జల్లించి అందులో మెంతి ఆకు తరుగు, ఉప్పు, మిర్చిపొడి వేసి సమంగా కలిపిన తరవాత నీటిని పోసి గట్టిగా ముద్ద చేయాలి. ► పిండి ముద్దను బాగా మర్దన చేసి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ► పిండిని పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకుని చపాతీలు చేసే రోలింగ్ పిన్‌తో పలుచగా వత్తి పెనం మీద వేసి రెండు వైపులా తిరగేస్తూ, మధ్యలో నూనె వేస్తూ కాల్చాలి. గుజరాతీ మెథీ తెప్లా రెడీ. ► పై పరిమాణంతో ఎనిమిది తెప్లాలు చేయవచ్చు. మునగాకు సూప్ కావలసినవి: మునగాకు – 2 కప్పులు (కడిగిన తర్వాత తరగాలి); తెల్ల ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; అల్లం తురుము – టేబుల్ స్పూన్; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూన్; టొమాటో ముక్కలు – పావు కప్పు; జీలకర్ర – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్ ; మిరియాల పొడి– టీ స్పూన్; నీరు – 4 కప్పులు; ఉప్పు– రుచికి తగినంత; నెయ్యి లేదా నూనె – అర టీ స్పూన్. తయారీ: ► పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసి సన్న మంట మీద వేయించాలి. ► ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ► ఇప్పుడు వరుసగా టొమాటో ముక్కలు, మునగాకు, పసుపు, ఉప్పు వేసి నీటిని పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికి నీకు సగం అయిన తరవాత స్టవ్ ఆపేసి వడపోయాలి. ► ఈ సూప్‌లో మిరియాల పొడి వేసుకుని తాగాలి. చికెన్ షోర్బా సూప్ కావలసినవి: చికెన్ బోన్స్– 500 గ్రా ; బోన్‌లెస్ చికెన్– 100 గ్రా (చిన్నగా అర అంగుళం ముక్కలు చేయాలి); వెల్లుల్లి రేకలు – 10(సన్నగా తరగాలి); మైదా లేదా మెత్తని వరిపిండి – టేబుల్ స్పూన్; వెన్న – టేబుల్ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; మిరియాల పొడి– 2 టీ స్పూన్లు (రుచికి తగినంత); ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినట్లు. తయారీ: ► చికెన్ బోన్స్‌ను శుభ్రం చేసి మందపాటి పాత్రలో వేసి నాలుగు లేదా ఐదు కప్పుల నీటిని పోయాలి. ► అందులో వెల్లుల్లి తరుగు వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ► వేడి తగ్గిన తరవాత వడపోసి ఈ చికెన్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. ► బాణలిలో వెన్న వేడి చేసి చికెన్ ముక్కలు వేసి సన్న మంట మీద ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. ► మరొక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. ► అవి చిటపట వేగిన తరవాత పిండి వేసి కలిబెడుతూ పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ► ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ స్టాక్, వెన్నలో వేయించిన చికెన్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి, సన్నమంట మీద నాలుగు నిమిషాల ఉడికించాలి. ► ఈ చికెన్ షోర్బాను వేడిగా తీసుకోవాలి. ► గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమందికి మసాలాతో వండిన కర్రీ సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లకు ఇది మంచి ఆహారం, త్వరగా జీర్ణమవుతుంది, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. -
బరువు తగ్గాలా? బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో ఇలా రొట్టెలు చేసుకుంటే
రోజూ రుచిగా తినాలి. కానీ... అద్దం నిండి పోతోంది. ఏం చేయాలి? మితిమీరిన బరువు వద్దు. వ్యాయామం మరీ ఎక్కువ చేయలేం! మరేం చేయాలి? బరువు తగ్గాలంటే... ఏం తినాలో చాలా మంది చెప్తారు. ఎలా వండాలో మేము చెప్తున్నాం. గ్రీన్ పీస్ అక్కీ రోటీ కావలసినవి: ►బియ్యప్పిండి– కప్పు ►పచ్చి బఠాణీ– కప్పు ►ఉల్లిపాయ – 1(తరగాలి) ►కొత్తి మీర తరుగు– 3 టీ స్పూన్లు ►పచ్చిమిర్చి– 3 (తరగాలి) ►జీలకర్ర– టీ స్పూన్ ►కరివేపాకు – 2 రెమ్మలు ►ఉప్పు – తగినంత ►నూనె– టీ స్పూన్ తయారీ: ►బఠాణీలను కడిగి ఉడికించి, నీటిని మరో పాత్రలోకి వంపి పక్కన ఉంచాలి. ►బఠాణీలను మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ►అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యప్పిండి, జీలకర్ర, మిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. ►మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే బఠాణీలు ఉడికించిన నీటిని తగినంత తీసుకుంటూ గారెల పిండిలా కలపాలి. ►అరిటాకు లేదా పాలిథిన్ పేపర్‌కు నూనె రాసి పై మిశ్రమాన్ని పెద్ద ఉల్లిపాయంత తీసుకుని సమంగా అరిశెలాగ వత్తాలి. ►మధ్యలో ఐదారు చోట్ల చిల్లు పెట్టాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి ఈ రోటీని పేపర్ మీద నుంచి జాగ్రత్తగా పెనం మీదకు జార్చాలి. ►మీడియం మంట మీద రెండు వైపులా కాల్చాలి. ఇవి కూడా ట్రై చేయండి: Paneer Halwa Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్, చిలగడ దుంప సూప్ తయారీ -
వైరల్ వీడియో: సోనూసూద్ తందూరి రోటీలు, తింటే మర్చిపోలేరు!
ముంబై: కరోనా కష్టకాలంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మందిని తమ సమస్యల నుంచి ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా అడిగిన వారికి లేదు, కాదు అనకుండా తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పలు వ్యాపారాలు కూడా మెదలు పెట్టాడు. అయితే ఈవేవి తన సొంత లాభం కోసం కాదు. కేవలం చిరు వ్యాపారులకు మద్దతివ్వడం కోసం నెట్టింట్లో చురుకుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సోనూసూద్ సూపర్ మార్కెట్ అని ఒకటి ఓపెన్ చేసి సైకిల్‌పై గుడ్లు, బ్రెండ్ వంటివి అమ్మాడు. దీనికి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందని, ఇందుకు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని, త్వరగా ఆర్డర్ చెయ్యాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. అలాంటి సోనూ కాగా తాజాగా పంజాబీ ధాబా ఓపెన్ చేసి అందులో స్వయంగా తందూరి రోటీలు చేసి అమ్ముతున్నాడు. సోనూ చేసిన రోటీలు తింటే మర్చిపోలేరని, ఒకసారి ఇక్కడ రోటీలు తిన్నవారు ఇక మళ్ళీ ఇంకెక్కడా తినలేరని కామెంట్‌ను జత చేసి ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే చిరు వ్యాపారులను ప్రొత్సహించేందుకు సోనూసూద్ ఇలా వారికి ఉచితంగా ప్రచారం చేస్తున్నాడు. సరసమైన ధరలకు ఇక్కడ పప్పు, రొట్టెలు లభించును అని క్యాషన్ పెట్టిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తుంది. కాగా చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని, వారు దేశానికి వెన్నుముకవంటి వారని సోనూసూద్ తెలిపాడు. చిన్న వ్యాపారాలు తమ రోజువారీ జీవనోపాధిని కొనసాగించలేకపోతున్నారని, వారిని ప్రోత్సహించే దిశగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
వైరల్: ఉమ్ముతూ రోటీలు చేసిన వ్యక్తి
-
పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి
చాలామందికి పెళ్లంటే గుర్తొచ్చేది కమ్మని విందు భోజనమే.. వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా రకరకాల వంటకాలతో వివాహానికి వచ్చినవారి కడుపు నింపుతారు. అందుకే ఎప్పుడైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తే ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనం అంటే బెంబేలెత్తిపోవడం ఖాయం. లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. ఆ సమయంలో అతడికి దగ్గర్లో ఇతర వంటగాళ్లు ఎవరూ లేనట్లున్నారు. ఇంతలో అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు. అతడు చేసిన ప్రతి రోటీ మీద ఇలాగే ఉమ్మాడు. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముందీ, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా మీరట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రోటీని నాశనం పట్టించిన అతడిని మీరట్‌కు చెందిన సోహైల్‌గా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు అతడి నిర్వాకానికి శివాలెత్తిపోతున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి ఆ రోటీలను పెళ్లికి వచ్చినవాళ్లు తిన్నారా? ఏంటని ఆరా తీస్తున్నారు. చదవండి: వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్ వైరల్: వంటకు సాయం చేస్తున్న కోతి! -
వణికించే చలిలో వేడివేడిగా తినాలని..
చలి గజగజలాడిస్తోంది. వణికించే చలిలో వేడివేడిగా తినాలని అంతా అనుకుంటారు. అందుకు వేడిగా కాదు.. స్పైసీగా కూడా కాస్త నోట్లో పడితే ఆ మజాయే వేరు. అందుకోసమే ఈ ప్రయత్నం. అన్నం, చపాతీ, రోటీ, పరాఠా... వంటకం ఏదైతేనేం... ఈ రుచులను జోడిస్తే పసందుగా ఉంటాయి. తియ్యగా, కారంగా, పుల్లగా.. కావలసిన రుచులను ఆస్వాదించొచ్చు. ► సర్సో దా సాగ్ (పంజాబీ వంటకం) కావలసినవి: ఆవ ఆకు – రెండు కప్పులు; తోటకూర – అర కప్పు; పాలకూర – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూను; నెయ్యి – 4 టీ స్పూన్లు; వెన్న – 1 టీ స్పూన్; మొక్కజొన్న పిండి – ఒక టేబుల్ స్పూన్; రాళ్ళ ఉప్పు – కొద్దిగా; నీళ్ళు – తగినన్ని. తయారీ: ముందుగా ఆకు కూరలను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ’ ఒక ప్యాన్‌లో ఆకు కూరలకు తగినన్ని నీళ్ళు జత చేసి, స్టౌ మీద ఉంచి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక పప్పు గుత్తితో బాగా మెదిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి, వేయించాలి పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు జత చేసి, బంగారు రంగులోకి వచ్చేవరకూ వేయించాలి ఆకు కూరల ముద్దను జత చేసి, ఐదు నిముషాల పాటు కలపాలి ఉడుకుతుండగానే రాళ్ళ ఉప్పు, మొక్కజొన్న పిండి జతచేసి, బాగా కలిపి, నాలుగైదు నిముషాలు ఉడికించాలి నెయ్యి జత చేసి, బాగా కలిపి ప్లేటులోకి తీసుకోవాలి వెన్నతో అలంకరించాలి రోటీలు, పూరీలు, పరాఠాలు, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. ► బీట్ రూట్ కబాబ్ కావలసినవి: బీట్ రూట్ తురుము – ఒక కప్పు; టోఫు – అర కప్పు (తురమాలి); వెల్లుల్లి ముద్ద – అర టేబుల్ స్పూను; ఆమ్ చూర్ పొడి – ఒక టేబుల్ స్పూను; వేయించిన దానిమ్మ గింజల పొడి – ఒక టేబుల్ స్పూను; చాట్ మసాలా – చిటికెడు; రాళ్ళ ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – పావు కప్పు; ఓట్స్ పొడి – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత. తయారీ: ఒక పాత్రలో బీట్ రూట్ తురుము, టోఫు తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు, దానిమ్మ గింజల పొడి వేసి, బాగా కలిపి, చేతితో కట్లెట్ మాదిరిగా ఒత్తాలి ఒక్కొక్క దానిలో జీడిపప్పు పలుకులు వేసి, కబాబ్ మాదిరిగా గుండ్రంగా చేయాలి ఓట్స్ పొడిని అద్దాలి ∙స్టౌపై బాణలిలో నూనె కాగాక, కబాబ్స్‌ని అందులో వేయించి, కిచెన్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి గ్రీన్ చట్నీతో వేడిగా అందించాలి ► చిలగడ దుంప రబ్డీ కావలసినవి: పాలు – ఒక కప్పు; ఉడికించిన చిలగడ దుంపల ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీళ్ళు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; పల్లీ, పిస్తా, జీడిపప్పుల పొడి – ఒక టేబుల్ స్పూన్. తయారీ: స్టౌ మీద గిన్నెలో పాలు పోసి, మరిగించాలి ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, పాలు చిక్కబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి చిన్న కప్పులో గోరు వెచ్చని నీళ్ళలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి ఏలకుల పొడి జతచేయాలి పల్లీ, పిస్తా, జీడిపప్పల పొడి జత చేసి, కలిపి దింపేయాలి చల్లారాక, ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి, తీసి అందించాలి. ► భర్వాన్ గోబీ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – ఒక కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ఫిల్లింగ్ కోసం: చీజ్ తురుము – అర కప్పు కిస్మిస్ – 15; దానిమ్మ గింజలు – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు తరుగు – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; కోవా పొడి – 4 టేబుల్ స్పూన్లు పిండి కోసం:సెనగ పిండి – ఒక కప్పు; వాము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని. తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు జత చేసి మరిగించి దింపేయాలి క్యాలీఫ్లవర్ తరుగును అందులో వేసి, మెత్తపడే వరకు ఉంచాలి ఒక పాత్రలో చీజ్ తురుము, కిస్మిస్, దానిమ్మ గింజలు, జీడి పప్పు తరుగు, కొత్తిమీర, అల్లం తురుము, కోవా పొడి వేసి అన్నీ బాగా కలిపి, మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి క్యాలీఫ్లవర్ తరుగును ఇందులో వేసి అన్నీ కలిసేలా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్‌ను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, వేడివేడిగా అందించాలి. ► ముల్లంగి కోఫ్తా కావలసినవి: ముల్లంగి – అర కేజీ, కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను, పల్లీలు – అర టేబుల్ స్పూను, వేయించిన సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా – ఒక టేబుల్ స్పూను, ఎండు మిర్చి – 2, పచ్చి మిర్చి – 1, ఉల్లిపాయ – 1, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి తగినంత, గ్రేవి కోసం: ఎండు మిర్చి – 4, వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, పసుపు – అర టీ స్పూను, ఉల్లి తరుగు – ఒక కప్పు, ఉల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను, నూనె – 100 మి.లీ, పెరుగు – అర కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూను, ఏలకులు – 4. తయారీ: ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక పాత్రలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి, దింపేయాలి నీరంతా ఒంపేసి, ముల్లంగి ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో కొబ్బరి తురుము, పల్లీలు, సెనగ పిండి, గరం మసాలా, ఎండు మిర్చి వేసి బాగా కలపాలి పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి మరోమారు కలపాలి ఉప్పు, ముల్లంగి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. గ్రేవీ తయారీ: మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు వేసి మెత్తగా చేసి, స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఈ ముద్దను వేసి వేయించాలి ఉల్లి తరుగు, ఉల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి పెరుగు, గరం మసాలా, ఏలకులు, అల్లం తురుము ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి అర కప్పు నీళ్లు పోసి, మంట బాగా తగ్గించి, రెండుమూడు నిమిషాలు ఉంచాలి వేయించి ఉంచుకున్న కోఫ్తాలను ఇందులో వేసి, బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి చపాతీలు, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. ► కోవా బఠానీ టిక్కీ కావలసినవి: నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; ఉడికించిన బఠానీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు. ఫిల్లింగ్ కోసం: కోవా – ఒక కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పిస్తా తరుగు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – ఒక టీ స్పూను; ఖర్జూరం తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వేసి దోరగా వేయించాలి బఠానీ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు జతచేసి, కొద్దిగా వేగిన తరవాత పప్పు గుత్తితో మెత్తగా అయ్యేవరకూ మెదపాలి ఒక పాత్రలో కోవాను చేతితో మెదుపుతూ పొడి చేయాలి పచ్చి మిర్చి, పిస్తా, కొత్తిమీర, ఖర్జూరం తరుగు, జత చేసి బాగా కలపాలి బఠానీ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని, వెడల్పుగా ఒత్తి, కొద్దిగా కోవా మిశ్రమాన్ని మధ్యలో ఉంచి, టిక్కీ మాదిరిగా ఒత్తాలి స్టౌ మీద బాణలిలో నూనె వేడెక్కాక, టిక్కీలను అందులో వేసి దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకి తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి. స్నాక్ సెంటర్ ► చికెన్ స్విస్ రోల్ కావలసినవి: చికెన్ తురుము – 1 కప్పు (చికెన్‌ని మెత్తగా ఉడికించి.. సన్నని తురుము చేసుకోవాలి), స్వచ్ఛమైన కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – 2 (మీడియం సైజ్‌వి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 3(చిన్నచిన్న ముక్కలు కట్ చేసుకోవాలి), అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 2 రెబ్బలు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు – 1 టేబుల్ స్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంప గుజ్జు – అర కప్పు (దుంపలను ఉడకబెట్టి ముద్దలా చేసుకోవాలి), మైదా పిండి – 1 కప్పు, రవ్వ – పావు కప్పు, గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు, పాలు – 5 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైౖ కి సరిపడా. తయారీ: ముందుగా స్టవ్ చిన్న మంట మీద పెట్టుకుని.. పాన్‌లో కొబ్బరి నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చికెన్ తురుము, కొత్తిమీర తురుము, బంగాళదుంప గుజ్జునూ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, రవ్వ వేసుకుని సరిపడే నీళ్లతో చపాతీ ముద్దలా కలిపి పక్కనపెట్టుకోవాలి. మరో చిన్న బౌల్లో గోధుమపిండి, పాలను పలచగా కలిపి ఉంచుకోవాలి. అవసరం అనుకుంటే అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మైదాతో చేసిన చపాతీ ముద్దను కాస్త మందంగా చపాతీల్లా చేసుకుని.. అందులో చికెన్ మిశ్రమాన్ని పెట్టి.. రోల్ చేసుకుని ఇరువైపులా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గోధుమపిండి–పాల మిశ్రమంలో ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ► బనానా డోనట్స్ కావలసినవి: అరటిపండ్లు –2, గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు, పంచదార – అర కప్పు, ఉప్పు – చిటికెడు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, గుడ్లు – 2, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, బటర్ – పావు కప్పు (కరిగించినది). తయారీ: ముందుగా అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకుని.. అందులో పంచదార, ఉప్పు, గుడ్లు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్, కరింగించిన బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. తర్వాత డోనట్స్ మేకర్లో పాన్‌కి బ్రష్‌తో కొద్దిగా నూనె రాసి.. గరిటెతో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని అందులో వేసి.. స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ► క్యారెట్ పుడ్డింగ్ కావలసినవి: క్యారెట్ – 3 (గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 కప్పులు (వేడి చేసినవి), ఉప్పు – చిటికెడు, వేరుశనగలు – 2 టేబుల్ స్పూన్లు (వేయించి తొక్క తీసినవి), పంచదార – అర కప్పు, పాల పొడి – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. క్యారెట్ ముక్కలు పాన్ బౌల్లో వేసుకుని.. అందులో వేడి వేడి పాలు పోసుకుని.. చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి గరిటెతో తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనివ్వాలి. వేరుశనగలనూ వేసి వాటినీ మెత్తగా ఉడకనివ్వాలి. క్యారెట్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ బౌల్లో వేసుకుని, మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముందుగా ఉపయోగించిన బౌల్‌లోనే వేసి పంచదార, పాల పొడి వేసుకుని మరికాసేపు గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గరిటెతో తిప్పుతూ మళ్లీ ఉడకనివ్వాలి. బాగా దగ్గర పడిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మరింత దగ్గర పడేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మొత్తం నెయ్యి వేసి.. చివరిగా ఒకసారి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకుని.. 5 అంగుళాల లోతుండే బౌల్లోకి తీసుకుని రెండు లేదా మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని బోర్లించి.. బయటకు తీసుకుంటే క్యారెట్ పుడ్డింగ్.. జున్ను ఉంటుంది. దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
రెండు రొట్టెలు.. రూ. 70 వేలు
స్త్రీలకు ఏమీ రాకపోవడం అంటూ ఎప్పటికీ ఉండదు. వారికి వచ్చింది కూడా ఎంతో విలువైనదే. హర్యాణాలోని నౌరంగాబాద్ అనే చిన్న పల్లెలో ఉండే బబితా ఒకరోజు రెండు రొట్టెలు చేసింది. ఆమె చేస్తున్న పనిలో పొందిక చూసిన మరిది వీడియోలో షూట్ చేసి యూ ట్యూబ్‌లో పెట్టారు. ఇక ఆమె వంట గదికి లక్షల మంది అభిమానులయ్యారు.తన కట్టెల పొయ్యి మీద వారానికి ఒకటి రెండు వంటలు చేసి వీడియోలు పెడుతున్న బబితకు యూట్యూబ్ నెలకు 70 వేల రూపాయలు ఇస్తోంది! ఆ ఇంట్లో ఇనప్పెట్టె వంట గదిలో ఉందని వారికి 2017 వరకూ తెలియలేదు. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన బబితా పర్మార్ చేతుల్లోనే ఆ ఇనప్పెట్టె తాళం ఉంటుందని కూడా వారికి తెలియదు. ఇదంతా ఒక విస్మయంతో మొదలైంది. హర్యాణాలోని నౌరంగాబాద్ అనే చిన్న గ్రామంలో బబితా ఇంటికి కోడలుగా వచ్చింది. ఆమె వంట బాగా చేస్తుంది. తినడానికే కాదు చూడటానికి కూడా బాగుంటుంది. మరది రంజిత్‌కి ఇది తెలుసు. వదిన చేసే వంట వీడియోలను యూట్యూబ్‌లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. యూ ట్యూబ్ వీడియో చానల్ ఎవరైనా ఎప్పుడైనా మొదలెట్ట వచ్చని తెలిశాక అతడు ఆగలేదు. మొదటి వీడియో ఫ్లాప్ రంజిత్ దగ్గర కేవలం పది వేల రూపాయల మామూలు ఫోన్ ఉంది. మొదటగా వదినను ఒప్పించి ‘పిండి బాగా కలపడం ఎలా’ అనే వీడియో చేశాడు. ‘ఇండియన్ గర్ల్ బబితాస్ విలేజ్’ పేరుతో వీడియో చానల్ ఓపెన్ చేసి మొదటిసారి దానిని అప్లోడ్ చేశాడు. అలా 2017లో వారి చానల్ మొదలయ్యింది. అయితే మొదటి వీడియోను ఎవరూ పెద్దగా చూడలేదు. మరిది ఈసారి ఒక ఎడిటింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ‘మృదువైన రొట్టెలు తయారు చేయడం ఎలా’ అని వదిన తో వీడియో చేశాడు. ఆశ్చర్యం. రెండు రోజుల్లోనే దానికి పది లక్షల వ్యూస్ వచ్చాయి. వదిన, మరిది ఇద్దరూ స్టన్ అయ్యారు. ఇక వాళ్ల ప్రయాణం మొదలైంది. ఇల్లే సెట్ బబిత ఇల్లు టిపికల్ భారతీయ పల్లెటూరి ఇల్లు. కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్, అలికిన పరిసరాలు... ఇలాంటివన్నీ వీడియోలో వచ్చేలా మరిది వంట వీడియోలు షూట్ చేస్తారు. ఎక్కువమందికి అవి నచ్చుతున్నాయి. తల మీద ఘూంఘట్‌ను అలాగే ఉంచుతూ చకచకా వంట చేసే బబితా చేతి నైపుణ్యాన్ని కూడా ఎక్కువమంది చూడటానికి ఇష్టపడుతున్నారు. నెలకు నాలుగైదు వంటలు చేసి వదిన–మరిది అప్లోడ్ చేయడం ప్రారంభించారు. ‘మూలీ కె పరోఠే’, ‘పంజాబీ కడై పకోడా’, ‘గార్లిక్ ఆనియన్ చీజ్ పరోఠా’, ‘ఆలూ భుజియా’, ‘గమ్ లడ్డూ’లాంటి దేశీ వంటకాలు చూసి చేసుకునే అభిమానులు మెల్లగా పెరిగారు. మొదటి పారితోషికం 13,400 యూట్యూబ్ చానెల్ మొదలైన ఆరునెలల తర్వాత యూట్యూబ్ ఆ చానెల్‌ను మానిటైజ్ చేయడం మొదలెట్టింది. బబిత అకౌంట్లో డబ్బు పడటం మొదలయ్యింది. అయితే అవన్నీ ఉత్తుత్తి డబ్బు అని నిజం డబ్బు కాదని స్నేహితులు చెప్పారు. కాని ఒకసారి నిజం డబ్బు పడింది. తొలి పారితోషికం 13,400 రూపాయలు. అవి పడిన రోజు ఆ ఊరంతా ఒక వింతగా చెప్పుకున్నారు. కుటుంబం ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత నెలకు కచ్చితంగా నాలుగైదు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యేలా చూసుకున్నారు. యూ ట్యూబ్ నుంచి రెగ్యులర్‌గా డబ్బుపడటం మొదలైంది. కొన్నిసార్లు ఇరవై వేల లోపు పడేది. ఒక్కోసారి రెండు లక్షలు పడేవి. యావరేజ్‌గా చూసుకుంటే ఇప్పటికి వారికి నెలకు అరవై డెబ్బయి వేలు వచ్చినట్టు లెక్క. ఈ డబ్బుతో రంజిత్ మంచి ఫోన్లు, కెమెరా స్టాండ్లు, లాప్టాప్ కొన్నాడు. మిగిలిన డబ్బు ఎలాగూ కుటుంబానిదే. ఇప్పటికి ఈ వదినా మరిది కలిసి 124 వీడియోలు అప్లోడ్ చేశారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఈ చానల్‌కు ఉన్నారు. హర్యాణాలోని మారుమూల పల్లెటూళ్లో ఒక వంట గది నుంచి కూచుని ఇంత ఉపాధి పొందవచ్చు అని వీరు నిరూపించారు. ప్రయత్నించాలేగాని ఇలాంటి ఉపాధి మార్గాలు వేనవేలు. – సాక్షి ఫ్యామిలీ -
‘ఫ్లాట్‌బ్రెడ్ ఉడికిస్తే ఉబ్బిపోతుంది’
సాధారణంగా పూరీలు, చపాతీలు తయరుచేసేటప్పుడు పొంగి తాజాగా కనిపిస్తే వెంటనే తినాలనిపిస్తుంది. అంతే కాకుండా కొన్నిసార్లు చపాతీలను పెనం మీద కాల్చినప్పుడు అవి ఒక్కసారిగా ఉబ్బిపోటం చూసి ఆశ్చర్యపోతాం. అచ్చం అలాంటి ఒక వీడియోను ఫుడ్ ఇన్సైడర్ అనే వెబ్సైట్ తన ట్వీటర్ఖాతాలో పోస్ట్ చేసింది. ‘భారతీయ ఫ్లాట్‌బ్రెడ్ ఉడికించినప్పుడు ఉబ్బిపోతుంది’ అని కామెంట్ జతచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విటర్లో 248వేల మంది లైక్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ.. సరదాగా మీమ్స్ తయారు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో రెండు రోటీలను మంటపై వేసి కాల్చటంతో అవి ఒక్కసారిగా ఉబ్బిపోతాయి. అయితే వీటిని పుల్కా అంటారని, పుల్కాలు అధికంగా పొంగుతాయని ఫుడ్ ఇన్సైడర్ తెలిపింది. అదే విధంగా రోటీలు, చపాతీలు కూడా తయారు చేసేటప్పుడు ఉబ్బిపోతాయని తెలిపింది. ఈ పుల్కాలను అధికంగా గ్లూటెన్ ఉండే గోధుమ పిండి(అట్టా)తో చేశామని పేర్కొంది. అట్టా ఉపయోగిస్తే పిండి వంట చేసేటప్పుడు రొట్టెలు పగలకుండా ఉంటాయని ఫుడ్ ఇన్సైడర్ పేర్కొంది. దీనితో మెత్తగా రోటీలు పొంగి టేస్టీగా ఉంటాని పేర్కొంది. ‘నీరు తడిగా ఉంటుంది, ఐస్‌క్రీం చల్లగా ఉంటుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అదే విధంగా మేము చపాతీలు చేసినప్పుడు ఇలా పొంగవు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. This Indian flatbread puffs up when cooked 🤤 pic.twitter.com/rA1XWHnFD0— Food Insider (@InsiderFood) June 9, 2020 -
మిన్న.. జొన్న
ఇటీవల రాత్రిపూట చాలామంది రోటీలు తింటుండటం చూస్తూనే ఉన్నాం. మరికొందరు గోధుమరొట్టెలకు బదులు కాస్తంత మార్పు అంటూ జొన్నరొట్టెలు తింటున్నారు. తక్కువ వర్షపాతంలో కూడా జొన్నలు తేలిగ్గా పండుతాయి. కాబట్టి వర్షపాతం అంతగా లేనిచోట కూడా జొన్నలను విస్తృతంగా సాగుచేస్తుంటారు. అందుకే చాలా సంస్కృతుల్లో జొన్నన్నం, జొన్నరొట్టెలూ నిత్య ఆహారంగా ఉన్నాయి. మనం రెండు మూడు తరాల కింద వరి ఆహారానికి మారకముందు జొన్న అన్నం, జొన్నరొట్టెలు తినడమే పరిపాటి. జొన్నల్లో ప్రోటీన్లు ఎక్కువే. అందుకే జొన్న రొట్టెల్ని బలవర్థక ఆహారంగా పరిగణిస్తుంటారు. వీటిల్లో ఐరన్, క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువ. థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి బీకాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువ. జొన్నల్లో ఉండే ఫీనాలిక్ యాసిడ్స్, ట్యానిన్స్, యాంథోసయనిన్ వంటి పోషకాలు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అన్నిటికంటే ప్రధానమైన అంశం... జొన్నలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. అందువల్ల ఊబకాయం (ఒబేసిటీ) ద్వారా వచ్చే ఎన్నో అనర్థాలను నివారించినట్లు అవుతుంది. గుండె ఆరోగ్యానికీ జొన్న ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు వచ్చే ఎన్నోరకాల సమస్యలను నివారిస్తాయి. మలబద్ధకం సమస్యను స్వాభావికంగా అధిగమించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలాకాలం పాటు యౌవనంగా కనిపించడం సాధ్యమవుతుంది. గ్లూటెన్ కారణంగా గోధుమ వల్ల అలర్జీ ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. -
మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..
సాక్షి, అంబాజీపేట: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఫిజా.. బగ్గర్లు.. పాస్ట్ ఫుడ్ వైపు చూస్తున్నారు. కాని కోనసీమలో మాత్రం మూకుడు రొట్టె కోసం ప్రియిలు సాయంత్రం సమయంలో మూకుడు రొట్టె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ ఆల్ఫాహారం తీసుకోవడం సర్వసాధరణం. ఇడ్లీ, పూరీ, బజ్జీ, గారె తదితరవి అల్పాహారాలు తీసుకుంటాం. చల్లని సాయంత్రం సమయంలో వేడే వేడి మూకుడు రొట్టె, పైగా మట్టి మూకుడులో సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన మినపరొట్టెను అరటి ఆకులో వేసుకుని తింటూ ఉంటూ ఆరుచికి లొట్టలేసుకుని మరీ తింటున్నారు టిఫిన్ ప్రియులు. వివరాల్లోకి వెళితే అంబాజీపేట మండలం ముక్కామలలో ఒక చిన్న పూరి పాకలో కాల్వగట్టుపై చిన్న హోటల్ ఉంది. అబ్బిరెడ్డి సత్యనారాయణ గత 50 ఏళ్ల నుండి ఈ పూరి పాకలో మినపరొట్టెను సాయంత్రం సమయంలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మట్టి మూకుడులో నిప్పులపై కాల్చిన మినపరొట్టె ఎంత రుచో మాటల్లో చెప్పలేమని రొట్టె ప్రియులు చెబుతున్నారు. పావలా నుండి రూ.15 వరకు గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ హొటల్ మినపరొట్టెకు ఫేమస్. 25 పైజల నుండి నేటు రూ.15 రూపాలయు విక్రయిస్తూనే ఉన్నానని సత్యనారాయణ తెలిపాడు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హొటల్ నిర్వహిస్తానని చెబుతున్నాడు. ప్రతీ రోజు సుమారు 100 నుండి 150 మినప రొట్టెలను విక్రయిస్తానంటున్నాడు. సాంప్రదాయ ఇంధనంతో తయారీ.. మట్టి మూకుడులో మినపరొట్టె తయారీకి సత్యనారాయణ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తాడు. ఇటుకలపొయ్యిపై కొబ్బరి డొక్కలను ఉపయోగిస్తాడు. మట్టి మూకుడులో మినపపిండి వేసి దానిపై మూత ఉంచి కింద పైన డొక్క నిప్పుల సెగతో రొట్టెను తయారు చేస్తాడు. అరటి ఆకులోనే సరఫరా టిఫన్ ప్లేట్లలో ప్లాస్టిక్ పేపర్, గ్లాసులు కూడా వాడకుండా అరటి ఆకులో టిఫిన్ వేసి సరఫరా చేస్తున్నాడు. 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మట్టి మూకుడు, నిప్పుల పొయ్యి తప్ప దేనిపైనా వండలేదని చెబుతున్నాడు. రంపచోడవరం: గిరిజనుల ఆహారంలో ప్రత్యేకమైనది వెదురు కూర. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వెదురు కోకిం కుసీర్ అని పిలిచే వెదురు కూరను ఇంగ్లిషులో బాంబూ షూట్ అని అంటారు. అడవిలో వెదురు బొంగులు ఏర్పడడానికి ముందు లేత మొక్కలు (వెదురు కొమ్ములు) వస్తాయి. ఆ దశలో అవి భూమిలో నుంచి పైకి రాగానే వాటిని కట్‌చేసి పై పొరను తీసేసి శుభ్రం చేసి గోరువెచ్చని నీటిలో ఉడకబెడతారు. అనంతరం వాటిని సన్నగా తురిమి కారం, మసాలా దినుసులు కలిపి కూరగా వండుతారు. కొంతమంది వాటిని ఎండబెట్టి కొన్నిరోజుల తరువాత కూడా కూరగా వండుకుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు వెదురు కొమ్ములను సేకరించి కొమ్ములుగా లేక సన్నగా తరిగి సంతల్లో విక్రయిస్తున్నారు. వెదురు కొమ్ములతో పచ్చళ్లు కూడా తయారు చేసి పట్టణాల్లోని గిరిజన స్టాల్స్‌లో విక్రయిస్తున్నారు. -
ఇదిగో... ఇతనే నా భర్త
నమస్తే! నా పేరు కోమల. నాకు యాభై ఏళ్లు. డబ్బులు లెక్కపెట్టడం, బస్‌ల మీది పేర్లు చదవగల జ్ఞానం తప్ప పెద్దగా చదువు లేదు. చిన్నప్పుడే పెళ్లి చేసేశారు మావాళ్లు. చేసుకున్నవాడు ముగ్గురు పిల్లలనిచ్చి.. తాగుడుకు బానిసై ఓ రోజు ప్రాణం విడిచాడు. అప్పు తప్ప ఆదాలేని జీవితం. పెళ్లిలో మా అమ్మ పెట్టిన రెండు బంగారు గాజులు తప్ప ఆస్తి లేదు. అవీ తాగడం కోసం అమ్మేస్తాడని చాలా జాగ్రత్తగా దాచా. మా ఆయన చనిపోయినప్పుడు వాటినే అమ్మి అంత్యక్రియలు చేయించా. పిల్లలను పోషించేందుకు మిగిలిన ఇంకాస్త డబ్బుతో ఓ కూరల బుట్ట కొని కోల్‌కతా వీధుల్లో కూరగాయలు అమ్మే పని పెట్టుకున్నా. రోజులు గడిచాయి. ఖర్చులూ పెరిగాయి. సంపాదనలోనే కాస్త కాస్త మిగుల్చుకుంటే కూరలతోపాటు బ్రెడ్డు, కోడిగుడ్లూ అమ్మడం మొదలుపెట్టాను. పిల్లలనూ చదివిస్తున్నాను. అలా కొన్నాళ్లకు దాచిన డబ్బుతో చెట్టుకింద చిన్న పాక వేసి దాల్ రైస్, దాల్ రోటీ అమ్మడం మొదలుపెట్టాను. పిల్లలకు రెక్కలొచ్చి వెళ్లారు పిల్లలు డిగ్రీకొచ్చేసరికే సొంతూళ్లో స్థలం కొన్నాను. వాళ్లకు ఉద్యోగాలు దొరికాక.. ఇల్లూ కట్టుకున్నాం. పిల్లల పెళ్లిళ్లూ చేశాను. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయాక.. నేను, చెట్టు కింద హోటల్ లాంటి చిన్న పాకా మిగిలాం. నా బాధ్యతలు తీరిపోయాక కానీ అతనిని గమనించలేదు నేను. రోజూ వచ్చేవాడు నా హోటల్‌కు. ఉదయం టీ కోసం.. మధ్యాహ్నం దాల్ రోటీ కోసం.. సాయంత్రం మళ్లీ రోటీ కోసం! తినేసి డబ్బులిచ్చి వెళ్లిపోకుండా నా పనుల్లో సాయం చేసేవాడు. ఉల్లిపాయ తరిగివ్వడం దగ్గర్నుంచి గిన్నెలు తోమడంలో కూడా. జనాలు ఎక్కువగా ఉంటే వడ్డించేవాడు కూడా. అలా అతనితో స్నేహం కుదిరింది. పెరిగింది. గిన్నెలు తోమేటప్పుడు.. తన యజమాని దగ్గర్నుంచి నుంచి మమతా దీదీ దాకా చాలా విషయాలు చెప్పేవాడు. ఆ మాటల్లోనే తెలిసింది అతనికి ఎవరూ లేరని. అతనో అనాథని. ‘‘దిగులు పడకు.. పిల్లలుండీ కూడా నేనిప్పుడు అనాథనే కదా! ఎవరి దార్లో వాళ్లు పోయారు. నేనూ నీలాగా ఒంటరినే’’ అన్నాను సముదాయించడానికి. అతను రెక్కలు కట్టుకొచ్చాడు! విమ్‌బార్ పీచుతో బాండీని రుద్దుతున్నప్పుడు మొహం మీద పడ్డ నా జుట్టును పక్కకు సవరిస్తూ చెప్పాడు ‘‘కోమలా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని. షాక్ అయ్యా. తేరుకున్నాక నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వా. అతను చిన్నబుచ్చుకున్నాడు. తెల్లవారి మళ్లీ చెప్పాడు నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం అని. అప్పటి నుంచి అతనిని చూసే నా దృష్టిలో మార్పు వచ్చింది. ఆప్తుడుగా.. ఆత్మీయుడిగా కనిపించసాగాడు. నా పట్ల అతనికున్న ఇష్టం.. ఆ వయసులో నాకు తోడు ఎంత అవసరమో ఆలోచించేలా చేసింది. తోడు అవసరమనే నిర్ణయానికీ వచ్చింది నా మనసు. ఓ రోజు అడిగా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. చేసుకుంటాను అన్నాడు. మా పిల్లలతో చెప్పా. నాకు ఒంట్లో బాగా లేదని ఎన్నిసార్లు చెప్పినా పని అనే సాకుతో తప్పించుకున్న పిల్లలు ఈ మాట చెప్పగానే ప్రత్యక్షమయ్యారు. సిగ్గులేదా? నువ్వసలు తల్లివేనా? ఇదేం పోయేకాలం.. మా పెళ్లాలు ఏమనుకుంటారు నీ గురించి? చుట్టాలకేం సమాధానం చెప్పుకోవాలి? ఈ వయసులో ఇదేం బుద్ధి? వగైరా వగైరా చాలా తిట్లే తిట్టారు. ఆగక.. అతనిని కొట్టారు. నా మనసుకూ రెక్కలొచ్చాయి నేను తోడు కోరుకోవడం తప్పా? నా మంచీచెడు నేను ఆలోచించుకునే హక్కు నాకు లేదా? అమ్మంటే పిల్లలకు బానిసేనా? విధవరాలిగా.. కొడుకుల ఆదరాభిమానాల భిక్ష కోరుతూనే బతుకు చాలించాలి కాని.. నాకంటూ ఓ జీవితం ఉండకూడదా? ఈ వయసా..? అంటే ?ఈ వయసులో తోడు కోరుకునే అర్హత నాకు లేదా? ఎందుకుండదు? ఇది నా జీవితం.. అందుకే.. అతని చేయి పట్టుకున్నా. ఒకరికొకరం తోడుగా ఉందాం అని పెళ్లి చేసుకున్నా. ఈ ఫొటోలో కనిపిస్తున్న అతనే నా భర్త. అన్నట్టు మమ్మల్ని మా పిల్లలే కాదు.. నా చుట్టాలు.. చుట్టుపక్కల వాళ్లూ వెలేశారు. కోల్‌కతాలోని ఆ చెట్టుకింది మా పాకే మాకిప్పుడు ఆశ్రయం. ఎప్పటిలాగే రోజూ పాలు తెస్తాడు. కాస్తాడు. ఉల్లిపాయలు, ఆలు తరిగిస్తాడు. గిన్నెలూ తోమిపెడతాడు. జనాలు ఎక్కువగా ఉంటే భోజనం వడ్డిస్తాడు. మా వెనకాల నుంచి ఏవేవో మాటలు వినిపిస్తుంటాయి మేం వినకూడనివి. అందుకే వినట్లేదు. ముందుకు నడుస్తున్నాం.. కలిసి! – శరాది -
రోల్ రోటీ రోల్స్
అంత కష్టపడి రొట్టె చేసి మళ్లీ తుంచడమేంటి?! చుట్టేయండి... హ్యాపీగా నోట్లో పెట్టేయండి. ఎగ్ రోటీ రోల్ కావలసినవి :కోడి గుడ్లు – 4; కీరదోస ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్; క్యారెట్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్; ఉల్లితరుగు – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2; ఆమ్చూర్ పౌడర్ – 1 టీ స్పూన్, నిమ్మకాయ – 1 చెక్క; టొమోటొ కెచప్ – 2 టేబుల్ స్పూన్స్; నల్లమిరియాల పొడి – 1/4 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 3 టేబుల్ స్పూన్స్. తయారి: ఒక గిన్నెలోకి 4 గుడ్లును తీసుకుని, కొంచెం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి ∙మరొక పాన్‌లో కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌లాగా వేసుకోవాలి ∙ఆమ్లెట్ ఒకవైపు కాలిన తర్వాత, ముందుగా కాల్చి ఉంచుకున్న చపాతీని దానిపై వేసి మరొకవైపు తిప్పి కాలనివ్వాలి ∙రెండు వైపులా కాలిన రోటీ ఆమ్లెట్‌ను ఆమ్లెట్ పైకి వచ్చేలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙ఈ రోటీ ఆమ్లెట్కు మధ్యలో నిలువుగా తరిగిన కీరా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, టొమోటొ కెచెప్ను వేసి దానిపై నిమ్మరసాన్ని పిండి బటర్ పేపర్‌తో రోల్ చేస్తే ఎగ్ రోటీ రోల్ రెడీ! వెజ్ పనీర్ రోటీ రోల్ కావలసినవి: తరిగిన కాప్సికమ్ – 1/4 కప్పు; ఉడికించిన బంగాళాదుంపల ముద్ద – 1 కప్పు, తురిమిన పనీర్ 3/4 కప్పు, కారం – 1 టీ స్పూన్ ; గరం మసాలా – 1/2 టీస్పూన్; ఛాట్ మసాలా – 1 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; టొమోటొ కెచెప్ – 2 టేబుల్ స్పూన్స్; తరిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్; సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూన్. తయారి:స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక క్యాప్సికమ్, ఉడికించిన బంగాళాదుంపలు, పనీర్, ఉప్పు, కారం, గరం మసాలా, ఛాట్ మసాలా వేసి అన్నిటిని బాగాకలిపి కాసేపు మగ్గనివ్వాలి ∙ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న రోటీని ఒక ప్లేట్లోకి తీసుకొని, టొమోటొ కెచెప్తో పూర్తిగా స్ప్రెడ్ చేయాలి ∙రోటీకి మధ్యలో నిలువుగా క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ పన్నీర్ స్టప్ ముద్దను రోల్‌గా మధ్యలో ఉంచి, చపాతీ కింద లోపలికి మడిచి, రోల్ చేసి, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. క్యారెట్ హల్వా రోటీ రోల్ కావలసినవి: క్యారెట్ – కేజి (తురుముకోవాలి); పాలు – 1 లీటరు; పంచదార – 200 గ్రా; జీడిపప్పు పొడి – 2 టీ టేబుల్ స్పూన్స్, బాదం పొడి – 2 టేబుల్ స్పూన్స్; కోవా – 100 గ్రా; యాలకుల పొడి – 1 టీ స్పూన్; నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్ తయారి: స్టౌ పైన మందపాటి బాణలి పెట్టి నెయ్యి వేసి తురుమిన క్యారెట్‌ను 10 నిమిషాల వేపు వేగనివ్వాలి ∙వేగిన క్యారెట్లో తురుములో పాలు పోసి మీడియమ్ ఫ్లేమ్‌లో పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ∙పాలు, క్యారెట్ తురుము మిశ్రమానికి జీడిపప్పు పొడి, బాదంపొడి, యాలకుల పొడి, పంచదార, కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. హల్వా పూర్తిగా దగ్గరగా అయ్యాక కోవా కూడా వేసి బాగా కలుపుకుంటే క్యారెట్ హల్వా రెడీ! ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాటీ మధ్యలో ఈ ఫిల్లింగ్‌తో రోల్ చేయండి. క్యారెట్ హల్వా రోటీ రోల్ రెడీ! (లేదా కాల్చని చపాతీలో క్యారెట్ హల్వాను ఫిల్ చేసి నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు). రోటీ తయారి కావలసినవి: గోధుమపిండి – 150 గ్రా; వెన్న – 2 టేబుల్ స్పూన్స్; ఉప్పు – రుచికి సరిపడ; కోడిగుడ్డు – 1 (ఆప్షనల్). తయారి: ∙గోధుమపిండిలో వెన్న, ఉప్పు, (కోడిగుడ్డు) కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసి మెత్తటి చపాతీ పిండిలా తయారు చేసుకుని 30 నిమిషాలు సేపు తడిబట్ట వేసి పక్కన పెట్టుకోవాలి ∙కలిపి పెట్టుకున్న పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసుకుని, నూనెతో మాత్రమే చపాతీలా ఒత్తుకోవాలి స్టౌ పైన పెనం పెట్టి వేడయ్యాక రెండువైపులా నూనెతో లేదా వెన్నతో కాల్చుకోవాలి. మటన్ రోటీ రోల్ కావలసినవి: మటన్ – 150 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్; గరం మసాలా – 1 టీ స్పూన్; కారం – 1 టీ స్పూన్; పసుపు – 1/4 టీ స్పూన్; నిలువుగా తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్; నిలువుగా తరిగిన కీరదోస ముక్కలు – 1/4 కప్పు; పుదీనా తరుగు – 2 టీ స్పూన్స్; నూనె – 4 టీ స్పూన్స్. తయారి: ∙ఒక గిన్నెలోకి పొడవుగా తరిగిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు కలిపి గంట సేపు నాననివ్వాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక అర కప్పు ఉల్లి తరుగు; టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసి 3 నిమిషాలు వేయించి ముందునా నానబెట్టుకున్న మటన్ వేసి మరికాసేపు వేయించుకుని కొంచెం నీరు పోసి, లో ఫ్లేమ్ మీద 45 నిమిషాలు ఉడకనివ్వాలి ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ తీసుకుని మధ్యలో మటన్ ఫ్రైతో ఫిల్ చేసి దానిపైన దోస ముక్కలు, ఉల్లి తరుగు, మిర్చి తరుగు, కొంచెం ఉప్పు వేసి రోల్ చేయండి. మటన్ రోల్స్ రెడీ! -
రోటి..వెరైటీ
రుచుల సమ్మేళంలో విభిన్నత సిటీ ప్రత్యేకత. నగర వంటకాలు దేశంలోనే ఓ విశిష్టతను సంతరించుకున్నాయి. నవాబుల ఆహారపు అలవాట్లు ఇక్కడి ప్రజల జీవనశైలిలో ఇప్పటికీ భాగంగానే ఉన్నాయి. ఆ కోవకు చెందినవే రొట్టెలు. సిటీజనులు రోటీగా పిలిచే వీటికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రధానంగా పాతబస్తీ వారికి రోటీ తినందే దినచర్య ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. పాతబస్తీలోని ఎన్నో కుటుంబాలు తరతరాలుగా రొట్టెల తయారీతో ఉపాధి పొందుతున్నాయి. పోషకాల ఖజానాగా పేరొందిన రొట్టెలను లొట్టలు వేస్తూ ఇప్పటికీ ఎంతో మంది తింటున్నారు. వీటి రుచి అమోఘమంటూ కితాబు ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో చార్మినార్ పరిసరాల్లో వందల సంఖ్యలో రొట్టెల కార్ఖానాలు ఉన్నాయి. పురానీహవేలీ ప్రాంతంలోనే దాదాపు 30కి పైగా రొట్టెల తయారీ కేంద్రాలు ఉన్నాయి. నాన్, షీర్మాల్, కుల్చా, తందూరీ, రుమాలీ, వర్ఖీ రోటీ, పరాటా, పుల్క రొట్టెలకు మంచి గిరాకీ ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వివాహాది శుభకార్యాలకు ఇక్కడి నుంచే రొట్టెలు సరఫరా అవుతాయి. అల్పాహారంతో మొదలు.. మైదాపిండి, ఆటా, పెరుగు, పాల మిశ్రమాన్ని నాలుగు పలకలుగా తయారుచేసి ప్రత్యేకమైన బట్టీల్లో వేడి చేస్తారు. వీటికి నెయ్యి పూసి విక్రయిస్తారు. వీటిని పాతబస్తీలోని ఎన్నో కుటుంబాలు రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకుంటాయి. గొర్రె, మేక ఎముకలతో తయారు చేసిన నహారీ (సూప్)లో దీన్ని నంజుకుంటారు. మరికొందరు మధ్యాహ్నం నాన్ రొట్టెలను కబాబ్‌లతో తింటారు. ఒక్కోదాని ధర రూ.15. రోజుకు వెయ్యికి పైగా నాన్లు విక్రయిస్తున్నట్లు దుకాణా యజమాని ఖాజీ అబ్దుల్ హమీత్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్లో వేలాది రొట్టెలు తయారు చేస్తామన్నారు. రుమాలీ.. తినాలి చార్ రుమాలీ.. ఏక్ తలాహువ (వేయించిన మాంసం) లావో.. అని యువకులు ఎక్కువగా ఆర్డర్ ఇస్తారు. రాత్రి వేళ డిన్నర్లో దీన్ని ఎక్కువగా తింటారు. మైందాపిండితో తయారు చేసిన ఈ రొట్టె పరిమాణంలో రుమాల్ అంత ఉంటుంది. కాగితం కంటే కూడా పల్చగా ఉంటుంది. మైదాతో పాటు కోడిగుడ్లు, పాలు, వెన్న మిశ్రమంతో రొట్టెలాగా తయారు చేసి నిప్పులపై కాల్చుతారు. దీనిని సంపన్నులు విందు, వివాహాల్లో ఎక్కువగా వడ్డిస్తారు. ఒక్కోటి రూ.10. తందూరీ.. తినరా మైమరిచి.. పాతబస్తీలో ఏ హోటల్‌కు వెళ్లినా ఏక్ తందూరీ, మటన్ మసాలా లావో అనే మాటలే వినిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం హోటళ్లలో తందూరీ అందుబాటులో ఉంటుంది. మైదాపిండి, పాలు, మొక్కజొన్న పిండి మిశ్రమంతో తందూరీ రోటీ తయారు చేస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ శాతం మధ్యాహ్న భోజనంలో తందూరీని మటన్ లేదా చికెన్‌తో లాగించేస్తారు. ఒక్కో దాని ధర రూ.12. వర్ఖీ .. వహ్వా మటన్ గ్రేవీ లేదా చికెన్ గ్రేవీలతో కలిపి వర్ఖీ పరోటా తింటే ఆ రుచే వేరు. పాలు, మైదాపిండి, గుడ్డు, పెరుగు, ఉప్పు మిశ్రమంతో పెద్ద సైజులో రొట్టెలాగా తÐయారు చేసి నెయ్యిలో వేయిస్తారు. దీని రుచి కూడా భలేగా ఉంటుంది. ఎక్కువగా దీన్ని మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తింటారు. పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో ఎంతో మంది దీన్ని తినేందుకు పాతబస్తీకి వస్తుంటారు. ఇది కేవలం పాతబస్తీలోనే లభిస్తుంది. దీని ధర రూ.15. నాలుగు తరాలుగా.. నగరంలోనే తొలి నాన్ రోటీ దుకాణం మాదే. దీనిని 1851లో పురానీహవేలీలో మా ముత్తాత ప్రారంభించారు. నాలుగు తరాలుగా నాన్ రోటీ తయారు చేస్తున్నాం. నాన్ రోటీ మొగలాయి వంటకం. దీన్ని ఎక్కువగా షోర్వా (సూప్)తో తింటారు. గొర్రె కాళ్ల నహరీ (సూప్)ను ఎక్కువగా వర్షాకాలం, చలి కాలాల్లో ఆరగిస్తుంటారు. – ఖాజా అబ్దుల్ హమీద్ మున్షియి, నాన్ రోటీల తయారీదారుడు తగ్గని ఆదరణ చైనీస్, యురోపియన్, తాయి తదితర వంటకాలున్నా... పాతబస్తీలోని మొగలాయి వంటకాలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ తందూరీ రోటీ, వర్ఖీ పరోటా, రుమాలీ రోటీ తదితర వంటకాలు అన్ని రోజుల్లోనూ తింటున్నారు. మొగలాయి రోటీలు ఎక్కువగా మటన్ ఫ్రై, చికెన్ గ్రెవీతో లాగించేస్తారు. – మహమ్మద్ సలీం, హోటల్ మేనేజర్ -
సింహగర్జన-సింహబలుడు...
పోస్టర్ స్టోరీ మన్మోహన్ దేశాయ్‌ను రాజ్ కపూర్ తర్వాత బాలీవుడ్లో అంత మాస్ పల్స్ తెలిసిన డెరైక్టర్‌గా అందరూ గుర్తిస్తారు. ‘ఆ గలే లగ్‌జా’ (1973), ‘రోటీ’ (1974) వంటి సినిమాల వరకూ ఒక ధోరణిలో తీసిన మన్మోహన్దేశాయ్ ‘ధరమ్ వీర్’ (1977) సినిమాతో ఫార్ములా సినిమాల దారి పట్టాడు. విడిపోయిన అన్నదమ్ములు తిరిగి కలవడం అనే ఫార్ములాను నాసిర్ హుసేన్ (యాదోంకి బారాత్)తో పాటు మన్మోహన్దేశాయ్ కూడా విపరీతంగా పాప్యులరైజ్ చేశాడు. ‘ధరమ్ వీర్’ అదే ఫార్ములాతో హిట్ అయ్యింది. సంస్థానాలు, గుర్రాలు, కాస్టూమ్‌లు, కత్తులు.... వీటితో తెర మీద కొత్త ఆకర్షణను నిలబెట్టిన మన్మోహన్దేశాయ్ మంచి సంగీతాన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించాడు. ‘ఓ మేరి మెహబూబా’... పాట ఈ సినిమాలోదే. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టిన ధరమ్వీర్ ప్రభావం తెలుగు మీద పడింది. ఆ మరుసటి సంవత్సరమే తెలుగులో ‘సింహ గర్జన’, ‘సింహ బలుడు’ సినిమాలు తయారయ్యి విడుదలయ్యాయి. సింహగర్జనలో కృష్ణ, గిరిబాబు నటిస్తే సింహబలుడు ఎన్టీఆర్ కెరీర్లో ఒక అసఫల చిత్రంగా మిగిలింది. ఇటీవల కన్నుమూసిన ఎం.ఎస్. విశ్వనాథన్ సింహబలుడులో ‘సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్’ పాటను హిట్ చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. -
డబుల్ జ్యువెల్!
యాసీన్ సింగిల్ చాయ్‌నైనా డబుల్‌స్ట్రాంగ్‌గా తాగుతారు మన హైదరాబాద్ సిటీ పీపుల్. డబుల్ స్ట్రాంగ్ చాయ్‌లో డబుల్ రోటీ అనే పేరున్న రోటీని అద్దుకుని తింటారు. వాస్తవానికి అది కేవలం బన్. కానీ డబుల్ అంటే గానీ... లేదా డబుల్ ఉంటే గానీ మనకు ఆనదు కాబట్టి దానికి డబుల్ రోటీ పేరు పెట్టారు మన సిటీ‘జెమ్స్’! దీన్నిబట్టి తెలిసేదేమిటి? మన హైదరాబాదీలకు సింగిల్ సరిపోదు. డోసు డబులైతేనే పీసు నచ్చుతుంది. బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లినవాడు... పెట్టింది తిని బుద్ధిగా వచ్చేస్తాడా? కుదర్దు. ఆర్డర్ ఇచ్చేటప్పుడే... ‘ఏక్ బిర్యానీ... విత్ డబుల్ మసాలా అండ్ డబుల్ గోష్’ అంటూ గొంతులో కమాండ్ నింపుకొని తన డిమాండ్ చెబుతాడు. అలాగే సగటు నగర ప్రయాణికులు మొన్నమొన్నటి వరకూ డబుల్ డెక్కర్ ఎక్కేవారు. కానీ అంతస్తుల తేడా వస్తుందనీ, అందరూ సమానమనే సామ్యవాద స్ఫూర్తి దెబ్బతింటోందని, ఈ మధ్య పై అంతస్తును కిందికి దింపేసి, వెస్టిబ్యూల్తో రెండు బస్సులనూ కలిపేసి ఇలా పొడుగ్గా ఉండే డబుల్ బస్‌లలో ప్రయాణం చేస్తున్నారు. అంతేనా... పీక్ టైమ్స్ అని పిలిచే ఏ ఉదయమైనా, ఏ సాయంత్రమైనా సరే... ఒక్క బస్సులోనే రెండు బస్సుల జనాలు కూరి కూరి నింపినట్లుగా నిండి ఉంటారు. అనగా ప్రయాణీకులూ డబుల్ ఉంటారన్నమాట. దాంతో జనాల మధ్య దూరాలూ, అంతరాలూ తగ్గి, ప్రేమలూ డబుల్ అవుతాయి. ఒక కాలు పట్టే స్థలంలో ఆ కాలు మీదికి మరో కాలు ఎక్కి డబులవుతుంది. ఇలా ఈ రద్దీలో ఒకవేళ ఎవరో ఎవరిదో కాలు తొక్కినందువల్ల తిట్టుకున్నా అదీ ప్రేమకొద్దే అనుకోవాలి. అదీ ‘డబుల్’ కాన్సెప్ట్ పట్ల సిటీ పీపుల్‌కు ఉన్న ప్రేమ. ఇంతటితోనే ఆగిందా... నగరం చుట్టూ ఎన్నో చెరువులున్నా, అఫీషియల్‌గా ‘సాగర్’ అన్న పేర్లున్న సరస్సులూ డబులే! ఒకటి హుస్సేన్‌సాగర్, రెండోది హిమాయత్‌సాగర్. నగరంలో ఒకే ఒక్క చార్మినార్ ఉండటం నామోషీ అనిపించిందో ఏమిటో గానీ... ఇంజనీర్లు హైటెక్స్‌కు పోయే ఎంట్రెన్స్ మార్గాన్ని మోడ్రన్ చార్మినార్ షేపులో కట్టి దాన్నీ ‘డబుల్’ చేశారు. ఇక ముగ్గురు ప్రయాణం చేసే మామూలు ఆటోలు మనకు ఆనలేదు. అందుకే మామూలు ఆటోల కంటే రెట్టింపు మంది పట్టేలా సెవెన్ సీటర్ ఆటోలని కొత్తవి ప్రవేశపెట్టి ‘డబుల్’ కాన్సెప్టును మరింత పరిపుష్టం చేశారు. అంతెందుకు హైదరాబాద్ అన్న ఒక్క నగరం మనకు సరిపోలేదు. అందుకే సికింద్రాబాదునూ నిర్మించి జంటనగరాలన్నారు. అందరూ ఇంగ్లిష్‌లో వీటిని ట్విన్ సిటీస్ అంటారు. కానీ... ట్విన్స్ అంటే కవలలు అని అర్థం. నిజానికి హైదరాబాద్ ఎప్పుడో నాలుగొందల ఏళ్ల క్రితం పుట్టింది. సికింద్రాబాద్ ఆ తర్వాత చాలా కాలానికి పుట్టింది కాబట్టి వీటిని ట్విన్స్ అనగా కవల నగరాలు అనడం కంటే తెలుగులో చక్కగా జంటనగరాలు అనే అర్థం వచ్చేలా ‘డబుల్ సిటీస్’ అనడమే కరక్టేమో! ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటే దిల్‌కు జిల్లుగా ఉంటుంది. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూస్తే థ్రిల్లుగా ఉంటుంది. అందుకే హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని మనం ఏ సిటీలో నివసించినా మనకు మరో సిటీ అదనం! అదే మన జంటనగరాల గొప్పదనం!! -
రివర్సే.. సిటీ పవర్సు!
హైదరాబాదీలు చాలా పనులు రివర్సులో చేస్తారు. ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చేస్తారు. భలే వైవిధ్యంగా చేస్తారు. కానీ చాలా గొప్పగా చేస్తారు. సాధారణంగా మనం రోటీలు చేయాలనుకుంటే ఏం చేస్తాం. కలిపిన పిండిని రొట్టెల పీట మీద పెట్టి అప్పడాల కర్రతో చుట్టూ విస్తరిస్తూ పోయేలా రౌండ్‌గా చేస్తాం. కానీ హైదరాబాదీ రుమాలీ రోటీని విస్తరించడం ఎప్పుడైనా చూశారా? అలాగే నిలబడిపోయి మామూలు రోటీలు చేసేవాడి ఆ కళానైపుణ్యాన్ని అదేపనిగా చూడ బుద్ధేస్తుంది. కాస్తంత వెడల్పు చేసిన రోటీని మాటిమాటికీ గాలిలోకి చక్రంలా ఎగరేసి గిర్రున తిప్పుతూ అలా వెడల్పయ్యేలా చేస్తుంటాడు. పేరుకు రుమాలీ గానీ.. దాదాపు టవల్కూ, శాలువాకూ సెంటర్ సైజులో ఉండేలా విస్తరిస్తూ తిప్పి.. అంత పెద్ద రోటీని అప్పుడు పెనం మీద వేస్తాడు. మళ్లీ ఇక్కడ పెనం విషయంలోనూ రివర్సే. సాధారణంగా రోటీలు చేసే పెనం మధ్యలో కాస్త గుంటలా ఉండి, అంచులు ఉబ్బెత్తుగా ఉంటాయి. కానీ రుమాలీ రోటీని కాల్చే పెనం పూర్తిగా రివర్సు. మూకుడును బోర్లా తిరగేసి, దాని కింద మంట పెట్టి రుమాలీ రోటీని కాలుస్తారు. అలా కాల్చాక రుమాలీ అని పేరు పెట్టినందుకో ఏమోగానీ... రుమాల్లాగా మడతలు వేస్తారు. జేబులో మాత్రం పెట్టరు. చుట్టలుగా చుట్టి నోట్లోకి పెట్టి రుచిని ఆస్వాదిస్తారు. ఇలాంటి రివర్స్ కేసే మరోటి! సాధారణంగా రోటీని కాల్చాలంటే మనమంతా పెనాన్ని పొయ్యి మీద పెడతాం కదా! కానీ ఇక్కడా మరో తరహా రివర్సు కేసే! తందూరీ రోటీ అని పిలిచే ఈ రొట్టెను చేసే పాత్ర పొయ్యిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. పైన ఉండే రంధ్రం ద్వారా రోటీని పాత్ర అంచుకు అతుక్కుపోయేలా చేసి, రోటీనీ కాల్చి ముల్లుకర్రలాంటి దానితో బయటకు తీస్తారు. ఈ తందూరీని మన హైదరాబాదీలంతా ఎంతో ఇష్టంతో తింటుంటారు. రివర్సులు బాగా ఇష్టం కాబట్టి వేరే నగరాల్లో ఉన్న మరో సౌకర్యాన్ని మనమూ పొందాలని ఓ ప్రాజెక్టు చేపట్టాం. సాధారణంగా ఇంటి ముందు కాళ్లు తుడుచుకోడానికి వేసే పట్టానైనా లేదా కాళ్లకు పెట్టుకునే పట్టా(గొలుసు)లైనా కిందే ఉంచుతాం. అంటే నేల మీదే ఉంచుతాం. కానీ మనకిష్టమైనదాన్ని నెత్తిన పెట్టుకునే స్కీము కింద ఈ పట్టాలను రివర్సులో గాల్లో పెట్టుకుంటున్నాం. అదే మెట్రో రైలు ‘పట్టా’లు! రోజూ తలెత్తి గాల్లోని ఆ పట్టాలను చూస్తున్నప్పుడల్లా... రుమాలీ, తందూరీ రోటీల రుచిని ఆస్వాదించినట్లే... ఆ మెట్రో రైడ్‌ను ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అనే ఓ కుతూహలం. ఎప్పుడెప్పుడు నేలపై కాకుండా రివర్సులో టవర్సు మీద గాల్లో పోయే ఆ ట్రైన్లో ఎంత త్వరగా ఎక్కుదామా అనే ఆత్రుత. ఇది నా ఒక్కడిదే కాదు... రోజూ తలెత్తి గర్వంగా చూసుకునే మన నగర ‘పట్టా’దారులందరికీ ఇష్టమైన సమష్టి కోరిక!