బరువు తగ్గాలని చాలామంది తీసుకునే ఆహారం విషయంలో చాలా మార్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కేలరీల తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు అదుపులో ఉంటుందన్న భావంతో రైస్‌కి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలామంది రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. చాలా వరకు చపాతీ లేదా రోటీలతో సరిపెడతారు. నిజానికి బరువు తగ్గడంలో అన్నం, రోటీలలో ఏది బెటర్. ఈ రెండింటిలో ఏదీ కీలకపాత్ర పోషిస్తుంది అంటే..
వెయిట్ లాస్ జర్నీలో రెండింటిలో ఏది మంచిదంటే..ముందుగా బియ్యం, రోటీల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో చూద్దాం.
అన్నం..
బియ్యం అనేది తృణధాన్యం. ఇది చాలా రకాలుగా వస్తుంది. సర్వసాధారణంగా తెలుపు, గోధుమ రంగుల్లో ఉంటుంది. వంద గ్రాముల వైట్ రైస్‌లో ఇవి ఉంటాయి:
కేలరీలు: 356 కిలో కేలరీలు
కార్బోహైడ్రేట్లు: 78.2గ్రా
ప్రోటీన్: 7.9 గ్రా
ఫైబర్: 2.8గ్రా
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI): 70-80 (అధిక)
రోటీ..
రోటీని సాధారణంగా గోధుమ పిండితో తయారుచేస్తారని నిపణుల చెబుతున్నారు. వంద గ్రాముల హోల్ వీట్ రోటీలో ఇవి ఉంటాయి:
కేలరీలు: 320 కిలో కేలరీలు
కార్బోహైడ్రేట్లు: 64.17గ్రా
ప్రోటీన్: 10.5 గ్రా
ఫైబర్: 11.3గ్రా
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI): 55-60 (మధ్యస్థం)
క్యాలరీ కంటెంట్: రోటీలో అన్నం కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నం, పోషకాలు తక్కువగా ఉండటం వలన, ఎక్కువ మొత్తంలో తినడానికి దారి తీస్తుంది. ఫలితంగా అధిక కేలరీలు తీసుకునేందుకు కారణమవుతుంది.
ఫైబర్ కంటెంట్: బరువు తగ్గడానికి ఫైబర్ కీలకం. ఎందుకంటే ఇది సంపూర్ణత్వం భావనను కలుగజేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోటీని గనుక ముఖ్యంగా సంపూర్ణ గోధుమలతో తయారు చేసినదైతే..దీనిలో తెల్ల బియ్యం కంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ అధిక ఫైబర్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. రోజంతా అధిక క్యాలరీలను తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.
ప్రొటీన్ కంటెంట్: బరువు తగ్గే సమయంలో కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి ప్రోటీన్ చాలా అవసరం. సంతృప్తికరమైన భావాలను కూడా పెంచుతుంది. రోటీలో అన్నం కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ఇది మంచి ఆకలి నియంత్రణకు దోహదపడుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్: గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అనేది ఆహారం ద్వారా రక్తంలో ఎంత వేగంగా చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయనేది కొలుస్తుంది. తక్కువ జీఐ ఉన్న ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి మంచివిగా పరిగణిస్తారు వైద్యులు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేసి, తక్కువ ఇన్సులిన్ స్పైక్‌లకు దారితీస్తాయి. రోటీ సాధారణంగా తెల్ల బియ్యం కంటే తక్కువ జీఐని కలిగి ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ప్రాసెసింగ్ అండ్ రిఫైన్‌మెంట్: వైట్ రైస్ అనేది శుద్ధి చేసిన ధాన్యం. అంటే దీనిలొ ఊక, జెర్మ్ పొరలను తొలగించడంతో దాని పోషక విలువను తగ్గుతుంది. హోల్ వీట్ రోటీని ఎక్కువ పోషకాలు, ఫైబర్‌ని ఉండేలా తక్కువ ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు.
మోతాదుని నియంత్రించొచ్చు: రోటీ ప్రామాణిక పరిమాణం, ఆకృతి ఎంత మేర తీసుకుంటే చాలనేది నిర్ణయించగలం. బియ్య ప్రత్యేకించి ఎంత వరకు తీసుకుంటే మంచిదని సవాలుగా ఉంటుంది. ఒక్కోసారి తెలియకుండానే ఎక్కువ తినేందుకు దారితీస్తుంది.
బరువు తగ్గడానికి అన్నం కంటే రోటీకి అనేక ప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఏ ఒక్క ఆహారం వల్ల బరువు తగ్గిపోమని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. నాణ్యతతో కూడిన సమతుల్య ఆహారం, సాధారణ శారీరక శ్రమ ఆరోగ్యకరమైన బరువును సాధించడంలో, నిర్వహించడంలో కీలకమైన అంశాలు.
రైస్ కావాలనుకుంటే..
ఎక్కువ ఫైబర్, పోషకాల కోసం తెలుపు బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా తృణధాన్యాలని ఎంచుకోండి.
అలాగే మోతాదులో తీసుకునేందుకు చిన్న చిన్న కప్పులను వినియోగించండి.
పోషక విలువలను పెంచడానికి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, కూరగాయలతో బియ్యం జత చేయండి.
అదే రోటీని ఎంచుకోవాలనుకుంటే:
గరిష్ట పోషక ప్రయోజనాల కోసం మొత్తం గోధుమ పిండితో తయారు చేయబడిందని నిర్ధారించుకోండి.
వండేటప్పుడు లేదా వడ్డించే సమయంలో జోడించిన కొవ్వుల పట్ల జాగ్రత్త వహించండి.
సమతుల్య భోజనం కోసం లీన్ ప్రోటీన్లు, కూరగాయలతో జత చేయండి.
బియ్యం, రోటీ రెండూ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే. అయితే గోధుమ రోటీలో అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, సులభమైన తక్కువ మోతాదులో తీసుకునే వెసులుబాటు కారణంగా బరువు తగ్గేందుకు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ ఆరర్యోకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే మాత్రం, సమతుఇఉల్య ఆహారం, మంచి జీవన శైలి తదితరాలే కీలకమైనవని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడ బెస్ట్ ఆయిల్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment