చాలామందికి పెళ్లంటే గుర్తొచ్చేది కమ్మని విందు భోజనమే.. వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా రకరకాల వంటకాలతో వివాహానికి వచ్చినవారి కడుపు నింపుతారు. అందుకే ఎప్పుడైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తే ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనం అంటే బెంబేలెత్తిపోవడం ఖాయం.
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. ఆ సమయంలో అతడికి దగ్గర్లో ఇతర వంటగాళ్లు ఎవరూ లేనట్లున్నారు. ఇంతలో అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు. అతడు చేసిన ప్రతి రోటీ మీద ఇలాగే ఉమ్మాడు. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇంకేముందీ, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా మీరట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రోటీని నాశనం పట్టించిన అతడిని మీరట్‌కు చెందిన సోహైల్‌గా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు అతడి నిర్వాకానికి శివాలెత్తిపోతున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి ఆ రోటీలను పెళ్లికి వచ్చినవాళ్లు తిన్నారా? ఏంటని ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment