wedding function
-
పెళ్లికళకు పరిపూర్ణత.. ఆధునికపు హెయిర్ స్టైల్స్! ఇలా ముస్తాబైతే..
కలల రోజు కళ్ల ముందు నిలిచే సమయం అత్యంత వైభవంగా మారిపోవాలనుకుంటారు. అందుకు తగినట్టుగానే ప్రతి అలంకరణలోనూ ప్రత్యేకత చూపుతారు. ఆ పెళ్లి కళకు పరిపూర్ణత రావాలంటే మాత్రం కేశాలంకరణదే అత్యంత కీలకమైన పాత్ర. సాధారణ డిజైన్స్ నుంచి ఆధునికపు హెయిర్ స్టైల్స్ ఎలా రూపు మార్చుకున్నాయో తెలుసుకుంటే మీదైన ప్రత్యేకమైన రోజుకు మరింత అందంగా ముస్తాబు అవ్వచ్చు. పెళ్లికూతురు ఆకర్షణీయ రూపానికి జీవం పోసేది కేశాలంకరణే. పెళ్లి దుస్తులను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటారో జడను కూడా అంతే స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటారు. సాధారణ పూల జడల నుంచి వజ్రాలతోనూ, బంగారంతోనూ మెరిసే అందమైన పొడవాటి జడలను నవ వధువుల ఎంపికలో ఉంటాయి. అలాగే, పెళ్లికూతురి దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా వీటి ఎంపికలో పోటీ పడుతుంటారు. ఇందుకు ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు ఇతర ఫ్యాన్సీ జడలు కూడా రకరకాల డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. లక్షల రూపాయల నుంచి వందల రూపాయల వరకు ఉన్న ఈ డిజైన్స్‌లో ఇవి కొన్ని. సంప్రదాయ వేడుకలలో వేసే హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంటాయి. ఈ బ్రైడల్ హెయిర్ స్టైల్స్‌లో మార్పులు చూస్తే ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకోసం ఉపయోగిస్తున్న లాంగ్ రిబ్బన్, మిర్రర్, టాజిల్స్తోనూ జడలు ప్రధాన ఆకర్షణగా డిజైనర్ల చేతుల్లో రూపు దిద్దుకుంటున్నాయి. సొంతంగా తయారీ ఆసక్తి గల వారు పూసలు, ముత్యాలు, స్టోన్స్, రంగు దారాలను ఉపయోగించి మల్టీకలర్ లాంగ్ జడలను సొంతంగా తయారు చేసుకోవచ్చు. దారాలకు పూసలు గుచ్చి, గమ్‌తో స్టోన్స్ లేదా అద్దాలను అతికించి పొడవాటి దండలుగా (జడ అంత పొడవులో) తయారు చేసుకోవాలి. వాటిని డ్రెస్‌తో మ్యాచ్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఎలాంటి అలంకరణ బాగుంటుందో చూసుకొని, ఆ జడను అలంకరించుకోవాలి. ఫ్యాన్సీ అలంకరణ సాధారణ కేశాలంకరణలో మల్లె, గులాబీ పూల జడలు పెళ్లికూతురు అలంకరణలో భాగంగా ఉంటాయి. కొందరు తమ చీర రంగుతో మ్యాచ్ అయ్యే పూల జడలను ఎంపిక చేసుకుంటారు. ఇవే కాకుండా స్వరోస్కి స్టోన్స్ ఉన్న పొడవాటి వరుసల క్లిప్స్‌ను పెట్టేసి కేశాలంకరణ పూర్తి చేసుకోవచ్చు. ఇవి, రిసెప్షన్ వంటి వేడుకల్లో అందంగా ఉంటాయి. పెళ్లికి ఎంచుకోగల ఆధునిక కేశాలంకరణలో ఇవి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డిజైన్ బట్టి ఈ జడల ధరలు అందుబాటులో ఉన్నాయి. మెరిసే.. మెరిసే కేశాలంకరణ ప్రత్యేక సందర్భాల్లోనే కాదు ప్రతిరోజూ స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారికి డే హెయిర్ జ్యువెలరీ (హెయిర్ క్లిప్స్) అందుబాటులో ఉన్నాయి. వీటిని గెట్ టు గెదర్ వంటి పార్టీలకు వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సులకూ అందంగా నప్పుతాయి. పెళ్లి కూతురి లేదా అతిథుల తమ కేశాలంకరణలో వివిధ స్టైల్స్‌ను అనుకరించాలంటే అందుకు తగిన ఆన్లైన్ ట్యుటోరియల్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి ఎలాంటి స్టైల్ బాగుంటుందో ఎంపిక చేసుకునే వీలుంటుంది. మీదైన గొప్ప రోజు కోసం మీ జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల పెళ్లికి వచ్చే మొత్తం అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తుంది. పెళ్లిరోజును మరింతగా వెలిగిపోయేలా మార్చేస్తుంది. చదవండి: Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో.. -
ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్
మంగళగిరి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులు లలిత నాగదుర్గ, సాయి సూర్యతేజలను ఆశీర్వదించారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ఆ జంటకు బొకేను అందజేశారు. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. సీఎం జగన్. వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యే క్రమంలో తిరిగి బయల్దేరే క్రమంలో ఆ ప్రాంగణమంతా అభిమానులు హర్షాతిరేకలతో సందడిగా మారిపోయింది. -
Guntur: జెడ్పీ ఛైర్మన్ కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలో జరిగిన వివాహానికి సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (గేర్ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి: సీఎం జగన్) -
వైరల్: ఉమ్ముతూ రోటీలు చేసిన వ్యక్తి
-
పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి
చాలామందికి పెళ్లంటే గుర్తొచ్చేది కమ్మని విందు భోజనమే.. వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా రకరకాల వంటకాలతో వివాహానికి వచ్చినవారి కడుపు నింపుతారు. అందుకే ఎప్పుడైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తే ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనం అంటే బెంబేలెత్తిపోవడం ఖాయం. లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. ఆ సమయంలో అతడికి దగ్గర్లో ఇతర వంటగాళ్లు ఎవరూ లేనట్లున్నారు. ఇంతలో అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు. అతడు చేసిన ప్రతి రోటీ మీద ఇలాగే ఉమ్మాడు. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముందీ, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా మీరట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రోటీని నాశనం పట్టించిన అతడిని మీరట్‌కు చెందిన సోహైల్‌గా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు అతడి నిర్వాకానికి శివాలెత్తిపోతున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి ఆ రోటీలను పెళ్లికి వచ్చినవాళ్లు తిన్నారా? ఏంటని ఆరా తీస్తున్నారు. చదవండి: వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్ వైరల్: వంటకు సాయం చేస్తున్న కోతి! -
రాజమౌళి ఇంట్లో పెళ్లి సందడి
-
కాసేపట్లో పెళ్లి..అంతలోనే పెళ్లి కొడుకు కాల్చివేత
-
వరుడికి కోడిగుడ్లు, పేడనీళ్లతో స్నానం.!
సాక్షి, బెంగళూరు( బొమ్మనహళ్లి) : స్నేహితులు పెళ్ళికి వచ్చి సందడి చేయడం, చిన్న చిన్న చిలిపి పనులు చేయడం కామన్ అన్న విషయం అందరికి తెలిసిందే. కాని మంగళూరులో జరిగిన ఒక యువకుడికి అతన్ని స్నేహితులు పెళ్ళికి వచ్చి సందడి చేయడమే కాకుండ అతన్ని అల్లరి పట్టించారు. పెళ్ళి కుమారుడికి పేడనీళ్లు, టమోటాల రసం, గోడిగుడ్లతో స్నానం చేయించారు. దీంతోపాటు వివిద రకాల కూరగాయాలతో ఏర్పాటు చేసిన పూలమాలలు వేసి వినూత్న రీతిలో అతనిని ఊరేగిస్తూ స్నేహితులు సందడి చేశారు. ఈ పెళ్ళిలో స్నేహితులు చేసిన ఈ సందడి పెద్దలకు ఇబ్బందిని కలిగించినా... స్నేహితుల సంతోషాన్ని చూసి ఏమి అనలేక పోయారు. ఈ పెళ్ళి సందడి ఈ నెల 19న మంగళూరులోని బంట్వాళ తాలుకా రాయి అనే గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రాయి గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడి పెళ్ళి జరిగింది. అతను మంగళూరులో ఉన్న ఈ ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన పెళ్ళికి రావాల్సిందిగా స్నేహితులందరిని ఆహ్వానించాడు. దీంతో మెహందీ కార్యక్రమం రోజు స్నేహితులు పెళ్లికి వచ్చారు. అక్కడ పెద్దలు... పెళ్ళి కుమారుడు రాకేష్‌కు తల స్నానం చేయిస్తుండగా అతడి స్నేహితులు అప్పటికే సిద్దం చేసుకున్న పేడ నీళ్లు, టమోటాల రసం, కోడిగుడ్లు పెట్టి స్నానం చేయించారు. అంతటితో ఆపకుండా అతని కోసం ప్రత్యేకంగా వివిర రకాల కూరగాయాలతో సిద్ధం చేసిన హారాలు వేసి అతనికి అలంకరణ చేశారు. పెళ్ళి రోజున కూడా తామేమి తక్కువ కాదని స్నేహితులు అందరు ఒకే రకమైన దుస్తులు ధరించి పెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కడ చూసిన రాకేష్ పెళ్ళి బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో రాపాటద రాకేషన్ పెళ్ళి వేడుకలు అని వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాలు జరుగతున్నాయని ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి పెళ్ళి వేడుకల్లో సందడి చేసారు. -
కలసి డాన్స్ చేయలేదని కాల్చిచంపాడు
-
కలసి డాన్స్ చేయలేదని కాల్చిచంపాడు
చండీగఢ్: పంజాబ్‌లోని బతీండా జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనతో డాన్స్ చేసేందుకు నిరాకరించిన మహిళా డాన్సర్‌ను కాల్చి చంపాడు. నిందితుడు డాన్సర్‌ను కాల్చిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడితో పాటు అతని స్నేహితులు ఇద్దరు, ఫంక్షన్ హాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ వేడుకలో అనూహ్యంగా కాల్పుల ఘటన జరగడంతో అంతా షాకయ్యారు. మృతురాలు ప్రెగ్నెన్సీతో ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జాతీయ మహిళ కమిషన్ ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.