వరుడికి కోడిగుడ్లు, పేడనీళ్లతో స్నానం.! | Friends enjoy in wedding function in mangalore | Sakshi
Sakshi News home page

వరుడికి టమోటాలు, కోడిగుడ్లు, పేడనీళ్లతో స్నానం.!

Published Mon, Feb 26 2018 6:25 PM | Last Updated on Mon, Feb 26 2018 7:31 PM

Friends enjoy in wedding function in mangalore - Sakshi

సాక్షి, బెంగళూరు( బొమ్మనహళ్లి) : స్నేహితులు పెళ్ళికి వచ్చి  సందడి చేయడం, చిన్న చిన్న చిలిపి పనులు చేయడం కామన్‌ అన్న విషయం అందరికి తెలిసిందే. కాని మంగళూరులో జరిగిన ఒక యువకుడికి అతన్ని స్నేహితులు పెళ్ళికి వచ్చి సందడి చేయడమే కాకుండ అతన్ని అల్లరి పట్టించారు. పెళ్ళి కుమారుడికి పేడనీళ్లు, టమోటాల రసం, గోడిగుడ్లతో స్నానం చేయించారు. దీంతోపాటు వివిద రకాల కూరగాయాలతో ఏర్పాటు చేసిన పూలమాలలు వేసి వినూత్న రీతిలో అతనిని ఊరేగిస్తూ స్నేహితులు సందడి చేశారు. ఈ పెళ్ళిలో స్నేహితులు చేసిన ఈ సందడి పెద్దలకు ఇబ్బందిని కలిగించినా... స్నేహితుల సంతోషాన్ని చూసి ఏమి అనలేక పోయారు. ఈ  పెళ్ళి సందడి ఈ నెల 19న మంగళూరులోని బంట్వాళ తాలుకా రాయి అనే గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించి వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. 

రాయి గ్రామానికి చెందిన రాకేశ్‌ అనే యువకుడి పెళ్ళి జరిగింది. అతను మంగళూరులో ఉన్న ఈ ప్రవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన పెళ్ళికి రావాల్సిందిగా స్నేహితులందరిని ఆహ్వానించాడు. దీంతో మెహందీ కార్యక్రమం రోజు స్నేహితులు పెళ్లికి వచ్చారు. అక్కడ పెద్దలు... పెళ్ళి కుమారుడు రాకేష్‌కు తల స్నానం చేయిస్తుండగా అతడి స్నేహితులు అప్పటికే సిద్దం చేసుకున్న పేడ నీళ్లు, టమోటాల రసం, కోడిగుడ్లు పెట్టి స్నానం చేయించారు. అంతటితో ఆపకుండా అతని కోసం ప్రత్యేకంగా వివిర రకాల కూరగాయాలతో సిద్ధం చేసిన హారాలు వేసి అతనికి అలంకరణ చేశారు. పెళ్ళి రోజున కూడా తామేమి తక్కువ కాదని స్నేహితులు అందరు ఒకే రకమైన దుస్తులు ధరించి పెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కడ చూసిన రాకేష్‌ పెళ్ళి బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. అందులో రాపాటద రాకేషన్‌ పెళ్ళి వేడుకలు అని వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాలు జరుగతున్నాయని ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి పెళ్ళి వేడుకల్లో సందడి చేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement