ఖమ్మంకు చెందిన వ్యాపారి సీతారాంబాబు
సాక్షిప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: నాగపూర్ యూనివర్సిటీ లా కాలేజీలో తన సహచరుడైన దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా మరోమారు ప్రమాణ స్వీకారం చేయనుండడం ఆనందంగా ఉందని ఖమ్మంకు చెందిన వ్యాపారి వేములపల్లి సీతారాంబాబు తెలిపారు. లా కాలేజీ 1990 బ్యాచ్‌లో ఫడ్నవీస్, తాను కలిసి చదువుకున్నామని ఆయన గుర్తు చేశారు.
అప్పట్లో ఏబీవీపీలో చురుగ్గా పని చేయడమే కాక కాలేజీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా తాను, కార్యదర్శిగా ఫడ్నవీస్ పోటీ చేశామని తెలిపారు. కాలేజీ రోజుల్లో ఐదుగురు స్నేహితులం కలిసి బ్యాచ్‌గా ఉండేవాళ్లమని చెప్పారు.
ఆయన తొలిసారి 2015లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్నేహితులను ఇంటికి పిలిచి భోజనం పెట్టారని.. చివరగా 2023లో ఫడ్నవీస్‌ను కలిశానని తెలిపారు. త్వరలో ముంబై వెళ్లి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేస్తామని, వచ్చే ఏడాది శ్రీరామనవమికి ఆయనను భద్రాచలం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని సీతారాంబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment