హెల్దీ డైట్‌- మొరింగా రోటీ–దాల్‌ | How To Prepare Moringa Leaves (Drumstick Leaves) Dal And Roti Recipe, Check Making Process Inside | Sakshi
Sakshi News home page

Moringa Leaves Recipes: హెల్దీ డైట్‌- మొరింగా రోటీ–దాల్‌

Published Sat, Jul 27 2024 11:02 AM | Last Updated on Sat, Jul 27 2024 11:52 AM

Moringa Leaves Dal Drumstick Leaves Dal

కావలసినవి: మల్టీ గ్రెయిన్‌ పిండి – కప్పు; మునగ ఆకులు– కప్పు; నూనె– టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – రుచిని బట్టి; నీరు – అర కప్పు.
తయారీ:  ∙మునగాకు కడిగి చిల్లుల పాత్రలో వేయాలి ∙ఒక పాత్రలో పిండి, ఉప్పు, మునగాకు వేసి కలిపి నీటిని పోస్తూ ముద్ద చేయాలి ∙పిండిని వత్తి పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుంటే మొరింగా రోటీ రెడీ. 

మొరింగా దాల్‌ కోసం...  కందిపప్పు – కప్పు, మునగాకు– కప్పు, పచ్చిమిర్చి– 2, వెల్లుల్లి రేకలు–2, నిమ్మరసం– టీ స్పూన్, ఉప్పు– రావు టీ స్పూన్, పసుపు– చిటికెడు, నూనె– టేబుల్‌ స్పూన్, ఆవాలు– ΄ావు టీ స్పూన్, జీలకర్ర – రావు టీ స్పూన్, ఇంగువ– చిటికెడు– వెన్న– టేబుల్‌ స్పూన్‌

తయారీ: పప్పును ఉడికించి మెదిపి పక్కన ఉంచాలి. బాణలిలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఇంగువ, మునగాకు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. కప్పు నీరు ΄ోసి ఉడికించి మెదిపిన పప్పు కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించి నిమ్మరసం కలిపి దించేయాలి.

పోషకాలు: ∙పప్పులో..ప్రోటీన్‌లు–10.36 గ్రా, ఫైబర్‌–8.7 గ్రా.  రోటీలో...ప్రోటీన్‌లు– 3 గ్రా, కార్బోహైడ్రేట్‌లు , విటమిన్‌లు – 15 గ్రా, మునగాకులో క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్‌ వంటి మినరల్స్‌తో΄ాటు డైటరీ ప్రోటీన్‌లు, ఫైబర్‌లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు... మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్‌ శాతం పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

డాక్టర్‌ కరుణ 
న్యూట్రిషనిస్ట్‌ – వెల్‌నెస్‌ కోచ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement