dal
-
పండగ సీజన్లో శనగపప్పు ధరలకు రెక్కలు
పండగ సీజన్‌కు ముందే పప్పుల ధరలు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే శనగపప్పుకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగిన సరఫరా లేకపోవడంతో గత నెల నుంచి వీటి ధరలు 10 శాతం పెరిగాయి. దాంతో సమీప భవిష్యత్తులో ఇంకెంత పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.స్వీట్లు, లడ్డూలు, ఇతర వంటకాల తయారీలో శనగపప్పు అవసరం అవుతుంది. అయితే అంతకుముందు నెల వీటి ధరలు దాదాపు 5% పడిపోయాయి. దాంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కానీ తాజా నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో వీటి ధర 10 శాత పెరగడం మళ్లీ ఆందోళన కలిగిస్తుంది.ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్(ఐపీజీఏ) ప్రకారం..శనగపప్పుకు స్థిరమైన డిమాండ్ ఉంది. దేశీయంగా సరఫరా తగ్గింది. ప్రభుత్వం వద్ద పరిమిత స్టాక్ ఉంది. కానీ, రానున్న రోజుల్లో దిగుమతులు పెరుగుతాయి. దాంతో డిమాండ్‌ను అదుపుచేయవచ్చు. దానివల్ల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం శనగపప్పు ధరలు పెరుగుతాయని ముందే ఊహించి పసుపు బఠానీలను భారీగా దిగుమతి చేసుకుంది. కానీ ఆశించిన విధంగా శనగపప్పు డిమాండ్‌ను భర్తీ చేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థఇదిలాఉండగా, సెప్టెంబరు నాటికి ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి శనగపప్పు దిగుమతులు పెరగడం వల్ల ధరలు మరింత పెరగకుండా నిరోధించవచ్చని కొందరు వ్యాపారులు తెలిపారు. పసుపు బఠానీలను ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేలా అనుమతులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ధరలు అదుపులో ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణ సమస్యలు, ఆఫ్రికా సరఫరాలో జాప్యం, పండగ సీజన్, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వడం వంటి కారణాలతో రానున్న రోజుల్లో కంది పప్పు ధరలు కూడా పెరుగుతాయిని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
హెల్దీ డైట్- మొరింగా రోటీ–దాల్
కావలసినవి: మల్టీ గ్రెయిన్ పిండి – కప్పు; మునగ ఆకులు– కప్పు; నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు – రుచిని బట్టి; నీరు – అర కప్పు.తయారీ: ∙మునగాకు కడిగి చిల్లుల పాత్రలో వేయాలి ∙ఒక పాత్రలో పిండి, ఉప్పు, మునగాకు వేసి కలిపి నీటిని పోస్తూ ముద్ద చేయాలి ∙పిండిని వత్తి పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుంటే మొరింగా రోటీ రెడీ. మొరింగా దాల్ కోసం... కందిపప్పు – కప్పు, మునగాకు– కప్పు, పచ్చిమిర్చి– 2, వెల్లుల్లి రేకలు–2, నిమ్మరసం– టీ స్పూన్, ఉప్పు– రావు టీ స్పూన్, పసుపు– చిటికెడు, నూనె– టేబుల్ స్పూన్, ఆవాలు– ΄ావు టీ స్పూన్, జీలకర్ర – రావు టీ స్పూన్, ఇంగువ– చిటికెడు– వెన్న– టేబుల్ స్పూన్‌తయారీ: పప్పును ఉడికించి మెదిపి పక్కన ఉంచాలి. బాణలిలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఇంగువ, మునగాకు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. కప్పు నీరు ΄ోసి ఉడికించి మెదిపిన పప్పు కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించి నిమ్మరసం కలిపి దించేయాలి.పోషకాలు: ∙పప్పులో..ప్రోటీన్లు–10.36 గ్రా, ఫైబర్–8.7 గ్రా. రోటీలో...ప్రోటీన్లు– 3 గ్రా, కార్బోహైడ్రేట్లు , విటమిన్లు – 15 గ్రా, మునగాకులో క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్‌తో΄ాటు డైటరీ ప్రోటీన్లు, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు... మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.డాక్టర్ కరుణ న్యూట్రిషనిస్ట్ – వెల్నెస్ కోచ్ -
కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!
బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న రాజకీయనాయకుడు కూడా ఆయనే. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో హీరోగా నటించారు కూడా. అందులో హీరోయిన్ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. ఇక చిరాగ్ ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన ఆహారం గురించి షేర్ చేసుకున్నారు. బిహారీ సంప్రదాయ ఫుడ్ అయిన దాల్చావల్ లేదా దాల్ బాత్ అంటే మహా ఇష్టమైన రెసిపీ అని చెప్పుకొచ్చారు. ఇది స్పైసీ తడ్కాతో కూడిన ఒక రకమైన భోజనం. పేరు డిఫెరెంగా ఉన్నా.. ఇది మన సాధారణ భారతీయ భోజమే. మనం తెలుగు రాష్ట్రాల్లో పప్పు అన్నం ఇష్టంగా తింటామే అదేగానీ కొంచెం వెరైటీగా ఉంటుంది.ఇక్కడ దాల్ చావల్ అంటే దాల్ అంటే పప్పు, చావల్ అంటే ఉడికించిన అన్నం..మొత్తం కలిపి పప్పు అన్నం. అయితే కొన్ని ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు తక్కువగా ఉండటంతో కొద్దిపాటి కూరగాయలను జోడించి.. సులభంగా పోషకాలు పొందేలా రూపొందిచిన వంటకమే ఈదాల్ చావల్. అదేనండి మనం పప్పు టమాటా, దోసకాయ పప్పు ఎలా చేసుకుంటామో అలానే అన్నమాట. కాకపోతే ఇది స్పైసీగా ఉంటుంది. దీనికి ఊరగాయ, పాపిడ్ని జతచేసి వేడివేడి అన్నంలో తింటే దీని రుచే వేరు. ఈ దాల్ చావల్ తయారీ విధానం ఎలాగో సవివరంగా చూద్దామా..!కావాల్సిన పదార్థాలు..కందిపప్పు 1 కప్పునీళ్లు 4 కప్పులుఉల్లిపాయ ఒకటిటమమోటాలు 2పచ్చిమిర్చి 2వెల్లుల్లి రెండు, లవంగాలు రెండుఅల్లం ముక్క ఒకటిఆవాలు టేబుల్ స్పూన్జీలకర్ర టేబుల్ స్పూన్నూనె రెండు టేబుల్ స్పూన్లుఅలంకరణ కోసం తాజా కొత్తిమీర ఆకులుబాస్మతి బియ్యం 1 కప్పునీరు 2 కప్పులురుచికి ఉప్పుతయారు చేయు విధానం: పప్పు బాగా కడిగి నాలుగు కప్పులు నీళ్లు, పసుపు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేగాక, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఈ ఉడికించిన పప్పును వేయడమే. చివరగా కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేసుకోవాలికి. దీని కోసం రెడీ చేసి పెట్టుకున్న వేడి వేడి అన్నంలో ఈ పప్పు, ఊరగాయ, పాపిడి వేసుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్. View this post on Instagram A post shared by Vani Sharma (@vaanis_lunch_table) (చదవండి: అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!) -
తెనాలి.. ‘సప్తాహ ముద్దపప్పు’ తినాలి
ఆ రోజుల్లో: మాఘ మాసం వచ్చి0దంటే.. తెనాలి రామలింగేశ్వరపేటలోని శంకర మఠం ముద్దపప్పు సప్తాహాలతో ఘుమఘుమలాడేది. వారం రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాల నుంచి వేద పండితులతోపాటు అన్ని కులాల్లోని ముద్దపప్పు ప్రియులు ముద్దపప్పు భోజనం ఆరగించి.. మఠంలోనే నిద్రించేవారు. 50 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ ముద్దపప్పు సప్తాహాల విశేషాల్లోకి వెళితే.. తెనాలి: ఎనిమిదో శతాబ్దపు తత్వవేత్త.. అద్వైత గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క పది సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ. కాషాయధారి ఎవరొచ్చి నా మఠంలోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమాలు, యజ్ఞాలతోపాటు మాఘ మాసంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించేవారు. మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి మొదలై వారం రోజులపాటు ముద్దపప్పు వేర్వేరు అనుపానాలతో ముద్దపప్పు సప్తాహాలు జరిగేవి. వీటికితోడు హరికథ, బుర్రకథ, పురాణ పఠన కాలక్షేపాలతో శంకర మఠం ఓ వెలుగు వెలిగింది. సుమారు 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి. సప్తాహాలు ఇలా: నలభీమ పాకంలో చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణా నదీ తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు వచ్చే వరకు వేయించి.. బాగా ఉడకబెట్టి.. ఉప్పు, పసుపు వేసి ముద్దపప్పు వండేవారు. దీనికి అనుపానాలుగా అంగలకుదురు పుల్ల దోసకాయల్ని వినియోగించి.. అనకాపల్లి ఆవపిండి, చినరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్ర మిరపకాయలతో కొట్టిన కారం, వేటపాలెం రాళ్ల ఉప్పు వేసి.. దేవతా దోసావకాయ తయారు చేసేవారు. వలివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్ర గుమ్మడి కాయలు, ముదురు బెండకాయల ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ తిరగమోత (తాలింపు) వేసి.. గుమ్మడి ముక్కల పులుసు గొప్పగా చేసేవారు. అనంతవరంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో అన్నం వండేవారు. వేజెండ్ల గ్రామపు నెయ్యి.. సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్‌హాం కాలువ గట్టున గడ్డిమేసి ఇచ్చిన చిక్కటి పాలతో జిడ్డు గడ్డ పెరుగు కుండల్లో తోడు పెట్టేవారు. ఇంగువ మినప వడియాలు, పెసర ఎర్ర అప్పడాలు వేయించేవారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి.. పంక్తులుగా వడ్డన చేయగా.. అలనాటి ఆ ముద్దపప్పు భోజనం చేసిన వారంతా తాదాత్మ్యం చెందేవారు. నాటి సప్తాహాలను వారణాసి మణెమ్మ మహిళ దగ్గరుండి చేయించేవారు. శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. మఠం వ్యవస్థాపకురాలు లింగమ్మ కుమారుడు శంకరశాస్త్రి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మఠం నిర్వహణ చూస్తుండేవారు. తర్వాత శంకరమఠం శ్రీశృంగేరీ శారదా పీఠం అధీనంలోకి వెళ్లింది. మణెమ్మ మా అమ్మ మాది ప్రకాశం జిల్లా అద్దంకి. కుటుంబ పోషణ నిమిత్తం మా కుటుంబం తెనాలి చేరుకుంది. శుభకార్యాల్లో వంటలు చేయడంలో మా అమ్మ వారణాసి మణెమ్మ పేరు తెచ్చుకుంది. శంకర మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహాలు, కార్తీక సమారాధనలు మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవి. మా అమ్మ 26 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇప్పటికీ ఆమె పేరిట ఏటా కార్తీకమాస సమారాధనల్ని మఠంలో చేస్తున్నాం. – రాయప్రోలు సుందరమ్మ. మణెమ్మ పెద్ద కుమార్తె, సదాశివశాస్త్రి, మనవడు ఆ రోజుల్లో గొప్పగా ఉండేది ఆధ్యాత్మిక ప్రచారంలో ఒక వెలుగు వెలిగిన శంకర మఠం తర్వాతి కాలంలో ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. గొప్పగా నడిచిన ముద్దపప్పు సప్తాహాలు నిలిచిపోయాయి. భోజనం వడ్డనకు ముందు మా తండ్రి ములుకుట్ల సదాశివశాస్త్రి హరికథా కాలక్షేపం తప్పనిసరిగా ఉండేది. – ములుకుట్ల విశ్వనాథశాస్త్రి,భక్తి ప్రచారక ధూపదీప నైవేద్యం ఇస్తున్నా శంకర మఠం శ్రీశృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఉంది. 30 ఏళ్లుగా ధూపదీప నైవేద్యం పెడుతున్నా. మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవాళ్లం. మఠంతో సహా ఇల్లు శిథిలావస్థకు చేరటంతో అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చి0ది. – యనమండ్ర నరసింహమూర్తి, అర్చకస్వామి -
పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..
మన భారతీయ వంటకాల్లో పప్పు లేకుండా భోజనం పూర్తవ్వదు. పండుగలు, ఫంక్షన్లో కచ్చితంగా పప్పుతో చేసిన వంటకం ఉండల్సిందే. అంతలా కందిపప్పుతో చేసే రెసిపీ భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పప్పులో ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పైగా రక్తహీనతను నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి, ఎముకల ఆరోగ్యానికి పప్పు మేలు చేస్తుంది. అలాంటి కందిపప్పు వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటీ కందిపప్పు వల్ల దుష్పరిణామాలా..? పప్పు వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు. ఇంతకీ పప్పు ఎవరు తినకూడదు?, ఎందుకని తినకూడదు? సవివరంగా చూద్దామా..! యూరిక్ యాసిడ్: యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉంటే పప్పులు ఎక్కువగా తినకపోవడమే మంచిది. పప్పులో ముఖ్యంగా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ రుగ్మతలు: అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పప్పు తీసుకోవడం హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ పప్పులో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు, వారి ఆహారంలో పప్పుతో కారణంగా కిడ్నీలో రాళ్లు లేదా ఇతర కొత్త మూత్రపిండ వ్యాధులలో ఆక్సలేట్ కారణం కావచ్చు. గ్యాస్ సమస్య: పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి దీనిని తినడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ సమస్యలు వస్తాయి. అతిగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ పప్పుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని అధికంగా ఆహారంలో చేర్చుకుంటే, బరువు పెరగడం, కొవ్వు అధికంగా ఉండే ప్రమాదం ఉంది. అలెర్జీ ప్రతిచర్యలు: కొంతమంది వ్యక్తులు పప్పు వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కొందరికి దురద, వాపు, జీర్ణశయాంతర బాధ వంటి ప్రతికూల ప్రతిచర్యలకు దారితీయవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని గురించి వ్యక్తిగత నిపుణులు, వైద్యుల సలహాలు సూచనలు మేరకు ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.) -
24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు
ఎన్నో రకాల వంటకాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి వంటకం మాత్రం చూసి ఉండరు. గోల్డ్‌తో తయారు చేసిన కొన్ని రకాల రెసిపీలు కూడా చూసి ఉంటారు. కానీ మరీ ఇలా పప్పుని గోల్డ్‌తో వడించడం చూసి ఉండరు. గోల్డ్‌ని ఇలా ఆహారం తీసుకుంటే అరుగుతుందా అన్న డౌట్లు వచ్చేస్తుంటాయి. కానీ ఓ రెస్టారెంట్ తన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన వంటకాన్ని అందిస్తుంది. పైగా ధర కూడా ఎక్కువే. ఎక్కడంటే..దుబాయ్‌లోని కుష్కన్లో పలు అవార్డులు పొందిన సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్‌కి చెందిన రెస్టారెంట్ బంగారంతో ప్రత్యేక వంటకాన్ని అందిస్తుంది. ఇది విశేష ప్రజాదరణ పొందిన వంటకం అని చెప్పొచ్చు. దీన్ని 'దాల్ కష్కన్' అనిపిలుస్తారు. పప్పుని 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు. దీని ధర ఏకంగా 58 దిర్హామ్‌లు (సుమారు ₹ 1,300). మెహుల్ హింగు అనే ఫుడ్ బ్లాగర్ ఇన్‌స్టాగ్రామలో ఆ రెసీపీకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక చెక్కపెట్టేలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకు వస్తారు. సర్వర్ కస్టమర్‌కు ఆ డిష్ ప్రత్యేకతను వివరించడం జరగుతుంది. ఆ తర్వాత ఒక గిన్నేలోని బంగారు రజనుతో ఉన్న లిక్విడ్‌ని పప్పుపై వేసి కలపడం కనిపిస్తుంది. ఇది కష్కన్లో దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్లోని రణ్వీర్ బ్రార్ రెస్టారెంట్ '24 క్యారెట్ల గోల్డెన్ తడ్కే వాలీ దాల్' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు మెహుల్ హింగు. దీన్ని చూసిన నెటిజన్లు బంగారాన్ని మన శరీరం శోషించుకోలేదు. అయినా దీనిలో ఏం పోషకాలు ఉంటాయని ఇలా చేస్తున్నారని, మరోకరు ఫైర్ అవ్వుతూ కామెంట్లతో పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Mehul Hingu (@streetfoodrecipe) (చదవండి: మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసిపీ ప్రీపరేషన్కి సంబంధించిన వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రాహుల్, ఆయన తల్లి సోనియగాంధీ ఆ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఇక్కడ భారతీయ వంటకాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ వంటకాల్లో కారానికి అలవాటు పడటానికి తాను ఎలా ఇబ్బంది పడ్డానో వివరించారు. భారతీయ వంటకాల్లో తనకు నచ్చేది 'పప్పు అన్నం' అని ముఖ్యంగా విదేశాలకు వెళ్లి భారత్‌కి రాగనే వెంటనే ఈ వంటకాన్నే తింటానని, అదంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. మన భారతీయులకు పండగలకు, లేదా ఏ సెలబ్రెషన్లో అయినా తప్పనిసరిగా ఉండాల్సింది ఈ దాల్ రైసే. దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!.. అవేంటంటే.. ఇది చాలా సింపుల్ వంటకం. బియ్యం, కాయధాన్యాల కలియక తో కూడిన పప్పు అన్నం ఆరోగ్యాన్ని ఎంతో మంచిది. శాకాహారులు ఎక్కువగా చేసే వంటకం కూడా ఇదే. ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రోటీన్ మూలం.. ఈ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ఉండే అమైనో ఆమ్లాలు, బియ్యంలోని కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం.. కండరాల నిర్వహణకు, పెరుగుదలకు అవసరమైన అన్ని ప్రోటీన్లు సమకూరుస్తుంది. ఫైబర్.. అలాగే కాయాధాన్యాల్లో ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహిస్తుంది. ఈ ఫైబర్ కంటెంట్ నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి బరువుని అదుపులో ఉంచేలా చేస్తుంది. తక్షణ శక్తి.. బియ్యంలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. రోజంత శరీరంలో శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడానికి పప్పు అన్నం ఒక ఎంపిక. చురుకైన జీవన శైలి లేదా శారీరక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు ఇది మంచి పౌష్టిక ఆహారం. సామాన్యుడికి సైతం .. సామాన్య మానవుడికి సైతం అందుబాటులో ఉండే మంచి ప్రోటీన్లు, ఫైబర్‌తో కూడిన ఆహారం. ఇంట్లో కనీసం కాయగూరలు లేనప్పుడూ దానితో చేసే వివిధ వంటకాలతో కావాల్సినన్ని పోషకాలు పొందగలుగుతారు. పోషకాల నిలయం.. పప్పులో ఐరన్, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు అందించగా, బియ్యంలో ఉండే 'బీ' విటమిన్లు మాంగనీస్‌ను అందిస్తుంది. ఈ పోషకాలు రక్తం ఏర్పడటానికి, రోగనిరోధక వ్యవస్థకు, ఎముకల ఆరోగ్యం తోపాటు వివిధ శారీరక విధులకు మద్దతు ఇస్తుంది. కంఫర్ట్ ఫుడ్ అందరూ సులభంగా వండుకునే వంటకం, పైగా భారతీయుల ఇంటిలో తప్పనసరిగా ఉండే వంటకం కూడా ఇదే. ఒకరకంగా ఈ వంటకాన్ని తమ వారసత్వ వంటకంగా చెబుతారు. సామాన్యుడికి విలువైన పోషకాలతో కూడిన ఆహార అవసరాన్ని తీర్చే వంటకం ఇదే. ఆరోగ్యకరమైనది, అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన రెసిపీగా పేర్కొనవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..?) -
చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!
నిత్యావసర సరుకుల ధరల ప్రభావం సామాన్యుల జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో 2023వ సంవత్సరం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. పప్పులు, టమాటాలు, అల్లం, ఉల్లి, బీన్స్, క్యారెట్, మిర్చి, టమాటా ఇలా రోజువారీ ఉపయోగించే అనేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కిలో రూ. 300 దాటిన టమాటా సాధారణ రోజుల్లో కిలో రూ. 20 నుంచి 30కి విక్రయించే టమాటా ఈ ఏడాది ఖరీదు పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆగస్టు చివరిలో కిలో రూ.250 నుంచి 260 వరకూ పలికింది. దేశంలోని కొన్ని నగరాల్లో టమాటా ధర కిలో రూ.300 దాటింది. ఇలా ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొండవాలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. ఆకాశాన్ని అంటిన కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని పప్పుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని రికార్డులను అధిగమించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 12న ఢిల్లీలో కంది పప్పు కిలో ధర రూ.118గా ఉంది. జూలై 12న ఢిల్లీలో కిలో కంది పప్పు ధర రూ.100కి చేరింది. ఈ పప్పు ధర ఇప్పటికీ ఆకాశంలోనే ఉంది. కందిపప్పు చిల్లర ధర కిలో రూ.170 నుంచి రూ.300 వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. పొలాల నుంచి అల్లం చోరీ 2023లో అల్లం ధర సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది అల్లం ధర కిలో రూ. 400కు చేరుకుంది. ఏడాది చివరి భాగంలో ధరల్లో తగ్గుదల కనిపించింది. కాగా ఆన్లైన్లో కిలో వెల్లుల్లి ధర రూ.320 నుంచి రూ.500 వరకు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూలైలో అల్లం ధర రూ.300 నుంచి రూ.400కి చేరింది. ధర పెరిగిన నేపధ్యంలో కర్ణాటకలో పొలాల నుంచి అల్లం చోరీకి గురైన సంఘటనలు వెలుగు చూశాయి. గణనీయంగా కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. జూలై 2023లో వార్షిక ప్రాతిపదికన 37.34 శాతానికి పెరిగింది. ఇది కాకుండా ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం స్థాయి జూన్ 2023లో 4.63 శాతం నుండి జూలై 2023 నాటికి 10.57 శాతానికి పెరిగింది. ధాన్యాల ద్రవ్యోల్బణం జూన్ 2023లో 12.71 శాతం నుంచి 13.04 శాతానికి పెరిగింది. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు! -
పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
భారతీయ వంటకాల్లో పప్పులు చాలా ప్రధానమైనవి. కచ్చితంగా ఏదో రూపంలో మన ఆహారంలో పప్పులు తీసుకుంటాం. అది పప్పుగా వండుకుని తీసుకోవడం లేదా స్నేక్స్ రూపంలోనో పప్పులను తీసుకోవడం జరగుతుంది. అలాంటి వాటిని రోజూవారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఇంకా మంచిదని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు పరిశోధకులు పప్పుధాన్యాలపై జరిపిన అధ్యయనంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటంటే.. పరిశోధకుల అధ్యయనం ప్రకారం అన్ని రకాల కాయధాన్యాలు, చిక్కుళ్లు జాతికి చెందినవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో మంచి ప్రోటీన్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదీగాక పప్పుల్లో తక్కువుగా గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరని ప్రభావవంతంగా తగ్గిస్తాయి. అందువల్ల టైప్ 2 మధుమేహం ఉన్నవారికి అధిక ఫైబర్ ఉన్న పప్పు దినుసులు ఎంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టోరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సుమారు 121 మంది మధుమేహ రోగులపై అధ్యయనం నిర్వహించారు. వారిలో సగం మందికి ఆహారంలో ప్రతిరోజూ ఒక పప్పు ధాన్యాలను చేర్చారు. మిగిలిన సగం మందికి గోధుమ ఆహారాన్ని ఇచ్చారు. అధికంగా పప్పుజాతికి సంబంధించిన వాటిని తీసుకున్న వారిలో చక్కెర హెచ్‌బీఏ1సీ(హీమోగ్లోబిన్ ఏ1సీ) స్థాయిల్లో తగ్గుదల కనిపించింది. ఇందులో ఉండే ఫైబర్లు రక్తంలోని చక్కెరను సమర్ధవంతగా నియంత్రించాయి. ముఖ్యంగా పప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉండటం కారణంగా రక్తంలోని గ్లైసెమిక్‌ని సులభంగా నియంత్రించగలదని తెలిపారు. ఈ పప్పుజాతికి చెందిన కాయధాన్యాలు నేరుగా రక్తంలోనే గ్లూకోజ్‌ని విడుదల చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదని చెబుతున్నారు. వీటిలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి. అందువల్ల రక్తంలో గ్లూకోజ్‌ని సమస్థాయిలో ఉంచడం లేదా స్థిరంగా ఉండేటట్లు చేస్తాయిని చెబుతున్నారు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పప్పుధాన్యాలు అత్యంత మంచివి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈజీగా రక్తంలో కరిగిపోగలదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వుల, తక్కువ గ్లైసెమిక్ ఆహారా పదార్థాల తోపాటు ఈ పప్పు ధాన్యాలను కూడా చేర్చితే మరింత పోషాకాలతో కూడిన ఆహారం అందినట్లు అవుతుంది. పైగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది పప్పులకి సంబంధించిన మరిన్నీ ఆసక్తికర విషయాలు.. కెనడియన్ల అధ్యయనం ప్రకారం పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లుకు ప్రతిస్పదించే విధానం ప్రభావితం అవుతున్నట్లు గమనించారు. ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు తెలిపారు అధ్యయంనంలో బంగాళ దుంపలు, బియ్యం స్థానంలో పప్పులు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సుమారు 20%కి పైనే తగ్గుతాయి. సగం అన్నం స్థానంలో అధికంగా కాయధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సుమారు 20% వరకు తగ్గుదల కనిపించింది పూర్తిగా పప్పుధాన్యాలను తీసుకుంటే 35%పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయిని చెబుతున్నారు పరిశోధకులు కాబట్టి పప్పులను మీ రోజూవారి ఆహారంలో సూప్ రూపంలోనే లేదా స్నాక్స్ కింద ఉకడబెట్టి తీసుకున్నా మంచిది. అదీగాకుండా మీరు తీసుకునే సలాడ్‌లో వీటిని కూడా చేర్చుకున్నా మంచిదే. అలా కాకుండా రోజూ పప్పుతినలేం అనుకున్న వాళ్లు, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు మీరు తినే చికెన్, మటన్‌కి ఈ పప్పు ధాన్యాలను జోడించి తీసుకోవచ్చని చెబుతున్నారు పోషాకాహార నిపుణులు. (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
రేపు ‘భారత్ దాల్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగపప్పు (చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజాపంపిణీ సంస్థ ‘భారత్ దాల్‘ బ్రాండ్ పేరుతో ప్యాక్ అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్‌లో 20 శాతం రిటైల్ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ఈ మేరకు వన్ నేషన్ వన్ ప్రైస్ ధరలను అమలు చేస్తోంది. కిలో కేజీ శనగపప్పు ప్యాకెట్ రూ.60, 30 కిలోల ప్యాకెట్‌కు కిలోకు రూ.55 చొప్పున రూ.1,650కి అందించనున్నారు. హాకాకు 50 వేల టన్నులు.. ఇక దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ‘భారత్ దాల్‘ బ్రాండ్ శనగపప్పు పంపిణీ బాధ్యతలను రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు అప్పగించింది. రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), మెట్రో, రిలయన్స్, టాటా రిటైల్ చైన్ హైపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ వంటి ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభం హాకా పంపిణీ చేసే శనగపప్పు భారత్ దాల్ బ్రాండ్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్‌రోడ్‌లో ని అంబేడ్కర్ విగ్రహం వద్ద హాకాచైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ పాల్గొననున్నారు. -
పప్పుకు నిప్పెట్టాడు!
అప్పు చేసి పప్పు కూడు తినమన్నారు గానీ...పప్పుకు నిప్పెట్టమని చెప్పలేదు పెద్దలు. హరిద్వార్‌లోని జ్వాలానగర్‌కు చెందిన ఈ పెద్దాయన పప్పుకు నిప్పెట్టి ‘ఫైర్‌వాలీ దాల్’ పేరుతో తన హోటల్లో హాటు హాటుగా అమ్ముతుంటాడు. నెయ్యి... మొదలైన దినుసులు ఉన్న గరిటెను మండించి ప్లేట్లో ఉన్న పప్పుకు జస్ట్ అలా తగిలిస్తాడు...అంతే! ‘ఫైర్‌వాలీ దాల్’కు రుచికరమైన సూప్‌ను ఉచితంగా ఇస్తాడు. ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ కోసం ఎప్పుడూ వచ్చే వారితో పాటు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అంటూ వచ్చే వాళ్లు కూడా ఎక్కువే. ఆనోటా ఈ నోటా ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ గురించి విన్న ఒక యువకుడు పనిగట్టుకొని దిల్లీ నుంచి హరిద్వార్‌కు వచ్చాడు. ‘ఇతడి చేతిలో ఏదో ఇంద్రజాలం ఉంది’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వేడి వేడిగా పోస్ట్ చేశాడు. ‘సో టెంప్టింగ్’ అంటూ స్పందించారు నెటిజనులు. -
పప్పు.. నిప్పు!
సాక్షి, హైదరాబాద్: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్ దాల్) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే.. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. స్టాక్.. బ్లాక్ మార్కెట్‌కు? పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అత్యుత్తమ వంటకాల జాబితాలో...షాహీ పనీర్, దాల్, కుర్మా!
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది. టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం! ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) -
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
Recipes: గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు, ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్ ఇలా!
మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, పచ్చని అడవులు స్వచ్ఛమైన గాలితో.. హిమాచల్ సోయగాలు రారమ్మని పిలుస్తుంటాయి. అక్కడి ప్రకృతి అందాలు ఎంత అబ్బురపరుస్తాయో ... íహిమాచల్ వాసుల సంప్రదాయ వంటలు విభిన్న రుచితో తినేకొద్ది తినాలనిపిస్తాయి. వాటిలో కొన్ని వంటలు ఇవి... గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు కావలసినవి: ►గోధుమ పిండి – రెండు కప్పులు ►మినపప్పు – కప్పు ►ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా ►ఉప్పు – రుచికి సరిపడా తయారీ.. ►మినపప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా నాన బెట్టుకోవాలి. ►నానిన పప్పుని ఉదయాన్నే నీళ్లు వంపేసి బరకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. ►గోధుమపిండిలో పావు టీస్పూను ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. ►పిండిముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ►ఈ ఉండలను చిన్న పూరీలా వత్తి మధ్యలో టీస్పూను మినపప్పు మిశ్రమం వేసి మూసేయాలి. ►ఇలా అన్నీ ఉండలు చేసిన తరువాత, లోపలి మిశ్రమం బయటకు రాకుండా చిన్నచిన్న పూరీలుగా వత్తుకోవాలి ►ఆయిల్ వేడెక్కిన తరువాత పూరీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారెంతవరకు కాలనిస్తే బబ్రు రెడీ. ► చనా మద్రా లేదా, బూందీరైతాలతో బబ్రూలు చాలా బావుంటాయి. ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్ కావలసినవి: ►బియ్యం – కప్పు ►ఎర్రకందిపప్పు – అరకప్పు ►ఉల్లిపాయ – ఒకటి ►బంగాళ దుంప – రెండు ►చిక్కటి పెరుగు – అరకప్పు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలుక్కాయ – ఒకటి ►నల్లయాలుక్కాయ – ఒకటి ►దాల్చిన చెక్క – అరంగుళం ముక్క ►నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా మసాలా పేస్టు: టొమాటో – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెలుల్లి రెబ్బలు – ఐదు, కొత్తిమీర – చిన్నకట్ట, పచ్చిమిర్చి – రెండు, యాలుక్కాయ – ఒకటి, నల్లయాలుక్కాయ – ఒకటి, దాల్చిన చెక్క – అరఅంగుళం ముక్క, జాపత్రి – రెండు, అనాసపువ్వులు – రెండు, దగడపువ్వులు – రెండు, నాగకేసరపువ్వులు – రెండు, గసగసాలు – అరటీస్పూను, లవంగాలు – రెండు, కారం – అరటీస్పూను. తయారీ.. ►ముందుగా మసాలా పేస్టుకోసం తీసుకున్న పదార్థాలన్నీ బ్లెండర్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. ►బంగాళ దుంపలను తొక్కతీసి, అంగుళం పరిమాణంలో ముక్కలుగా తరగాలి ►బంగాల దుంపల ముక్కలను మసాలా మిశ్రమంలో వేసి కలిపి, రాత్రంతా రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ►ఎర్రకందిపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి ►బియ్యాన్ని కూడా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ►ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ∙కుకర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ►నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, నల్ల, సాధారణ యాలుక్కాయలు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి ►ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ►ఉల్లిపాయలు చక్కగా వేగినాక రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి వేగనివ్వాలి ►ఈ మిశ్రమం వేగిన తరువాత పెరుగు వేసి నెయ్యి పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యం, ఎర్రకందిపప్పులను నీళ్లు వంపేసి వేయాలి ►∙దీనిలో మూడు కప్పుల వేడినీళ్లుపోసి కలపాలి. ►కుకర్ మూతపెట్టి పెద్ద మంటమీద రెండు విజిల్స్ రానిస్తే తుక్దియా బాత్ రెడీ. చదవండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ ఇలా తయారు చేసుకోండి! Ulava Garelu Recipe In Telugu: ఉలవ గారెలు తిన్నారా? -
పెళ్లికి ముందు ‘గ్రేట్ ట్రైనింగ్’
సాక్షి, హైదరాబాద్: ఆ మ్యాగీ, చిప్స్ గట్రా రెండు వారాలు తినే సరికి నోరు చేవ చచ్చిపోతుంది. ఇంటి తిండి తినాలనే కోరిక పుడుతుంది. సరిగ్గా అప్పుడే చిన్న సమస్య మొదలవుతుంది. అదే ఏది కందిపప్పో, ఏది మినపప్పో తెలియకపోవడం! అంటూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న తనయుడికి ఓ తల్లికి రాసిన చిన్న సలహాల పట్టిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (నితిన్ పెళ్లి ముహూర్తం ఖరారు) ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా దీన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. రకరకాల పప్పుదినుసులను ఓ పేపర్‌పై స్టిక్కర్లతో అంటించిన తల్లి దాన్ని కొడుక్కి పెళ్లి బహుమతిగా ఇచ్చిందట. దీపాన్షు ట్వీట్‌కు వెయ్యికి పైగా రిప్లైలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఆవిడ చేసిన పనిపై వారి అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు పెళ్లికి ముందు ఇచ్చే ‘గ్రేట్ ట్రైనింగ్’గా పేర్కొంటూ మెచ్చుకున్నారు. ఓ యూజర్ పప్పు దినుసుల్లో ఏది ఏంటో గుర్తుపట్టలేని అమ్మాయిలు కూడా ఉన్నారు సార్ అని ఓ యూజర్ పేర్కొనగా, ఈ పోస్టు వారికీ వర్తింస్తుందని దీపాన్షు రిప్లై ఇచ్చారు. -
కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మధ్యహ్నా భోజనంలో భాగంగా తనకు కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు ఓ వంటమనిషి ఒకటో తరగతి చదువుతున్న బాలుడి ముఖంపై వేడిగా కాలుతున్న పప్పును విసిరికొట్టాడు. దీంతో ఆ బాలుడి ముఖం కాలింది. అలాగే చెంపలు, ఛాతీ భాగం, వెనుక భాగం కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం దిండోరిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ మెహ్రా అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేసే క్రమంలో నేమావతి బాయి అనే వంట చేసే మహిళను తనకు కొంచెం అదనంగా పప్పు వేయాలని కోరాడు. దాంతో ఆమె నేరుగా పప్పు అతడిపై విసిరి కొట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రూ.9.64 లక్షల మినపప్పు స్వాధీనం
కాకినాడ సిటీ : అక్రమంగా నిల్వ ఉంచిన రూ.9.64 లక్షల విలువైన 120 క్వింటాళ్ల మినపప్పును పౌర సరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ గొడారిగుంట సీతారామనగర్లోని ఒక ఇంటి నుంచి విశాఖపట్నం తరలించేందుకు లారీలో పప్పు లోడ్ చేస్తుండగా అసిస్టెంట్ పౌర సరఫరా శాఖాధికారి పి.సురేష్ నేతృత్వంలోని అధికారుల బృందం దాడి చేసింది. మహలక్ష్మి ట్రేడర్స్ పేరిట నారపురెడ్డి శ్యామల ఫుడ్ గ్రేన్ లైసెన్స్ (ఎఫ్జీఎల్) లేకుండా పప్పు దినుసుల వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిల్వ ఉంచిన సరుకును సీజ్ చేసి దిగుమర్తివారి వీధిలోని సాయికృష్ణ ట్రేడర్స్‌కు అప్పగించారు. సరుకు తరలిస్తున్న లారీని సీజ్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహలక్ష్మి ట్రేడర్స్ అధినేత శ్యామలపై నిత్యావసర వస్తువుల చట్టం 6ఏ కేసు నమోదు చేశామని, తగిన చర్యలకు కలెక్టర్‌కు నివేదిక అందజేసినట్టు అసిస్టెంట్ పౌర సరఫరా శాఖాధికారి సురేష్ తెలిపారు. నూనె, పంచదార, పప్పు దినుసులు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌర సరఫరాలశాఖ నుంచి ఫుడ్‌గ్రేన్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. డిప్యూటి తహసీల్దార్లు ఎ.తాతారావు, ఎస్ఎం.బాషా, జీపీఏ పి.సుబ్బారావు పాల్గొన్నారు. -
ఇంటిప్స్
పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే... పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులను పెడితే చాలు. వంట చేసేటప్పుడు స్టవ్ మీద పడిన మరకలు అంత సులువుగా పోవు. అలాంటప్పుడు పెద్ద సైజు టొమాటో ముక్కను తీసుకొని దాన్ని ఉప్పులో ముంచి మరకలపై రుద్దాలి. ఇలా చేస్తే ఎలాంటి మరకలైనా త్వరగా పోతాయి. అంతే కాకుండా ఎన్నేళ్ల స్టవ్ అయినా కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డికాషిన్‌లో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. -
ప్రధాని ఆఫ్రికా పర్యటనలో..
న్యూఢిల్లీః ప్రధాని ఆఫ్రికా పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆఫ్రికా, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం, సహకారం బలోపేతం చేయడంతోపాటు ఆయాదేశాల్లోని అనేక వనరుల వినియోగంపై దృష్టి సారించనున్నారు. పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు, పప్పుధాన్యాలు, విద్యుత్ శక్తి మొదలైన అంశాలపై చర్చించనున్నారు. జూలై 7న మొదలై.. ఐదురోజులపాటు కొనసాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో విద్యుత్, వాణిజ్య, పెట్టుబడి, ఆహారం, సముద్ర భద్రత, తీవ్రవాదం, సహకారం వంటి విషయాలపై దృష్టి సారించనున్నట్లు భారత విదేశాంగశాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి అమర్ సిన్హా తెలిపారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఒక్కోదేశంలోనూ అనేక ఒప్పందాలపై మోదీ సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో.. చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించగా... ప్రస్తుతం మోదీ పర్యటన మరింత దోహదం చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే భారతదేశం ఆఫ్రికా దేశాలనుంచి భారీ పరిమాణంలో పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటుండగా.. ఈ పర్యటనలో మొజాంబిక్ తో దీర్ఘ కాల సేకరణకు ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొద్ది నెల్లుగా భారత్ లో పప్పుధాన్యాల ధర తీవ్రంగా పెరగడం అనేక విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రధాని పప్పుధాన్యాల దిగుబడులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జోహాన్స్ బర్గ్, నైరోబిల్లో భారత సంతతికి చెందిన ప్రజలు గణనీయంగా ఉండటంతో ప్రధాని ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా నాలుగు దేశాల్లో జరిగే సమావేశాల్లో భారత సమాజంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సిన్హా తెలిపారు. పర్యటనలో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ఎంతో లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ లో భారత్ లో నిర్వహించిన నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల సదస్సుకు సుమారు 54 ఆఫ్రికా దేశాల ప్రభుత్వాధినేతలు, 40 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. గురువారం ప్రారంభం కానున్న మోదీ విదేశీ ప్రయాణంలో ముందుగా మొజాంబిక్ కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు ఫిలిఫె న్యూసితో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారు. అనంతరం రెండు రోజులపాటు దక్షిణాఫ్రికాలోని జొహన్స్ బర్గ్, పీటర్ మారిట్జ్ బర్గ్, డర్బన్ నగరాల్లో పర్యటిస్తారు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంలో మహాత్మాగాంధీ ప్రయాణించిన చారిత్రక రైలులో మోదీ పీటర్‌మారిట్జ్ బర్గ్ ప్రయాణించనున్నారు. తెల్లవారు కాని వారికి అనుమతి లేదంటూ అప్పట్లో మహాత్మా గాంధీని మొదటి తరగతి కంపార్ట్ మెంట్ నుంచి బయటకు తోసేసిన కథనం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో భారత్ కు ఉన్న చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు, ఇతర రాజకీయ నేతలతో మోదీ సమావేశం అవుతారు. జూలై 10న టాంజానియాలో, 11న కెన్యాలో మోదీ పర్యటన జరగనున్నట్లు ప్రధాని పర్యటనపై పూర్తి వివరాలను సిన్హా తెలిపారు. -
‘పప్పు’లేని మెతుకు నూనెకు నోచుకోని బతుకు
♦ 5 నెలలుగా అందని కందిపప్పు ♦ ఏడాదిన్నరగా నిలిచిపోయిన పామాయిల్ ♦ నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ ♦ నెలల తరబడి అందని సరుకులు ♦ జిల్లాలో 7.79 లక్షల ఆహారభద్రత కార్డులు ♦ బహిరంగ మార్కెట్లో మండుతున్న ధరలు ♦ బియ్యం, చక్కెర, గోధుమలతోనే సరి జోగిపేట: బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు కొని తినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసర వస్తువులను అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. సరఫరాను బియ్యం, చక్కెర, గోధుమలకే పరిమితం చేసింది. నిల్వలు లేవని గతంలో పసుపు, ఉప్పు, కారం, పామాయిల్, గోధుమ పిండి, చింతపండు సరఫరాలను నిలిపివేసిన ప్రభుత్వం 5 నెలలుగా కందిపప్పును కూడా ఆపేసింది. దీంతో నిత్యావసర వస్తువులు మార్కెట్లో కొనలేక లబ్ధిదారులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. కరువుతో అల్లాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం చూపాల్సిన ప్రభుత్వం కనీసం పప్పు మెతుకులకు నోచుకోకుండా చేసిందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలలో 7.79 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా బియ్యంతో పాటు గోధుమలు పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఈ వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంత ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. కానీ నిల్వలు లేవని గడిచిన 5 నెలలుగా కందిపప్పు సరఫరా నిలిపేసింది. కొన్ని సార్లు కార్డుకు అరకిలో ఇచ్చే చక్కెరను కూడా పంపిణీ చేయలేకపోతున్నారు. తొమ్మిది వస్తువులకు మంగళం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.185కే 9 నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించారు. రూ.40 కి పామాయిల్, రూ.50కి కందిపప్పు, రూ.10 పసుపు, రూ.7 గోధుమలు, రూ.5కు ఉప్పు, రూ.6.75కు చక్కెర, రూ.30కి చింతపండు, రూ.20కి కారం, రూ.16.50కి గోధుమ పిండిని పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బియ్యం కోటా లబ్దిదారుడికి రూ.4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచి సంతోషపెట్టారు. కానీ తొమ్మిది నిత్యావసర వస్తువుల సంఖ్యను తగ్గించారు. ఉప్పుకారం, గోధుమ పిండి, పసుపు, చింతపండు, పామాయిల్ సరఫరా గత ఏడాది నుంచి నిలిపివేశారు. ఐదు మాసాల క్రితం కంది పప్పును నిలిపివే సారు. కందిపప్పు, చక్కెర ధరలతో అవస్థలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.150కి పెరిగింది. చౌకధర దుకాణాలలో కిలో రూ.50కేల దొరికేది. చక్కెర కిలో రూ.40 పలుకుతుంది. చౌకధరల దుకాణంలో రూ.14కు వచ్చేది ఈ పరిస్థితిలో ఈ రెండు వస్తువులు చౌక ధరల దుకాణాల్లో లేకపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తొమ్మిది వస్తువులను పునరుద్ధరించాలి గతంలో చౌక ధరల దుకాణం ద్వారా రూ.185కే తొమ్మిది వస్తువులు ఇచ్చే వారు. ప్రస్తుతం బియ్యం, గోధుమలు, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కంది పప్పు నిలిచిపోవడంతో చాలా కష్టంగా ఉంది. గతంలో పామాయిల్, కందిపప్పులను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేవారు. తిరిగి నిలిపివేసిన వస్తువులన్నింటిని పంపిణీ చేసి ఆదుకోవాలి. పేద ప్రజలు పండుగలు చేసుకోవాలంటేనే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. - లక్ష్మి, రాంసానిపల్లి పామాయిల్, కందిపప్పు సరఫరా లేదు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం చక్కెర, బియ్యం, గోధుమలు, గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 7 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులున్నాయి. గత సంవత్సరం నుంచి పామాయిల్‌ను సరఫరా చేయడం లేదు. కొన్ని నెలలుగా కంది పప్పు కూడా రాకపోవడంతో దుకాణాలల్లో పంపిణీ చేయలేకపోతున్నాం. పామాయిల్‌కు బదులుగా వేరే ఆయిల్‌ను పంపిణీ చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. పేదలకు అవసరమయ్యే బియ్యం విషయంలో మాత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అనురాధ, డీఎస్ఓ సంగారెడ్డి -
పప్పులకు కేంద్రం 'మద్దతు'
సాక్షి, న్యూఢిల్లీ వరి, పప్పు ధాన్యాలకు 2016–17 ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధరను బుధవారం కేంద్రం పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా సాగయ్యే వరి ధాన్యానికి మద్దతు ధరను నామమాత్రంగా క్వింటాలుకు రూ. 60 మాత్రమే పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల రేటు 4.3 శాతమే. అయితే.. అనూహ్యంగా పెరిగిన పప్పు ధరలను అదుపుచేసే ప్రయత్నంలో భాగంగా.. పప్పు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించేందుకు వీటికి మద్దతు ధరను గణనీయంగా పెంచింది. ‘వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్’ సిఫారసులకు అదనంగా రైతులకు మేలు చేసేందుకు మరింత బోనస్ ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. ఈ ధరలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు కామన్ గ్రేడ్ వరికి రూ. 1,410 ఉన్న మద్దతు ధరను రూ. 1,470కు పెంచింది. రూ. 1,450 ఉన్న గ్రేడ్–ఏ రకం వరికి మద్దతు ధర రూ.1,510కి పెరిగింది. ప్రస్తుతానికి కేంద్రం వద్ద సరిపడినంత స్థాయిలో బియ్యం నిల్వ ఉన్నందున వరికి ఈ మద్దతు ధరలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది విదేశాల నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావటంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పప్పు ధాన్యాలకు బోనస్‌ను పెంచినట్లు మంత్రి తెలిపారు. 2015–16లో క్వింటాలుకు రూ. 4,625గా ఉన్న కందులకు మద్దతు ధరను 9.2 శాతం మేర పెంచుతూ రూ. 5,050గా ప్రకటించింది. గతేడాది కందులకు బోనస్ రూ.200 ఉండగా.. ఈ ఏడాది మద్దతు ధరలో రూ.425 బోనస్ సమ్మిళితమై ఉంది. మినుములకు 8.1 శాతం బోనస్ ఇస్తూ.. ఇప్పటివరకు క్వింటాలుకు రూ. 4,625గా ఉన్న మద్దతు ధరను ఈఖరీఫ్‌లో రూ. 5 వేలకు పెంచింది. పెసర క్వింటాలుకు ఇప్పటివరకు మద్దతు ధరను రూ. 4,850 నుంచి రూ. 5,225 కు (7.7 శాతం పెంపు) పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వేరుశనగకు గతేడాది రూ. 4,030 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది బోనస్ రూ. 100తోపాటు అదనంగా రూ. 90 కలిపి మొత్తంగా క్వింటాలుకు రూ. 4,220గా ప్రకటించింది. నువ్వులకు రూ. 4,700 మద్దతు ధరల ఉండగా.. దీన్ని రూ.5,000లకు పెంచింది. సోయాబీన్ మద్దతు ధరను రూ. 175, పొద్దుతిరుగుడు పువ్వు కు రూ.150 పెంచినట్లు రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. మీడియం స్టేపుల్ పత్తి రకానికి ప్రస్తుతం ఉన్న రూ. 3800 ధరకు రూ. 3,860 పెంచారు. అదేవిధంగా.. లాంగ్స్టేç³#ల్ రకానికి ప్రస్తుతం ఉన్న రూ. 4,100 ధరను రూ. 4,160లకు పెంచినట్లు ఆయన తెలిపారు.దీంతోపాటు రాగికి రూ.75, జొన్నకు రూ.60, సజ్జలకు రూ.55, మొక్కజొన్నకు రూ.40 మద్దతు ధర పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు చెన్నై మెట్రోరైలు లైను మొదటి దశ పనులను మరో 9 కిలోమీటర్లు పొడగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాషర్‌మ్యాన్‌పేట్ నుంచి వింకోంగార్ వరకు లైనును పొడగించనున్న ఈ లైనుతోపాటు రూ.3,770 కోట్ల ప్రతిపాదిత తొలిదశ ప్రాజెక్టును మార్చి 2018 కల్లా పూర్తిచేయన్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అమెరికాతో చేసుకునే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ధాన్యం పాత ఎంఎస్పీ కొత్త ఎంఎస్పీ పెంపు వరి 1,410 1,470 60 కందులు 4,625 5,050 425 పెసలు 4,850 5,225 375 మినుములు 4,625 5,000 375 వేరుశనగ 4,030 4,220 190 నువ్వులు 4,700 5,000 300 పత్తి 3,800 3,860 60 -
అభాసుపాలవుతున్న ‘ఆరోగ్యలక్ష్మి’
అంగన్వాడీలకు రెండున్నరనెలలుగా నిలిచిన కందిపప్పు సరఫరా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందని పౌష్టికాహారం పట్టించుకోని అధికారులు ఘట్కేసర్ టౌన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం ఆరంభ శూరత్వంగా మారింది. మాతాశిశు మరణాలను తగ్గిం చడానికి షౌష్టికాహారం అందించాలని 2015 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకపూట సం పూర్ణ భోజనం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హయత్‌నగర్ ప్రాజెక్టులో 243 కేంద్రాల ద్వారా సుమారు 10,300 వేలకు పైగా బాలింతలు, గర్భిణిలు వన్ ఫుల్‌మీల్స్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో గర్భిణిగా నమోదైనప్పటి నుంచి పుట్టిన సంతానం ఆరు నెలల వయస్సు వచ్చేం తవరకు ఈ భోజనాన్ని అందిస్తారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం గర్భిణిలు, బాలింతలకు నిత్యం కూరగాయలు, పాలు, గుడ్లతో పాటు రోజూ 40 గ్రాముల కందిపప్పు, చిన్నారులకు 15 గ్రాముల కంది పప్పును భోజనంలో వడ్డించాలి. కనిపించని కందిపప్పు.. అధికారుల సమన్వయం లోపం గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పాలిట శాపంగా మారింది. అధికారుల ముందుచూపు కరువవడంతో అంగన్వాడీ కేం ద్రాలకు సుమారు మూడు నెలలుగా కంది పప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహా రానికి దూరం అవుతున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో కడుపు నిండా విటమిన్లతో కూడిన పౌష్టికాహారం అందితే కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కంది పప్పు సరఫరా కాకపోవడంతో కొనుగోలు చేసి వడ్డించాలని అధికారులు అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంగన్వా డీ సిబ్బంది కొనుగోలు చేసిన అరకొర పప్పుతో పౌష్టికాహారం ఎలా అందుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నా రు. ఈ విషయమై అంగన్వాడీ సూపర్వైజర్ యశోదను వివరణ కోరగా సరి పోను కందిపప్పు నిల్వలు లేని కారణం గా అందించ లేకపోయామని, వారం రోజుల్లో సరఫరా చేస్తామని తెలిపారు. -
కర్ణాటకలో సెగలు రేపుతున్న టిప్పు సుల్తాన్ జయంతి
-
కందిపప్పు మద్దతు ధర రూ.325 పెంపు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల ధరలు ఎగసిపడుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో పప్పు ధాన్యాలకు మద్దతు ధరను రూ. 325 పెంపునకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. గోధుమ మద్దతుధరపై మరో రూ.75 బోనస్ అందించేందుకు ఆర్థికవ్యవహారల కేబినెట్ కమిటీ(సీసీఎఫ్ఏ) ఆమోదం తెలిపింది. దీంతో 2015-16రబీ సీజన్‌కుగాను గోధుమ మద్దతుధర క్వింటాకు రూ.75 పెరిగి రూ.1,525కు చేరుకుంది. నూనెగింజల మద్దతు ధరను క్వింటాకు రూ.250 పెంచారు. పెంపు తర్వాత కందిపప్పు మద్దతుధర రూ.3,325కు, శెనగల మద్దతుధర రూ.3,425కు చేరింది. వ్యవసాయ ఖర్చులు, ధరల సలహా మండలి కమిషన్(సీఏసీపీ) సూచించినట్లుగా ఆరు రబీ పంటలైన గోధుమలు, బార్లీ, శెనగలు, కందిపప్పు, ఆవాలు, కుసుమ నూనె గింజలకు మద్దతుధరను పెంచాలని నిర్ణయించారు. ఆహార బిల్లును ఇంకా అమలుచేయని రాష్ట్రాల్లో పేద, అత్యంత పేద వర్గాలకు 27లక్షల ధాన్యాలను కేటాయించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటికి 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార బిల్లు అమల్లో ఉండగా.. మిగిలిన రాష్ట్రాలు సెప్టెంబర్ 2015 కల్లా. అమలు చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలనుంచి స్పందన రాలేకపోవడంతో కేంద్రమే పేద వర్గాలకు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. మద్దతు ధర పెంపుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హరియాణా సీఎం ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు. బెల్జియం, భారత్ మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధికి సహకారం అందించుకోవటంతోపాటు.. పునరుత్పత్తి శక్తికి సంబంధించిన సాంకేతికత విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.