నిత్యావసర సరుకుల ధరల ప్రభావం సామాన్యుల జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో 2023వ సంవత్సరం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. పప్పులు, టమాటాలు, అల్లం, ఉల్లి, బీన్స్, క్యారెట్, మిర్చి, టమాటా ఇలా రోజువారీ ఉపయోగించే అనేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
కిలో రూ. 300 దాటిన టమాటా
సాధారణ రోజుల్లో కిలో రూ. 20 నుంచి 30కి విక్రయించే టమాటా ఈ ఏడాది ఖరీదు పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆగస్టు చివరిలో కిలో రూ.250 నుంచి 260 వరకూ పలికింది. దేశంలోని కొన్ని నగరాల్లో టమాటా ధర కిలో రూ.300 దాటింది. ఇలా ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొండవాలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి.
ఆకాశాన్ని అంటిన కంది పప్పు ధర
2023వ సంవత్సరంలో అన్ని పప్పుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని రికార్డులను అధిగమించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 12న ఢిల్లీలో కంది పప్పు కిలో ధర రూ.118గా ఉంది. జూలై 12న ఢిల్లీలో కిలో కంది పప్పు ధర రూ.100కి చేరింది. ఈ పప్పు ధర ఇప్పటికీ ఆకాశంలోనే ఉంది. కందిపప్పు చిల్లర ధర కిలో రూ.170 నుంచి రూ.300 వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి.
పొలాల నుంచి అల్లం చోరీ
2023లో అల్లం ధర సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది అల్లం ధర కిలో రూ. 400కు చేరుకుంది. ఏడాది చివరి భాగంలో ధరల్లో తగ్గుదల కనిపించింది. కాగా ఆన్‌లైన్‌లో కిలో వెల్లుల్లి ధర రూ.320 నుంచి రూ.500 వరకు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూలైలో అల్లం ధర రూ.300 నుంచి రూ.400కి చేరింది. ధర పెరిగిన నేపధ్యంలో కర్ణాటకలో పొలాల నుంచి అల్లం చోరీకి గురైన సంఘటనలు వెలుగు చూశాయి.
గణనీయంగా కూరగాయల ద్రవ్యోల్బణం
ఈ ఏడాది జూలైలో కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. జూలై 2023లో వార్షిక ప్రాతిపదికన 37.34 శాతానికి పెరిగింది. ఇది కాకుండా ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం స్థాయి జూన్ 2023లో 4.63 శాతం నుండి జూలై 2023 నాటికి 10.57 శాతానికి పెరిగింది. ధాన్యాల ద్రవ్యోల్బణం జూన్ 2023లో 12.71 శాతం నుంచి 13.04 శాతానికి పెరిగింది.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు!
Comments
Please login to add a commentAdd a comment