tamato
-
చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!
నిత్యావసర సరుకుల ధరల ప్రభావం సామాన్యుల జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో 2023వ సంవత్సరం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. పప్పులు, టమాటాలు, అల్లం, ఉల్లి, బీన్స్, క్యారెట్, మిర్చి, టమాటా ఇలా రోజువారీ ఉపయోగించే అనేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కిలో రూ. 300 దాటిన టమాటా సాధారణ రోజుల్లో కిలో రూ. 20 నుంచి 30కి విక్రయించే టమాటా ఈ ఏడాది ఖరీదు పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆగస్టు చివరిలో కిలో రూ.250 నుంచి 260 వరకూ పలికింది. దేశంలోని కొన్ని నగరాల్లో టమాటా ధర కిలో రూ.300 దాటింది. ఇలా ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొండవాలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. ఆకాశాన్ని అంటిన కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని పప్పుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని రికార్డులను అధిగమించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 12న ఢిల్లీలో కంది పప్పు కిలో ధర రూ.118గా ఉంది. జూలై 12న ఢిల్లీలో కిలో కంది పప్పు ధర రూ.100కి చేరింది. ఈ పప్పు ధర ఇప్పటికీ ఆకాశంలోనే ఉంది. కందిపప్పు చిల్లర ధర కిలో రూ.170 నుంచి రూ.300 వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. పొలాల నుంచి అల్లం చోరీ 2023లో అల్లం ధర సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది అల్లం ధర కిలో రూ. 400కు చేరుకుంది. ఏడాది చివరి భాగంలో ధరల్లో తగ్గుదల కనిపించింది. కాగా ఆన్లైన్లో కిలో వెల్లుల్లి ధర రూ.320 నుంచి రూ.500 వరకు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూలైలో అల్లం ధర రూ.300 నుంచి రూ.400కి చేరింది. ధర పెరిగిన నేపధ్యంలో కర్ణాటకలో పొలాల నుంచి అల్లం చోరీకి గురైన సంఘటనలు వెలుగు చూశాయి. గణనీయంగా కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. జూలై 2023లో వార్షిక ప్రాతిపదికన 37.34 శాతానికి పెరిగింది. ఇది కాకుండా ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం స్థాయి జూన్ 2023లో 4.63 శాతం నుండి జూలై 2023 నాటికి 10.57 శాతానికి పెరిగింది. ధాన్యాల ద్రవ్యోల్బణం జూన్ 2023లో 12.71 శాతం నుంచి 13.04 శాతానికి పెరిగింది. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు! -
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్‌పూర్‌లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్‌కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్‌కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్‌కు విక్రయానికి వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం!
పెరిగిన టమాటాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు వంటగదిలో కనిపించే టమాటా ఇప్పుడు వంటకాల్లో కనుమరుగయ్యింది. అయితే ఇప్పుడు టమాటాల స్థానాన్ని అవకాడోలు భర్తీ చేస్తున్నాయి. దీనికి అవకాడోల రేటు భారీగా పడిపోవడమే ప్రధాన కారణం. సోషల్ మీడియా యూజర్ ఒకరు ఇటీవల ఒక ఈ కామర్స్ ప్లాట్ఫారంలో విక్రయమయ్యే టామాటాలకు సంబంధించిన ఒక పోస్టు పెట్టారు. ఈ పోస్టులో వాటి ధరల స్క్రీన్ షాట్ కూడా షేర్చేశారు. సోషల్ మీడియా యూజర్ సుబి తన పోస్టుకు క్యాప్షన్‌గా. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే దోశలలోకి టమాటా చట్నీ చేయడం కంటే అవకాడో టోస్ట్ చేయడం తక్కువ ఖర్చుతో కూడిన పని అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం ఒక అవకాడో(సుమారు 200 గ్రాములు) ధర రూ. 59. టమాటా ధర కిలో రూ. 222 అని పేర్కొన్నారు. ఈ పోస్టు చూసిన పలువురు నెటిజన్లు అవకాడో రేటు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టమాటాల ధరలపై టోకు వ్యాపారులు మాట్లాడుతూ ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 200 ఉన్నదని, అతి త్వరలోనే దీని ధర రూ. 300 కు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్ it’s just a time in the economy when making avocado toast for breakfast is cheaper than dosa and tomato chutney pic.twitter.com/DgtuRj7OSv — subiii (@_subiii_) August 3, 2023 -
వర్షాకాలంలో వేడివేడిగా టొమాటో రింగ్స్ చేసుకోండి ఇలా
ఓట్స్ టొమాటో రింగ్స్ తయారీకి కావల్సినవి టొమాటోలు – 4 లేదా 5 (గుండ్రంగా కట్ చేసుకుని మధ్యలో గుజ్జు తీసేసి చక్రాల్లా చేసుకోవాలి) ఓట్స్ పౌడర్ – అర కప్పు, శనగపిండి – 1 కప్పు బియ్యప్పిండి, కారం – 1 టేబుల్ స్పూన్ చొప్పున బేకింగ్ సోడా – పావు టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా బ్రెడ్ పౌడర్ – పావు కప్పు (అభిరుచిని బట్టి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో శనగపిండి, ఓట్స్ పౌడర్, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు.. బేకింగ్ సోడా.. వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలచగా చేసుకోవాలి. అందులో టొమాటో ముక్కల్ని బాగా ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇంకాస్త లావుగా కావాలంటే వెంటనే మళ్లీ ఓట్స్ మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి వేయించుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే.. ఈ రింగ్స్ భలే రుచిగా ఉంటాయి. -
కూరలో టమాటా వేశాడని.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయిన భార్య!
మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టమాటాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది మరింత పెద్దదిగామారడంతో భార్య తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. వివరాల్లోకి వెళితే టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ వర్మన్ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చినప్పటికీ ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్ నుంచి అతని భార్య ఆరతి ఫోన్ నంబరు తీసుకుని ట్రేస్ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్ అధికారి సంజయ్ జైశ్వాల్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతి వర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు. కాగా దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేపధ్యంలో వీటి కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
టమాటా పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో కిలోకు రూ. 30 మేర ధర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 50–60 పలుకుతోంది. తెలంగాణలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు.. అంటే అక్టోబర్ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుంది. తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 15 నుంచి 20 శాతం వరకే ఉంటుంది. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో టమాటా సాగవుతుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో డిమాండ్ మేర సరఫరా లేక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మదనపల్లితోపాటు కర్ణాటకలోని చిక్మంగళూరు, కోలారు, చింతమణి ప్రాంతాలు, మహారాష్ట్రలోని బీదర్, షోలాపూర్, నాందేడ్ నుంచి కొంతమేర టమాటా రాష్ట్రానికి వస్తోంది. లాక్డౌన్ అనంతరం జూన్‌లో రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరగడం వల్ల టామాటా ధర రూ. 50 వరకు పెరిగింది. అనంతరం ఆగస్టు తొలి వారం నుంచి ధర తగ్గుతూ కిలో రూ. 20–30 మధ్య కొనసాగింది. ఆగస్టు చివరలో సైతం కిలో ధర రూ. 30 వరకు ఉండగా అది ఇప్పుడు దాదాపు రెట్టింపయ్యింది. ఆగస్టులో కురిసిన వర్షాలతో పంట దెబ్బతినడం, ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటం వల్ల డిమాండ్ పెరిగి తెలంగాణకు సరఫరా తగ్గిపోయింది. గత నెలలో గరిష్టంగా రోజుకు 3 వేల క్వింటాళ్ల వరకు టామటా మార్కెట్లకు రాగా గత 10 రోజులుగా 1,600–2,000 క్వింటాళ్ల మేర మాత్రమే వస్తోంది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ప్రస్తుతం మదనపల్లిలోనే కిలో టమాటా ధర రూ. 30–35 మేర ఉంది. రవాణా చార్జీలు కలుపుకొని ప్రస్తుతం హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ. 37–40 అమ్ముతున్నారు. రైతు బజార్లలో రూ. 45 వరకు అమ్ముతుండగా బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి ధర రూ. 50–60 వరకు చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి కిలో ధర కేవలం రూ. 20 మాత్రమే ఉండగా సరఫరా రోజుకు 3,500 క్వింటాళ్లకుపైగా ఉండేది. అక్టోబర్ చివర, నవంబర్‌లో స్థానికంగా పండించే పంట చేతికొస్తుందని, అప్పటివరకు టమాటా ధర తగ్గుదల ఉండదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
నో'టమాట' లేదు..
పంటను చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ మార్కెట్‌కు తరలిస్తే అక్కడ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 10 బాక్సులకు ఒక బాక్సును జాక్‌పాట్ పేరుతో ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది. వంద బాక్సు కాయలలో 10 బాక్సులు ఇలాగే ఇస్తున్నాం. దీంతో పాటు వందకు రూ.10 కమీషన్ల రూపంలో ఇవ్వాలి. కూలీలు, రవాణా, హమాలీల రూపంలో 30 రూపాయలు పోతోంది. రూ. 40 నుంచి రూ. 50 ఇలా ఖర్చు రూపంలోనే కష్టం కరిగిపోతోంది. రెండేళ్లుగా అనుకూలమైన ధరలు రావడం లేదు. రెండు నెలల కిందట పలికిన ధరలు చూసి మోసమోయాను. – ఆనంద్..కేశాపురం..చిన్నమండెం మండలం రాయచోటి : మార్కెట్లో ధర బాగుంటే దిగుబడి ఉండదు..దిగుబడి బాగుంటే ధర పలకదు..ఏటా టమాట రైతుకు ఎదరవుతున్న చేదు అనుభవమిది. ధర పలుకుతోంది కదా అని సాగు చే?స్తే సరకు మార్కెట్ చేరేరోగా రేటు పడిపోతోంది. దీంతో రైతుకు నో‘టమాట’ రావడం లేదు. ధర చూసి కుదేలవుతున్నాడు. తాజాగా అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో టమాట రైతులు నష్టాల మూట నెత్తికెత్తుకోవల్సి వస్తోంది. మోత కూలీ కూడా రావడం లె?దని లబోదిబోమంటున్నాడు. సంబేపల్లె, చిన్నమండెం, మైదుకూరు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా కష్టాలే చెప్పుకొస్తున్నారు. నెల రోజుల కిందట టమాట కిలో రూ.80 పలికింది. ప్రస్తుతం కింలో నాలుగైదు రూపాయలకు మించి రావడం లేదు. గతంలో మార్కెట్లో పలికిన ధరకు ఆశపడి టమాట సాగుకు ఉపక్రమించారు. నీరు లేకపోతే అప్పు చేసి మరీ బోర్లు వేయించుకున్నారు. వేయి, పదకొండందల అడుగుల లోతున్న గంగను పైకి తెచ్చారు. 20 రోజుల కిందట పక్క రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాట ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పిన వ్యాపారులు ఇప్పుడు దిగుబడి గణనీయంగా పెరిగిందంటూ మాట మారుస్తున్నారని రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు. నిన్నొక మాట..నేడొక మాట.. ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అక్కడి మార్కెట్లలో టమాటకు డిమాండ్ పడిపోయింది. దీంతో స్థానికంగా మార్కెట్లోమారుస్తున్నారని రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు. నిన్నొక మాట..నేడొక మాట.. ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అక్కడి మార్కెట్లలో టమాటకు డిమాండ్ పడిపోయింది. దీంతో స్థానికంగా మార్కెట్లో 15 కిలోల బాక్సు రూ.60 వరకు మించి తీసుకోవడం లేదు. కిలో నాలుగైదు రూపాయలతో విక్రయిస్తే సాగుకు పెట్టుబడులేం వస్తాయని రైతులు వాపోతున్నారు. వడ్డీలు, కోత కూలి, మార్కెట్‌కు తరలించడానికి అవుతున్న ఖర్చులను తల్చుకుని కన్నీటిపర్యంతమవుతున్నాడు. రైతుల నుంచి కొనుగో లు చేసిన సరకును వర్తకులు మార్కెట్లో రూ. 7 నుంచి రూ.10 వర కు విక్రయిస్తున్నారు. సమీపంలోని కర్నాటకతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో టమాట ది గుబడి అధికంగా ఉంది. నెల రోజుల కిందట మంచి ధర ఉన్నా వర్షాభావం వల్ల దిగుబడి తక్కువ వచ్చింది. ఇప్పుడు వర్షాల కారణంగా దిగుబడి పెరిగి నష్టాలను చూడాల్సిన దుస్థితి. మార్కెట్‌కు తరలించినా రేటు గిట్టుబాటు కావడం లేదని చాలా చోట్ల రైతులు కాయలు కోయకుండా వదిలేస్తున్నారు. తోటల్లోనే కా యలు మాగిపోయి కనిపిస్తున్నాయి. చిత్తూరులోని మదనపల్లి, గుర్రకొండ, కలకడ, కలికిరి మార్కెట్లకు తీసుకెళ్లినా ఉపయోగం కనిపిం చడం లేదు. రవాణా వ్యయం తడిసిమోపెడవుతోంది. నెల రోజుల కిందట 20 కిలోల బుట్ట వెయ్యి రూపాయల పైబడి పలికిన ధరలు అదే బుట్ట కాయలు నేడు రూ.80 నుంచి రూ.100 మించి పలకడం లేదంటే అతిశయోక్తి కాదు. దూర ప్రాంతాలకు తరలించి నష్టపోవడం కంటే దగ్గరలోని రాయచోటి, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని మార్కెట్లకు తీసుకువెళ్తున్నారు. కనీసం మోత కూలి కూడా రావడం లేదని రైతులు గద్గద స్వరంతో చెబుతున్నారు. -
ట‘మాట’ పడిపోయింది!
కర్నూలు, పత్తికొండ: మార్కెట్లో టమాటకు గిట్టుబాటు ధర కరువైంది. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఐదువేల హెక్టార్లలో పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన దిగుబడులు రాలేదు. వైరస్ తెగులు సోకి పంట దెబ్బతినింది. పత్తికొండ మార్కెట్‌కు నవంబరు, డిసెంబర్ నెలల్లో ప్రతి రోజూ 10 నుంచి 12 లోడ్ల సరుకు వచ్చేది. 15 కేజీలు ఉన్న జత గంపలు రూ.1,200 నుంచి రూ.2,500 వరకు పలికేవి. ప్రస్తుతం దిగుబడులు పూర్తిగా తగ్గాయి. రోజుకు 2 నుంచి 3 లోడ్ల సరుకు వస్తోంది. వారం రోజుల నుంచి 30 కేజీలు ఉన్న జత గంప రూ. 150 నుంచి రూ. 200 మాత్రమే పలుకుతోంది. నాణ్యత లేదని చెబుతూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మొదటి రకం 30 కేజీల ధర రూ. 250, రెండో రకం ధర రూ.200, మూడో రకం ధర రూ. 140 పలుకుతోంది. సేద్యాలు, కలుపులు, మందులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు రూ. 10 వేల ప్రకారం ఖర్చు చేశామని..పంట అమ్ముకుంటే పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దికెర మండలంలో 750 ఎకరాలు, వెల్దుర్తిలో 125, కృష్ణగిరిలో 250, తుగ్గలిలో 400, పత్తికొండ మండలంలో 325 ఎకరాల్లో టమాట పంటను సాగు చేశారు. సకాలంలో వర్షాలు లేనందుకు 60 శాతం పైరు దెబ్బతినింది. అంతంత మాత్రమే వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధర లేదు. ప్రతి ఏటా నష్టపోతున్నాం నేను రెండు ఎకరాల్లో పంట సాగు చేశాను. మెరుగైన దిగుబడులను తీయడానికి రూ.20 వేలు పెట్టు బడులు పెట్టాను. దిగుబడులు చేతికి అందే సమయంలో గిట్టు బాటు ధరలు లేవు. ధర ఉన్న సమయంలో దిగుబడులు రాలేదు. పంటకు పెట్టిన పెట్టు బడులు కూడా చేతికి అందడం లేదు. వ్యవసాయం చేయాలంటేనే భయ మేస్తోంది. ప్రతి ఏటా నష్టపోతున్నాం. –పెద్దరామాంజనేయులు , మద్దికెర అప్పులు మిగులుతున్నాయి టమాట వేసినప్పుడల్లా ఏదో విధంగా నష్టం పోతున్నాం. గత ఏడాది రెండు ఎకరాల్లో వేశాను. నష్టం రావడంతో ఈ ఏడాది ఒక ఎకరంతో సరిపెట్టుకున్నా. ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో దిగుబడి వచ్చింది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉన్నాయి. – మహమ్మద్ , బసినేపల్లి -
టమాట కేజీ ధర రూ.300
లాహోర్: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో టమాట ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ టమాట సుమారు రూ.300 ధర పలుకుతోంది. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పాక్ భారత్ నుంచి టమాటను దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం పాక్ టమాట, ఉల్లిగడ్డ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే ప్రతి ఏటా పాక్‌లో టమాట కొరత ఏర్పడినప్పుడు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇంత దారుణ పరిస్థితి నెలకొన్న ఆ దేశ ఆహార భద్రతా మంత్రి సికిందర్ హయత్ బోసన్ మాత్రం భారత్ నుంచి టమాటలను ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోమని తేల్చి చేప్పారు. బలూచిస్తాన్ నుంచి పంట దిగుబడి రాగానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లాహోర్, పంజాబ్ ప్రావిన్స్‌లో కేజీ టమాట ధర రూ.300గా ఉందని డాన్ పత్రిక పేర్కొంది. ఇక భారత్ నుంచి కూరగాయల దిగుమతి చేసుకోమన్న బోసన్ వ్యాఖ్యలను ఆ దేశ నేతలు సమర్ధిస్తున్నారు. ఈ నిర్ణయం ఇక్కడి రైతులకు ఎంతో మేలు చేస్తుందని వాపోతున్నారు. 2016 పఠాన్ కోట్ దాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. -
తగ్గని టమోత
రిటైల్‌లో కిలో రూ.80 కిలో చిక్కుడుకాయలు రూ.120 చుక్కలనంటిన కూరగాయలు తాడేపల్లిగూడెం : ట’మోత’ ఇంకా తగ్గలేదు. కొండెక్కిన టమాటాల ధర దిగిరానంటోంది. డిమాండ్‌కు తగిన సరుకు సరఫరా లేకపోవడంతో ధరలు తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో వీటి ధర 25 కిలోల ట్రే రూ.1,800 పలికింది. విడిగా కిలో రూ.80కి మార్కెట్లో టమాటాలు దొరికాయి. వీటికి తోడు అన్నట్టుగా చిక్కుడుకాయలు సై అన్నాయి. నల్లజర్ల మండలం ఆవపాడు నుంచి మార్కెట్‌కు వచ్చే చిక్కుడుకాయలు ధర పదికిలోలు రూ.800 పలికింది. విడిగా మార్కెట్లో కిలో రూ.120కి చేరింది. క్యారెట్ 40, బీట్రూట్ రూ.40కు విక్రయించారు. క్యాప్సికం, బీన్స్ కిలో రూ.80కు విక్రయించారు. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు కిలో రూ.40 లభించాయి. బీరకాయల ధర మాత్రం కిలో రూ.40 నుంచి రూ.30కి పడిపోయింది. దొండకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.24, కంద రూ.40, చామ రూ.40, చిలకడదుంపలు రూ.30, దోసకాయలు రూ.16, క్యాబేజీ రూ.16, గోరుచిక్కుళ్లు రూ.24లకు లభించాయి. ములగకాడలు జత రూ.12 చేసి అమ్మారు. మామిడికాయలు జతకు రూ.20 విక్రయించారు. ఘాటెక్కించిన కొత్తిమిర ధర కాస్త దిగివచ్చింది. కిలో రూ.50 లభించగా, విడిగా కట్ట పదిరూపాయలకు విక్రయించారు. పచ్చిమిరప కూడా ఘాటు తగ్గించుకుంది. కిలో విడిగా రూ.50కి దొరికింది. బంగాళాదుంపలు. ఉల్లిపాయలు సాధారణ ధరలకే దొరికాయి. -
టమాటలో ముసుగులో ఇసుక రవాణా
– వాహన తనిఖీల్లో మాఫియా గుట్టు రట్టు – లారీ, రెండు మోటర్ సైకిళ్లు సీజ్ కర్నూలు: కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్న మాఫియా గుట్టు రట్టు అయింది. నగర శివారుల్లోని అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిఘా తీవ్రతరం చేయడంతో అడ్డదారుల్లో ఇసుకను రవాణా చేస్తూ ఇసుక మాఫియా పోలీసుల వలకు చిక్కారు. టమాటల రవాణా పేరుతో కొంతకాలంగా ఇసుకను తరలిస్తున్నారు. కర్నూలు శివారుల్లోని హంద్రీనది నుంచి హైదరాబాద్‌కు ఐచర్ వాహనంలో ఇసుకను తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి నాల్గో పట్టణ సీఐ నాగరాజు రావు, తన సిబ్బందితో వెంకటరమణ కాలనీ మలుపు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఏపీ 01 ఎక్స్ 9755 ఐచర్ వాహనంలో సుమారు 10 టన్నుల ఇసుకను నింపి లారీకి వెనుక, ముందు మోటర్‌సైకిళ్లతో ఇద్దరు పైలట్ల తరహాలో తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. లారీలో ఇసుక కనపడకుండా టమాట బాక్సులను వెనుక భాగంలో అడ్డం పెట్టి, తడికలు కప్పి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులను చూడగానే డ్రైవర్ ఫయాజ్ వాహనాన్ని పక్కన పార్కు చేసి పారిపోయాడు. అలాగే ద్విచక్ర వాహనాలపై పైలెట్లుగా వ్యవహరించిన రాజు, మరో వ్యక్తి కూడా తమ వాహనాలను వదిలివేసి పారిపోవడంతో పోలీసులు టమాట బక్సులను తొలగించి తనిఖీ చేయగా, ఇసుక బయటపడింది. దీంతో రెండు మోటర్ సైకిళ్లు, లారీని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ముఠా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ః కర్నూలు మండలం, పంచలింగాల గ్రామానికి చెందిన రాజు, గంగన్న, హుసేని, షాలు తదితరులు హైదరాబాద్‌కు చెందిన మొహిద్దీన్, ఫయాజ్‌తో చేతులు కలిపి కొంతకాలంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. గంగన్న, హుసేని హమాలీలుగా పని చేస్తూ ముఠాకు చేదోడుగా ఉంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు మామూళ్లు ముట్టజెప్పి ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సుంకేసుల పరిసర ప్రాంతాల్లోని తుంగభద్ర నది నుంచి కూడా భారీ ఎత్తున మాఫియా సభ్యులు ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన మొహిద్దీన్, పంచలింగాలకు చెందిన గంగన్న, హుసేని తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎంత కాలం నుంచి ఇసుక రవాణా అక్రమంగా జరుగుతుంది, ముఠా వెనుక ఎవరెవరి హస్తం ఉంది, తదితర విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.