
ఓట్స్ టొమాటో రింగ్స్ తయారీకి కావల్సినవి
టొమాటోలు – 4 లేదా 5 (గుండ్రంగా కట్ చేసుకుని మధ్యలో గుజ్జు తీసేసి చక్రాల్లా చేసుకోవాలి)
ఓట్స్ పౌడర్ – అర కప్పు, శనగపిండి – 1 కప్పు
బియ్యప్పిండి, కారం – 1 టేబుల్ స్పూన్ చొప్పున
బేకింగ్ సోడా – పావు టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా
బ్రెడ్ పౌడర్ – పావు కప్పు (అభిరుచిని బట్టి)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా..
ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో శనగపిండి, ఓట్స్ పౌడర్, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు.. బేకింగ్ సోడా.. వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలచగా చేసుకోవాలి. అందులో టొమాటో ముక్కల్ని బాగా ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇంకాస్త లావుగా కావాలంటే వెంటనే మళ్లీ ఓట్స్ మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి వేయించుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే.. ఈ రింగ్స్ భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment