పెరిగిన టమాటాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు వంటగదిలో కనిపించే టమాటా ఇప్పుడు వంటకాల్లో కనుమరుగయ్యింది. అయితే ఇప్పుడు టమాటాల స్థానాన్ని అవకాడోలు భర్తీ చేస్తున్నాయి. దీనికి అవకాడోల రేటు భారీగా పడిపోవడమే ప్రధాన కారణం.
సోషల్ మీడియా యూజర్ ఒకరు ఇటీవల ఒక ఈ కామర్స్ ప్లాట్‌ఫారంలో విక్రయమయ్యే టామాటాలకు సంబంధించిన ఒక పోస్టు పెట్టారు. ఈ పోస్టులో వాటి ధరల స్క్రీన్ షాట్ కూడా షేర్‌చేశారు. సోషల్ మీడియా యూజర్ సుబి తన పోస్టుకు క్యాప్షన్‌గా. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే దోశలలోకి టమాటా చట్నీ చేయడం కంటే అవకాడో టోస్ట్ చేయడం తక్కువ ఖర్చుతో కూడిన పని అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం ఒక అవకాడో(సుమారు 200 గ్రాములు) ధర రూ. 59. టమాటా ధర కిలో రూ. 222 అని పేర్కొన్నారు.
ఈ పోస్టు చూసిన పలువురు నెటిజన్లు అవకాడో రేటు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టమాటాల ధరలపై టోకు వ్యాపారులు మాట్లాడుతూ ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 200 ఉన్నదని, అతి త్వరలోనే దీని ధర రూ. 300 కు చేరుకునే అవకాశాలున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్
it’s just a time in the economy when making avocado toast for breakfast is cheaper than dosa and tomato chutney pic.twitter.com/DgtuRj7OSv
— subiii (@_subiii_) August 3, 2023
Comments
Please login to add a commentAdd a comment