replace
-
Bhagwant Mann: పంజాబ్ సీఎంను మార్చేయబోతున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఫలితం నేపథ్యంలో.. పొరుగున్న ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రిని అక్కడి అధికార ఆమ్ఆద్మీ పార్టీ మార్చేయబోతోందంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుత సీఎం భగవంత్ మాన్ విషయంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద కేజ్రీవాల్ అసంతృప్తిగా ఉన్నారని, హామీల అమలులో మాన్ ఘోరంగా విఫలమయ్యారని, త్వరలో ఆయన్ని తప్పించి సమర్థుడిని ఎంపిక చేయబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిపై పంజాబ్ సీఎం మాన్ స్పందించారు.ఢిల్లీలో ఇవాళ పంజాబ్ ఆప్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆ మీటింగ్ తర్వాత.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే(నూతన) మజిందర్ సింగ్ సిస్రా చేసిన కామెంట్ల గురించి మాన్కు మీడియా నుంచి ప్రశ్నెదురైంది. దానికి ఆయన గట్టిగా నవ్వారు. వాళ్లను అలా మాట్లాడనివ్వండి అని మీడియాతో చెప్పారు.పంజాబ్ ఆప్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు. ఢిల్లీ ఫలితాల తర్వాత పంజాబ్ యూనిట్ మా పార్టీ కన్వీనర్‌ను కలవాలనుకుంది. అందుకే వచ్చాం. ఇవాళ్టి మీటింగ్‌లో అలాంటి అంశం కూడా ఏదీ చర్చకు రాలేదు. పంజాబ్‌లో మా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. ప్రత్యర్థులు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా.. మాకొచ్చిన నష్టమేమీ లేదు అని అన్నారాయన. అదే సమయంలో.. తనతో ఇరవై మంది పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపైనా మాన్ స్పందించారు. ‘‘ఆయన గత మూడేళ్లుగా ఆ మాటే చెబుతూ వస్తున్నారు. ఆ లెక్కలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒకసారి మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో.. ఆ పార్టీ ఎన్ని సీట్లు నెగ్గిందో ఆయన్ని లెక్కించుకోమనండి’’ అంటూ ఎద్దేశా చేశారాయన.అలాగే.. ఎన్నికల హామీలను పంజాబ్ ఆప్ ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శలపైనా మాన్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో హామీలను అమలు చేసి తీరతామని ఉద్ఘాటించారాయన. ఇదిలా ఉంటే.. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో 93 మంది ఆప్ సభ్యులు ఉండగా, 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. -
పుజారాకు నిరాశ..!
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్ క్లబ్ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.గత మూడేళ్లుగా ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్ రిటైన్ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్ హెడ్ కోచ్ పాల్ ఫార్బస్ అన్నాడు. -
కన్నౌజ్ నుంచి తేజ్ కాదు..అఖిలేష్?
లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేయనున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ తన మేనల్లుడు తేజ్ ప్రతావ్ యాదవ్‌ను ఇటీవల కన్నౌజ్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కన్నౌజ్ ఎస్పీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేష్ ఇక్కడి నుంచి పోటీచేసే విషయమై ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.ఏప్రిల్ 25న కన్నౌజ్ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయవచ్చని నేతలు అంటున్నారు. కన్నౌజ్ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. అయితే గత రెండు దఫాల్లో ఈ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. 2019లో డింపుల్ యాదవ్ ఈ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. తాజాగా పార్టీ ఇక్కడ నుండి తేజ్ ప్రతావ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు అఖిలేష్ తమ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు ప్రకటించిన తరువాత, స్థానిక నేతల అఖిలేష్ యాదవ్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో అఖిలేష్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తేజ్ ప్రతాప్ యాదవ్‌తో చర్చించనున్నారట. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేష్ కన్నౌజ్ నుంచి పోటీ చేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది. -
మీరట్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి మార్పు?
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు. 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు. -
టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం!
పెరిగిన టమాటాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు వంటగదిలో కనిపించే టమాటా ఇప్పుడు వంటకాల్లో కనుమరుగయ్యింది. అయితే ఇప్పుడు టమాటాల స్థానాన్ని అవకాడోలు భర్తీ చేస్తున్నాయి. దీనికి అవకాడోల రేటు భారీగా పడిపోవడమే ప్రధాన కారణం. సోషల్ మీడియా యూజర్ ఒకరు ఇటీవల ఒక ఈ కామర్స్ ప్లాట్ఫారంలో విక్రయమయ్యే టామాటాలకు సంబంధించిన ఒక పోస్టు పెట్టారు. ఈ పోస్టులో వాటి ధరల స్క్రీన్ షాట్ కూడా షేర్చేశారు. సోషల్ మీడియా యూజర్ సుబి తన పోస్టుకు క్యాప్షన్‌గా. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే దోశలలోకి టమాటా చట్నీ చేయడం కంటే అవకాడో టోస్ట్ చేయడం తక్కువ ఖర్చుతో కూడిన పని అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం ఒక అవకాడో(సుమారు 200 గ్రాములు) ధర రూ. 59. టమాటా ధర కిలో రూ. 222 అని పేర్కొన్నారు. ఈ పోస్టు చూసిన పలువురు నెటిజన్లు అవకాడో రేటు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టమాటాల ధరలపై టోకు వ్యాపారులు మాట్లాడుతూ ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 200 ఉన్నదని, అతి త్వరలోనే దీని ధర రూ. 300 కు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్ it’s just a time in the economy when making avocado toast for breakfast is cheaper than dosa and tomato chutney pic.twitter.com/DgtuRj7OSv — subiii (@_subiii_) August 3, 2023 -
సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. హెచ్డీఎఫ్సీ స్థానంలో చోటు
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్–30లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చోటు లభించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనంకానున్న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ స్థానే ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రాతినిధ్యం వహించనుంది. జూలై 13నుంచి తాజా సవరణలు అమలులోకి రానున్నట్లు ఏషియా ఇండెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఏషియా ఇండెక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈతో భాగస్వామ్యంలో సూచీల కూర్పును చేపట్టే సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో ఇతర ఇండెక్సులలోనూ సవరణలకు తెరతీసినట్లు తెలియజేసింది. వీటి ప్రకారం హెచ్డీఎఫ్సీ స్థానంలో ఎస్అండ్పీ బీఎస్ఈ–500లో జేబీఎం ఆటో కంపోనెంట్స్, బీఎస్ఈ–100లో జొమాటో, సెన్సెక్స్–50లో అపోలో హాస్పిటల్స్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్‌ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
Elon Musk: అలా దిగజారి ఆ వెంటనే..
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత ధనికుడి స్థానాన్ని ఎలన్ మస్క్ కోల్పోయాడు. అవును.. ఫోర్బ్స్ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారాడు. టెస్లా షేర్లు భారీగా పతనం కావడం, ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద కరిగిపోయి ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి చేరిన వేళ.. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. అయితే ఈ పరిణామం మారడానికి ఎంతో టైం పట్టలేదు. వ్యక్తిగత సంపదను పెంచుకుని మస్క్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అర్నాల్ట్ సంపద విలువ 184.7 బిలియన్ డాలర్లు. అలాగే.. మస్క్ సంపద 185.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడోస్థానంలో, జెఫ్ బెజోస్ ఐదవ స్థానంలో, వారెన్ బఫెట్ ఐదో స్థానంలో నిలిచారు. భారత్ నుంచి ముకేశ్ అంబానీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. కిందటేడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలో అత్యంత ధనికుడిగా ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను కిందకు నెట్టేసి.. ఎలన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఆయన అదే స్థానంలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఆయన సంపద ఏకంగా 200 బిలియన్ డాలర్లు దాటడం గమనార్హం. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే నాటికి పుతిన్ అవుట్!
కీవ్: రష్యాతో యుద్ధం ముగిసేనాటికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవిలో ఉండరని చెప్పారు ఉక్రెయిన్ రక్షణ అధికారి కిరిలో బుడనోవ్. పుతిన్‌ను అధ్యక్షుడిగా తొలిగించేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే పుతిన్ పదవిని కోల్పోతారని జోస్యం చెప్పారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రష్యా ఆక్రమించుకున్న ఖేర్సాన్ను ఉక్రెయిన్ తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నవంబర్ నాటికి ఈ ప్రాంతమంతా మళ్లీ తమ అధీనంలోకి వస్తుందని బుడనోవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత క్రిమియాను కూడా తిరిగి పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని రష్యా 2014లోనే తమ భూభాగంలో విలీనం చేసుకుంది. సెప్టెంబర్ నుంచి రష్యా సేనలను చావుదెబ్బ కొడుతూ తమ ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటోంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే పుతిన్ పదవి కోల్పోతారని బుడనోవ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ దాడులకు ప్రతిఘటనగా ఇటీవల డ్రోన్లతో క్షిపణుల వర్షం కురిపించింది రష్యా. విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్‌లో 40 శాతం మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. అయినా ఏమాత్రం వెనక్కితగ్గకుండా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నాయి కీవ్ సేనలు. తమ ప్రాంతాలని తిరిగి చేజిక్కించుకుంటున్నాయి. చదవండి: షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్! -
రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్ల మార్పు! విలువెంతంటే..
లండన్: బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేషన్స్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్స్, రాయల్ మింట్ నుంచి కాయిన్స్ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్‌లో బ్యాంక్ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్‌కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది. రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్ అమెరికన్ డాలర్లు(ఒక బిలియన్ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. రాజు బొమ్మతో ఎలాగంటే.. కింగ్ ఛార్లెస్-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్ ఛార్లెస్-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది. ఇదీ చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
కొత్త సంవత్సరం వచ్చేసింది.. అయితే ఇలా చేయండి!
పాత భావాలు... పారేయము. అటక మీద పాత సరుకు.. పారేయము. పంచేయము. పాత బట్టలు, బూట్లు... పారేయము. పంచేయము. అవసరం లేని ఇంటిని ఆక్రమించిన చెడిపోయిన వస్తువులు? పారేయము. పంచేయము. కొత్తవి రావాలంటే పాతవి ఖాళీ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవి పారేయండి. లేదా అవసరం ఉన్నవారికి పంచేయండి.కొత్తకు దారివ్వండి. కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. దానికి ముందు పాతవి పారేయాలి కదా. పాతను తీసేయాలి కదా. అక్కరలేని పాతవి అక్కర ఉన్నవారికి కనీసం పంచేయాలి కదా. ఆ పని చేయము. కొత్త సంవత్సరానికి రెడీ కావడం అంటే కొత్తగా రెడీ కావడమే. కొత్త సంవత్సరంలో తేలిగ్గా ప్రవేశించాలి. పాత లగేజ్‌తో కాదు. ఎన్ని ఉంటాయి పాతవి ఇళ్లల్లో. పేరబెట్టుకొని. అడ్డంగా. స్పేస్ ఆక్యుపై చేసి. ఇంట్లో ఏయే పాత వస్తువుల బరువు దించుకోవాలో చూద్దామా? ఆ భారీ పాత సోఫా మన ఇంటి సోఫా జన్మ సంవత్సరం ఏమోగాని దాని ఆయుష్షు తీరి చాలా రోజులై ఉంటుంది. కవర్లు మార్చి, చిరిగిన చోట ప్యాచ్ వేసి, కిరకిరమంటుంటే మానేజ్ చేస్తూ, చిల్లులు పడుంటే పైన బెడ్‌షీట్ వేస్తూ... డబ్బులు లేకపోతే సరే. ఉంటే కొత్త సోఫా తెచ్చుకోండి. ఇల్లు కొత్తదిగా కనిపించాలంటే మారే కాలంతో పాటు వచ్చే ఫర్నీచర్ తెచ్చుకోవాలి. ఖరీదైనదే అక్కర్లేదు. రోడ్‌సైడ్ కూడా మోడరన్ ఫర్నీచర్ దొరుకుతుంది. ఆ పాత సోఫాను వాచ్‌మన్‌కు ఇచ్చేయండి. దానిని పెన్నిధిగా భావించే ఏ కారు డ్రైవర్కో లేదంటే అవసరం ఉన్నవారికో ఇచ్చేయండి. ఇల్లు బరువు తగ్గుతుంది. కొత్త కళ వస్తుంది. పాత బట్టలు, పుస్తకాలు ప్రతి ఇంట్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. భర్తవి, భార్యవి, పిల్లలవి మళ్లీ పొరపాటున వేసుకోరు అని తెలిసినా ఆ బట్టలను కూరి కూరి బీరువాలలో నింపి ఉంటారు. వాటిని ఈ చలికాలంలో పేదవారికి పంచేస్తే ఎంత గుండె తేలిక. ఇల్లు తేలిక. పిల్లలు స్కూలు పుస్తకాలు కూడా దాచి ఉంటారు. పాత క్లాసులవి ఎందుకు. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇంట్లో ఎప్పటెప్పటివో పుస్తకాలు ఉంటాయి. వాటిలో కొన్నే విలువైనవి. కొన్ని ఒకసారి చదివితే చాలనిపించేవి. ఆ ఒకసారి చదవదగ్గ పుస్తకాలను వేరేవాళ్లకు ఇచ్చేయాలి. హ్యాపీగా ఉంటుంది. షూ ర్యాక్ క్లీన్ చేయండి ప్రతి ఇంటి షూ ర్యాక్ పాత చెప్పులు, బూట్లు దుమ్ముపట్టి పోయి ఉంటాయి. వాటిని వాడేది లేదు. అలాగని పారేసేది లేదు. పిల్లల షూస్ కూడా ఉంటాయి. వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తే సంతోషంగా వేసుకుంటారు. చెప్పులు నిరుపేదలకు ఇచ్చేస్తే వేసుకుంటారు. పాతవి పోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కి కొత్త చెప్పులు తొడుక్కోండి. అటక మీద ఉంటుంది రహస్యం అటక మీద తోసేస్తాం చాలా. పాత తపేలాలు, కీబోర్డులు, చెంబులు, కుర్చీలు, మిక్సీలు, గ్రైండర్లు... అవన్నీ ఎందుకు దాస్తామో తెలియదు. వాటిని ఎవరికైనా ఇస్తే సరి చేయించుకుని వాడుకుంటారు. లేదా పాత సామాన్లవాడికి వేస్తే మనకే కొద్దిగా చిల్లర వస్తుంది. అవి బూజుపట్టి వికారంగా కనిపిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా తిరుగాడదు. ఇంకా బాల్కనీల్లో అక్కర్లేని సామాన్లు ఉంటాయి. వాష్ ఏరియాల్లో బోలెడన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి. మిద్దె మీద కొందరు పనికి రానిదంతా దాస్తారు ఎందుకో. అన్నీ పారేయండి. పంచేయండి. కొత్త సంవత్సరం కోసం ఇంటిని మీ మనసును తేలిగ్గా చేసుకోండి. కొత్త వెలుతురు కు దారి ఇవ్వండి. అదిగో ఇవాళ మీరు ఫలానా వస్తువు ఇచ్చారన్న ఆనందంతో కొంతమంది అయినా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేలా చేయండి. సరేనా? -
మిథాలీ స్థానంలో షెఫాలీ
న్యూ ఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టులో టీనేజీ బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మకు చోటు దక్కింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికైంది. తాజాగా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్ మిథాలీ రాజ్ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. తెలుగమ్మాయి, పేసర్ అరుంధతిరెడ్డికి సైతం స్థానం దక్కింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన బీసీసీఐ అండర్–19 టోర్నీలో విధ్వంసక ఆటతో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసి షెఫాలీ అందరి దృష్టిలో పడింది. మహిళల టి20 చాలెంజ్ టోర్నీలోనూ రాణించడంతో జాతీయ జట్టులోకి రావడం ఖాయమని తేలిపోయింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపికకు గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ... వన్డేలకు మిథాలీ రాజ్, టి20లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌లను సారథులుగా కొనసాగించింది. తొలి టి20 ఈ నెల 24న సూరత్‌లో జరుగనుంది. -
బఫెట్ వారసుడు మనోడేనా..?
ఒమాహా (అమెరికా): ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్‌షైర్ హాథ్‌వే పగ్గాలు ఒక భారతీయుడికి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయా.. అంటే ఉన్నాయనేలా స్వయంగా బఫెటే సంకేతాలిచ్చారు. బెర్క్‌షైర్ హాథ్‌వే వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా సూచనప్రాయంగా రెండు పేర్లు చెప్పడం ద్వారా ఊహాగానాలకు కాస్త తెరదించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు భారతీయుడైన అజిత్ జైన్ కావడం గమనార్హం. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న బఫెట్.. ఏటా నిర్వహించే షేర్‌హోల్డర్ల సమావేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, బిలియనీర్లు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందులో పాల్గొనే అవకాశం దక్కించుకునేందుకు పోటీపడతారు. ఈసారి 20,000 మందికి అవకాశం దొరికింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న షేర్‌హోల్డర్ల నుంచి ఈసారి కూడా బఫెట్ వారసుడిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి నేరుగా సమాధానమివ్వని బఫెట్ సూచనప్రాయంగా రెండు పేర్లు ప్రస్తావించారు. గతేడాది డైరెక్టర్ల బోర్డులోకి ప్రమోట్ అయిన అజిత్ జైన్ (67), గ్రెగరీ ఏబుల్ (57)లను ప్రస్తావిస్తూ.. భవిష్యత్‌లో షేర్‌హోల్డర్ల ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు..తన దీర్ఘకాల వ్యాపార భాగస్వామి చార్లీ ముంగర్ (95)తో పాటు వీరిద్దరు కూడా స్టేజ్‌పై ఉంటారని పేర్కొన్నారు. ‘గ్రెగ్, అజిత్‌లు అద్భుతమైన మేనేజర్లు, వారిద్దరూ చాలా గొప్ప విజయాలు సాధించారు‘ అని బఫెట్ తెలిపారు. అయితే, ఈ ఇద్దరిలో ఎవరికి పగ్గాలు ఇవ్వబోతున్నారన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. ‘బెర్క్‌షైర్‌లో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. మిగతా కంపెనీలతో పోలిస్తే ఈ విధానం బాగానే పనిచేసింది. కాబట్టి మీరు మమ్మల్ని భరించాల్సి ఉంటుంది. తప్పదు‘ అని బఫెట్ వ్యాఖ్యానించారు. అజిత్ జైన్ ఎవరంటే.. ఒడిశాలో పుట్టి, పెరిగిన అజిత్ జైన్ 1986లో బెర్క్‌షైర్ హాథ్‌వే ఇన్సూరెన్స్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాయిష్ బ్యాంక్ మాజీ కో–సీఈవో అన్షు జైన్‌కు అజిత్ వరుసకు సోదరుడవుతారు. మరోవైపు, 1992లో ఎనర్జీ విభాగంలో చేరిన ఏబెల్ గత ఏడాది కాలం పైగా బీమాయేతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. బఫెట్ నిష్క్రమించిన పక్షంలో బెర్క్‌షైర్ హాథ్‌వే చరిత్రలో ఒక శకం ముగుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సారథ్యం వహిస్తున్నందుకే బెర్క్‌షైర్ షేర్లు వాస్తవ విలువ కన్నా 10–15 శాతం ప్రీమియం రేటు పలుకుతున్నాయని, ఆయన గానీ తప్పుకుంటే బెర్క్‌షైర్ హాథ్‌వే బహుళ సంస్థలుగా విడిపోవచ్చని వారి అంచనా. తొలి త్రైమాసికంలో బెర్క్‌షైర్ హాథ్‌వే 21.66 బిలియన్ డాలర్ల నికర లాభం ప్రకటించింది. గూగుల్‌ను వదులుకోవడం సిగ్గుచేటు.. టెక్ దిగ్గజం అమెజాన్‌లో వాటాలు ఉన్నాయంటూ బెర్క్‌షైర్ వెల్లడించిన నేపథ్యంలో .. కంపెనీ పెట్టుబడి వ్యూహాలపైనా బఫెట్‌కు ఇన్వెస్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక ఆన్ లైన్ పుస్తకాల విక్రయ సంస్థ నుంచి ఈ–కామర్స్ దిగ్గజంగా అమెజాన్ ను తీర్చిదిద్దడంలో ఆ సంస్థ చీఫ్ జెఫ్ బెజోస్ అత్యద్భుతాన్ని ఆవిష్కరించారని బఫెట్ పేర్కొన్నారు. అర్థం కాని టెక్నాలజీ స్టాక్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గూగుల్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడంపై తనకు, బఫెట్‌కు సిగ్గుచేటుగా అనిపించిందని ముంగర్ చెప్పారు. ‘మేం నోట్లో వేలెట్టుకుని కూర్చున్నాం. పెద్ద తప్పు చేశాం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అమెజాన్ లోను, యాపిల్‌లో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినప్పటికీ టెక్నాలజీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని మార్చుకున్నట్లు కాదని బఫెట్ పేర్కొన్నారు. మరోవైపు, తరచూ ప్రమాదాల బారిన పడుతున్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రశ్నలకు స్పందిస్తూ.. సదరు విమానం సురక్షితమైనదేనని, అందులో ప్రయాణించడానికి తాను ఒక్క క్షణం కూడా సందేహించబోనని బఫెట్ స్పష్టం చేశారు. అటు మహిళా ఆర్థికవేత్తలు నిర్వహించిన సమావేశానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపర్చారు బఫెట్. ఇన్వెస్ట్మెంట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రియాంక పోయి కైఫ్ వచ్చె!
‘భారత్’ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్‌తో వివాహం కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీ టౌన్ టాక్. ఈ సినిమా నుంచి ప్రియాంక వెళ్లిపోయినా చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఫీలవ్వలేదు. హ్యాపీగా అంగీకరించారు. కానీ ప్రియాంకా చోప్రా పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌ను కత్రినా కైఫ్ రీప్లేస్ చేయనున్నారట. ఆల్రెడీ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్లది హిట్ కాంబినేషన్ కాబట్టి కత్రినా కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచిస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో దిశా పాట్నీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దిశాది సల్మాన్ సిస్టర్ పాత్ర అని వినికిడి. సల్మాన్ ఫాదర్‌గా జాకీ ష్రాఫ్ నటిస్తున్నారని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
-
మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
వెల్లింగ్టన్: ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఆ మాటల మధ్య పొందిక లేకుండా ఉండటం, మానసిక పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిన నేపథ్యంలో అమెరికాలో ఓ మహిళా పైలట్‌ను టేకాఫ్‌కు ముందు దింపేశారు. అయితే, ఆమె ఎవరనే వివరాలు చెప్పేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. ప్రయాణీకులంతా భయపడేలా ఆమె ప్రవర్తించిందని, దీంతో విమానం నుంచి కొంతమంది ప్రయాణికులు దిగిపోయారని కూడా ఎయిర్‌లైన్స్ తెలిపింది. యూఎస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 455 ఆస్టిన్ నుంచి టెక్సాస్ మీదుగా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సి ఉంది. ఓ పురుషుడు, ఓ మహిళ దీనికి పైలట్లుగా ఉన్నారు. ఇందులో మహిళా పైలట్ తన విధుల నిమిత్తం వేసుకునే దుస్తులు కాకుండా.. సాధారణ పౌరులాలుగా వచ్చింది. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్‌కు గానీ, హిల్లరీ క్లింటన్కుగానీ తాను ఓటు వేయలేదని, వారిద్దరు అబద్ధాల కోరులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నానంటూ చెప్పింది. ఆ తర్వాత ఇంకేవో మాటలతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయేలా చేసింది. దీంతో కొంతమంది ప్రయాణీకులు దిగిపోతుండటంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పైలెట్‌ను దింపేశారు. 90 నిమిషాలు ఆలస్యంగా కొత్త పైలెట్ ను పంపించారు. -
ఎన్సీఎస్టీలో ఖాళీలు భర్తీచేయండి...
⇔ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్టీ)లో చైర్పర్సన్ సహా ఉన్న మూడు ఖాళీలను మూడు నెలల్లోపు భర్తీ చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదే శించింది. ⇔ ప్రజా రవాణా వాహనాల్లో వేగ నియంత్రకాలను అమర్చడానికి సంబంధించి ప్రస్తుత స్థితిని తెలిపే నివేదికలను రాష్ట్రాలు సమర్పించకపోవడంతో ఆయా రాష్ట్రాల రవాణా కార్యదర్శులు తన ముందు హాజరుకావాలని సుప్రీం కోర్టుఆదేశించింది. ⇔ 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణ స్థితి ఏమిటో తెలుపుతూ సమగ్ర నివేదిను సమర్పించాలని కేంద్రా న్ని సుప్రీం ఆదేశించింది. -
గెలాక్సీ నోట్ 7 ఎలా రీప్లేస్ చేసుకోవాలి?
చార్జింగ్ పెడుతున్నపుడు బ్యాటరీ పేలుతున్న ప్రమాదాలతో శాంసంగ్ భారీ సంకోభంలో చిక్కుకుంది. దీంతో తన కొత్త స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేస్తోంది. ఈ నేపపథ్యంలో అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్నవారు రీప్లేస్ లేదా రిఫండ్ చేసుకోవాలని కోరింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలిన ఘటనలు 92 నమోదయ్యాయని తెలిపింది. వీటిల్లో 26 కాలిన ఘటనలు, 55 ఆస్తినష్టం ఘటనలు రిపోర్ట్ చేసింది. అమెరికా పది లక్షల ఫోన్లను రీకాల్ చేయనున్నట్టు, ఇక్కడి అమ్మకాల్లో 97 శాతం ఎఫెక్ట్ అయినట్టు అమెరికాలోని శాంసంగ్ అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే శాంసంగ్ నోట్ 7ను సొంతం చేసుకున్నవారు రిప్లేస్ మెంట్ లేదా రిఫండ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా ఫోన్ ఐఎంఈఐ నెంబరును గమనించాలి. దీన్ని http://samsung.com/us/note7recall అనే వెబ్ సైట్ లో నమోదు చేయాలి. లేదా హాట్ లైన్ నెంబరు 1-844-365-6197 కాల్ చేసి వివరాలు అందించాలి. పూర్తిగా నగదు వాపసు కోరవచ్చు. లేదంటే మరో గెలాక్సీ నోట్ 7గానీ, ఎస్7 , ఎస్7 ఎడ్జ్ గానీ రీప్లేస్ అడగవచ్చు. లేదంటే వినియోగదారులు కొనుగోలు చేసిన రీటైల్ స్టోర్లలోగానీ, బెస్ట్ బై లాంటి ఆన్ లైన్ లో కొనుగోలుచేస్తే ఆయా వ్యాపార కేంద్రాలను సంప్రదించాలి. శాంసంగ్ నుంచి డైరెక్ట్ కొన్నవారు నేరుగా కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. కాగా గ్లోబల్ గా ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన శాంసంగ్ యూజర్లను క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. -
నకిలీవి ఇచ్చి.. అసలు ఐఫోన్లకు ఎసరు
తప్పుడు పత్రాల తో రిప్లేస్ నగరంలోని మొబైల్ షాపులకు ఢిల్లీ ముఠా టోకరా ఇద్దరి పట్టివేత, పరారీలో ఐదుగురు నిందితులు బంజారాహిల్స్: నకిలీ ఐఫోన్లను తప్పుడు ధ్రువపత్రాల సహాయంతో సెల్‌ఫోన్ షాపుల్లో రీప్లేస్ చేస్తూ మోసానికి పాల్పడుతోంది ఢిల్లీకి చెందిన ఓ ముఠా. జూబ్లీహిల్స్ పోలీసులు ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసి, 20 డూప్లికేట్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్ర అలియాస్ సోను(22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్(23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యంతో పాటు మరో యువకుడు నెలన్నర క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నకిలీ సెల్ఫోన్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఐఫోన్లకు మక్కీమక్కీ నకిలీవి తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి వివిధ షాపుల్లో నకిలీ ఫోన్లు రీప్లేస్ చేస్తూ.. కంపెనీ ఫోన్లు కొత్తవి తీసుకుంటున్నారు. వాటిని ఇతరులకు అధిక మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సోను, అమన్‌నాగ్‌పాల్ దొరికిపోయారు. పోలీసులు వీరిద్దరినీ విచారించగా ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. వీరి నుంచి 20 నకిలీ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోను, అమన్‌నాగ్‌పాల్ అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బెడ్ రూంలో పాగా వేయనున్న రోబో!
ఇప్పటికే మానవ సంబంధాల్లో రోబోలు కీలపాత్ర పోషిస్తున్నాయి. పలు కార్యాలయాల్లో సెక్యురిటీ గార్డులుగా, ఆఫీసు మేనేజర్లుగా తిష్ట వేసుకొని కూర్చున్న రోబోలు.. ఇక ముందు బెడ్ రూంలలోనూ పాగా వేయనున్నాయని తెలుస్తోంది. మానవ సంబంధాల ప్రిడిక్టర్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ వెల్లడించిన నివేదికలో లైంగిక సంబంధాల విషయంలో రానున్న విప్లవాత్మక మార్పులను గురించి తెలిపారు. దీనిలో ఆశ్చర్యకరంగా 2050 నాటికి మనుషులు మనుషులతో కంటే ఎక్కువగా రోబోలతోనే లైంగిక సంబంధాలకు మొగ్గుచూపుతారని వెల్లడించారు. బొండారా అడల్ట్ అన్లైన్ స్టోర్ వెల్లడించిన నివేదికలో '2030 నాటికి ఎక్కువ మంది వర్చువల్ రియాలిటీ ద్వారా లైంగిక సంతృప్తి పొందుతారు' అని తెలిపారు. ఇప్పటివరకు కొన్ని దేశాల్లో పురుష కస్టమర్లు మాత్రమే సెక్స్ డాల్ మార్కెట్‌ను ముందుకు తీసుకుపోతున్నా.. ముందుముందు మహిళలు సెక్స్ రోబోల వాడకంతో ఈ మార్కెట్ మరింత దూసుకుపోనుందని వెల్లడించారు. -
కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది. -
ఇక డయాలసిస్ కష్టాలు తీరినట్టేనా?
వాషింగ్టన్: కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చికిత్సపై ఆధారపడి జీవించే రోగులకు ఇక ఆ కష్టాలు తీరినట్టే. ఇలాంటి వారికోసం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు పరిశోధకులు. తీవ్రమైన కిడ్నీవ్యాధితో బాధపడుతూ..రక్తశుద్ధి కోసం డయాలసిస్ చేయించుకునే పేషంట్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. వీటికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక కృత్రిమ కిడ్నీని రూపొందించింది. ప్రామాణిక డయాలసిస్ చికిత్సా పద్ధతికి స్వస్తి చెపుతూ నూతన సాంకేతిక పద్ధతితో ఆర్టిఫిషీయల్ కిడ్నీని తయారు చేశారు. కన్వెన్షనల్ డయాలసిస్ లో మిషీన్ నడుస్తున్నంత సేపు ..పేషెంట్ మంచానికి పరిమితమై ఉండాలి... రకాల రకాల ట్యూబులతో రోగి శరీరానికి అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొత్తం ఒక రోజంతా నడుస్తుంది. కానీ ఈ ధరించడానికి వీలుగా రూపొందించిన ఈ కృత్రిమ కిడ్నీ మూలంగా....పేషెంట్ ఫ్రీగా తిరగొచ్చనీ, ట్యూబుల బాధ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. డయాలసిస్ సెషన్స్ ను తగ్గించవచ్చని, దీని ద్వారా అదనపు చికిత్స ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆహారం ఆంక్షలు లేకపోవడంతోపాటూ చికిత్స సమయంలో బాధల్నీ,తీవ్రమైన దుష్ప్రభావాలను నిరోధించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ కృత్రిమ పరికరంద్వారా వ్యర్థ ఉత్పత్తులను, అదనపు నీరు, ఉప్పు లను సమర్ధవంతంగా తొలగించగలదని చెప్పారు. యూరియా, క్రియాటినిన్ మరియు భాస్వరం తదితర వ్యర్థాలను సాధారణం మూత్రపిండాల్లోలాగానే ఫిల్టర్ చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ లో సేడార్-సినై మెడికల్ సెంటర్ కు చెందిన విక్టర్ గురా దీన్ని ఆవిష్కరించారు. ధరించగలిగిన కృత్రిమ కిడ్నీ నమూనా పరికరాన్ని సీటెల్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ లో రోగులపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగ ఫలితాలను జేసీఐ ఇన్సైట్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తరహాలో వేరియబుల్ ఆర్టీఫిషియల్ కిడ్నీ ఆవిష్కరణ, దీని ప్రయోగ ఫలితాలు మరింత నూతన డయాలసిస్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. -
బర్త్ కంట్రోల్ పిల్ కు బదులుగా ఫెట్రిలిటీ యాప్...!
లండన్ః గర్భనిరోధక మాత్రలకు బదులుగా వినియోగించే ఓ కొత్త యాప్ ను వైద్య పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు. నేచురల్ సైకిల్స్ పేరున అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త యాండ్రాయిడ్ యాప్ ఆధారంగా సంతానోత్సత్తి సమయాన్ని తెలుసుకొని, ముందు జాగ్రత్తలతో అవాంఛిత గర్భానికి దూరం కావొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మహిళల్లో సంతానోత్సత్తి సమయాన్ని గుర్తించేందుకు పరిశోధకులు కొత్త యాప్ ను సృష్టించారు. బర్త్ కంట్రోల్ పిల్ ను వాడేందుకు బదులుగా ఈ అనువర్తనం ద్వారా మహిళల శరీరంలోని ఉష్ణోగ్రతనుబట్టి అండోత్పత్తి సమయాన్ని గుర్తించే అవకాశం ఉంటుందని వైద్య పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. నేచురల్ సైకిల్స్ యాప్ ను సృష్టించి రసాయనాలకు దూరంగా సహజ గర్భనిరోధావకాశాన్ని కల్పించే పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ కొత్త అనువర్తనం వినియోగించి ఇకపై మహిళల్లో ఇతర సమస్యలను తెచ్చిపెట్టే పిల్స్ కు దూరం కావొచ్చునని చెప్తున్నారు. 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలపై పరిశోధకులు స్వీడన్ లో ఓ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. పెర్ట్ ఇండెక్స్ పద్ధతిలో యాప్ ను పరీక్షించిన పరిశోధకులు గర్భనిరోధక మాత్రలను పోలిన ఫలితాలే ఉండటాన్ని గుర్తించారు. గర్భనిరోధక మాత్రలు క్రమ పద్ధతిలో వాడిన వెయ్యిమంది మహిళల్లో సంవత్సరంలో 0.3 శాతం అనుకోకుండా గర్భం దాల్చే అవకాశం కనిపిస్తే... నేచురల్ సైకిల్ సిస్టమ్ ద్వారా కూడా 0.5 శాతం మాత్రమే ప్రమాదం ఉన్నట్లు కనుగొన్న పరిశోధకులు తమ అధ్యయనాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండ్ రీ ప్రొడక్టివ్ హెల్త్ కేర్ లో ప్రచురించారు. ఆరోగ్యంకోసం అనేక రకాలుగా ఇటీవల మొబైల్ టెక్నాలజీని వాడుతున్నారని యాప్ సృష్టికర్త ఎలీనా బెర్గ్లండ్ చెప్తున్నారు. కెమికల్స్ కు బదులుగా నేటి మహిళలు నేచురల్ సైకిల్స్ యాప్ ను వినియోగించి అవాంఛిత గర్భానికి దూరంకావచ్చంటున్నారు. అంతేకాక గర్భ నిరోధక మాత్రలవల్ల శరీరంలో వచ్చే అనేక రకాలైన హార్మోన్ సమస్యలను కూడ అధిగమించవచ్చని యాప్ సృష్టికర్తలు చెప్తున్నారు. -
మద్రాసు కాదు.. చెన్నై హైకోర్టు
సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టు పేరును చెన్నైగా మార్చేందుకు అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడబోతున్నది. ఇందుకు తగ్గ కార్యచరణ సిద్ధమైనట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. మద్రాసు నగరం చెన్నై మహానగరంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇక్కడున్న అన్ని కార్యాలయాలు, వ్యవహారాల్లో మద్రా సు అన్న పేరును పక్కన పెట్టి చెన్నైగా మార్చేశారు. అయితే, హైకోర్టును మాత్రం మద్రాసు హైకోర్టుగానే పిలుస్తూ వస్తున్నారు. ఇక్కడ మాత్రం బోర్డులు సైతం మద్రాసు హైకోర్టు అని రాసి ఉంటుంది. ఈ పేరు మార్పుకు పలు మార్లు న్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అయినా, పేరు మాత్రం మార లేదు. ఈ పరిస్థితుల్లో మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా పేరు మార్చడానికి అన్ని కసరత్తులు పూర్తి కావడంతో, త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇదే విషయాన్ని శని వారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. చెన్నై హైకోర్టు: నగరంలోని ఓ హోటల్లో జరిగిన న్యాయ సదస్సుకు సదానంద గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా ఎప్పుడు మార్చనున్నారంటూ మీడియా ప్రశ్నించగా, అందుకు తగ్గ కసరత్తులు పూర్తి అయ్యాయని సమాధానం ఇచ్చారు. చెన్నై హైకోర్టుగా పేరు మారుస్తూ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నదని స్పష్టం చేసి ముందుకు కదిలారు. ముందు బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన సదానంద గౌడ మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ను స్తంభింప చేయడం ప్రజా స్వామ్య విరుద్దంగా వ్యాఖ్యానించారు. మానవతా ధృక్పథంతో లలిత్ మోడికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారేగాని, ఆమె ఏ తప్పూ చేయలేదన్నారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి , రాజస్థాన్ ముఖ్యమంత్రి ఏ తప్పు చేయ లేదన్నారు. అయితే, తమకు ఏ సమస్య చేతికి చిక్కక పోవడంతో వీటిని ఆధారంగా చేసుకుని తమ మీద కాంగ్రెస్ బురద జల్లుతున్నదని మండి పడ్డారు. భూ సేకరణ చట్టం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకొస్తున్నామేగానీ, ఇందు లో ఎలాంటి లొసుగులు లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. కర్ణాటకలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, గౌరవ హత్యలు పెరిగాయని పేర్కొంటూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు. -
డీఎస్సీ భర్తీ సందేహమే
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరహాలో నిర్వహించిన డీఎస్సీ-14 భర్తీ జరుగుతుందో లేదోనన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. అనాలోచిత నిర్ణయాలతో డీఎస్సీని ప్రకటించడం వల్ల ఇప్పుడు భర్తీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. టెట్ కమ్ టీఆర్టీ పేరిట డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులపై భారాన్ని మోపకూడదని యోచిస్తూ టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అభ్యర్థులపై మరింత భారాన్ని మోపేలా పరీక్షను నిర్వహించింది. గతంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహించగా ఇప్పుడు 200 మార్కులకు పరీక్ష పెట్టారు. అయితే సమయాన్ని మాత్రం 3 గంటలు మాత్రమే పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. ప్రస్తుత విధానం వల్ల అభ్యర్థులు సోషల్, మ్యాథ్స్, సైన్స్‌తోపాటు మరిన్ని సబ్జెక్టులను చదవాల్సి వస్తోంది. ఉదాహరణకు తెలుగు పండిట్ అభ్యర్థి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 70 మార్కులకు, సోషల్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 60 మార్కులకు, మిగిలిన అంశాలకు సంబంధించి 70 మార్కులకు చదవాల్సి వచ్చింది. ఇన్ని మార్కులకు తర్ఫీదు పొందాలంటే రోజుకు 18 గంటలకు పైగా శ్రమించాలి. గతంలో 100 ప్రశ్నలను 3 గంటల్లో రాస్తే ఇప్పుడు అదే సమయంలో 200 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. అలాగే గతంలో టెట్ నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రాల కాఠిన్యత స్థాయి నియమాలను అనుసరించి మార్కులను కలిపేవారు. టెట్ కమ్ టీఆర్టీ గతంలో కంటే కఠినమైనప్పటికీ గత నియమాలను అనుసరించకపోవడంతో గతంలో టీఈటీ ఉత్తీర్ణులైనవారికి వెయిటేజ్ ఉండడంతో వారు లబ్ధిపొంది తాము నష్టపోతున్నామంటూ కొత్తగా పరీక్ష రాసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలాగే ఎన్సీటీఈ టెట్ నిర్వహించమని సూచించింది తప్ప టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించమని చెప్పలేదని, టెట్‌కు వెయిటేజ్ ఇమ్మని చెప్పలేదని, ఓసారి టెట్‌లో అర్హత పొందితే ఏడేళ్ల వరకు టెట్ రాసే అవసరం లేదని ఎన్సీటీఈ చెప్పినప్పటికీ అందుకు విరుద్ధంగా డీఎస్సీ నిర్వహించడంపై కూడా అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కీ లోని పలు తప్పులు దొర్లాయంటూ ఆధారాలతో సహా పలువురు అభ్యర్థులు చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఫలితాలను విడుదల చేసింది. తుది కీ లో 13 తప్పులు ఉన్నాయంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆధారాలతో సహా ఆశ్రయించారు. ఇవన్నీ పరిష్కారమవ్వాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడంతో కోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తే అసలు నియామకాలుంటాయా అనే సందేహం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీటికి జవాబు చెప్పేవారే లేకుండా పోయారు.