షెఫాలీ వర్మ
న్యూ ఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టులో టీనేజీ బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మకు చోటు దక్కింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికైంది. తాజాగా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్ మిథాలీ రాజ్ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. తెలుగమ్మాయి, పేసర్ అరుంధతిరెడ్డికి సైతం స్థానం దక్కింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన బీసీసీఐ అండర్–19 టోర్నీలో విధ్వంసక ఆటతో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసి షెఫాలీ అందరి దృష్టిలో పడింది. మహిళల టి20 చాలెంజ్ టోర్నీలోనూ రాణించడంతో జాతీయ జట్టులోకి రావడం ఖాయమని తేలిపోయింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపికకు గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ... వన్డేలకు మిథాలీ రాజ్, టి20లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌లను సారథులుగా కొనసాగించింది. తొలి టి20 ఈ నెల 24న సూరత్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment