
కత్రినా కైఫ్
‘భారత్’ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్‌తో వివాహం కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీ టౌన్ టాక్. ఈ సినిమా నుంచి ప్రియాంక వెళ్లిపోయినా చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఫీలవ్వలేదు. హ్యాపీగా అంగీకరించారు. కానీ ప్రియాంకా చోప్రా పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌ను కత్రినా కైఫ్ రీప్లేస్ చేయనున్నారట. ఆల్రెడీ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లది హిట్ కాంబినేషన్ కాబట్టి కత్రినా కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచిస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో దిశా పాట్నీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దిశాది సల్మాన్ సిస్టర్ పాత్ర అని వినికిడి. సల్మాన్ ఫాదర్‌గా జాకీ ష్రాఫ్ నటిస్తున్నారని బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment