యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్‌లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు.
2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment