ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న వ్యవసాయాధికారుల(ఏఓ) పోస్టులకు 2, 3 నెలల్లో భర్తీ చేస్తామని ఆ శాఖ అదనపు డెరైక్టర్ వి.విజయలక్ష్మి పేర్కొన్నారు.
కదిరి (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న వ్యవసాయాధికారుల(ఏఓ) పోస్టులకు 2, 3 నెలల్లో భర్తీ చేస్తామని ఆ శాఖ అదనపు డెరైక్టర్ వి.విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో విత్తన వేరుశనగ పంపిణీని పర్యవేక్షించారు. అనంతరం కదిరిలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఏఓ పోస్టులు చాలా వరకూ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సరఫరా చేస్తున్న వేరుశనగ విత్తనాలు సరిగా లేకుంటే... వాటిని వాపసు ఇచ్చి మరో సంచి తీసుకెళ్లవచ్చన్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.