బెడ్ రూంలో పాగా వేయనున్న రోబో! | Sex with ROBOTS could replace intimate human relationships | Sakshi
Sakshi News home page

బెడ్ రూంలో పాగా వేయనున్న రోబో!

Published Sat, Jul 2 2016 12:22 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

బెడ్ రూంలో పాగా వేయనున్న రోబో! - Sakshi

బెడ్ రూంలో పాగా వేయనున్న రోబో!

ఇప్పటికే మానవ సంబంధాల్లో రోబోలు కీలపాత్ర పోషిస్తున్నాయి. పలు కార్యాలయాల్లో సెక్యురిటీ గార్డులుగా, ఆఫీసు మేనేజర్లుగా తిష్ట వేసుకొని కూర్చున్న రోబోలు.. ఇక ముందు బెడ్ రూంలలోనూ పాగా వేయనున్నాయని తెలుస్తోంది. మానవ సంబంధాల ప్రిడిక్టర్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ వెల్లడించిన నివేదికలో లైంగిక సంబంధాల విషయంలో రానున్న విప్లవాత్మక మార్పులను గురించి తెలిపారు. దీనిలో ఆశ్చర్యకరంగా 2050 నాటికి మనుషులు మనుషులతో కంటే ఎక్కువగా రోబోలతోనే లైంగిక సంబంధాలకు మొగ్గుచూపుతారని వెల్లడించారు.

బొండారా అడల్ట్ అన్లైన్ స్టోర్ వెల్లడించిన నివేదికలో '2030 నాటికి ఎక్కువ మంది వర్చువల్ రియాలిటీ ద్వారా లైంగిక సంతృప్తి పొందుతారు' అని తెలిపారు. ఇప్పటివరకు కొన్ని దేశాల్లో పురుష కస్టమర్లు మాత్రమే సెక్స్ డాల్ మార్కెట్ను ముందుకు తీసుకుపోతున్నా.. ముందుముందు మహిళలు సెక్స్ రోబోల వాడకంతో ఈ మార్కెట్ మరింత దూసుకుపోనుందని వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement