వారసుడిని మార్చిన సౌదీ రాజు | Saudi King Salman Replaces Heir and Next-in-Line to Rule | Sakshi
Sakshi News home page

వారసుడిని మార్చిన సౌదీ రాజు

Published Wed, Apr 29 2015 11:24 AM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

వారసుడిని మార్చిన సౌదీ రాజు - Sakshi

వారసుడిని మార్చిన సౌదీ రాజు

రియాద్: సౌదీ అరేబియా రాజు తన వారసుడిని మార్చేశారు.  తన అంతర్గత వ్యవహారాల మంత్రి మహ్మద్ బిన్ నయీప్ను రాజుగా ప్రకటించి సొంతకుమారుడికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం రక్షణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న తనకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ను నయీఫ్ తర్వాతి స్థానంలో చేర్చారు. ఇక నుంచి మహ్మద్ నయీఫ్ రాజుగా కొనసాగుతారని, తన కుమారుడు సల్మాన్ యువరాజుగా ఉంటారని, వీరి పాలనలో సౌదీ రాజ్యం ముందుకు వెళుతుందని ఆయన ప్రకటించారు.

దీంతోపాటు ఆయన ఇప్పటి వరకు తన రాజ్యానికి సుదీర్ఘకాలంగా విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సౌద్ అల్ ఫైజల్ను బాధ్యతలు తప్పించి వాషింగ్టన్కు రాయబారిగా పనిచేస్తున్న అదల్ అల్ జుబెయిర్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు రాజుగా ఉన్న అబ్దుల్లా చనిపోవడంతో ఆయన సవతి సోదరుడైన సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కు సౌదీ అరేబియా తదుపరి రాజుగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement