- హోంమంత్రి నాయిని వెల్లడి
- నగరంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచన
పంజగుట్ట: మహానగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం,కార్మికశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి జలమండలి అధికారులు,కార్మికులను కోరారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన జనరల్ పర్పస్ ఎంప్లాయి(జీపీఈ)లు పదిమంది కార్మికులకునియామకపత్రాలు అందజేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
బోర్డులో 23 ఏళ్లుగా నానా ఇబ్బందులు పడుతున్న ఎన్‌ఎంఆర్,హెచ్‌ఆర్ కార్మికుల విధులను క్రమబద్దీకరించిన ఘనత బోర్డు గుర్తింపు కార్మికసంఘం గౌరవ అధ్యక్షుడు, సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుదేనని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీఠవేస్తున్నామని, సమ్మెలు, లాకౌట్లకు తావులేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ..బోర్డులో ఖాళీ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మంగళవారం నూతనంగా నియమితులైన సుమారు 600మంది ఎన్‌ఎంఆర్,హెచ్‌ఆర్ కార్మికులకు బోర్డు అధికారులు నియమాక పత్రాలు అందజేస్తారని తెలిపారు.
ఈకార్యక్రమంలో జలమండ లి ఎండీ శ్యామలరావు, కామ్‌గార్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సతీష్‌కుమార్,ఈఎన్‌సీ సత్యనారాయణ ఉన్నతాధికారులు, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు పెద్దపీఠ: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని నాయిని ప్రకటించారు. పోలీసుశాఖకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు ఆధునిక ఆయుధాలతోపాటు గల్లీకో కెమెరా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.