water board
-
మన నీళ్లలో నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని భూగర్భజలాలు శుద్ధిచేయకుండా తాగునీటికి ఉపయోగించడం ఏమాత్రం సురక్షితం కాదని తాజా అధ్యయనం తేల్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) ప్రమాణాల కంటే కూడా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ మోతాదులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27.48 శాతం మేర భూగర్భ నీటి నమూనాలను పరిశీలించగా నైట్రేట్ స్థాయిలు లీటర్‌కు 45 మిల్లీగ్రాముల నిర్దేశిత ప్రమాణాలకన్నా అధికంగా ఉన్నట్లు నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా–2024 నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతుండటం వల్ల నైట్రేట్స్ మోతాదు, గాఢత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల్లేక మురుగునీరు భూగర్భజలాల్లో చేరుతుండటం కూడా నైట్రేట్స్ మోతాదు పెరుగుదలకు కారణమవుతోందని నివేదిక విశ్లేషిoచింది. దేశవ్యాప్తంగా నైట్రేట్స్ మోతాదులు ఎక్కువగా ఉన్న 15 జిల్లాల్లో రంగారెడ్డి మూడో స్థానంలో నిలవగా ఆదిలాబాద్ 11వ స్థానంలో, సిద్దిపేట 12వ స్థానంలో నిలిచాయి. రసాయన ఎరువుల అధిక వాడకంతో..రాష్ట్రంలో వరిసాగు అధికం కావడంతో అధిక మోతాదులో ఎరువు మందులు వాడుతున్నారని.. అందులో సుమారు 30 శాతం పంటలు పీల్చుకుంటే మిగతా 70 శాతం మాత్రం నీటినిల్వ కారణంగా నెమ్మదిగా భూగర్భజలాల్లో కలుస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా నైట్రేట్ అధికంగా ఉన్న నీరు తాగేందుకు అనువైంది కాదంటున్నారు. ఢిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–సేŠట్ట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్–2024 నివేదిక ప్రకారం 2021–22లో తెలంగాణలో ప్రతి హెక్టార్‌కు 297.5 కిలోల ఎరువులను రైతులు వినియోగిస్తున్నారని వారు వెల్లడించారు. అలాగే ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా–2022–23 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలో 2021–22 నుంచి 2022–23 మధ్య ఎరువుల వినియోగంలో 4.7 శాతం వృద్ధి నమోదైనట్లు తేలిందని చెప్పారు.నైట్రేట్లు భూగర్భజలాల్లోకి చేరితే వాటిని శుద్ధి చేయడం మరింత కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చెరువులు, కాలువల్లోని కలుíÙతాలనే సరైన పద్ధతుల్లో శుద్ధి చేయలేకపోతున్న నేపథ్యంలో ఇక భూగర్భజలాల్లో కలిసే నైట్రేట్లను శుద్ధి చేయడం ఇబ్బందేనని అంటున్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో ఏటా పండిస్తున్న మూడు పంటల్లో ఎకరానికి 10–15 బస్తాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నారని వివరించారు. దీనివల్ల విత్తనం, నేల వంటివి బలహీనంగా ఉండటమే కాకుండా రసాయన ఎరువుల అవశేషాలు పంటల్లోకి చేరుతున్నాయని.. వాటిని మనం ఆహారంగా తీసుకుంటుండటంతో మన శరీరంలోకి సైతం కెమికల్స్ ప్రవేశిస్తున్నాయని వివరిస్తున్నారు.మురుగు శుద్ధిపై పర్యవేక్షణ ఏదీ? హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి మెరుగుపడట్లేదు. దీనిపై స్వతంత్ర సంస్థతో ఇప్పటిదాకా పర్యవేక్షణే లేదు. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల సంఖ్య పెరుగుతున్నా సమర్థంగా శుద్ధిచేయక మురుగునీరంతా భూగర్భజలాల్లో చేరడం వల్ల నైట్రేట్ శాతం పెరుగుతోంది. – ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తనైట్రేట్లతో కేన్సర్ ముప్పు.. పంటల ఉత్పాదకతను పెంచేందుకు రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. అవే నీటిని పంటల సాగుకు ఉపయోగిస్తుండటంతో హెవీ మెటల్స్, కలుషితాలు నేరుగా వాటిలో కలుస్తున్నాయి. చేపల ద్వారా కూడా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. శరీరంలో నైట్రేట్ల శాతాలు పెరిగితే కేన్సర్‌కు దారితీస్తుంది. పంజాబ్‌లో కేన్సర్ కేసుల పెరుగుదలకు పంటల కోసం అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగమే కారణమని తేలింది. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు -
జలమండలిలో కొత్తనీరు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం తర్వాత జలమండలి యంత్రాంగంలో కొత్త నీరు వచ్చి చేరింది. ప్రధాన కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన కీలక ఉన్నతాధికారుల పదవీ విరమణ, బదిలీలతో కొత్తవారికి అవకాశం లభించింది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జనరల్ మేనేజర్ల వరకు కొత్తవారు బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, రెండు రోజులు క్రితం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరో ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే కీలక విభాగాల ఇద్దరు డైరెక్టర్లు పదవీ విరమణ చేయగా, మరో డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సుంకిశాల ఘటనలో మరో ప్రాజెక్టు డైరెకర్లపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సీజీఏ, జీఎం, డీజీఎం స్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలగడంతో యంత్రాంగంలో కొత్తదనం వచ్చింది. అంతా అస్తవ్యస్తమే.. మహా నగరంలో తాగునీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్ర స్థాయి పరిస్థితి అధ్వానంగా మారింది. తాగునీటి సరఫరాలో అడుగడుగునా లీకేజీలు, లోప్రెషర్, కలుíÙత నీటి సరఫరా, లైన్మెన్ల చేతివాటం, నల్లా అక్రమ కనెక్షన్లు, ఎక్కడపడితే అక్కడ పొంగిపొర్లే మురుగు, పగిలిన మ్యాన్‌హోళ్ల వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఫిర్యాదు చేస్తే కానీ స్పందించని పరిస్థితి నెలకొంది. అడుగడుగు చేతివాటంతో బోర్డుకు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తాగునీటి సరఫరా, సీవరేజ్ చార్జీల బకాయిలు కూడా పెద్దఎత్తున పేరుకుపోయాయి. అంతా ఇష్టానుసారమే.. జలమండలిలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పనితీరు ఇష్టానుసారంగా మారింది. ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్లలో సైతం కనీస సమయపాలన లేకుండా పోయింది.అంతా ఫీల్డ్ విజిట్ అంటూ మధ్యాహ్నం వరకు ఆఫీస్‌లలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సాధారణ బదిలీలు జరగడంతో సర్కిల్. డివిజన్, సబ్డివిజన్లలో సైతం కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఇప్పటికైనా బోర్డు పాలన యంత్రాంగంతోపాటు సిబ్బంది పనీతీరులో మార్పు వచ్చేనా అనే చర్చ సాగుతోంది. -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్‌ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్‌గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్‌మెంట్‌కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్‌కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్‌గౌడ్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్‌తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి వృథాపై ఢిల్లీ జల్‌బోర్డు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో అక్కడి వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పక్క కరువుతో తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.వాటర్‌ట్యాంకులు ఓవర్‌ఫ్లో అయినా, మంచి నీటితో కార్లు, ఇతర వాహనాలు కడిగినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా ఫైన్ కట్టాల్సిందేనని వాటర్ బోర్డు ప్రకటించింది. నీరు ఎక్కడ వృథా అవుతుందో పరిశీలించడానికి ఢిల్లీ వాటర్‌బోర్డుకు చెందిన 200 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వాణిజ్య సముదాయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఉన్న అక్రమ తాగునీటి కనెక్షన్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
Bengaluru Water Crisis: నీటి వృథాపై వాటర్ బోర్డు కఠిన నిర్ణయం
బెంగళూరు: తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నబెంగళూరు నగరంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలపై వాటర్‌బోర్డు కన్నెర్ర చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.1లక్షలు వసూలు చేసింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, మొక్కలకు, ఇతర అత్యవసరం కాని వాటికి వాడతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా కుటుంబాలపై వాటర్‌బోర్డు చర్య తీసుకుంది. కావేరి నీరు, బోర్ నీళ్లతో హోలీ వేడుకలు జరపడాన్ని వాటర్‌బోర్డు ఇప్పటికే నిషేధించింది. నగరంలోని పలు హోటళ్లు హోలీ వేళ రెయిన్ డ్యాన్స్ ఈవెంట్లు ప్రకటించంతోనే వాటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెయిన్ డ్యాన్సులు ఉంటాయని ప్రకటించిన హోటళ్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. కాగా, షాపులు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో నీటి వాడకాన్ని నియంత్రించేందుకుగాను ఎయిరేటర్స్‌ను వాడాలన్న నిబంధనను నగరంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ట్రీటెడ్ వాటర్‌తో చెరువులను నింపి తాగునీటిగా కాకుండా ఇతర అవసరాలకు వాటిని వాడేందుకు వాటర్ బోర్డు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదీ చదవండి.. బీజేపీలో కేఆర్పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
Delhi Jal Board case: జలమండలి కేసులోనూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు జారీచేయడం ఆయన గైర్హాజరవడం తెల్సిందే. తాజాగా ఢిల్లీ జల్‌బోర్డ్‌లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ విచారణ కోసం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీచేయగా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాలేదు. తనకు సమన్లు పంపడం చట్టవ్యతిరేకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ సంబంధించిన సమన్లు అందుకున్న రెండో కేసు ఇది. మద్యం ఎక్సయిజ్ కేసులో ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు అందుకోవడం, ప్రతిసారీ ఆఫీస్‌కు రాకుండా మిన్నకుండిపోవడం తెల్సిందే. మద్యం కేసులో విచారణ నిమిత్తం మార్చి 21వ తేదీన తమ ఆఫీస్‌కు రావాలని ఈడీ తాజాగా ఆయనకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. -
‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రికవరీ
సాక్షి, హైదరాబాద్: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్ బుక్ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంక్రిమెంట్ ఇలా.. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్ సర్విస్ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జలమండలిలో వర్తింపు ఇలా జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్ఆర్, ఎన్‌ఎంఆర్‌లను ప్రభుత్వం 2014 జూన్ 23న రెగ్యులరైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్ 23 ఆర్డర్‌తో ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయి సర్వీస్‌లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్‌ను వర్తింపజేశారు. జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ ఎందుకంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన జూన్ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల రెగ్యులరైజ్ జూన్ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
నిత్యం మురుగు పరుగు
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో డ్రైనేజీల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. సగం వరకు పగిలి, సరిగ్గా మూతల్లేని, చెత్తాతో నిండిన మ్యాన్‌హోళ్ల నుంచి నిత్యం మురుగు నీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే కాదు... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది. జలమండలి యంత్రాంగం, డ్రైనేజీ పైప్లైన్ల, మ్యాన్‌హోల్స్ మరమ్మతులు, నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్నా... మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డా డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి ముగురు నీరు ఇళ్లలోకి వస్తుండగా, కొన్నిచోట్ల తాగునీటి పైప్‌లోకి మురుగు వస్తోంది. నిత్యం సమస్యలే.. మహానగరంలో మ్యాన్‌హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. చిన్న వర్షం పడితే ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరుగడం సాధారణంగా తయారైంది. ఎక్కడ చూసినా.. ఇవే సమస్యలు. నగరంతోపా టు శివార్లలో సైతం మ్యాన్‌హోళ్ల పరిస్ధితి అధ్వానంగా తయారైంది. ప్రతిచోట మ్యాన్‌హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్ట సాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కానీ, స్పందించని పరిస్థితి ఉంది. 12 వేల చదరపు కిలో మీటర్ల మురుగు నీటి వ్యవస్థ... మహానగరంలో సుమారు 12 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మురుగు నీటి వ్యవస్థ విస్తరించి ఉంది. వీటిపై సుమారు నాలుగు లక్షల వరకు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో లక్ష వరకు మ్యాన్‌హోళ్లు ఉంటాయన్నది అంచనా. వీటిలో సుమారు 20 వేలకు పైగా లోతైనవి ఉంటాయి. నగరంలోని సుమారు 450 ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్న వర్షానికే పొంగిపర్లుతుంటాయి. మరోవైపు వ్యర్థాలు, చెత్తా పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మ్యాన్‌హోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది. నిజాం కాలం నుంచే.. నిజాం కాలం నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ కొనసాగుతోంది. అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైపులైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్‌తో నిర్మాణాలు చేపట్టారు. అయితే అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా 25 రెట్లు పెరిగినా పాత కాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పైప్లైన్లను కొన్ని ప్రాంతాల్లో రీస్టోర్ చేసినా.. క్లీనింగ్ యంత్రాలతో మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండటంలేదు. తాగునీటి పైపుల్లోకి.. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీలు దెబ్బతిని లీకవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. పాతబస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుçవడంతో మంచినీరు కలుషితమవుతోంది. సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులిపేసుకుంటున్నారు. -
HYD: జలమండలి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: జలమండలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నాలాల పూడిక తీయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాలాల పూడిక తీయడంలేదని బీజేపీ కార్పొరేటర్లు జలమండలి వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మట్టి తీసుకువచ్చి జలమండలి ఎదుట వేశారు కార్పొరేటర్లు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జలమండలి ఆఫీసులోకి దూసుకెళ్లారు. దీంతో.. కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం -
ఆంధ్రా తీరమే అత్యంత సురక్షితం..
సాక్షి, అమరావతి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అత్యంత భద్రం, సురక్షితమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం స్పష్టం చేసింది. అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల అండమాన్–నికోబార్ దీవులు, కేరళ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో తీర రేఖ అధికంగా కోతకు గురవుతోందని వెల్లడించింది. దేశంలో 1,144.29 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఎక్కువగా కోతకు గురవుతోందని తెలిపింది. ఆ తీర ప్రాంతంలో 3,679.91 హెక్టార్ల భూమి తీవ్రంగా కోతకు గురై ందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 973.7 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉండగా.. కేవలం 15 కి.మీ.ల పొడవునా మాత్రమే సముద్రపు అలల ప్ర భావం అధికంగా ఉందని వెల్లడించింది. ఈ నేప థ్యంలో సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికను విశ్లేషించిన పారిశ్రామికవేత్తలు.. పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి, వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన ప్రాంతమని చెబుతున్నారు. దేశంలో రెండో అతి పొడవైన తీర ప్రాంతం మనదే.. మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశి్చమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డయ్యూ డామన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ప శి్చమ బెంగాల్, లక్షదీ్వప్, అండమాన్–నికోబార్ దీవుల పొడవున 7,516.6 కి.మీ.ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ ఉంది. దేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రంగా గుజరాత్ (1,214.7 కి.మీ.లు) మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ (973.7 కి.మీ.లు) రెండో స్థానంలో నిలిచింది. వాయుగుండాలు, తుపానుల వల్లే.. అతి పొడవైన తీర రేఖ, భారీ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అడ్వైజరీ కమిటీ (సీపీడీఏసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. తీర రేఖపై సముద్రపు అలల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సీడబ్ల్యూసీ అధ్యయనం చేస్తోంది. కోతకు గురైన ప్రాంతాన్ని పరిరక్షించి, అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ వస్తోంది. తాజాగా దేశంలో తీర రేఖపై అలల ప్రభావం గురించి సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కేంద్ర జల సంఘం అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ.. - బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే వాయుగుండాలు, తుపాన్ల ప్రభావం వల్ల తీరం వైపు వీచే గాలుల వేగానికి రెట్టింపు ఉధృతిలో అలలు ఎగిసిపడటం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. - అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలోనే అధికంగా వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల పశి్చమ తీర రేఖతో పోల్చితే తూర్పు తీర రేఖ అధికంగా కోతకు గురవుతోంది. - బంగాళాఖాతంలో ఉండే అండమాన్– నికోబార్ దీవులకు 1,962 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఉంటే.. అలల ఉధృతి, గాలి వేగానికి 360.1 కి.మీ.ల పొడవునా 987.68 హెక్టార్ల భూమి కోతకు గురైంది. అత్యధికంగా తీర ప్రాంతం కోతకు గురైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్–నికోబార్ దీవులు ప్రథమ స్థానంలో ఉన్నాయి. - అండమాన్ –నికోబార్ దీవుల తర్వాత అలల ఉధృతి ప్రభావం ఒడిశాపై అధికంగా పడుతోంది. ఒడిశాకు 476.4 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉంటే.. 143.6 కి.మీ.ల పొడవునా కోతకు గురవుతోంది. - 569.7 కి.మీ.ల పొడవు తీర రేఖ ఉన్న కేరళలో 137.33 కి.మీ.ల తీర ప్రాంతానికి కోత తప్పడం లేదు. ఆ తర్వాత తమిళనాడులో 128.88 కి.మీ., గుజరాత్లో 109.76 కి.మీ., మహారాష్ట్రలో 75.16 కి.మీ., పశి్చమ బెంగాల్లో 56.3 కి.మీ., కర్ణాటక 40.19 కి.మీ. పొడవునా తీర రేఖ కోతకు గురవుతోంది. - మడ అడవులను పెంచడం, తీర రేఖను పటిష్టంగా అభివృద్ధి చేయడం ద్వారా అలల ఉధృతి ప్రభావాన్ని తగ్గించవచ్చు. -
బాదుడే బాదుడు! తప్పుడు నీటి బిల్లుల జారీపై జలమండలి నజర్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో అడ్డగోలుగా నీటి బిల్లుల జారీపై జలమండలి ఆలస్యంగానైనా దృష్టి సారించింది. నీటి మీటర్లు తనిఖీ చేయకుండానే అవి పని చేయడం లేదంటూ అదనంగా బిల్లుల బాదుడుతో పాటు నూతనంగా నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు అయిన ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటే చాలు.. వారికి సైతం బిల్లుల జారీ, డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాల్లో మురుగు పన్ను పేరుతో నీటి బిల్లులో అదనంగా బాదుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. వేలాదిగా ఫిర్యాదులు.. ఈ నిర్వాకంపై ఇటీవల జలమండలికి వేలాదిగా ఫిర్యాదులు అందాయి. కాల్‌సెంటర్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నీటిబిల్లుల వసూలు కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీల తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధిక నీటిబిల్లుల మోత, తప్పుడు బిల్లుల జారీపై నివేదిక అందించాలని జనరల్ మేనేజర్లను కోరినట్లు సమాచారం. ఫిర్యాదు అందిన 24గంటల్లోనే పరిష్కరించాలి.. అధిక నీటిబిల్లుల జారీతో సతమతమవుతున్న వినియోగదారుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోని మేనేజర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని సిటిజన్లు కోరుతున్నారు. వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఇబ్బందులు లేకుండా ఉదయం 7 నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8గంటల వరకు ఈ శిబిరాలు నిర్వహించి అక్కడికక్కడే ఈ సమస్యలను పరిష్కరించాలంటున్నారు. జలమండలి కాల్‌సెంటర్‌కు అందిన ప్రతి ఫిర్యాదును 24 గంటల్లోగా పరిష్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కమీషన్ ముట్టజెప్పుతూ.. అదనంగా బాదుతూ.. నగరంలో సుమారు 12 లక్షల వరకు నల్లా నీటి కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లుల వసూలు ప్రక్రియను పలు ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. వసూలు చేసిన మొత్తంపై సంబంధిత అధికారులకు కమీషన్ ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. దీంతో అదనంగా బిల్లులు వసూలు చేయాలన్న లక్ష్యంతో నీటి మీటర్లను తనిఖీ చేయకుండానే అడ్డగోలుగా బిల్లులు జారీ చేస్తున్నారు. వినియోగదారుల ఇళ్లకు వెళ్లకుండానే డోర్ లాక్ పని చేస్తున్నా.. నీటి మీటర్ ఉన్నప్పటికీ అది పని చేయడంలేదనే సాకుతో బిల్లులు ఇస్తుండటం గమనార్హం. -
జల మండలికి విద్యుత్‌తో.. రూ.999 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జల మండలికి రాయితీ విద్యుత్ సరఫరా వల్ల గత నాలుగేళ్లలో ఏకంగా రూ.999.53 కోట్లు నష్టాలను మూటగట్టుకున్నట్టు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లు వెల్లడించాయి. టారిఫ్ సబ్సిడీల రూపంలో ఈ నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపాయి. తమ ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకు ని ఈ మేరకు నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. జలమండలి కోసం రేటు తగ్గించి.. జలమండలి గతంలో విద్యుత్ చార్జీల కింద యూనిట్‌కు.. పరిశ్రమల కేటగిరీ (హెచ్‌టీ–1ఏ) పరిధిలో 11 కేవీ సరఫరాకు రూ.6.65.. 33కేవీ సరఫరాకు రూ.6.15.. సీపీడబ్ల్యూఎస్ (హెచ్‌టీ–4బీ) కేటగిరీ పరిధిలో అన్నివోల్టేజీ స్థాయిలకు రూ.5.10 చొప్పున చెల్లించేది. అయితే హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చులతో పోల్చితే... ప్రజల నుంచి వసూలు చేస్తున్న నీటిచార్జీలు తక్కువగా ఉండడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని, విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గించాలని జలమండలి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2018–19లో రూ.299.95 కోట్లు, 2019–20లో రూ.577.49 కోట్లు, 2020–21లో రూ.543.84 కోట్లు కలిపి మొత్తం రూ.1,421.28 కోట్లు నష్టాలు వచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. జలమండలికి సరఫరా చేసే విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గిస్తూ 2020 జూలైలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన చార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు తిరిగి చెల్లించాలని కోరింది. 2018–19 నాటి బిల్లుల నుంచి ఇప్పటిదాకా ఈ తగ్గింపును వర్తింపజేసింది. ఈ మేరకు డిస్కంలు జలమండలికి విద్యుత్ టారిఫ్‌ను తగ్గించినా.. బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ విడుదల కాలేదు. దీనివల్ల ఈ నాలుగేళ్లలో రూ.999.53 కోట్లు నష్టపోయినట్టు డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి. సబ్సిడీ కొనసాగించాలన్న విజ్ఞప్తితో.. సబ్సిడీ టారిఫ్‌ను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తిని తాజాగా ఈఆర్సీ తోసిపుచ్చింది. ‘వార్షిక టారిఫ్ ఉత్తర్వులు 2021–22’జారీచేసే వరకు జలమండలి సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే యథాతథంగా అమల్లో ఉంటాయని గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. 2021–22 టా రిఫ్ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చే సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. -
కీలక ప్రాజెక్టులన్నీ బోర్డుల ఆధీనంలోకి..
సాక్షి, హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించారు. రెండు రాష్ట్రాల్లో ఈ నదులు, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను మొదటి షెడ్యూల్లో ప్రస్తావించారు. మొత్తంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులను షెడ్యూల్-2లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధిం చిన ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాల్వల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఆ ప్రాజెక్టుల్లోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సహా ఉద్యోగులంతా బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. బోర్డులు ప్రాజెక్టులను తమ స్వాధీనంలోకి తీసుకున్నా.. గెజిట్ వచ్చేనాటికి ఉన్న కేసులు, అప్పటికే జరిగిన విషయాలపై భవిష్యత్‌లో దాఖలయ్యే కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. షెడ్యూల్ -3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాలి. కృష్ణా బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీశైలం రిజర్వాయర్, దానిపై ఆధారపడిన ప్రాజెక్టులు.. స్పిల్‌వే, ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్ నాగార్జున సాగర్ పరిధిలో.. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్ పాండ్. తుంగభద్ర, దాని పరిధిలోని హై లెవల్, లో లెవల్ కెనాల్లు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల ఎగువ కృష్ణాలో.. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు - పాకాల ఇన్‌ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంపుహౌస్, ఎస్సారెస్పీ స్టేజ్ -2లోని మైలవరం రిజర్వాయర్ వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ-ఎన్ఎస్-ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణాలింకు,కృష్ణాడెల్టా,గుంటూరు కెనాల్. గోదావరి బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు, చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ లిఫ్టు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్. పెద్దవాగు రిజర్వాయర్ స్కీం, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు ప్రాజెక్టు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్ల తరలింపు. పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్టు, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్. తొర్రిగడ్డ, చింతలపూడి, చాగలనాడు, వెంకటనగరం ఎత్తిపోతలు. -
అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘కృష్ణానదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని మేం అంటున్నాం. కానీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతోనే తాము ఎక్కువగా మాట్లాడడం లేదని ఏపీ సీఎం, మంత్రులు అనడం విచారకరం. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోగానీ, ఇతర ప్రాంతాల్లో గానీ నివసిస్తున్న సీమాంధ్రులు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇబ్బందులు పడ్డామని ఎవరైనా అన్నారా? ట్యాంక్ బండ్‌పై ఉన్న ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడి విగ్రహాన్ని అయినా తొలగించామా? తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను ఇక్కడివారు కలుపుకొని పోయి.. వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఏపీలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సులను అక్కడి స్టేషన్లలో ఆపనివ్వలేదు. తిరుపతిలో ఓ అధికారి మమ్మల్ని అవమాన పరిచిన ఘటన కూడా ఉంది..’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పాలమూరును ఎడారి చేసేలా అక్రమ ప్రాజెక్టులతో నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తోందని, పైగా తెలంగాణపై నిందలు మోపుతోందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం ఉండాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని.. మహారాష్ట్రకు నష్టం వాటిల్లకుండా వారిని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఏపీ కూడా అలాగే పైన ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందని భావించామన్నారు. శ్రీశైలం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అని, అలాంటిది విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. -
అసలు మాత్రమే చెల్లించండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేశామని, కేవలం అసలు మాత్రమే చెల్లించాలని కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో జలమండలి వన్ టైం సెటిల్మెంట్ పథకం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. -
రెండుమార్లు స్నానం.. మళ్లీ మళ్లీ కడిగేస్తున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎల్భీనగర్‌లో నివసించే విక్రమ్ ఇటీవలి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం అలవాటు చేసుకున్నాడు. కోవిడ్ భయంతో రోజుకు 2–3 సార్లు స్నానం చేయడం..4–5 సార్లు చేతులు, కాళ్లు కడుక్కుంటున్నారు. దీంతో ఐదుగురు నివాసం ఉండే వారింట్లో నీటివినియోగం అనూహ్యంగా పెరిగింది’. ఈ పరిస్థితి విక్రమ్ ఒక్కరిదే కాదు..గ్రేటర్‌సిటీజన్ల అందరిదీ. కోవిడ్ పంజా విసరడంతో నగరంలో పాజిటివ్‌కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకుఅధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పలుమార్లు స్నానంచేయడం, చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం చేస్తున్నారు. దీంతో ఇళ్లలో నీటివినియోగంఅనూహ్యంగా పెరిగింది. మహానగరం పరిధిలోని సుమారు 10.60 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 204 కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ప్రధాన నగరంలో ప్రతీ ఒక్కరికీ నిత్యం 130 లీటర్లు, శివారు ప్రాంతాల్లో ఒక్కొక్కరికీ 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తోంది. ఇక జలమండలి తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో స్థానికులు బోరుబావుల నీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని సిటీజనులు తోడేస్తున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలమట్టాలు పెరగడంతో బోరుబావుల్లో సమృద్ధిగా నీటినిల్వలుండడంతో వ్యక్తిగత అవసరాలకు నీటిఇక్కట్లు లేకపోవడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక్కో వ్యక్తికి నిత్యం తాగడానికి, స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం ఇతర వ్యక్తిగత అవసరాలకు సుమారు 130 లీటర్ల నీరు అవసరం. నగరంలో ఆమేర నీటి లభ్యత ఉంది. వర్షాకాలంలోనూ.... సాధారణంగా వర్షాకాలం సీజన్లో నీటివినియోగం తగ్గడం పరిపాటే. కానీ ఈసారి మార్చి నెల నుంచి ప్రస్తుత తరుణం వరకు నీటి వినియోగం క్రమంగా పెరుగుతుందే కానీ..తగ్గడంలేదు. ప్రస్తుతం జలమండలి కృష్ణామూడుదశలు,గోదావరి మొదటి దశతోపాటు జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 204 కోట్ల లీటర్లు(2047 మిలియన్ లీటర్లు) నీటిని సేకరించి శుద్ధిచేసి 10.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటి తరలింపు,శుద్ధి చేసేందుకు ప్రతీ వెయ్యి లీటర్లకు జలమండలి రూ.45–50 ఖర్చు చేస్తుండగా..వినియోగదారుల నుంచి రూ.10 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని సుమారు 23 లక్షల బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని తోడేస్తూ వివిధ గృహ, వాణిజ్య అవసరాలకు సిటీజన్లు వినియోగిస్తుండడం విశేషం. ఈ ఏడాది నీటికొరత లేనట్టే.. గ్రేటర్ నగరానికి తాగునీరందిస్తోన్న నాగార్జునసాగర్ (కృష్ణా), ఎల్లంపల్లి (గోదావరి), జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల్లో ఇటీవలి వర్షాలకు నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. రాగల 2 నెలల్లో ఈ జలాశయాలు నిండుకుండల్లా మారతాయని ఆశిస్తున్నాం. ఆయా జలాశయాల్లో నీటినిల్వలు సమృద్ధిగా ఉంటే నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగరవాసులు ప్రతి ఒక్కరికీ నిత్యం 130 లీటర్ల స్వచ్ఛమైనతాగునీరందించడమే జలమండలి లక్ష్యం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
విద్యుత్ చార్జీల్లో రాయితీ
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్లుగా జలమండలి ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ చార్జీల భారం నుంచి విముక్తి లభించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు‡ ప్రత్యేక చొరవతో విద్యుత్ చార్జీల తగ్గింపు జరిగింది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి ఒక ఫేజ్ ద్వారా నగరానికి తాగునీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.. నగరానికి ఈ నీటి అందజేత.. 95 శాతం భారీ మోటర్ల ద్వారా, 5 శాతం గ్రావిటీ ద్వారా జరుగుతోంది. భారీ మోటర్ల వినియోగం, రిజర్వాయర్ల ద్వారా వినియోగదారులకు నీటిని సరఫరా చేయడం కోసం నెలకు దాదాపుగా 200 నుంచి 225 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. విద్యుత్ చార్జీల రూపంలో రూ.90 కోట్లను చెల్లిస్తున్నారు. మహానగరానికి జలమండలి సరఫరా చేస్తున్న ఈ నీటిలో 95 శాతం వరకు గృహావసరాలు తీరుతున్నాయి. దీంతో విద్యుత్ చార్జీల్లో రాయితీలు కల్పించాలని ప్రభుత్వానికి జలమండలి విజ్ఞప్తి చేసింది. జలమండలికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల టారీఫ్ తగ్గించాలని జలమండలి అధికారులు 2018లోనే మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఓకే చెప్పారు. ఈక్రమంలో జలమండలి టారీఫ్ తగ్గించాలని జీవో నెం.148ని 2018 ఆగస్టు 3న విడుదల చేశారు. అయితే ఈ జీవో ప్రకారం జలమండలి విద్యుత్ చార్జీల టారీఫ్ తగ్గింపులను ఈఆర్సీ అమలు చేయలేదు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈఆర్సీ అధికారులతో పలుమార్లు సమావేశమై విద్యుత్ బిల్లుల టారీఫ్‌లు తగ్గించారు. విద్యుత్ శాఖ యాక్ట్ 108/2003 ప్రకారం ఈ రాయితీలు కల్పించారు. రాయితీలు ఇలా... ఇంతకుముందు జలమండలికి 11కేవీ విద్యుత్‌కి రూ.6.65, 33 కేవీ విద్యుత్‌కి రూ.6.15, 133 కేవీ, ఆపైన విద్యుత్‌కి రూ.5.65లు యూనిట్‌కి చొప్పున వసూలు చేసేవారు. తాజాగా ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని కేటగిరీలో ప్రతి యూనిట్‌కి రూ.3.95 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ టారీఫ్ రాయితీ ఏప్రిల్ 2018 నుంచే అమలులోకి రానుండటం విశేషం. దీనివల్ల జలమండలికి రూ.700 కోట్లు మిగలనున్నాయి. ప్రతినెలా జలమండలికి దాదాపుగా రూ.22.5 కోట్లు ఆదా కానుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.270 కోట్ల భారం తప్పనుంది. రాయితీ లేకముందు నెలకు దాదాపుగా రూ.90 కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో చెల్లించేవారు. రాయితీ అనంతరం నెలకు దాదాపుగా రూ.22.5 కోట్లు ఆదా కానున్నాయి. మిగులు చార్జీలతో నగరంలో మెరుగైన నీటి సరఫరా, సీవరేజ్ పనులు చేపట్టవచ్చు. జలమండలికి విద్యుత్ టారీఫ్‌లో రాయితీ కోసం కృషి చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు జలమండలి ఎండీ ఎం.దానకిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. -
నల్లా లెక్కల్లో!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక నష్టాల్లో ఉన్న వాటర్‌బోర్డును గట్టెక్కించేందుకు జలమండలి ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగ(డొమెస్టిక్), వాణిజ్య అవసరాల (కమర్షియల్) నల్లా కనెక్షన్ల లెక్క తేల్చనుంది. డొమెస్టిక్ కనెక్షన్లు కలిగి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ ప్రతినెల రూ.వేలల్లో బిల్లులు ఎగవేస్తున్న భవనాల గుర్తింపే లక్ష్యంగా శనివారం నుంచి ఈ సర్వే సాగనుంది. ఇందుకోసం 150 మంది సిబ్బందితో 50 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. నగర పరిధిలో మొత్తం 10.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా... వీటిలో కమర్షియల్ కనెక్షన్లు 30వేలకు మించి లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు చరిత్రలోనే తొలిసారి ఇంటింటి సర్వే చేయనున్నారు. సిబ్బందికి శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్–1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు. సర్వే ఇలా... జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ సాయంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తాయి. నల్లా కనెక్షన్ నంబర్, నీటి మీటర్ సమాచారం, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరీ తదితర వివరాలను సిబ్బంది సేకరిస్తారు. సదరు భవనానికి బోర్డు నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత కేటగిరీలో కనెక్షన్ ఉందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒకవేళ డొమెస్టిక్ కనెక్షన్ ఉండి, ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే దాన్ని కమర్షియల్ కేటగిరీలోకి మారుస్తారు. ఈ సర్వేను తొలుత నారాయణగూడ, ఎస్ఆర్నగర్, మారేడుపల్లి, కూకట్పల్లి, అంబర్పేట్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో చేపడతారు. ఆదాయానికి మించి ఖర్చు... జలమండలి రెవెన్యూ ఆదాయం నెలకు రూ.120 కోట్లు కాగా.. ఖర్చు రూ.150 కోట్లకు చేరిందని ఎండీ దానకిశోర్ తెలిపారు. ప్రతినెల రూ.30 కోట్ల లోటు బడ్జెట్‌తో బోర్డు నెట్టుకొస్తోందని చెప్పారు. రెవెన్యూ ఆదాయం పెంచుకొని ఈ లోటును పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సర్వేలో అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు, వాటిని క్రమబద్ధీకరించడం, నాన్ డొమెస్టిక్ కనెక్షన్ అయితే మీటర్ బిగింపు, నీటి వృథాను అరికట్టే విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించడం తదితర అంశాలు ఉంటాయన్నారు. నీటి వృథాను గణనీయంగా తగ్గిస్తే బోర్డుకు మరింత రెవెన్యూ ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. సర్వే వివరాలను విజిలెన్స్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీ చేయిస్తామని,సర్వే సమయంలో అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమర్షియల్ ఏరియాలుగా గుర్తించిన 150 ప్రాంతాల వివరాలు తీసుకొని ఆయా ప్రదేశాల్లో వాణిజ్య కనెక్షన్లపై సర్వే చేపట్టనున్నామని తెలిపారు. జలమండలి సిబ్బంది ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు వినియోగదారులు సహకరించాలని కోరారు. -
15 ఏళ్లుగా బిల్లేది?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లులు కట్టడంలో హైదరాబాద్ జలమండలి చేస్తున్న నిర్లక్ష్యం నీటి పారుదల శాఖ పాలిట శాపంగా మారింది. ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తుండగా, దాన్ని వినియోగించుకుంటున్న జలమండలి మాత్రం కరెంట్ బిల్లులు కట్టట్లేదు. ఏకంగా 15 ఏళ్లుగా కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో అవి రూ.776 కోట్లకు పేరుకుపోయాయి. కరెంట్ బిల్లులు కట్టాలంటూ ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుదల శాఖ ఇంజనీర్ల క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తున్నారు. 24 లేఖలు రాసినా.. నాగార్జునసాగర్ ఫోర్‌షోర్ పుట్టంగండి పంపింగ్ స్టేషన్ నుంచి హైదరాబాద్ తాగునీటికి ఏటా 16.5 టీఎంసీల మేర నీరు వినియోగించుకునేలా ఆదేశాలుండగా, రోజూ 525 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్ బిల్లును అధికారులు నీటిపారుదల శాఖకే పంపిస్తున్నారు. వాస్తవానికి ఈ మొత్తాన్ని జలమండలికి నీటిపారుదల శాఖకు చెల్లించాలి. అయితే 15 ఏళ్లుగా జలమండలి పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించట్లేదు. దీనిపై నీటిపారుదల శాఖ 24 లేఖలు రాసినా జలమండలి స్పందించలేదు. మరోపక్క బిల్లులు చెల్లించకుంటే క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుల శాఖకు నోటీసులు పంపిస్తున్నారు. దీంతో 2004 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మొత్తం రూ.776.45 కోట్ల బిల్లులు చెల్లించాలని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహా.. జలమండలికి లేఖ శనివారం రాశారు. బిల్లులు కట్టకపోవడంతో ఏఎంఆర్పీ క్యాంపు కార్యాలయానికి విద్యుత్ శాఖ కరెంట్ కట్ చేస్తోందని పేర్కొన్నారు. పుట్టంగండి పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా బిల్లులు చెల్లించాలని కోరారు. -
జీవజలం..
ఆహారం లేకుండా రెండుమూడు రోజులైనా ఉండగలమేమో గానీ.. నీరు తాగకుండా ఉండటం కష్టం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. తాగడానికే కాదు.. ఎన్నో రకాల అవసరాలకు మనకు నీరు వినియోగం తప్పదు. పల్లెల్లో ఎలా ఉన్నా.. పట్టణాల్లో మాత్రం రోజూ వేల లీటర్లు కావాలి. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి కార్పొరేషన్లలో అయితే మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్ల్లో రోజూ ఆయా వాటర్ బోర్డులు ప్రజలకు అవసరమైన మేర నీటి సరఫరా చేస్తున్నాయి. అయినా కొన్ని చోట్ల మాత్రం కొరత తప్ప డం లేదు. రోజురోజుకు నగర జనాభా పెరుగుతుండటంతో అంతమందికి నీటి సరఫరా కత్తి మీద సాము లాంటిదే... కార్పొరేషన్లలో నీటి సరఫరా తీరుపై ఓ లుక్కేస్తే.... - సాక్షి, నెట్వర్క్ -
స్నేహితుడి కోసం...
పవన్, శైలజ జంటగా జి.మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరాదోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి.వీరారెడ్డి నిర్మించారు. వి.సాయిరెడ్డి స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర పాటలను తెంగాణ వాటర్ బోర్డ్ చైర్మన్ వి.ప్రకాశ్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. జి.మురళి మాట్లాడుతూ– ‘‘డైనమిక్‌లాంటి అమ్మాయి ఒక బలహీనుణ్ని ప్రేమిస్తుంది. ఓ సందర్భంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. ఆ బలహీనుడి మిత్రుడైన హీరో... ఆ రాక్షసుడ్ని సంహరించి ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మేరాదోస్త్’. వీరారెడ్డిగారు ఇచ్చిన సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మురళి చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాం. ‘మేరాదోస్త్’ అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు పి.వీరారెడ్డి. ‘‘సినిమా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. ఆరో తరగతి నుంచే సినిమాలు విపరీతంగా చూసేవాణ్ణి. అల్లాణి శ్రీధర్‌గారి వద్ద దర్శకత్వశాఖలో పని చేశాను. అనుకోనుకుండా రాజకీయాల్లోకి వెళ్లాను. ఆ తరుణంలోనే తెంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో సినిమాకు దూరమయ్యాను. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది’’ అన్నారు వి.ప్రకాశ్. నిర్మాత సాయి వెంకట్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వి.సాయిరెడ్డి, కెమెరా: సుధీర్. -
రూ.36 కోట్లు నీళ్లపాలు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో 50 ఎంజీడీలు వృథా అవుతోంది. ప్రతినెలా ఇలా రూ.36 కోట్ల ప్రజాధనం నీటిపాలవుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. దీనికంతటికీ ప్రజల అవగాహన రాహిత్యమేనన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద నీటి పొదుపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు, వాక్ వలంటీర్లు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిపొదుపుపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జలశక్తి అభియాన్’ కార్యక్రమంతో వాక్ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. నగరానికి సుమారు 200 కిలో మీటర్ల దూరం నుంచి తీసుకువచ్చి సరఫరా చేస్తున్న కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతిరోజు 50 ఎంజీడీల నీరు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీటిని పొదుపు చేస్తే దాదాపు 30 లక్షల కుటుంబాలకు వినియోగించవచ్చన్నారు. నీటి పొదుపుతో విద్యుత్ చార్జీల రూపేణ నెలకు దాదాపు రూ.36 కోట్ల ప్రజాధనం పొదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. విచక్షణా రహితంగా బోరుబావులను తవ్వి భూగర్భ జలాలను తోడడంతో వందల అడుగుల లోతునకు బోర్లు వేసినా నీరు పడడం లేదన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జలమండలి.. ఎన్జీవోల సహకారంతో జలభాగ్యం, జలం జీవం, వాక్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. 75 రోజులపాటు అవగాహన నీటి పొదుపై అవగాహన కల్పించేందుకు నగరంలో ఈనెల మొదటి వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు 75 రోజుల పాటు స్లమ్ లెవెల్ ఫెడరేషన్, వాక్ వలంటీర్లు, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఆఫీసర్స్, జలమండలి జీఎంలు, డీజీఎంలు గ్రేటర్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎండీ ఆదేశించారు. ఇందుకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, సెకండరీ ట్రాన్స్మిషన్ డైరెక్టర డా. పి.ఎస్. సూర్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరాకృష్ణ, పి.రవి, రెవెన్యూ డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. -
పట్నానికి దూపైతాంది
సాక్షి, సిటీబ్యూరో :నగరం గొంతెండుతోంది. తాగునీటి కోసం తండ్లాడుతోంది. ఎండలు మండిపోతుండడంతో సమస్య తీవ్రరూపందాలుస్తోంది. జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నా...నిర్వహణ లోపాలతోనే ఈ పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ... ప్రజాఅవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. రోజు విడిచి రోజు సరఫరా జరగడం లేదనిధ్రువపడింది. ‘సాక్షి’ మంగళవారం నగరంలో పరిశీలించగా ఈ మేరకు వెల్లడైంది. బస్తీలు, కాలనీలకు అరకొర నీటిసరఫరా, కలుషిత జలాల సరఫరా తదితర సమస్యలు కళ్లకు కట్టాయి. వాస్తవానికి ప్రతి వేసవిలో ఉన్నతాధికారులు డివిజన్ల వారీగా పరిస్థితిని సమీక్షించాల్సి ఉన్నప్పటికీ కార్యాలయాలకేపరిమితమయ్యారనే విమర్శలు వినిపించాయి. కిందిస్థాయి సిబ్బందే సరఫరా రోజు, సమయాలు నిర్ణయించే పరిస్థితినెలకొందనే ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో గుడిసెకుమూడు బిందెలు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని నందగిరిహిల్స్‌ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్ మురికివాడలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నెల రోజులుగా సరిపోయేన్ని నీళ్లు సరఫరా కాకపోవడంతో స్థానికులు చుట్టుపక్కల అపార్టుమెంట్లకు వెళ్లి బిందెడు నీటిని అడుక్కోవాల్సి వస్తోంది. రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నా పావుగంట కూడా వదలకపోవడంతో ఒక్కో గుడిసెకు మూడు బిందెలు కూడా రావడం లేదు. ఇక్కడ బోర్ ఉన్నా భూగర్భజలాలు అడుగంటడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి.భారతి నివసించే రోడ్ నెం.14లోని లంబాడి బస్తీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మల్కాజిగిరి: నియోజకవర్గం పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్‌తో నీరు సరఫరా అవుతోంది. మరికొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితమవుతోంది. వినాయకనగర్ డివిజన్ వాజ్‌పేయి నగర్లో తాగునీటి సమస్యతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. లో ప్రెషర్‌తో నీరు సరఫరా అవుతోందని ఆరోపిస్తున్నారు. యాప్రాల్‌లో... రాజీవ్‌గృహకల్ప, భరత్‌నగర్‌లో నీటి పైప్‌లైన్ అసలే లేదు. ఏళ్ల తరబడి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. 15, 20 రోజులకు ఒక సారి ట్యాంకర్ వస్తోంది. దీంతో 4 నుంచి 5 డ్రమ్ములు ఒక కుటుంబం సరి పెట్టుకుంటున్నామని, ఈ నీటిని స్నానాలు, తాగేందుకు వినియోగించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. సమయపాలన లేదు చింతల్: చింతల్ వాటర్ వర్క్స్ డివిజన్ నాలుగు సెక్షన్ల పరిధిలో ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన నీటి సరఫరా అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఐదు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గాజులరామారం రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో దేవేందర్‌నగర్, మల్లారెడ్డినగర్, కైసర్‌నగర్, రోడామేస్త్రీనగర్, మెట్కానిగూడ తదితర ప్రాంతాల్లో ఐదురోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. అన్ని సెక్షన్లలో సమయపాలన పాటించడం లేదు. సూరారం తదితర ప్రాంతాల్లో 5 రోజులకు ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. మొదటి అరగంట కలుషితం అంబర్‌పేట: నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి లో ప్రెషర్‌తో నీటి సరఫరా జరుగుతోంది. ♦ అంబర్‌పేట డివిజన్ న్యూ ప్రేమ్‌నగర్‌లోని 2–3–647/ఎ/300 ప్రాంతంలో 10వ తేదీ నుంచి తాగునీటి సరఫరా లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ♦ బాగ్‌అంబర్‌పేట డివిజన్లో పోచమ్మబస్తీ సమీపంలో మంగళవారం కలుషిత తాగునీరు సరఫరా అయింది. ♦ బాగ్‌అంబర్‌పేట మల్లికార్జున్ నగర్లో ముందస్తు సమాచారం లేకుండా నీటి సరఫరా బంద్ చేశారు. ♦ నల్లకుంట డివిజన్లో విజ్ఞాన్‌పురి బస్తీలో.. తిలక్‌నగర్‌బస్తీ, చైతన్యనగర్ కాలనీ, భాగ్యనగర్‌లో ట్యాంకర్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. లో ప్రెషర్‌తో సరఫరా లో ప్రెషర్‌తో తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చే నీళ్లు కూడా గంటకంటే ఎక్కువగా రావడం లేదు. వేసవి కావడంతో ఇంట్లోని బోరు పూర్తిగా ఎండిపోయింది. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – ఎ.సుజాత, మోతిమార్కెట్ చాలీచాలని నీళ్లు అడ్డగుట్ట: ఒక పక్క చాలీచాలని నీళ్లు మరో పక్క కలుషిత నీటి సరఫరా కారణంగా అడ్డగుట్ట డివిజన్లోని బి సెక్షన్ వాసులు కష్టాలు పడుతున్నారు. అడ్డగుట్ట డివిజన్లోని బి సెక్షన్ ఇంటి నెం. 10–4–బి/146 సమీప ప్రాంతంలో లో ప్రెషర్‌తో నీళ్లు సరఫరా అవుతున్నాయి. నల్లా నీటిలో మురుగు నీళ్లు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐదు రోజులకోసారి.. కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు స్వతహాగా నీటి వనరులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జలమండలి ద్వారా నీటిని కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతానికి రోజుకు 50 లక్షల గ్యాలన్ల చొప్పున 11 వేర్వేరు రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బోయిన్పల్లి పరిధిలోని 1, 6 ఆరు వార్డుల్లో మినహా, మిగతా ఆరు వార్డులో మూడు నుంచి ఐదురోజులకోసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. పది రోజుల క్రితం జలమండలి ఎండీ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేసి అదనంగా రోజుకు 13 లక్షల గ్యాలన్ల చొప్పున విడుదల చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు నీటి మోతాదును పెంచితే అన్ని ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి నీరు విడుదల చేసే అవకాశముంది. మంగళవారం కంటోన్మెంట్లో మెజారిటీ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. కేవలం 20 శాతం బస్తీలు, కాలనీల్లో మాత్రమే నీటి సరఫరా జరిగింది. బిందెనక బిందెపెట్టి! ♦ బోయిన్‌పల్లిలో ఐదు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. ♦ జూబ్లీహిల్స్ డివిజన్లోని గురుబ్రహ్మనగర్ మురికివాడలో ఒక్కో గుడిసెకు కేవలం 3 బిందెల నీళ్లే వస్తున్నాయి. ♦ గచ్చిబౌలిలోని బంజారానగర్, దీప్తిశ్రీనగర్‌లలో కేవలం అరగంట పాటే నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి పాపిరెడ్డినగర్ కాలనీలో దుర్గామాత దేవాలయం సమీపంలో కనెక్షన్లు ఉన్నా నీటి సరఫరా జరగడం లేదు. ♦ కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో 23 ఎంజీడీ లు డిమాండ్ ఉండగా... 17–18 ఎంజీడీలే సరఫరా అవుతోంది. ♦ యాప్రాల్‌లోని రాజీవ్ గృహకల్ప, భరత్‌నగర్‌లలో నీటి పైప్లైన్లు అసలే లేవు. ఏళ్ల తరబడి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 15–20 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తోంది. ఒక్కో కుటుంబం 4–5 డ్రమ్ముల నీటిని పట్టుకొని వాటినే అన్ని అవసరాలకు సరిపెట్టుకుంటోంది. ♦ అంబర్‌పేట డివిజన్ న్యూప్రేమ్‌నగర్‌లోఈ నెల 10 నుంచి నీటి సరఫరా జరగడం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ♦ బాగ్‌అంబర్‌పేట మల్లికార్జుననగర్‌లో ముందస్తు సమాచారం లేకుండా నీటిసరఫరా ఆపేశారు. అరగంట మాత్రమే.. ఉప్పల్: ఉప్పల్, కాప్రా సర్కిల్, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల పరిధిలో నీటి కటకట మొదలైంది. కాప్రా సర్కిల్ పరిధిలో దాదాపు 50 శాతం గోదావరి జలాలు సరఫరా అవుతుండేవి.. అయితే మంజీరా, సింగూరు ఎండిపోవడం వల్ల గోదావరి జలాలను మళ్లించారు. దీంతో నీళ్లు సరిపోక ఇక్కడి ప్రజలు నీటికి తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో 23 ఎంజీడీల నీరు డిమాండ్ ఉండగా ప్రస్తుతం 17 నుండి 18 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. గోదావరి జలాలుమళ్లించడం వల్ల జలమండలి అధికారులు కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో రోజు విడిచి రోజు గంట సరఫరా చేసే బదులు కొన్ని ప్రాంతాల్లో అరగంట మాత్రమే సరఫరా అవుతోంది. ఉప్పల్ న్యూ విజయపురి కాలనీ, శాంతినగర్, విజయపురి కాలనీ, లక్ష్మారెడ్డి కాలనీ, సూర్యనగర్‌కాలనీ, సరస్వతినగర్, ఇందిరానగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్య తీవ్రంగా ఉంది. ఉప్పల్, కాప్రా సర్కిళ్ల పరిధిలో 63 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో 28 వేల నీటి కనెక్షన్లు ఉండగా కాప్రా సర్కిల్ పరిధిలో 35 వేల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు ఉప్పల్ సర్కిల్ పరిధిలో సమయపాలన లేకుండా నీరు వదలడంతో ఎందుకు ఉపయోగం కాకుండా పోతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి పైప్‌లైన్ చార్మినార్: పాతబస్తీలో నీటి కొరత ఎక్కువగా ఉంది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిజాం కాలం నాటి తాగునీటి పైపులైన్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రధాన రోడ్లలో ప్రాజెక్టు పనులు జరిగినా అంతర్గత బస్తీల్లో ఇంకా పాత పైపులైన్ ద్వారానే నీటి సరఫరా అవుతోంది. కుళాయిల్లో వచ్చే కలుషిత నీటి సరఫరాతో స్థానికులు అనారోగ్యాలకు గురవుతున్నారు. దాంతో 20 లీటర్ల నీటి క్యాన్లను బహిరంగ మార్కెట్లో ఖరీదు చేస్తున్నారు. నీటి సరఫరా ప్రారంభమైన చాలా సేపటి వరకు కలుషితంగా వస్తుండటంతో పాతబస్తీ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. చుక్క చుక్కకూ నిరీక్షణే... ఎల్బీనగర్: ఎల్బీనగర్జోన్ పరిధిలో నీటి సరఫరా అస్తవ్యస్థంగా ఉంది. రోజు విడిచి రోజు నీరు సరఫరా అవుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారిగా ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో 32ఎంజీడీ నీరు సరఫరా అవుతోంది. లో ప్రెషర్‌తో కారణంగా మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. చుక్క నీటికి నిరీక్షించాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ లింగోజిగూడ డివిజన్లోని మజీద్‌గల్లిలో మురుగు నీరు సరఫరా అవుతోంది. ♦ హయత్‌నగర్‌లో కలుషిత నీరు సరఫరా అవుతోంది. సమయపాలన లేకుండా.. కూకట్పల్లి (జోన్‌బృందం): కూకట్పల్లి సర్కిల్ పరిధిలో కొన్ని బస్తీల్లో సమయపాలన లేకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ నీటి కోసం నిరీక్షిస్తున్నారు. మరి కొన్ని బస్తీల్లో పూర్తిగా నీటి సరఫరా లేకుండా పోయింది. రిజర్వాయర్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాకు కనీసం పైపులైన్లు లేకపోవటం గమనార్హం. ♦ ఆల్విన్‌కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ, ఎన్‌టీఆర్‌నగర్‌లలో నీటి ట్యాంకు ఉపయోగంలో లేదు. ♦ జేఎన్ఎన్యుఆర్ఎం గృహ సముదాయాల్లో కనీసం నీటి పైపులైన్లు కూడా వేయడం మరిచారు. ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి నీటిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. ♦ వివేకానందనగర్ డివిజన్ రిక్షాపుల్లర్స్ కాలనీలో మురుగు చేరి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ♦ బాలానగర్ డివిజన్ రాజీవ్‌గాంధీనగర్‌లో నాలుగు నెలల నుంచి మురుగు నీరు సరఫరా అవుతోంది. ♦ మూసాపేట డివిజన్లో అర్ధరాత్రి వేళలో సరఫరా అవుతోంది. ఏళ్లుగా అవే అవస్థలు మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిందిబస్తీ, ఆర్టీసీ కాలనీ, వినాయక్‌నగర్, ఎన్జీవోస్ కాలనీల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ♦ శామీర్‌పేట్ మండలంలోని ఉద్దెమర్రి, కేశవరం, లక్ష్మాపూర్, పొన్నాల్, అద్రాస్పల్లి, శామీర్‌పేట్ గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేదు. జవహర్‌నగర్‌లోని శాంతినగర్, అంబేడ్కర్‌నగర్, గబ్బిలాలపేట్, బీజేఆర్నగర్, మోహన్‌రావు నగర్, వికలాంగుల కాలనీ, మోహన్‌రావు నగర్ తదితర కాలనీల్లో నీటి సరఫరా సక్రమంగా లేదు. ♦ కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ గ్రామాల్లో నీటి కొరత నెలకొంది. ఆయా కాలనీవాసులు ప్రైవేటు ట్యాంకర్ల వద్ద నీటిని కొనుగోలు చేస్తున్నారు. ♦ ఘట్కేసర్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో నీటి సరఫరా కావడం లేదు. మెయిన్ రోడ్డులో ఉన్న హోటళ్లకు ఎక్కువ నీరు సరఫరా అవుతోంది. నీటి సరఫరా సమయంలో కొన్ని ఇళ్ల యజమానులు మోటార్లు బిగించడంతో చివరన ఉన్న ఇళ్ల వారికి నీరు సరఫరా కావడం లేదు. -
ఇంటి దొంగకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పుట్టి ముంచుతోన్న ఇంటి దొంగల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుండడం సంచలనం సృష్టిస్తోంది. వాటర్‌బోర్డుకు రూ. కోట్లలో నష్టం చేసిన ఓ క్షేత్రస్థాయి అధికారి..తనకున్న అధికారాలతో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 1.97 లక్షల రూపాయల నీటిబిల్లు మాఫీ చేసి వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బోర్డు ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జలమండలిలో మాదాపూర్ సెక్షన్ పరిధిలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న కె.రవీందర్ 2015–18 మధ్యకాలంలో తనకున్న అధికారాలతో 381 నల్లా కనెక్షన్లకు సంబంధించిన నీటిబిల్లు రూ.1,96,71,398 బకాయిలను మాఫీచేసి సదరు వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకొని బోర్డుకు భారీగా నష్టం చేసినట్లు బోర్డు విజిలెన్స్ బృందం పరిశీలనలో తేలింది. దీంతో ఆయనను బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అతనిపై బోర్డు నిబంధనలు, సర్వీసు మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తక్షణం సదరు అధికారి తన గుర్తింపు కార్డును సంబంధిత డివిజన్ జనరల్ మేనేజర్‌కు అప్పగించాలని, తదుపరి ఆదేశాలిచ్చేవరకు నగరం విడిచి వెళ్లరాదని స్పష్టంచేశారు. జలమండలిలోఇంటిదొంగల నిర్వాకమిదీ.. జలమండలి నెట్వర్క్ ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధి వరకు విస్తరించడం..ప్రస్తుతం ఉన్న 9.65 లక్షల నల్లా కనెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వినియోగదారులకు అవస్థలు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డిప్యూటీ జనరల్మేనేజర్లు, జనరల్ మేనేజర్లకు పలు అధికారాలను బోర్డు బదలాయించింది. ఇదే అదనుగా కొందరు జలగల్లా మారిన అధికారులు వినియోగదారుల వాణిజ్య నల్లాలను తమ అధికారాలను వినియోగించుకొని గృహ వినియోగ నల్లాలుగా మార్చేస్తున్నారు. బోర్డు డేటాబేస్‌లో ఇలాంటి మార్పులు చేస్తుండడంతో నెలవారీగా వేలల్లో వసూలు చేయాల్సిన బిల్లు వందల్లోపే ఉంటుంది. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన అధికారి ఏకంగా తన పాస్‌వర్డ్‌ను వినియోగించుకొని వేలాదిగా నీటిబిల్లు బకాయిపడిన 381 మంది వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకొని ఏకంగా రూ.1.97 కోట్ల రూపాయల నీటిబిల్లు బకాయిలను బోర్డు డేటాబేస్‌నుంచి తొలగించడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి ఉదంతాలు బోర్డు విజిలెన్స్ పోలీసులు లోతైన విచారణలో రోజుకొక్కటి చొప్పున బయటపడుతుండడం గమనార్హం. ఇటీవల చంచల్గూడా సెక్షన్ పరిధిలో మాజీ ఉద్యోగి పాస్‌వర్డ్‌ను వినియోగించుకొని పలు వాణిజ్య నల్లాలను గృహవినియోగ నల్లాలుగా మార్చిన అక్రమార్కుల ఉదంతం బయటపడడంతో విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదుచేసిన విషయం విదితమే. ప్రధానంగా అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు, బహుళ భవనాలు, హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులు, రెస్టారెంట్లకు సాధారణంగా వాణిజ్య నల్లాలుగా పరిగణిస్తారు. వీటిని గృహవినియోగ నల్లాలుగా బోర్డు డేటాబేస్‌లో మార్పులు చేస్తుండడంతో వాటి నుంచి రావాల్సిన కనెక్షన్ ఛార్జీలు, నీటిబిల్లులు రాక బోర్డుకు ప్రతీనెలా కోట్లరూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే నెలకు సుమారు రూ.25 కోట్ల ఆర్థికనష్టాలతో ఉన్న బోర్డుకు కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో మరింత కుదేలవుతోంది. మహానగరం పరిధిలో సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలుంటాయని బోర్డు వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఇవి ఎక్కడున్నాయన్న విషయం అధికారులు, సిబ్బందికి తెలిసినా మిన్నకుంటున్నారంటే వీటి ఏర్పాటు వెనక సూత్రధారులు వీరేనన్న విషయం సుస్పష్టమౌతోంది. జలమండలిలో జలగల ఉదంతంతో ప్రతీనెలా బోర్డు రూ.10 కోట్లమేర కనెక్షన్ ఛార్జీలు, నీటిబిల్లు బకాయిలు, నీటిచౌర్యం, అక్రమనల్లాల కారణంగా నష్టపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం. కాగా జలమండలిలో క్షేత్రస్థాయి అధికారుల వ్యవహారాలను ఎండీ ఎం.దానకిశోర్ సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై విజిలెన్స్ బృందం ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. నీటినాణ్యత, వినియోగదారుల సమస్యల పరిష్కారం విషయంలో ఐఎస్ఓ ధ్రువీకరణ సాధించిన బోర్డుకు కొందరు అధికారుల తీరు శాపంగా పరిణమిస్తుండడంతో సదరు అక్రమార్కుల భరతం పట్టాలని నిర్ణయించడం విశేషం. -
గట్టెక్కేదెలా?
సాక్షి,సిటీబ్యూరో: భారీగా పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు జలమండలి పుట్టి ముంచుతున్నాయి. ఇప్పటికే రూ.450 కోట్ల మేర బిల్లులు పేరుకుపోవడంతో పాటు, బకాయిలపై అపరాధ వడ్డీ 11 శాతం వడ్డించడంతో వాటర్ బోర్డుకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మెట్రోరైలు తరహాలో బోర్డుకు రాయితీ ధరపై విద్యుత్ సరఫరా చేయాలన్న ఫైల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వద్ద ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంది. దీంతో అధిక విద్యుత్ బిల్లులు.. కొండలా పేరుకుపోయిన బకాయిలుసంస్థను రూకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయి. విద్యుత్ రాయితీకి మోక్షమెప్పుడు? జలమండలికి ప్రస్తుతం విద్యుత్‌శాఖ వాణిజ్య విభాగం కింద విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ప్రతి యూనిట్‌కు రూ.6–7 వరకు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మెట్రో రైలు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి మాత్రం రాయితీపై యూనిట్ విద్యుత్‌ను రూ.3.95కే సరఫరా చేస్తోంది. ఈ తరహాలోనే జలమండలికి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. సంబంధిత ఫైలు ప్రస్తుతం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద ఉంది. తక్షణం దీనికి మోక్షం లభిస్తేగాని జలమండలికి ఊరట లభించే పరిస్థితి లేదు. ఈ ఫైలు ఓకూ అయితే బోర్డుకు నెలవారీగా రూ.25 కోట్లు.. ఏడాదికి రూ.300 కోట్ల మేర విద్యుత్ బిల్లుల రూపేణా ఆదా అవుతుంది. ఈ ఫైలుకు తక్షణం మోక్షం కల్పించి బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రతీనెలా ఆర్థిక కష్టాలే.. జలమండలికి నెలవారీగా రూ.95 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు అవసరమైన పంపింగ్ కేంద్రాలు, నగరం నలుమూలలా నీటి సరఫరాకు వినియోగించే పంపులకు సంబంధించి నెలవారీగా రూ.75 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇక మిగతా రూ.20 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. ఇక నగరంలో మురుగునీటి పారుదల, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులకు, గతంలో కృష్ణా, గోదావరి పథకాలకు తీసుకున్న రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకు మరో రూ.15–20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలవారీ వ్యయం రూ.110–115 కోట్లకు చేరుతోంది. అంటే నెలకు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు బోర్డుకు నష్టాలు తప్పడంలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన రూ.1000 కోట్ల నిధులను సైతం త్రైమాసికాల వారీగా సక్రమంగా కేటాయింపులు జరపకపోవడం శాపంగా పరిణమిస్తోంది. గతంలో జలమండలికి హడ్కో అందించిన రూ.300 రుణ మొత్తాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించింది. ఈ చెల్లింపులు కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదని సమాచారం. హడ్కో రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంటు చెల్లింపులు కూడా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. సరఫరా నష్టాలు అదనం వాటర్ బోర్డు రోజువారీగా 440 మిలియన్ గ్యాలన్ల జలాలను కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరించి శుద్ధిచేసి నగర ప్రజల అవసరాలకు సరఫరా చేస్తోంది. ప్రతి వేయిలీటర్ల నీటి శుద్ధికి రూ.40 ఖర్చు చేస్తున్నప్పటికీ.. వినియోగదారులకు రూ.10కే తాగునీటిని అందిస్తోంది. ఇక సరఫరా చేస్తున్న నీటిలోనూ లీకేజీలు, చౌర్యం, ఇతరత్రా కారణాలతో సరఫరా నష్టాలు 40 శాతం ఉంటున్నాయి. అక్రమ నల్లాలు, కోట్లలో పేరుకుపోయిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నీటిబిల్లు బకాయిలు జలమండలికి ఆర్థిక కష్టాలనే మిగిలిస్తుండడం గమనార్హం. -
నల్లా నీళ్లే బెస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో నల్లా కనెక్షన్లు ఉన్నవారిలో సుమారు 85 శాతం మంది జలమండలి సరఫరా చేస్తున్న నల్లానీటినే నేరుగా తాగేందుకు వినియోగిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. మరో 15 శాతం మంది ప్రైవేటు ఫిల్టర్‌ప్లాంట్లు, ఇళ్లలో రివర్స్ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్ రేడియేషన్ కిరణాలతో నీటిని శుద్ధి చేసే మినీ ఫిల్టర్ల నీటిని తాగుతున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ సౌజన్యంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రశాంత మహాపాత్ర నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఇటీవలి కాలంలో వాటర్‌బోర్డు నగరంలోని 256 భారీ స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో తాగునీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. దీంతో వినియోగదారులు నల్లా నీటిని నేరుగా తాగేందుకు వినియోగిస్తుండడం విశేషం. గతంలో సిటీలో నల్లా నీటిని నేరుగా తాగేవారి శాతం 55 శాతానికి మించకపోవడం గమనార్హం. సర్వే సాగిందిలా.. గ్రేటర్ పరిధిలో జలమండలి నల్లా నీరు సరఫరా అవుతున్న 18 నిర్వహణ డివిజన్ల పరిధిలో సుమారు 1200 నివాస సముదాయాల వారిని నేరుగా కలవగా వారిలో 85 శాతం మంది నల్లా నీటిని నేరుగా తాగేందుకు వినియోగిస్తున్నామని తెలిపారు. మరో 15 శాతం మందిని ఫిల్టర్‌నీటిని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. ఇక నల్లా నీటి నాణ్యతపై 47 శాతం మంది చాలా బాగుందని కితాబునిచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. ఇక కలుషిత జలాలు, అరకొరనీటిసరఫరా, తక్కువ వత్తిడితో నీటిసరఫరా, ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, మురుగు సమస్యలపై ఫిర్యాదులు, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, అధిక నీటిబిల్లులమోత తదితర సమస్యలపై తాము జలమండలి కస్టమర్ కేర్ 155313కి ఫోన్‌చేసిన వెంటనే 70 శాతం సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారని వినియోగదారులు తెలిపినట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇక మరో 30 శాతం మంది తమ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తున్నట్లు తెలిపారట. అత్యధిక ఫిర్యాదులు ఈ ప్రాంతాల నుంచే.. నగరంలో ప్రధానంగా... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్.ఆర్.నగర్, ఎర్రగడ్డ, ప్రకాశ్‌నగర్, మారేడ్‌పల్లి, ఆస్మాన్‌ఘడ్, టోలిచౌకి ప్రాంతాల నుంచి గత నెలరోజులుగా 34,468 ఫిర్యాదులందాయని వీటిని విశ్లేషించగా..70 శాతం సమస్యలను ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పరిష్కరించగా..మరో 30 శాతం సమస్యలను రెండురోజుల్లో పరిష్కరించినట్లు సర్వేలో తేలింది. శివార్లకు జలసిరులే... గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లపరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో 2500 కి.మీ మార్గంలో తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటుచేయడంతోపాటు మరో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను జలమండలి నిర్మించింది. ఇందులో ఇప్పటికే 40 రిజర్వాయర్లను ప్రారంభించారు. మరో 16 రిజర్వాయర్లను త్వరలో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుతో గ్రేటర్ పరిధిలో వెయ్యి కాలనీలు, బస్తీలకు దాహార్తి దూరమైంది. శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 50 లక్షల మందికి కన్నీటి కష్టాలు దూరమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అనుమతి లేని ఫిల్టర్‌ప్లాంట్ల నుంచి తాగునీటి కొనుగోలు చేసే అవస్థలు శివారువాసులకు తప్పడం విశేషం. 2020 వరకు తాగునీటికి ఢోకాలేదు ఇటీవలి భారీ వర్షాలకు గ్రేటర్దాహార్తిని తీరుస్తోన్న ఎల్లంపల్లి(గోదావరి), నాగార్జునసాగర్(కృష్ణా)జలాశయాల్లో నీటినిల్వలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో మహానగర తాగునీటికి మరో 2020 నాటికి ఢోకా ఉండదని భావిస్తున్నాం. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలోని 9.65 లక్షల నల్లాలకు నిత్యం 465 మిలియన్ గ్యాలన్ల నీటిని కొరతలేకుండా సరఫరా చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల మేరకు తాగునీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను చేపడుతున్నాం. జలమండలి తాగునీటి నాణ్యతకు ఇటీవలే ఐఎస్ఓ ధ్రువీకరణ కూడా లభించింది. ఇదే స్ఫూర్తితో ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామపంచాయతీలు, 7 నగరపాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.700 కోట్లతో చేపట్టిన ఓఆర్ఆర్ తాగునీటి పథకం పనులను ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తిచేసి శివార్లకు దాహార్తిని దూరం చేస్తాం. – ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ -
ఢిల్లీ వాసులకు న్యూ ఇయర్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నగరవాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. అసలే నీటికొరతతో ఇబ్బందులు పడే నగర ప్రజలను కొత్త సంవత్సరంలో మరింత ఆందోళనలో పడేసింది. నీటి వినియోగంపై పన్నులు పెంపు నిర్ణయానికి జల్‌బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నీటి వినియోగంపై భారీగా పన్నును విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం ఇకపై ఇంటికి నెలకు 20వేల లీటర్ల వినియోగ పరిమితి మించితే ఇక బాదుడు తప్పదు. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్న 20వేల లీటర్ల పరిమితి దాటితే 20శాతం పన్ను చెల్లించక తప్పదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, నెలకు 20,000 లీటర్ల వినియోగం టారిఫ్‌లో ఎటువంటి మార్పు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిమితికి మించి ఒక్క లీటర్ వినియోగం పెరిగినా మొత్తం వాడకంపై పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. -
ఐటీ సిటీలో ఇక నీళ్లకు రేషన్ తప్పదు!
దేశంలోనే ఐటీకి అతిపెద్ద కేంద్రంగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. ఇప్పటికే అక్కడి రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో బెంగళూరు సహా చుట్టుపక్కల పట్టణాల్లో త్వరలోనే నీళ్లకు రేషన్ విధానాన్ని అమలుచేసే అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరానికి నిరంతరాయంగా నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన 15 రోజులకే ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం. బెంగళూరు నగరంతో పాటు ఇతర పట్టణాలు కూడా కావేరీ జలాల మీదే ఆధారపడుతున్నాయి. ఇప్పటికే ఆ నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నీటి ప్రెషర్ తగ్గిపోతోందని, కాలుష్యం కూడా పెరుగుతోందని అంటున్నారు. మామూలు రోజుల్లో అయితే తెల్లవారుజామున 5.30 నుంచి మూడు గంటల పాటు నీళ్లు సరఫరా చేస్తారు. కానీ ఇప్పుడు ప్రెషర్ తక్కువ ఉండటంతో రెండు గంటలే ఇస్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూషన్ లైన్లకు చివర్లో ఉన్న వినియోగదారులకు తగినంతగా నీళ్లు అందడం లేదు. సరఫరా చేస్తున్న నీళ్లు కూడా చాలా మురిగ్గా ఉంటున్నాయని హెబ్బల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ జగదీష్ అన్నారు. బెంగళూరు వాటర్ బోర్డు అనధికారికంగా నీళ్ల రేషనింగ్ మొదలుపెట్టిందని అంటున్నారు. నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో నీళ్లకు డిమాండ్ పెరిగిందని, దానికితోడు బోర్‌వెల్స్ కూడా ఫెయిల్ కావడంతో కావేరీ జలాల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారని.. కానీ ఆ నదిలో నీళ్లు తగ్గడంతో ప్రెషర్ కూడా తక్కువైందని వాటర్ బోర్డు చైర్మన్ తుషార్ గిరినాథ్ చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాము రోజుకు 1300, 1350 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతానికి నగర అవసరాలకు తగినంతగా నీళ్లున్నాయని ఆయన అన్నారు. ఎక్కువగా బోర్ వెల్స్ మీద ఆధారపడిన ప్రాంతాలకు తాము నీళ్లు ఎక్కువ పంపుతున్నామని, అవసరమైన దాని కంటే ఎక్కువ నీళ్లు వెళ్తున్న ప్రాంతాలకు తగ్గించామని వివరించారు. అయితే.. రాబోయే రోజుల్లో మాత్రం నీటి సరఫరా బాగా తగ్గుతుందని వాటర్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లాలు కట్
సాక్షి, సిటీబ్యూరో: ఆరు నెలలుగా నల్లా బిల్లుల బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లా కనెక్షన్లను డిసెంబర్ 15లోగా తొలగించాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో పలు అంశాలపై బోర్డు డైరెక్టర్లతో సమీక్షించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన మల్కాజ్గిరి మంచినీటి పథకంలో భాగంగా మీటర్ల ఏర్పాటు, నూతనంగా కనెక్షన్ చార్జీల వసూలు తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రెవెన్యూ, ఫైనాన్స్, ఆపరేషన్స్, ప్రాజెక్ట్, రెవెన్యూ విభాగం డైరెక్టర్లతో కమిటీని నియమించినట్లు తెలిపారు. మల్కాజ్‌గిరిలో నీటిమీటర్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించినా స్పందన లేకపోవడంపై అధికారులను ఆరా తీశారు. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రధాన నగరంలో నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసే అంశం త్వరలో కొలిక్కి రానుందని చెప్పారు. మంచినీరు, మురుగునీటి పారుదల పైప్లైన్ల ఉనికిపై జీఐఎస్ మ్యాపుల తయారీ, హడ్కో నిధులతో శివార్లలో చేపట్టిన పైప్‌లైన్, స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణం పనుల తీరును సమీక్షించారు. నగరంలోని అన్ని మ్యాన్ హోళ్లను సత్వరం జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ఇరుకు వీధుల్లోకి వెళ్లేందుకు వీలుగా ప్రవేశపెట్టనున్న మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను సత్వరం రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సెక్షన్ల పునర్విభజనపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు రామేశ్వర్రావు, సత్యసూర్యనారాయణ, ఎల్లాస్వామి, రవీందర్‌రెడ్డి, అజ్మీరా కృష్ణ, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
మీటరు మాది బిల్లు మీది!
సాక్షి,సిటీబ్యూరో: నీటి మీటర్లు లేని నల్లాలకు అక్టోబర్ నుంచి రెట్టింపు బిల్లులు జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. మూడు నెలల్లోగా వినియోగదారులు దిగి రాకుంటే... బోర్డు ఖర్చుతో సొంతంగా మీటర్లు ఏర్పాటు చేసి.. దానికైన వ్యయాన్ని నెలవారీ నీటి బిల్లుతో కలిపి వారి నుంచే వసూలు చేయాలని యోచిస్తోంది. ఈ విధానం బెంగళూరులో అమలులో ఉంది. మహా నగరంలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లాలు ఉండగా.. సుమారు ఐదు లక్షల నల్లాలకు మీటర్లు లేవు. మురికివాడల్లో సుమారు 1.50 లక్షల నల్లాలు ఉన్నాయి. ఇవి పోను సమారు 3.50 లక్షల నల్లాలు గృహ, వాణిజ్య విభాగానికి చెందినవే. వీరంతా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లోగా సొంతంగా మీటర్లు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోని పక్షంలో బోర్డు రంగంలోకి దిగాలని సంకల్పించింది. ప్రతి నల్లాకు మీటర్‌ను ఏర్పాటుచేసి ఆ కనెక్షన్‌ను జియోట్యాగ్ చేయడంతో పాటు మీటర్ వ్యయాన్ని విడతల వారీగా (ఇన్స్టాల్మెంట్) నెల వారీ నీటిబిల్లుతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించింది. నష్ట నివారణపై దృష్టి ప్రస్తుతం నూతన నల్లా కనెక్షన్లు, నీటి బిల్లులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో జలమండలికి నెలకు సుమారు రూ.93 కోట్ల మేర రెవెన్యూ ఆదాయం సమకూరుతోంది. నెలవారీగా ఉద్యోగుల జీతభత్యాలు, సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి జలాల పంపింగ్‌కు వెచ్చించే మొత్తం, నిర్వహణ వ్యయాలు కలిపితే రూ.వంద కోట్ల పైమాటే. దీంతో నెలకు సుమారు రూ.10 కోట్ల నష్టాన్ని బోర్డు భరిస్తోంది. మరోవైపు నీటి సరఫరా నష్టాలు సుమారు 40 శాతం మేర ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు అంతర్గత సామర్థ్యాన్ని, రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించుకోవాలని నిర్ణయించింది. ప్రతి నల్లాకు మీటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా చేసే ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్క కట్టాలని భావిస్తోంది. తద్వారా నెలవారీ రెవెన్యూ ఆదాయాన్ని రూ.పది కోట్ల మేర రాబట్టవచ్చని బోర్డు వర్గాల అంచనా. -
స్పందన అంతంతే..!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 8.79 లక్షల నల్లాలకు నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనుకున్న జలమండలి సంకల్పానికి.. నెలరోజులుగా వినియోగదారుల నుంచి స్పందన నామమాత్రంగానే లభిస్తోంది. మహానగరంలో ప్రస్తుతం 1.69 లక్షల నల్లాలకు మాత్రమే నీటి మీటర్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి. మిగతా 7.10 లక్షల నల్లాలకు డాకెట్ సరాసరి(ఒక పైపులైన్కున్న నల్లా కనెక్షన్ల సగటు నీటి వినియోగాన్ని బట్టి) పేరుతో నీటి బిల్లులిస్తుండడంతో... వీధిలో తక్కువ నీటిని ఉపయోగించుకున్నవారికీ.. అధికంగా నీటిని వినియోగించుకుంటున్న వారికి ఒకే రీతిన బిల్లులు జారీ అవుతున్నాయి. ఈనేపథ్యంలో అన్ని నల్లాలకు మీటర్లు బిగించడం ద్వారా శాస్త్రీయంగా నీటి చుక్కను లెక్కగట్టి ఇటు వినియోగదారులకు.. అటు బోర్డుకు నష్టం కలగని రీతిలో బిల్లులు జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, లైన్మెన్లు, మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు నీటి మీటర్ల ఏర్పాటుపై జలమండలి ముద్రించిన కరపత్రం అందజేసి.. వినియోగదారుల్లో సరైన అవగాహన కల్పించడంలో విఫలమౌతుండడంతో ఈ ప్రక్రియ ప్రహాసనంగా మారుతోంది. మరోవైపు ఆగస్టు నెలాఖరులోగా నీటిమీటర్లు ఏర్పాటు చేసుకుంటే నీటిబిల్లులో 5 శాతం రాయితీ ప్రకటించినా ఈ ఆఫర్ వినియోగదారులను ఆకట్టుకోకపోవడం గమనార్హం. సెప్టెంబరు నెలాఖరులోగా మీటర్లు ఏర్పాటు చేసుకోనివారికి రెట్టింపు నీటి బిల్లులు జారీ చేస్తామని జలమండలి స్పష్టం చేస్తోంది. కాగా శివారు ప్రాంతాల్లో నాలుగు రోజులకోమారు నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాలకు చెందిన వినియోగదారులు మాత్రం నీటి మీటర్లు ఏర్పాటు చేసుకున్నా చేసుకోకపోయినా తమకు పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతుండడం గమనార్హం. అన్ని మీటర్లకు తూనికలు కొలతల శాఖ గుర్తింపుపై అనుమానాలు..? నగరంలో నీటిమీటర్లను విక్రయించేందుకు గతంలో జలమండలి యూరో, ఐఎస్ఐ ప్రమాణాలున్న 9 కంపెనీలను ఎంపిక చేసింది. అయితే ఆయా సంస్థలు తయారు చేస్తున్న పలు రకాల మీటర్లలో కొన్ని రకాల(మోడల్స్) మీటర్లకుSమాత్రమే తూనికలు కొలతల శాఖ ధ్రువీకరణ ఉందని, మరికొన్నింటికి లేవన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కానీ వినియోగదారులు మాత్రం ఈ తొమ్మిది కంపెనీలకు చెందిన మీటర్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు స్పష్టతనివ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. లేని పక్షంలో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు చేసిన పక్షంలో వినియోగదారులు బలిపశువులు అవుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి మీటర్లు దొరికే ప్రదేశాలివే... 1.గోషామహల్, ఖైరతాబాద్, నారాయణగూడ, ఎస్.ఆర్.నగర్, మారేడ్‌పల్లి, భాగ్యనగర్, ఎన్టీఆర్నగర్, సైనిక్‌పురి రిజర్వాయర్, బీరప్పగడ్డ రిజర్వాయర్(ఉప్పల్), బుద్వేల్ ఫిల్లింగ్ పాయింట్ల వద్ద నున్న జలమండలి కార్యాలయాల వద్ద నీటిమీటర్లు లభ్యమౌతాయి. మీటర్ రీడర్లు లేదా లైన్మెన్ల సహాయంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇతర వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.హైదరాబాద్‌వాటర్.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో సంప్రదించాలి. లేదా 155313 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌చేయాలని జలమండలి ప్రకటించింది. జలమండలి ఎంపిక చేసిన మీటర్ కంపెనీలివే.. ఒక్కో మీటరు ఖరీదు: మీటర్ రకాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2000 మధ్యన ఉంటుంది. మీటర్ కంపెనీ –సంప్రదించాల్సిన వ్యక్తి–మీటర్ల సైజు– మీటర్ రకం– ఫోన్ నెంబరు 1. డెక్కన్ పవర్ ప్రోడక్ట్స్ –సీతారామ్‌రెడ్డి–15, 20 ఎంఎం–బీ–మీటర్స్, జీఎన్డీ5– 9849008490 2. మాంటెక్ కన్స్ట్రక్షన్స్–పీసీరావు–15,20 ఎంఎం–జెన్నర్మైనో, మెన్ఈటీఎక్స్ –9866306233 3. దేశ్వాన్సిస్టమ్స్–ఎస్.జె.హెన్రీ–15ఎంఎం–ఎల్ష్టర్–ఎన్100– 8793336925 4. శ్రీరంగ్అకార్డ్జెవి–కపిల్కరియా–15,20ఎంఎం–ఎల్ష్టర్–ఎన్100– 09324646964 5. బట్రాన్–సంతోష్–15,20ఎంఎం–ఐల్ట్రాన్ యూనిమాగ్– 9392462798 6. భారత్ప్రిసిషన్–కుక్రెజా–15,20ఎంఎం–ఇన్ఫ్రెన్షియల్ టైప్– 09312273380 7. జనరల్వాటర్మీటర్–నరేష్చంద్ర–15,20ఎంఎం–చాంబెల్,మాగ్నటిక్– 040–24603591 8. భారతి ఇంజినీరింగ్వర్క్స్–వేణుగోపాల్–15,20ఎంఎం–జెన్నర్– 8099921242 9. గ్లోబల్వాటర్అండ్ ఎన్విరాన్మెంటల్–చైతన్య–15,20ఎంఎం–గ్లోబల్– 9490469750 -
నీటి సరఫరా వేళలు ఇక ఎస్ఎంఎస్లో
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక...నిత్యం టెన్షన్‌కు గురయ్యే వినియోగదారులకు శుభవార్త. నీటి వేళల వివరాలు ఇక నేరుగా మీ మొబైల్‌కే పంపేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఫలానా సమయంలో మీ ఇంట్లో నల్లా నీళ్లు వస్తాయని మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. తద్వారా నీటి కోసం వేచి చూడాల్సిన పని ఉండదు. మొదట ప్రయోగాత్మకంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని సుమారు 70 వేల మందికి నీటిసరఫరా జరిగే వేళలపై వారి సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఇదే తరహాలో నగరంలోని మిగతా 20 డివిజన్ల పరిధిలోని 8 లక్షల నల్లాలకు సైతం సెప్టెంబరు 15 నుంచి సంక్షిప్త సందేశాన్ని అందజేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు ఆయా వీధులకు నీటిని మళ్లించేందుకు వాల్‌్వను తిప్పిన సమయంలో ఆ వాల్వ్ పరిధిలో ఉన్న వినియోగదారులకు ఈ సమాచారం వారి ఫోన్లలో ఎస్ఎంఎస్ రూపంలో ప్రత్యక్షం కానుండడంతో వినియోగదారులకు ఇది మరింత సౌకర్యంగా ఉండనుంది. జీపీఎస్ సాంకేతికతతో ఎస్ఎంఎస్లు.... వినియోగదారులకు సంక్షిప్త సందేశం అందించేందుకు జలమండలి గ్లోబల్ పొజిషన్ సిస్టం(జీపీఎస్)సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లకు స్మార్ట్ఫోన్లను అందజేసి..అందులో ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకొని వాల్వ్ తిప్పేందుకు లైన్మెన్ వెళ్లినపుడు అతని ఫోన్లో ఆ వాల్వ్ నెంబరు ప్రత్యక్షమౌతుంది. ఆ నెంబరుపై అతడు నొక్కినపుడు ఆ సమాచారం జలమండలి కేంద్ర కార్యాలయంలో ఉన్న సర్వర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో ఆ వాల్వ్ పరిధిలో ఉన్న అందరు వినియోగదారులకు ఎస్ఎంఎస్ ద్వారా నల్లా నీళ్లు వస్తున్నాయన్న సమాచారం అందుతుంది. ఇదే సమాచారం క్షేత్రస్థాయి మేనేజర్ సెల్‌ఫోన్‌కు కూడా అందుతుంది. దీంతో ఒక ప్రాంతానికి అత్యధిక సరఫరా..మరొక వీధికి తక్కువ నీటి సరఫరా ఉండకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లైన్మెన్ల అక్రమాలకు చెక్... నీటిసరఫరాపై వినియోగదారులకు ఎస్ఎంఎస్ సందేశం అందించడం ద్వారా లైన్మెన్ల చేతివాటానికి చెక్‌పడనుంది. ఉన్నతాధికారులకు సైతం నీటి సరఫరా వేళలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుండడంతో డబ్బులు తీసుకొని ఒక ప్రాంతానికి అధికంగా..మరొక ప్రాంతానికి తక్కువ సమయం నీటిని సరఫరా చేయడానికి వీలుండదని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రయోగాత్మకంగా జల్‌యాప్ వినియోగం.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లకు నిత్యం వినియోగదారుల నుంచి వినపడే కలుషిత జలాలు..అరకొర నీటిసరఫరా, మూతలు లేని మ్యాన్‌హోల్స్ వంటి 9 రకాల సమస్యలపై జలమండలి రూపొందించిన జల్‌యాప్ ప్రయోగాత్మకంగా వంద మంది లైన్మెన్ల వద్దనున్న స్మార్ట్ఫోన్ల ద్వారా అమలు చేస్తున్నారు. జల్యాప్కు అందే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్కో క్షేత్రస్థాయి మేనేజర్‌కు రూ.2 లక్షలు నగదును అందజేయనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్‌ను నియమిస్తున్నామన్నారు. సెప్టెంబరు నెలలో జలమండలిలో పనిచేస్తున్న మూడువేల మంది లైన్మెన్ల చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లకు జల్‌యాప్ అందుబాటులోకి రానుందన్నారు. సెప్టెంబరు 15 నుంచి అన్ని నల్లాలకు... జలమండలి పరిధిలో ప్రస్తుతం 8.76 లక్షల నల్లాలున్నాయి. ప్రస్తుతానికి కూకట్పల్లి డివిజన్ ప్రాంతంలో సుమారు 70 వేల నల్లాలకు ఎస్ఎంఎస్ సందేశం అందుతోంది. మిగతా 8.06 లక్షల నల్లాలకు సెప్టెంబరు 15 నుంచి ఎస్ఎంఎస్ సమాచారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసంlమహానగర పరిధిలో మంచినీటి పైపులైన్లపై ఉన్న వాల్్వలను అవి ఉన్న అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జీపీఎస్ సాంకేతికతతో అనుసంధానిస్తున్నాం. దీంతోS బోర్డు రికార్డుల్లో నమోదైన వినియోగదారుల మొబైల్ నెంబర్లకు నీటిసరఫరా వేళలపై ఎస్ఎంఎస్ సందేశం అందనుంది. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
మళ్లీ అదే నిర్లక్ష్యం..
సాక్షి, సిటీబ్యూరో: మళ్లీ అదే నిర్లక్ష్యం.. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్‌హోల్‌లో దిగి నలుగురు కార్మికులు మృత్యువాత పడిన ఘోర దుర్ఘటనను మరువకముందే గురువారం సఫిల్‌గూడలో మరో నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. జలమండలి పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాల తీరును పరిశీలిస్తే పనులు చేపట్టిన సంస్థలు, గుత్తేదారులు కార్మికుల ప్రాణాల రక్షణకు భద్రతా చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే కారణంగా కనిపిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న మంచినీటి పైప్‌లైన్ జాయింట్లకు గ్యాస్ వెల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌పైప్ లీకై మంటలు వ్యాపించాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సాధారణంగా వెల్డింగ్‌కు ఉపయోగించే వాణిజ్య విభాగం గ్యాస్కిట్ (వెల్డింగ్ గ్యాస్కిట్) కాకుండా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌ను వినియోగించడమే ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మైల్డ్‌స్టీల్‌తో తయారు చేసిన ఈ భారీ పైప్‌లైన్‌కు జాయింట్ వేసే క్రమంలో కనీసం ఆక్సిజన్ సిలిండర్లు, అగ్ని నిరోధక దుస్తులు, బూట్లు, హెడ్‌లైట్, టార్చ్ వంటి ఉపకరణాలేవీ లేకుండా నేరుగా పైప్లైన్లోనికి కార్మికులను దించడంతోనే ప్రమాదం సంభవించినట్టు స్పష్టమవుతోంది. ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? జలమండలి పరిధిలో ఏటా సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు, నిర్వహణ పనులు జరుగుతుంటాయి. మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రూ.300 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇవి తుది దశకు చేరుకున్నాయి. పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థలు ఉపగుత్తేదారులకు ఇచ్చి పనులు చేపడుతున్నాయి. ప్రధాన ఏజెన్సీలు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 30 శాతం లాభం రాబట్టుకొని మిగతా మొత్తానికి సబ్ కాంట్రాక్టులిచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ప్రధాన ఏజెన్సీల పర్యవేక్షణ లేకపోవడం... నిపుణులతో అవసరమైన సలహాలు, సూచనలు అందించకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతుండడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో వైపు సబ్‌కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్లు తమ లాభం తగ్గుతుందనే భావనతో భద్రతా ఉపకరణాల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతుండడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఈ దుర్ఘటనకు కారణమైన కాంట్రాక్టర్లు, ప్రధాన ఏజెన్సీలు, పర్యవేక్షించని జలమండలి క్షేత్రస్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా ఉపకరణాలు లేకుండా కార్మికులను పనిలోకి దించడాన్ని నిరోధించాలని కోరుతున్నాయి. గాయాలపాలైన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. జీఎం సరెండర్ సఫిల్‌గూడ దుర్ఘటనకు బాధ్యులపై క్రిమినల్ కేసులు సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 13న మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్హోల్లోకి దిగి నలుగురు కార్మికులు మృతిచెందిన ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక అందేవరకు ప్రాజెక్టు విభాగం జనరల్ మేనేజర్(పీడీ–8) సుదర్శన్‌ను బోర్డు ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేసినట్లు జలమండలి ఎమ్డీ దానకిశోర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై జలమండలి శాఖాపరమైన విచారణ నివేదికలో పనులు చేపట్టిన జీఎస్కే సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిందన్నారు. అలాగే గురువారం సఫిల్‌గూడ వద్ద పైపులైన్ జాయింట్ వెల్డింగ్ పనుల్లో గ్యాస్‌పైపు లీకైన నలుగురు కార్మికులు గాయాల పాలైన ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎమ్డీ స్పష్టం చేశారు. కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం జలమండలి పరిధిలో నిర్వహణ, ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రధాన ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. -
జలమండలి నిధుల వేట..
సాక్షి, సిటీబ్యూరో: వివిధ ఆర్థిక సంస్థల నుంచి భారీగా నిధులు సాధించేందుకు జలమండలి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. మూసీ ప్రక్షాళన రెండోదశ, ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, ఔటర్ లోపలి గ్రామాలకు తాగునీటి సరఫరా, నగర శివార్లలో భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం వంటి పథకాలకు మొత్తంగా రూ.13 వేల 705 కోట్ల ఆర్థికసాయం అందించాలని వివిధ ఆర్థిక సంస్థలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సమర్పించింది. బుధవారం నగరంలోని ఓ హోటల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక సంస్థలు, బ్యాంకర్లతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఇందులో కొన్నింటికి ఆర్థిక సహకారం అందించేందుకు పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చినట్లు సమాచారం. ఇవీ ప్రతిపాదనలు.... పథకం ప్రాజెక్టు అంచనా వ్యయం(రూ.కోట్లలో) మూసీ ప్రక్షాళన రెండోదశ రూ.1200 శివార్లలో మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు,ఎస్టీపీల నిర్మాణం రూ.2867 ప్రధాననగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ రూ.1240 ఔటర్లోపలున్న 190 గ్రామాలకు నీటిసరఫరా రూ.628 శామీర్‌పేట్ కేశవాపూర్‌లో 20 టీఎంసీల స్టోరేజి రిజర్వాయర్ రూ.7770 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం : రూ.13,705 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మూసీ కష్టాలు తీర్చేందుకు రూ.1200 కోట్లు మూసీ ప్రక్షాళన రెండోదశలో భాగంగా 610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసి తిరిగి మూసీలో కలిపేందుకు పది మురుగు శుద్ధి కేంద్రాలు, రెండు రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఐదు ఎస్టీపీలతో 690 మిలియన్ లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధిచేస్తున్నారు. మూసీ ప్రక్షాళన రెండోదశ ప్రాజెక్టు సాకారమైతే కాలుష్యకాసారమైన మూసీకి మహార్థశ పట్టనుంది. శివార్ల మురుగు కష్టాలు తీర్చేందుకు రూ.2867 కోట్లు గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మురుగు నీటి పారుదల వ్యవస్థ(డ్రైనేజి) అందుబాటులో లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ఓపెన్‌నాలాలు,ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మురుగు నీరు మగ్గుతోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఆయా ప్రాంతాలు మురుగుకూపంగా మారుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని సుమారు వెయ్యి కాలనీలు,బస్తీల్లో డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు రూ.2867 కోట్లు అంచనా వ్యయం అవుతుందని జలమండలి ప్రతిపాదించింది. ప్రధాననగరంలో మురుగు అవస్థలకు రూ.1240 కోట్లు.. ప్రధాననగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ,తుప్పుపట్టి,దెబ్బతిన్న పైపులైన్ల స్థానే నూతన పైపులైన్ల ఏర్పాటు,ఉప్పొంగే మురుగు సమస్యలు తీర్చేందుకు రూ.1240 కోట్లు అవసరమౌతాయని నివేదిక సిద్ధంచేసింది. ఔటర్లోపలి గ్రామాల దాహార్తికి రూ.628 కోట్లు.. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న సుమారు 190 గ్రామాల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన రిజర్వాయర్లు,పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.628 కోట్లు అవసరమౌతాయని ప్రతిపాదించింది. కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7770 కోట్లు మహానగర దాహార్తిని తీర్చేందుకు నగర శివార్లలోని శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో 20 టీఎంసీల సామర్థ్యంతో గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు రూ.7770 కోట్లు అవసరమౌతాయని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో సీజన్లో ఒక్కసారి 20 టీఎంసీల గోదావరి జలాలను నిల్వచేస్తే విపత్కర పరిస్థితుల్లోనూ నగర తాగునీటి అవసరాలకు ఢోకా ఉండదని జలమండలి వర్గాలు తెలిపాయి. -
నీటిలో క్లోరిన్ ఎంతుంది?
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్, వీఐపీ ఘాట్‌లోని నీటిలో ప్రతి గంటకు ఒకసారి క్లోరిన్ శాతాన్ని వాటర్ బోర్డు సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. సీతానగరంలోని కృష్ణానది జలాలలో ప్రమాదకరమైన ఈ–కొలి బ్యాక్టీరియా ఉందనే కథనాలతో అప్రమత్తమైన వాటర్ బోర్డు సిబ్బంది ప్రతి గంటకు ఘాట్‌లోని నీటిని తనిఖీ చేస్తున్నారు. క్లోరిన్ కలపడం వల్ల నీటిలో వ్యాధికారకాలు నశిస్తాయి. సాధారణ స్థాయిలో క్లోరిన్ 0.5 పీపీ ఉండాల్సి ఉండగా, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో 1 పీపీ క్లోరిన్ ఉండేలా చూస్తున్నట్లు విశాఖపట్నం రీజనల్ పబ్లిక్ హెల్త్ వాటర్ ఎనలిస్టు పీ. వెంకటరమణ పేర్కొన్నారు. నీటిలో ఏ మాత్రం క్లోరిన్ శాతం తగ్గుముఖం పట్టినా వెంటనే పెంచుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం స్నాన ఘాట్లలో క్లోరిన్ బస్తాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంట..గంటకు నీటి తనిఖీలు: మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ (వన్‌టౌన్) : కృష్ణానదిలో నీటిని గంటగంటకు పరీక్షలు చేసి చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం దుర్గాఘాట్‌ను పరిశీలించారు. నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో నీటి నమూనాలను పరిశీలించారు. నీటి ప్రవాహం నిల్వ ఉంటేనే సమస్యలు ఉంటాయని, దుర్గాఘాట్‌లో నీటి ప్రవాహం 90శాతం ముందు కు వెళ్లిపోతూ ఉంటుందని ఎటువంటి ఇబ్బందులు ఉండవని సిబ్బంది వివరించారు. భక్తులకు వైద్య సౌకర్యాల గురించి, డ్వాక్రా స్టాల్స్‌ను పరిశీలించారు. అలాగే భక్తులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. -
ప్రజలకు జలమండలి బంపర్ ఆఫర్!
► నీటి మీటర్ ఏర్పాటు చేసుకుంటే 5 శాతం బిల్లు రాయితీ ► రూ.1 చెల్లిస్తే అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ ► ఆగస్టు 31 వరకు అందరికీ అవకాశం సాక్షి, సిటీబ్యూరో: నల్లా వినియోగదారులకు జలమండలి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30 లోగా తమ ఇంట్లోని నల్లాకు మీటర్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఏడాది పాటు నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ ప్రకటించింది. ఉదాహరణకుæనెలకు రూ.500 బిల్లు చెల్లించే గృహ వినియోగదారులు తమ ఇళ్లలో నీటి మీటర్ ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.25 చొప్పున రాయితీ పొందవచ్చు. ఈ లెక్కన ఏడాదికి రూ.300 ఆదా చేసుకోవచ్చు. నీటి బిల్లు అధికంగా చెల్లించేవారు ఈ ఆఫర్‌తో గరిష్ట ప్రయోజనం పొందనుండడం విశేషం. ఈ ఆఫర్‌తో నగరంలోని సుమారు మూడు లక్షలమంది వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆఫర్ ఆగస్టు ఒకటి నుంచి వచ్చే ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. మీటర్ల ఏర్పాటు దిశగా వినియోగదారులను ప్రోత్సహించిన లైన్మెన్లకు సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇక నీటి మీటర్ ఏర్పాటు చేసుకోని వినియోగదారులు రెట్టింపు నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తక్షణం మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ ఆగస్టు ఒకటి నుంచి మీటర్ రీడింగ్ సిబ్బంది నగరంలో 3 లక్షలమంది గృహ వినియోగదారులకు స్వయంగా నోటీసులు అందజేస్తారని తెలిపారు. నోటీసులకు స్పందించని వారి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. పేద కుటుంబాలకు రూ.1కే నల్లా క్రమబద్ధీకరణ బస్తీల్లో నివాసం ఉండే నిరుపేదల(బీపీఎల్కుటుంబాలు)కు కూడా జలమండలి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగిన వారు ముందుకు వచ్చి రూ.1 చెల్లిస్తే సదరు వినియోగదారుని నల్లాను(15 ఎంఎం పరిమాణం)48 గంటల్లోగా క్రమబద్ధీకరిస్తామని ఎండీ తెలిపారు. ఇటీవలే బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే నల్లా కనెక్షన్ జారీ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 24న జి.ఓ.ఆర్.నెం.372 ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు పదిలక్షల బీపీఎల్ కుటుంబాలుండగా..తొలివిడతగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని పేదలకు రూ.1కే నల్లా కనెక్షన్లను సైతం తక్షణం మంజూరు చేస్తామన్నారు. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు అందరికీ అవకాశం.. గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాలు కలిగిన వినియోగదారులకు తమ నల్లాల క్రమమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాలని జలమండలి ఫోకస్ గ్రూపు సమావేశం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సదరు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకురావాలని ఎండీ సూచించారు. లేకుంటే సదరు వినియోగదారులకు కనెక్షన్ ఛార్జీలు రెట్టింపు చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందించే ఉద్యోగులకు ప్రోత్సాహకాలివే.. అక్రమ నల్లాలపై సమాచారం అందించే పౌరులు, ఉద్యోగులకు అక్రమార్కుల నుంచి వసూలు చేసే కనెక్షన్ ఛార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకం అందిస్తామని ఎండీ తెలిపారు. అక్రమ నల్లాను గుర్తించిన బోర్డు లైన్మెన్లకు ప్రతి కనెక్షన్‌కు రూ.200 ప్రోత్సాహకం అందిస్తామన్నారు. -
నీటి మీటర్లు లేకుంటే కనెక్షన్ కట్
- అక్రమ నీటి కనెక్షన్లకు రెండింతల చార్జీలు హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని నీటి కనెక్షన్లు ఉన్న వారందరూ ఆగస్టు నుంచి తప్పని సరిగా నీటి మీటర్లు వాడాలని హైదరాబాద్ జలమండలి ఎండీ పేర్కొన్నారు. మీటర్లు లేని కనెక్షన్ దారులందరికీ ఆగష్టు లో నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నోటీసులో మీటర్లు దొరికే ఏజెన్సీ వివరాలు ఉంటాయన్నారు. నోటీసు అందిన నెలరోజుల్లో మీటర్లు పెట్టుకోకుంటే కనెక్షన్ కట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ కనెక్షన్ దారులు రెండు నెలలలోపు మీటర్లు పెట్టుకోవాలన్నారు. అక్రమంగా నీటి కనెక్షన్లు ఉంటే రెండింతలు చార్జీలు వసూలు చేస్తామన్నారు. -
100 రోజులు @ రూ.78.25 కోట్లు
జలమండలి వందరోజుల కార్యాచరణ! * ప్రణాళికలో మార్పులు చేయాలని మంత్రి సూచన.. * 18న మరోసారి సమావేశం సాక్షి,సిటీబ్యూరో: రాబోయే వేసవిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకుగాను వంద రోజుల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై రూ.78.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం సచివాలయంలో మున్సిపల్, ఐటీ,పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో జలమండలి ఎండీ జనార్దన్‌రెడ్డి, డెరైక్టర్లు సత్యనారాయణ, కొండారెడ్డి, రామేశ్వర్రావు, సత్యసూర్యనారాయణ, ఎల్లాస్వామి, శర్మ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఈ ప్రతిపాదనల్లో పలు మార్పులు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని మంత్రి సూచించారు. దీంతో ఈనెల 18న మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో చేపట్టనున్న పనులివే: ♦ శివార్లలో జంక్షన్ పనుల పూర్తి, నీటి సరఫరా పునరుద్ధరణకు:రూ.2.90 కోట్లు ♦ రిజర్వాయర్లు, వాల్వ్‌ల లీకేజీల నివారణకు:రూ.1.75 కోట్లు ♦ అదనంగా నీటి ఫిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు:రూ.50 లక్షలు ♦ రిజర్వాయర్ల శుద్ధికి:రూ.80 లక్షలు ♦ కలుషిత జలాల నివారణకు:రూ.3.75 కోట్లు ♦ అదనంగా ఎయిర్‌వాల్వ్‌లు, స్లూయిజ్వాల్వ్ల ఏర్పాటు:రూ.80 లక్షలు ♦ పంపులు, మోటార్ల మరమ్మతులకు:రూ.4 కోట్లు ♦ ప్రదర్శన బోర్డుల ఏర్పాటుకు:రూ.50 లక్షలు ♦ పైపులైన్లలో లీకేజీల నివారణకు:రూ.2 కోట్లు ♦ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల శుద్ధికి:రూ.90 లక్షలు ♦ విద్యుత్ మోటార్ల మరమ్మతులకు:రూ.5కోట్లు ♦ దెబ్బతిన్న మోటార్ల స్థానంలో నూతన మోటార్ల ఏర్పాటుకు:రూ.2 కోట్లు ♦ ట్రాంక్మెయిన్పైపులైన్లపై ఉన్న వాల్వ్‌ల మరమ్మతులకు:రూ.2కోట్లు ♦ కెపాసిటర్ల కొనుగోలుకు:రూ.1 కోటి ♦ బటర్‌ఫ్లై వాల్వ్‌ల కొనుగోలుకు:రూ.1.50 కోట్లు ♦ గోదావరి నీటిపథకంలో క్లోరినేషన్ ప్లాంట్ల ఏర్పాటు:రూ.50 లక్షలు ♦ నీటి నమూనాలు సేకరించే సిబ్బంది నియామకం:రూ.10 లక్షలు ♦ కృష్ణా,గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు:రూ.10 లక్షలు ♦ ఇంకుడు గుంతల నిర్మాణానికి:రూ.3 కోట్లు ♦ నూతనంగా నీటిమీటర్ల ఏర్పాటు:రూ.3 కోట్లు జలమండలి ప్రతిపాదనలివే..! ⇒ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధికి రూ.2.85 కోట్లు ⇒ రిజర్వాయర్లు, పైపులైన్ల లీకేజీల నివారణ, వాల్వ్‌ల మరమ్మతుకు: రూ.2.25 కోట్లు ⇒ సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాల్లో స్టాటిక్ ట్యాంకుల నిర్మాణానికి :రూ.1.20 కోట్లు ⇒ రిజర్వాయర్ల శుద్ధి,పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం:రూ.10.80 కోట్లు ⇒ కలుషిత నీటి సమస్య నివారణకు:రూ.3 కోట్లు ⇒ అదనంగా ఎయిర్‌వాల్వ్‌లు,స్లూయిజ్ వాల్వ్‌ల ఏర్పాటు:రూ. 75 లక్షలు ⇒ చేతిపంపులు, బోరుబావుల మరమ్మతులకు: రూ.1.50 కోట్లు ⇒ నీటిసరఫరా వేళల బోర్డుల ఏర్పాటుకు రూ.90 లక్షలు ⇒ మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ:రూ.1.08 కోట్లు ⇒ మ్యాన్‌హోళ్ల ఎత్తు పెంపునకు:రూ.1.35 కోట్లు ⇒ మురుగు సమస్యలు తలెత్తుతున్న ప్రాంతాల్లో అదనపు పైపులైన్ల ఏర్పాటుకు:రూ.2.70 కోట్లు ⇒ మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళన:రూ.2.07 కోట్లు ⇒ నూతన మ్యాన్‌హోళ్ల ఏర్పాటుకు:రూ.90 లక్షలు ⇒ సిల్ట్చాంబర్ల నిర్మాణానికి:రూ.90 లక్షలు -
వికారాబాద్‌కు మంజీరా
వికారాబాద్ పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందు కు తక్షణమే మంజీరా జలాలను విడుదల చేయాలని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బిల్లులు చెల్లించలేదని నీటి సరఫరాను నిలిపివేయడం సబబుకాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్కారు రక్షిత మంచినీటికి ప్రాధాన్యతనిస్తున్నందున.. పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో వికారాబాద్ శాటిటైట్ టౌన్షిప్ పనుల పురోగతిని ప్రజారోగ్య, వాటర్‌బోర్డు, మున్సిపల్ అధికారులతో మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షించారు. వికారాబాద్‌కు వెంటనే మంజీరా జలాల సరఫరాను ప్రారంభిస్తామని, ఏప్రిల్‌లోపు డిమాండ్‌కు అనుగుణంగా 5.4 ఎంజీడీల నీటిని పంపిణీ చే స్తామని వాటర్‌బోర్డు మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ స్పష్టం చేశారు. పైపులైన్ గుంతలు పూడ్చండి డ్రైనేజీ పనులను వేగిరంచేయాలని, పైపులైన్ల కోసం తవ్విన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చివేయడమేకాకుండా సీసీ రోడ్డు, అంతర్గత పనులను పూర్తిచేయాలని పురపాలక, ప్రజారోగ్య శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని, అసంపూర్తిగా ఉన్న పనులకు తుదిరూపు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కొరత లేదని, నిధుల ఇబ్బంది ఉంటే తన దృష్టికి తేవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు. స్థానిక శాసనసభ్యుడు సంజీవరావు మాట్లాడుతూ శాటిలైట్ టౌన్షిప్ పనులు నత్తనడకన సాగుతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం రెండో దశ నిధుల విడుదలకు కేంద్రం ముం దుకురావడంలేదని పేర్కొన్నారు. నిర్ణీత వ్యవధిలో తొలివిడత పనులు పూర్తి చేసినట్లయితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదన్నారు.మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీశ్వర్, జనరల్ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, పురపాలకశాఖ అడిషనల్ డెరైక్టర్ అనురాధ, ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ ఇంతియాజ్ అలీ, ఎస్ఈ యాదగిరి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జైతారాం, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి పరమేశ్వర్రావు ఉన్నారు. -
ముదురుదుతున్న కృష్ణా జలాల వివాదం
-
రంగంలోకి దిగిన కృష్ణా రివర్ బోర్డు
-
ఈనెల 8,9 తేదిల్లో కృష్ణా బోర్డు సమావేశం
-
'నీటిని విడుదల చేయండి'
-
త్వరలో వాటర్‌బోర్డులో ఖాళీల భర్తీ
హోంమంత్రి నాయిని వెల్లడి నగరంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచన పంజగుట్ట: మహానగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం,కార్మికశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి జలమండలి అధికారులు,కార్మికులను కోరారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన జనరల్ పర్పస్ ఎంప్లాయి(జీపీఈ)లు పదిమంది కార్మికులకునియామకపత్రాలు అందజేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. బోర్డులో 23 ఏళ్లుగా నానా ఇబ్బందులు పడుతున్న ఎన్ఎంఆర్,హెచ్ఆర్ కార్మికుల విధులను క్రమబద్దీకరించిన ఘనత బోర్డు గుర్తింపు కార్మికసంఘం గౌరవ అధ్యక్షుడు, సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుదేనని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీఠవేస్తున్నామని, సమ్మెలు, లాకౌట్లకు తావులేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ..బోర్డులో ఖాళీ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మంగళవారం నూతనంగా నియమితులైన సుమారు 600మంది ఎన్ఎంఆర్,హెచ్ఆర్ కార్మికులకు బోర్డు అధికారులు నియమాక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో జలమండ లి ఎండీ శ్యామలరావు, కామ్‌గార్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సతీష్‌కుమార్,ఈఎన్సీ సత్యనారాయణ ఉన్నతాధికారులు, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు పెద్దపీఠ: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని నాయిని ప్రకటించారు. పోలీసుశాఖకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు ఆధునిక ఆయుధాలతోపాటు గల్లీకో కెమెరా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.