న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో అక్కడి వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పక్క కరువుతో తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.
వాటర్‌ట్యాంకులు ఓవర్‌ఫ్లో అయినా, మంచి నీటితో కార్లు, ఇతర వాహనాలు కడిగినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా ఫైన్ కట్టాల్సిందేనని వాటర్ బోర్డు ప్రకటించింది. నీరు ఎక్కడ వృథా అవుతుందో పరిశీలించడానికి ఢిల్లీ వాటర్‌బోర్డుకు చెందిన 200 బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
వాణిజ్య సముదాయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఉన్న అక్రమ తాగునీటి కనెక్షన్‌లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment