బెంగళూరు: తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నబెంగళూరు నగరంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలపై వాటర్‌బోర్డు కన్నెర్ర చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.1లక్షలు వసూలు చేసింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, మొక్కలకు, ఇతర అత్యవసరం కాని వాటికి వాడతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా కుటుంబాలపై వాటర్‌బోర్డు చర్య తీసుకుంది.
కావేరి నీరు, బోర్ నీళ్లతో హోలీ వేడుకలు జరపడాన్ని వాటర్‌బోర్డు ఇప్పటికే నిషేధించింది. నగరంలోని పలు హోటళ్లు హోలీ వేళ రెయిన్ డ్యాన్స్ ఈవెంట్లు ప్రకటించంతోనే వాటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెయిన్ డ్యాన్సులు ఉంటాయని ప్రకటించిన హోటళ్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి.
కాగా, షాపులు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో నీటి వాడకాన్ని నియంత్రించేందుకుగాను ఎయిరేటర్స్‌ను వాడాలన్న నిబంధనను నగరంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ట్రీటెడ్ వాటర్‌తో చెరువులను నింపి తాగునీటిగా కాకుండా ఇతర అవసరాలకు వాటిని వాడేందుకు వాటర్ బోర్డు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇదీ చదవండి.. బీజేపీలో కేఆర్‌పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment