Water Waste
-
Bengaluru Water Crisis: నీటి వృథాపై వాటర్ బోర్డు కఠిన నిర్ణయం
బెంగళూరు: తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నబెంగళూరు నగరంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలపై వాటర్‌బోర్డు కన్నెర్ర చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.1లక్షలు వసూలు చేసింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, మొక్కలకు, ఇతర అత్యవసరం కాని వాటికి వాడతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా కుటుంబాలపై వాటర్‌బోర్డు చర్య తీసుకుంది. కావేరి నీరు, బోర్ నీళ్లతో హోలీ వేడుకలు జరపడాన్ని వాటర్‌బోర్డు ఇప్పటికే నిషేధించింది. నగరంలోని పలు హోటళ్లు హోలీ వేళ రెయిన్ డ్యాన్స్ ఈవెంట్లు ప్రకటించంతోనే వాటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెయిన్ డ్యాన్సులు ఉంటాయని ప్రకటించిన హోటళ్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. కాగా, షాపులు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో నీటి వాడకాన్ని నియంత్రించేందుకుగాను ఎయిరేటర్స్‌ను వాడాలన్న నిబంధనను నగరంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ట్రీటెడ్ వాటర్‌తో చెరువులను నింపి తాగునీటిగా కాకుండా ఇతర అవసరాలకు వాటిని వాడేందుకు వాటర్ బోర్డు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదీ చదవండి.. బీజేపీలో కేఆర్పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: సాంప్రదాయ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ఉపయోగించుకుని ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. నీటి వ్యర్థాల నిర్వహణలో ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నీటి వ్యర్థాల నిర్వహణపై హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను గవర్నర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటి వ్యర్థాల నిర్వహణ సమస్యల పరిష్కారానికి ఒక నిర్ధిష్టమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు. కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి రాజ్‌భవన్‌కు రావాలని విదేశీయులతో పాటు బారత ప్రతినిధి బృందాన్ని గవర్నర్ ఆహ్వానించారు. నీటి వ్యర్థాల శుద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ముంబైలో ప్రతి రోజూ 210 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయని, వాటి వల్ల వేలాది హెక్టార్లలో పంటలు పండటం లేదని చెప్పారు. భారత్‌లోని కాస్మోపాలిటన్ నగరాల్లో 3,600 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయని తెలిపారు. చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు కలుషితం కావడంతో 30–90 హెక్టార్ల సాగుభూమి ప్రమాదంలో పడుతోందని గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. నీటి వ్యర్థాల నిర్వహణపై తెలంగాణ పర్యావరణ పరిరక్షణ శిక్షణ, అధ్యయన సంస్థ, చికాగో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా వాటర్ మేనేజ్మెంట్ సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో «థాయ్‌లాండ్ ప్రతినిధి థానెట్, అమెరికా నుంచి కోన్లి ఎగ్గెట్, చికాగో ఎండబ్ల్యూఆర్డీ కమిషనర్ ప్రాంక్ అవీలా తదితరులు పాల్గొన్నారు. కల్యాణానికి రండి... యాదగిరిగుట్ట: ఈ నెల 26వ తేదీనుంచి ప్రారంభమయ్యే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4వ తేదీన నిర్వహించే శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణ వేడుకకు రావాలని కోరుతూ సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆలయ ఈఓ గీతారెడ్డి, ప్రధాన అర్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు కలసి ఆహ్వానపత్రిక అందజేశారు. -
‘మిషన్’కు లీకేజీ
కోమటి కుంట చెరువు తూము నుంచి నీరు వృథా పట్టించుకోని అధికారులు కమ్మర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అపహాస్యం పాలవుతున్నాయి. నాణ్యతలోపంతో పనులు చేపట్టడంతో అప్పుడే లీకేజీలు ఏర్పడుతున్నాయి. మానాల గ్రామ పరిధిలోని కోమటి కుంట చెరువు తూముకు లీకేజీ ఏర్పడడంతో నీరు వృథాగా పోతోంది. మొదటి విడత మిషన్ కాకతీయలో భాగంగా రూ. 35.68 లక్షలతో కోమటి కుంట చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. అధికార పార్టీ నాయకులు ఇద్దరు కలిసి పనులు చేశారు. అధికారులు సరిగా పనులను పరిశీలించలేదన్న ఆరోపణలున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరింది. మంగళవారం ఉదయం తూం నుంచి నీరు లీకయ్యింది. నీటిని నిలువరించడానికి రైతులు షెట్టర్‌ను కిందకు దింపే ప్రయత్నం చేశారు. బోల్ట్ పని చేయకపోవడంతో షట్టర్ కిందికి దిగలేదు. రైతులు తూములో గడ్డి, మట్టి ముద్దలను కుక్కి నీటి వృథాను అరికట్టారు. చెరువు అడుగు భాగం నుంచి షట్టర్ రాడ్లు నిర్మించలేదని రైతులు ఆరోపించారు. తలుపులకు బిగించిన బోల్టులు తిప్పినా బిగుసుకోవడం లేదన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. -
జనం బాధ జనాలది.. నాయకులేమో ఇలా..!
బాగల్కోట్: ప్రజలు కరువు, నీటి ఎద్దడితో అల్లాడిపోతుంటే.. నాయకులకు, అధికారులకు మాత్రం వారి బాధలు, సమస్యలు పట్టడం లేదు. పర్యటనల పేరుతో నీటిని వృథా చేస్తూ ప్రజలకు మరిన్ని కష్టాలు పెడుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క అలమటిస్తుంటే.. ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రి ఎక్నాథ్ ఖడ్సే హెలికాప్టర్ దిగేందుకు ఏకంగా 10 వేల లీటర్ల నీటిని వృథా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రకే చెందిన మరో మంత్రి పంకజా ముండే కరువు ప్రాంత పర్యటనకు వెళ్లి సెల్ఫీ దిగారు. మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పర్యటన వివాదాస్పదమైంది. ఉత్తర కర్ణాటకలోని కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధరామయ్య వెళ్లారు. సీఎం వెళ్లడానికి ముందు అధికారులు అత్యుత్సాహంతో భారీగా నీటిని వృథా చేశారు. సీఎం పర్యటించే మార్గంలో రోడ్లపై దుమ్ము లేస్తుందనే ఉద్దేశ్యంతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి రోడ్లపై చల్లించారు. ఈ సంఘటనపై ప్రతిపక్ష బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజలు కరువుతో అలమటించిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మంత్రులు విహారయాత్రకు యూరప్ వెళ్తున్నారని మండిపడ్డారు. నీటిని వృథా చేసిన విషయంపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.