అసలు మాత్ర‌మే చెల్లించండి: కేటీఆర్‌ | KTR Unveils The Poster Of The Water Board One Time Settlement Scheme | Sakshi
Sakshi News home page

అసలు మాత్ర‌మే చెల్లించండి: కేటీఆర్‌

Published Tue, Aug 11 2020 3:57 PM | Last Updated on Tue, Aug 11 2020 4:43 PM

KTR Unveils The Poster Of The Water Board One Time Settlement Scheme - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల​​ బకాయిలపై వడ్డీ మాఫీ చేశామని, కేవలం అసలు మాత్రమే చెల్లించాలని కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement