స్నేహితుడి కోసం... | mera dost movie songs release | Sakshi

స్నేహితుడి కోసం...

Aug 10 2019 5:13 AM | Updated on Aug 10 2019 5:13 AM

mera dost movie songs release - Sakshi

శైలజ, పవన్‌

పవన్, శైలజ  జంటగా జి.మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరాదోస్త్‌’. వి.ఆర్‌. ఇంటర్నేషనల్‌ పతాకంపై పి.వీరారెడ్డి నిర్మించారు. వి.సాయిరెడ్డి స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర పాటలను తెంగాణ వాటర్‌ బోర్డ్‌ చైర్మన్‌ వి.ప్రకాశ్, డిజిక్వెస్ట్‌ బసిరెడ్డి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ విడుదల చేశారు. జి.మురళి మాట్లాడుతూ– ‘‘డైనమిక్‌లాంటి అమ్మాయి ఒక బలహీనుణ్ని ప్రేమిస్తుంది. ఓ సందర్భంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. ఆ బలహీనుడి మిత్రుడైన హీరో... ఆ రాక్షసుడ్ని సంహరించి ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మేరాదోస్త్‌’.

వీరారెడ్డిగారు ఇచ్చిన సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మురళి చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాం. ‘మేరాదోస్త్‌’ అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు పి.వీరారెడ్డి. ‘‘సినిమా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. ఆరో తరగతి నుంచే సినిమాలు విపరీతంగా చూసేవాణ్ణి. అల్లాణి శ్రీధర్‌గారి వద్ద దర్శకత్వశాఖలో పని చేశాను. అనుకోనుకుండా రాజకీయాల్లోకి వెళ్లాను. ఆ తరుణంలోనే తెంగాణ  ఉద్యమం ప్రారంభం కావడంతో సినిమాకు దూరమయ్యాను. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది’’ అన్నారు వి.ప్రకాశ్‌. నిర్మాత సాయి వెంకట్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వి.సాయిరెడ్డి, కెమెరా: సుధీర్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement