shailaja
-
టీమిండియా స్టార్ అక్క.. ఈమె కూడా క్రికెటరే! (ఫొటోలు)
-
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్‌ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది కాల్‌మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా శైలజా టీచర్.. ప్రకటించిన సీపీఎం
తిరువనంతపురం: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తమకు పట్టు ఉన్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీసీఐ) పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగరు అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం) పార్టీ నేడు (మంగళవారం) 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఎంవీ గోవిందన్ లోక్‌సభలో పోటీచేసేవారి జాబితాను విడుదల చేశారు. ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన సీపీఎం.. మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో నాలుగు స్థానాలను ఇప్పటికే సీపీఐకి కేటాయించింది. గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా సేవలందించిన కేకే శైలజా(శైలజా టీచర్)ను సీపీఏం.. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించుతోంది. ఆమెకు వడకర లోక్‌సభ నియోజకవర్గాన్ని కేటాయించింది. థామస్ ఐజాక్ పతనంతిట్ట సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సీటును కేరళలోని కాంగ్రెస్(ఎం)కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలోని కొత్త మంత్రివర్గంలో కేకే శైలజకు మాత్రం చోటు దక్కలేదు. ఆమె రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ.. పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇక.. 2018లో ఆరోగ్య మంత్రిగా చేసిన సమయంలోనూ ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో కేకే శైలజా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీచేసే అభ్యర్థులు వీరే... అలప్పుజ - ఏఎం ఆరిఫ్ అలత్తూరు - కె. రాధాకృష్ణన్ అట్టింగల్ - వి. జాయ్ చాలకుడి - ప్రొఫెసర్ సి. రవీంద్రనాథ్ ఎర్నాకులం - కె.జె. షైన్ ఇడుక్కి - జాయిస్ జార్జ్ కన్నూర్ - ఎం.వీ జయరాజన్ కాసరగోడ్ - ఎం.వీ బాలకృష్ణన్ కొల్లాం - ఎం. ముఖేష్ కోజికోడ్ - ఎలమరం కరీం మలప్పురం - వి. వసీఫ్ పాలక్కాడ్ - ఎ. విజయరాఘవన్ పతనంతిట్ట - థామస్ ఐజాక్ పొన్నాని - కే.ఎస్. హంస వడకర - కె.కె.శైలజ ఇది కూడా చదవండి: కేరళ: నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
కబడ్డీ.. కబడ్డీ... గెలిచింది
40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ‘‘నా చిన్నతనం అంతా నాగపూర్‌లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు. హాఫ్ ప్యాంట్ ‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్‌గా నిలిచారు. కబడ్డీ క్లబ్లో చేరడంతో నా జీవితమే మారిపోయింది. మొదటి మార్పు నాగపూర్‌లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్‌కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్‌కి వెళ్లి, కోచ్‌తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్‌కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని. చీకటి దారుల గుండా.. ఇంటికి గ్రౌండ్‌కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్‌పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్‌కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్‌పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని. చిన్న చిన్న అవార్డులైనా... యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్‌ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్‌కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్‌ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది. పాఠశాల స్థాయి నుంచి... కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్‌ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్‌లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్‌ను వదలలేదు. డిప్రెషన్‌ను అధిగమించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్‌లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అంతర్జాతీయంగా అవకాశాలు... రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్‌గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్‌పోర్ట్‌పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్‌గా ఉంటూ నాన్‌వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్‌తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను. జకార్తా నుంచి భారత్‌కు జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్‌కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది. స్వదేశానికి... ‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్. -
చెప్పకుండా శైలజ దేశం దాటారు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ది భారీ కుంభకోణమని, ఈ కేసులో వేలాది చందాదారుల ప్రయోజనాలు కాపాడటం తమ బాధ్యత అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇంత పెద్ద స్కాంలో నిందితులుగా ఉన్న రామోజీరావు(ఏ–1), శైలజ (ఏ–2) దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడంలేదని తెలిపింది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పింది. దర్యాప్తు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులు చూపించడంలేదని తెలిపింది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శైలజ దేశం దాటి వెళ్లారని, అందుకే ఆమెపై లుక్ అవుట్ నోటీసులు (ఎల్వోసీ) జారీ చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే అమెరికా పర్యటనను సాకుగా ఎంచుకున్నారని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లలో ఏపీ సీఐడీ కౌంటర్లు దాఖలు చేసింది. అనంతరం వాదనలకు పిటిషనర్ల తరపు న్యాయవాది రెండు వారాల సమయం కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. కౌంటర్లో ఏపీ సీఐడీ వెల్లడించిన కీలక వివరాలు.. సొంత ప్రయోజనాల కోసం వేల కోట్లు మళ్లించారు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని 37 బ్రాంచ్‌ల్లో ఆ సంస్థ రూ.25 వేల నుంచి రూ.కోటి వరకు చిట్లు నడుపుతోంది. వీటిలో చందాదారులు పెద్దఎత్తున పెట్టుబడి పెట్టారు. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ, బ్రాంచ్ మేనేజర్లు వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని అక్రమ మార్గాల్లో సొంత సంస్థల్లోకి, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చందాదారులకు చెల్లింపుల్లో విఫలమయ్యారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, మోసం కిందికే వస్తాయి. మార్గదర్శి ఎండీ శైలజపై సీఐడీ ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు, కీలక ఆధారాలు తెలుసుకోవడానికి శైలజ విచారణ ప్రధానం. దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఆమె వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్ 6న విచారణలో ఆమె సహకరించలేదు. అంతేకాదు అధికారులు అడిగిన ఆర్థిక లావాదేవీల రికార్డులు, డాక్యుమెంట్లు తీసుకురాలేదు. ఆమెకు రాజకీయంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్న పరిచయాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసు్తన్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే చందాదారులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వేలాది చందాదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు శైలజను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరాల్సివచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 22న నోటీసులు జారీ చేశాం. కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఏప్రిల్ 27 నుంచి మూడు నాలుగు వారాలు హాజరుకాలేనని ఏప్రిల్ 23న సమాధానం ఇచ్చారు. అనంతరం మే 12న, మే 22న రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె నిరాకరించారు. ఆమె ఇంట్లోనే విచారణ చేపడతామని చెప్పినా అంగీకరించలేదు. అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఎక్కడా అమెరికా వెళ్తున్న విషయం చెప్పలేదు. ఆ సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచి ఉంచారు. విచారణలో సహకరించకపోవడం, నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, సమాచారం లేకుండా దేశం దాటి వెళ్లడం.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎల్ఓసీ జారీ చేయాల్సి వచ్చింది. శైలజ చర్యలు రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధం. బ్రాంచిలలో సోదాల సందర్భంగా అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై శైలజ నుంచి వివరణ తీసుకోవడం అత్యంత కీలకం. ఇంత పెద్ద ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు సాగుతుంటే.. విదేశాలకు వెళ్లడానికి ఆమె చెప్పిన కారణం ఓ సాకు మాత్రమే. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదు అని సీఐడీ కౌంటర్లో తెలిపింది. -
రామోజీ, కిరణ్, శైలజలపై ప్రాథమిక ఆధారాలున్నాయి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీపై ‘ఈనాడు’ పత్రిక ప్రచురిస్తున్న అసత్య, తప్పుడు కథనాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు న్యాయస్థానం స్పందించింది. ఈ ఫిర్యాదులో నిందితులపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించారని వెల్లడించింది. ఈ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో నన్నపనేని విశ్వప్రసాద్, హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఎం.నరసింహారెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసులు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు గుంటూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సీహెచ్.రాజగోపాలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 25న రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్‌లతో సహా మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు విచారణ మొదలవుతుంది. ఈనాడు తప్పుడు, విష కథనాలపై ఫిర్యాదు.. మార్గదర్శి అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీపై ఈనాడు వరుసగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇందులో సీఐడీపై పలు అసత్య, నిరాధార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఈనాడు, రామోజీరావు తదితరులపై గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగించింది. దీంతో గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 4న కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతోపాటు ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్ఐఆర్లు, రామోజీరావు, కిరణ్‌ల వాంగ్మూలం, శైలజా కిరణ్ రిమాండ్ రిపోర్టులు తదితరాలను అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి దీన్ని మరో న్యాయమూర్తికి పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సీహెచ్ రాజగోపాలరావు గురువారం విచారణ జరిపారు. సీఐడీ మనోస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు కథనాలు.. ఫిర్యాదుదారు తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారం చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేసిన తనిఖీల్లో ఆ సంస్థ అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయన్నారు. దీంతో వాటిపై చిట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సీఐడీ విచారణ మొదలు పెట్టిందన్నారు. సీఐడీ చట్టప్రకారమే నడుచుకుంటున్నా దాని మనో, నైతిక స్థైర్యాలు దెబ్బతీసేలా ఈనాడు యాజమాన్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని కోర్టుకు నివేదించారు. సీఐడీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఈనాడు ఇలా చేసిందన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ఈనాడు యాజమాన్యం చేస్తున్న పనులకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెడుతూ న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరువు, ప్రతిష్టలు ఎవరికైనా ఒకటేనని, వాటిని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ముందుకు రాకపోతే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలిపారు. ‘ప్రభుత్వాలను నిలబెట్టేది మేమే.. కూల్చేది మేమే’ అన్నట్లు ఈనాడు యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ఈనాడు తప్పుడు, విష కథనాల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. -
మార్గదర్శి కేసు: రామోజీరావుకు షాక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్‌లో మోసాలపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్‌తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్‌గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్‌లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్‌లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ! -
సీఐడీ విచారణకు రాలేమని రామోజీ, శైలజా కిరణ్ మెయిల్
-
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దూకుడును గురువారం మరింతగా పెంచింది. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా మళ్లింపు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ 2 చెరుకూరి శైలజాకిరణ్‌కు సహాయకారిగా వ్యవహరించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏడుగురు కీలక అధికారుల విచారణ చేపట్టింది. ఈ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏపీలోని చందాదారుల నిధుల అక్రమ మళ్లింపులో సాధనంలా వ్యవహరించారు. నిధుల మళ్లింపునకు చెక్‌పవర్ కలిగిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని వైస్ ప్రెసిడెంట్లు సీహెచ్ సాంబమూర్తి, రాజాజీ, పి.మల్లికార్జున రావు, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకట స్వామి, ఫైనాన్స్ జనరల్ మేనేజర్ టి.హరగోపాల్, జనరల్ మేనేజర్లు ఎల్.శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావును విచారించి ముఖ్యమైన ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం సంబంధిత బ్రాంచి మేనేజర్ (ఫోర్‌మెన్)కు చెక్ పవర్ ఉండాలి. కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో బ్రాంచి మేనేజర్లకు రూ.500 వరకు మాత్రమే చెక్ పవర్‌ను పరిమితం చేయడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్‌తో పాటు మరో 11 మందికి నిబంధనలకు విరుద్ధంగా చెక్ పవర్ కేటాయించి నిధుల అక్రమ బదిలీకి పాల్పడ్డారు. అందులో ప్రధాన భూమిక పోషించిన ఈ ఏడుగురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టడంతో పాటు వారి స్టేట్మెంట్ సీఐడీ నమోదు చేసుకుంది. ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో ట్విస్ట్.. రామోజీకి బిగుస్తున్న ఉచ్చు! -
సీఐడీ సోదాల్లో కీలక పత్రాలు హార్డ్ డిస్కులు
-
AP: మారదర్శి బ్రాంచ్‌లలో సీఐడీ విస్తృత సోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ లలో సీఐడీ విస్తృత సోదాలునిర్వహిస్తోంది. 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచిలలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచ్‌లలో సోదాలు జరుగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ లిమిటెడ్ అక్రమాలు, నిధుల దారి మళ్లింపుపై సీఐడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 గా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజ కిరణ్ ఉన్నారు. మార్గదర్శి అక్రమాలపై ఇప్పటికే రామోజీరావు, శైలజ కిరణ్లన సీఐడీ విచారించింది. ఈ విచారణలో వెలుగుచూసిన అక్రమాల ఆధారంగా సీఐడీ మరోమారు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గతంలోను తనిఖీలునిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కాగా.. డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించించిన విషయం తెలిసిందే. అలాంటిదేమీ లేని పక్షంలో ఆయా వివరాలు పూర్తిగా కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. చదవండి: డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి, రామోజీరావుకి సుప్రీంకోర్టు ప్రశ్న -
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్ 34, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
తల్లీ కూతురు హత్య.. వ్యక్తికి జీవితాంత ఖైదు
చిత్తూరు అర్బన్: తల్లీ, కూతురిని హతమార్చి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తికి మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్ మౌలాలి(47) అనే వ్యక్తి వృత్తిరీత్యా చెరువులను లీజుకు తీసుకుని చేపలు పట్టి విక్రయించే వ్యాపారం చేసేవాడు. మండలంలోని గిరిజన తాండాకు చెందిన సరళమ్మ(37)కు భర్త మరణించాడు. ఆమెతో మౌలాలి కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, తల్లి ఉన్నారు. సరళమ్మ వేరే మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెతో రాత్రి పొలం వద్ద గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఆమెను కర్రతో తలపై కొట్టాడు. ఆమె చనిపోవడంతో పెద్దేరు ప్రాజెక్టులో వేసేశాడు. శవం పైకి తేలకుండా చీరకు రాళ్లు కట్టిపడేశాడు. మరుసటి రోజు ఆమె తల్లి గంగులమ్మ తన కుమార్తె ఎక్కడని మౌలాలిని నిలదీసింది. నీ కుమార్తె ఉదయానికల్లా వస్తుందని నమ్మబలికాడు. ఆమెకు మద్యం అలవాటు ఉండడంతో మద్యం తెచ్చి ఇచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో చీరకొంగుతో గొంతుకు బిగించి చంపేశాడు. శవాన్ని ఓ చెరువులోకి తీసుకెళ్లాడు. శవం పైకి లేవకుండా ఆమె చీరను నీటిలోని ఓ చెట్టు మొదలుకు కట్టివేశాడు. ఆ మరుసటిరోజు సరళమ్మ కుమార్తెలు తమ అమ్మ, అవ్వ ఎక్కడని మౌలాలీని నిలదీశారు. వారికి కరోనా రావడంతో మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించానని వారిని నమ్మించాడు. వారితో కలసి అక్కడే పడుకునే వాడు. వారిలో పెద్ద అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితో చంపేస్తానని బెదిరించాడు. ఇలా నెల రోజులు గడిచాక ఆ పిల్లలు ముగ్గురిని కర్ణాటక గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. బంధువుల ఫిర్యాదు సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, కుమార్తె కనపడకపోవడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సయ్యద్ మౌలాలిని అరెస్టు చేసి.. బాలికలను అతడి నుంచి విడిపించారు. నిందితుడు చెప్పిన వివరాలతో చెరువులో పడున్న తల్లీ, కుమార్తె మృతదేహాలను బయటకు తీశారు. అతనిపై పలు హత్యలు, అత్యాచారం, అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువుకావడంతో.. అతను మరణించేంత వరకు జైల్లో ఉండాలని, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి సోమవారం తీర్పునిచ్చారు. బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచిస్తూ తీర్పులో పేర్కొన్నారు. -
తవ్విన కొద్దీ... ‘చీట్స్’
సాక్షి, అమరావతి: సోదాలు చేస్తున్న కొద్దీ అక్రమాల పుట్టగా బయటపడుతున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో అరెస్టులకు తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు... నలుగురు బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసి ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే ఏ1గా రామోజీరావును, ఏ2గా చెరుకూరి శైలజను, ఎ3గా బ్రాంచి మేనేజర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సీఐడీ... ఫోర్మన్లుగా పిలిచే కామినేని శ్రీనివాసరావు (విశాఖ– సీతమ్మధార బ్రాంచి), సత్తి రవి శంకర్ (రాజమండ్రి), బి.శ్రీనివాసరావు (విజయవాడ– లబ్బీపేట), గొరిజవోలు శివ రామకృష్ణ (గుంటూరు)లను అరెస్టు చేసి ఆయా ప్రాంతాల్లో న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు. వీరిలో కొందరికి 24 వరకూ రిమాండు విధించారు. ఈ సందర్భంగా వెలుగుచూసిన అక్రమాలు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిట్ సభ్యుల స్థానంలో వేల చిట్లలో తమ పేరే రాసేసుకున్న మార్గదర్శి సంస్థ... నిబంధనల మేరకు దానికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు!!. చిట్లలో తనకు వచ్చే కొద్ది పాటి డిస్కౌంట్ల మొత్తాన్నే దాదాపు అన్ని చిట్లలోనూ డూప్లికేట్ చేసి చూపించి... దాన్నే తమ సొమ్ముగా పేర్కొనటంతో, ఇదంతా పచ్చి “గొలుసు’ వ్యవహారంగా మారిపోయింది. గొలుసులో ఏ చిన్న లింకు తెగినా... ఇది సంస్థ దివాలాకు దారితీసే ప్రమాదముంది. అదే జరిగితే చిట్ సభ్యుల సొమ్ము వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు చిట్లలకు వేర్వేరు బ్యాంకు ఖాతాలను నిర్వహించాల్సి ఉండగా... అన్నిటికీ ఒకే ఖాతాను నిర్వహిస్తూ వాటిలో డబ్బును ఇష్టం వచ్చినట్టుగా మళ్లించటం కూడా విస్మయం కలిగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో గ్రూపు సంస్థల్లోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తుండటంతో పాటు... హైరిస్క్ ఉండే మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి కూడా ఈ ఖాతా నుంచి చిట్ సభ్యుల సొమ్మును మళ్లించటం గమనార్హం. వీటన్నిటితో పాటు... చట్ట విరుద్ధ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థను మూసేసినా డిపాజిట్లు తీసుకోవటం మాత్రం రామోజీరావు ఆపలేదని తాజా సోదాల్లో వెల్లడయింది. చిట్ సభ్యుల నుంచి అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటూ... బ్యాంకుల్లో అయితే వాటిపై టీడీఎస్ (ఆదాపు పన్ను) చెల్లించాలని, తమ దగ్గరైతే అలాంటిదేమీ ఉండదని నమ్మబలుకుతుండటం మోసాలకు పరాకాష్టగా అధికారులు చెబుతున్నారు. ఆ అక్రమాల వివరాలివీ... ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు సాధారణంగా ప్రతి చిట్కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని 27, 32 సెక్షన్లలో నిర్దేశించిన ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. కానీ వాటికోసం మార్గదర్శి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలించి కొన్ని గ్రూపుల్లో చిట్ల సభ్యులు తమ చందా చెల్లించలేకపోతే... ఇక మిగతా వాళ్లకు చిట్లు పాడుకున్నా సరే డబ్బులు రావటం కష్టం. ఎందుకంటే కంపెనీ పేరిట ఉన్న వేటికీ డబ్బులు లేవు కాబట్టి!!. ఇదిగో ఉదాహరణ.... ఎంసీఎఫ్ గుంటూరు బ్రాంచిలో 45 గ్రూపుల చిట్టీలు వేశారు. వాటిలో మొత్తం 2,040 టికెట్లు (చందాదారులు) ఉన్నాయి. 858 టికెట్లు మార్గదర్శివే. వాటి చందాగా మార్గదర్శి రూ.16.96 కోట్లు చెల్లించాలి. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని బ్రాంచి మేనేజర్(ఫోర్మేన్) అంగీకరించారు. కేవలం రికార్డుల్లో ఎంట్రీలను అటూ ఇటూ జంబ్లింగ్ చేసి చూపిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మొత్తంగా 2,300 చిట్టీలను నిర్వహిస్తోంది. వాటిలో లక్షమందికిపైగా చందాదారులున్నారు. వాటిలో కొన్ని వేల టికెట్లు మార్గదర్శివే. కానీ సంస్థ యాజమాన్యం తన వాటాగా ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. గొలుసు కట్ట మాదిరిగా ఒక చిట్ సొమ్మును వేరే చోట సర్దుబాటు చేస్తూ... కొందరికి ష్యూరిటీల పేరిట ఆలస్యం చేస్తూ... మరికొందరికి డిపాజిట్ల పేరిట తరవాత ఇస్తామని చెబుతూ రోజులు నెట్టుకొస్తోంది. అదీ కథ. ఒక్క బ్యాంకు ఖాతా చాలట!! చిట్‌ఫండ్ సంస్థలు తమ నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. చిట్టీల ఒప్పందాల్లో బ్యాంకు పేరును చెబుతోంది తప్ప ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఇవ్వటమే లేదు. ప్రతి చిట్టీకీ ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాల్సి ఉండగా... దాన్నీ పాటించటం లేదు. అన్నీ ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా పోగేస్తోంది. నిజానికిదో పెద్ద ఆర్థిక కుట్ర. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై సదరు బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే అన్నీ చూడాలి. కానీ మార్గదర్శిలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ లేదు. అంతా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచే నడిపిస్తున్నారు. అక్కడ ఒకరికే చెక్ పవర్ కల్పించడం వెనుక గూడుపుఠాణి ఏమంటే... ఆ ఖాతా నుంచి నిధులు మళ్లించటం ఈజీ కనక. మ్యూచువల్ ఫండ్స్, ఇతర స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం నేరమైనా... మార్గదర్శి చేస్తున్నది అదే. తమ గ్రూపు సంస్థ ఉషోదయ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.5శాతం వాటాను మార్గదర్శి చిట్స్ కొనుగోలు చేసింది. ఇతర సంస్థల్లోకీ అక్రమంగా నిధులు మళ్లించింది. హైరిస్క్ ఉన్న వీటిలో పెట్టుబడులు పెడుతున్నట్లు చందాదారులకు కనీసం తెలియకుండా... దశాబ్దాలుగా రామోజీ సాగిస్తున్న ఆర్థిక దోపిడీ ఇది. డిపాజిట్లు సేకరించటం నేరమే అయినా... చిట్టీ పాడిన చందాదారుడికి చిట్టీ మొత్తం చెల్లించినట్టుగా చిట్స్ రిజిస్ట్రార్‌కు చూపిస్తున్న మార్గదర్శి... ఆ చందాదారుడికి పూర్తిగా చెల్లించకపోవటం గమనార్హం. ష్యూరిటీలు సరిగా లేవన్న కారణాలతో పలువురు చందాదారుల నుంచి ఫ్యూచర్ సెక్యూరిటీ పేరిట మిగిలిన కాలానికి చెల్లించాల్సిన చందాను తమ వద్దే ఉంచుకుంటున్నారు. దానికి ఓ రశీదు ఇస్తున్నారు. దానిపై 4–5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇలా డిపాజిట్లు సేకరించటం చట్టప్రకారం నేరం. రామోజీ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. దానికి ఇదిగో ఉదాహరణ... ఒకే వ్యక్తి నుంచి రూ.కోటికిపైగా అక్రమ డిపాజిట్లు మార్గదర్శిలో ఓ చందాదారునికి 24 చిట్టీలున్నాయి. ఆయన నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ “రశీదు’ రూపంలో రూ.కోటికుపైగా డిపాజిట్టు వసూలు చేసింది. దీనిపై ఆ సభ్యుడిని విచారించగా విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. టీడీఎస్ మినహాయించుకోకుండా తాము డిపాజిట్లు సేకరిస్తున్నామని మార్గదర్శి చిట్స్ తనకు చెప్పిందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాలి. అదే మార్గదర్శిలో అయితే టీడీఎస్ అవసరం లేదని చెప్పి ఆయన్ని ఆకర్షించారు. ఇది ఆర్బీఐ నిబంధనల ప్రకారం నేరం. నిజానికి గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఎలాంటి అనుమతులూ లేకుండా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేశారు. దీన్ని నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టడంతో కేసులు నమోదయ్యాయి. విచిత్రమేంటంటే కేసులు కొనసాగుతుండగా... నేరాన్ని కప్పిపుచుకోవటానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను రామోజీరావు మూసేశారు. ఇలా డిపాజిట్లు సేకరించటం ఐటీ చట్టం ప్రకారం నేరం. ఎంత సేకరిస్తే అంత మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ఈ మేరకు ఐటీ కూడా రామోజీకి నోటీసులు జారీ చేసింది. దానిపైనా పలు కేసులు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో సంస్థను కుట్రపూరితంగా మూసేయటమే కాక... ఇపుడు చిట్స్ ముసుగులో రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరిస్తుండటం గమనార్హం. మేనేజర్ల పేరిట మరో పన్నాగం... (బాక్స్) – తన అక్రమాలకు వారిని బలి చేసే కుతంత్రం – న్యాయస్థానాన్నీ తప్పుదోవపట్టించేందుకు యత్నం అవినీతి బాగోతం బయటపడే సమయంలో దానికి సాంకేతిక కారణాలు చూపించి తప్పించుకోవటంలో రామోజీది అందెవేసిన చెయ్యి. అదే తరహాలో చిట్స్ విషయంలోనూ ఈ ఉల్లంఘనలన్నింటినీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్‌మెన్) నెత్తిన రుద్దీ తప్పించుకునే దుర్మార్గానికి తెరతీశారు రామోజీ. కానీ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఈ కేసును శాస్త్రీయంగా అధ్యాయనం చేసి... తగిన ఆధారాలు సేకరించడం ద్వారా రామోజీ ఎత్తును చిత్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు బయటపడగానే రామోజీరావు తన ఈనాడు పత్రికలో అరపేజీ ప్రకటన ఇచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలు బ్రాంచి మేనేజర్లే(ఫోర్‌మెన్) మాత్రమే చూస్తారు ...సర్వాధికారాలు వారివేనని అందులో పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో అదే మాట చెప్పారు. తద్వారా బ్రాంచి కార్యాలయాల్లో అక్రమాలతో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. కానీ స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ విభాగాలు రామోజీరావు కుట్రను సమర్థంగా తిప్పికొట్టాయి. ఎందుకంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు కేవలం నిమిత్త మాత్రులు. వారికి తమ బ్రాంచిలోని ఖాతాలకు సంబంధించి కనీసం చెక్ పవర్ కూడా లేదు. అంటే వారికి సర్వాధికారాలు ఉన్నాయని రామోజీ ఇచ్చిన ప్రకటనలో గానీ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో గానీ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది స్పష్టమైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అన్ని అక్రమాలకు రామోజీరావు, ఆయన కోడలు శైలజే పూర్తి బాధ్యులనేది సుస్పష్టం. -
స్వరాల పుస్తకం
అది బెంగళూరు నగరం జయనగర్... నిత్యం సప్తస్వరాలు పలికే ఓ రాగాలయం... ఆ గాననిలయం గాయని శైలజాపంతులు నివాసం. కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారం... ప్రసిద్ధగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు... లెక్కకు మించిన సత్కారాలు... కన్నడనాట తెలుగు గాయనికి అందుతున్న గౌరవం. గాత్రసేవలో తరిస్తున్న స్వరాల పుస్తకం ఆమె. ఆమె సంగీత ప్రస్థానం... ఆమె మాటల్లోనే... ‘‘మా ఇంటికి వచ్చిన వాళ్లు ‘ఇంట్లో సప్తస్వరాలతోపాటు త్రిమూర్తులు కూడా వెలిశారు’ అనీ, ‘ఇల్లు దశావతారాలకు ప్రతిబింబంగా ఉంది’ అనీ జోకులేసేవారు. ముగ్గురు అబ్బాయిలు. ఏడుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. నాకు మా మేనత్త పోలికలతోపాటు ఆమె స్వరం కూడా వచ్చిందని గుర్తు చేసుకునే వారు నాన్న. స్కూల్లో ప్రార్థనాగీతాలు, బృందగానాలు ఇష్టంగా పాడేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న నాకు, చిన్నక్క రమాదేవికి సంగీతంలో శిక్షణ ఇప్పించడానికి తనవంతుగా మంచి ప్రయత్నమే చేశారు. మా ఊరు చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోట. బెంగళూరు నుంచి మాస్టారు వారాంతాల్లో మా ఊరికి వచ్చి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. వెంకటేశ్ భాగవతార్ మాస్టారు ప్రతివారం రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమైంది. తొలుత ఏకలవ్య శిష్యరికం నేను ప్రఖ్యాత గాయని ఎమ్ ఎల్ వసంతకుమారి శిష్యురాలిని, ఏడేళ్లు ఆమె దగ్గరే ఉండి శుశ్రూష చేసి చదువుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. ఆడపిల్లలు ఇంటి ఆవరణ దాటడానికి కూడా ఇష్టపడని సంప్రదాయ కుటుంబం మాది. అలాంటి రోజుల్లో అన్నయ్య నరేంద్రరావు చొరవ తీసుకుని నాన్నని ఒప్పిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేయించాడు. అక్క, నేను ఎమ్ఎల్ వసంతకుమారి గారికి ఏకలవ్య శిష్యులం. ఇంట్లో రోజూ ఆమె పాటల క్యాసెట్ పెట్టుకుని సంగీత సాధన చేసేవాళ్లం. అలాంటిది ఆ గాయని ఓ రోజు రిషివ్యాలీ స్కూల్‌కి వస్తున్నట్లు సమాచారం తెలిసి అన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్లి ఆమెను చూపించాడు. అప్పుడు ఆమె దగ్గర సంగీతం నేర్చుకోగలననే ఆలోచన నా ఊహకు కూడా అందలేదు. దేవుడు సంకల్పించినట్లుగా ఆమె ఓ రోజు వైద్యం కోసం మా మేనమామ క్లినిక్‌కి వచ్చారు. అప్పుడు మా మామ ఆమెను రిక్వెస్ట్ చేయడం, ఆమె వెంటనే రిషి వ్యాలీ స్కూల్లో చేర్పించమని చెప్పడం జరిగిపోయాయి. చేరడం వరకు సులువుగానే జరిగింది. కానీ అక్కడికి వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో క్లాసులు. మా ఊరి నుంచి ‘అంగళ్లు’ అనే ఊరి వరకు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి రిషివ్యాలీ చేరేవాళ్లం. ఆ స్కూల్లో తెలుగు మాస్టారు రామచంద్రరావు గారు మా దూరపుబంధువు. వారింట్లో ఉండి సంగీతం నేర్చుకోవడం, సోమవారం ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి రావడం. ధర్మవరం కాలేజ్‌లో ఇంటర్ చదువు... ఈ దశలో చదువు సరిగ్గా సాగలేదు. ఇదిలా ఉండగా అక్కకు పెళ్లయి బెంగుళూరుకు వెళ్లిపోయింది. ఇక నాది ఒంటరి పోరాటమే అయింది. ఇంట్లో వాళ్లు చదువు లేదా సంగీతం ఏదో ఒకటి మానిపించాలనే ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు నేను ‘ప్రైవేట్‌గా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటాను’ అని మొండిగా పట్టుపట్టాను. అలా మా గురువుగారు వసంతకుమారి గారింటికి చేరాను. ఏడేళ్లు అక్కడే ఉండి గురు శుశ్రూష చేశాను. ఆమె శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ ఆమె జతతో కచేరీల్లో పాల్గొంటూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేశాను. వరుడి కోసం వేట మా అన్న మద్దతు అక్కడితో ఆగిపోలేదు. నాకు వరుడిని వెతికే పనిని ఒక యజ్ఞంలా చేశాడు. నా పెళ్లి నాటికి నాన్న లేరు, బాధ్యతంతా అన్నయ్య దే. సంగీతం విలువ తెలిసిన కుటుంబం అయితేనే నా సాధన కొనసాగుతుందనే ఉద్దేశ్యంతో సంగీతం వచ్చిన వరుడి కోసం గాలించాడు. అలా... బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో మృదంగవాద్యకారుడికిచ్చి పెళ్లి చేశారు. మా వారు రఘుపంతులుకి సొంత వ్యాపారం ఉంది. కానీ సంగీతం పట్ల ఆయనకు అపారమైన ఇష్టం, గౌరవం. అలా పెద్ద సంగీత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లల పెంపకంతో నాకు సంగీత కచేరీలకు పదేళ్లు విరామం వచ్చేసింది. అప్పుడు మావారు పిల్లల పనులకు సహాయకులను నియమించుకుని సంగీత సాధనకు వెసులుబాటు చేసుకోమని సూచించారు. రాగాల పరిశోధన సంగీతం ఆహ్లాదకారకం మాత్రమే కాదు, దివ్యమైన ఔషధం కూడా. ఇది నిరూపణ అయిన వాస్తవమే, కానీ ఏ రాగంతో ఏ అనారోగ్యం నుంచి సాంత్వన కలుగుతుందోనని స్వయంగా శోధించి తెలుసుకున్నాను. బీపీ, డయాబెటిస్, ఒత్తిడి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నేచర్ క్యాంపులు పెట్టి ప్రకృతి ఒడిలో రాగాలాపన చేస్తాం. మెంటల్ హెల్త్ విభాగానికి మానసిక సమస్యలకు సాంత్వన కలిగించే మ్యూజిక్ థెరపీ ప్రాజెక్టు సిద్ధం చేసిచ్చాను. ప్రఖ్యాత వాగ్గేయకారుడు పురందరదాసు చెప్పినట్లు సంగీతజ్ఞానం ప్రతి ఇంట్లో ఉండాలనేదే నా ఆకాంక్ష. సంగీతం అనే ఔషధసేవనం చేసే వాళ్లకు అనేక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. లెక్కకు మించిన అవార్డులు అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు అందుకోవడంతో నా జన్మధన్యం అయింది. సంగీతం కోసం ఇంకా ఇంకా సేవ చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గురుకులాన్ని ప్రారంభించాలనేది తదుపరి లక్ష్యం. నేను మొదలుపెడితే మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారు’’ అన్నారు శైలజాపంతులు. సరిగమల గ్రాఫ్ సంగీతంలో జూనియర్, సీనియర్ విద్వత్తు కోర్సు చేశాను. సంగీత సాధన కోసమే ఇంట్లో ఒక గదిని కేటాయించుకుని చాలా తీవ్రంగా సాధన చేసి గ్రాఫో టెక్నాలజీకి రూపకల్పన చేశాను. నాకు డాక్టరేట్ వచ్చింది ఈ సర్వీస్‌కే. సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉండే విధానం అది. నా మనుమరాలు నాలుగేళ్ల ‘పూర్వి’ కూడా గ్రాఫ్ చూస్తూ పాడేస్తుంది. గ్రాఫో టెక్నాలజీతో సంగీత పాఠాల పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. సంగీతం కోసం తీవ్రంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి 2001లో ... అత్తమామల పేర్లు, తిరుమల బాలాజీ పేరు వచ్చేటట్లు శ్రీవెంకట్ మ్యూజిక్ అకాడమీ స్థాపించాను. ఒక్క స్టూడెంట్‌తో మొదలైన అకాడమీలో ఇప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు సంగీత సాధన చేస్తున్నారు. వాళ్లకు నేర్పించడం కోసం రోజుకు ఐదారు గంటల సేపు నేను కూడా పాడతాను. – డాక్టర్ శైలజాపంతులు, ప్రసిద్ధగాయని, బెంగళూరు – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం
కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో సిక్కోలుకు ఓ మైలురాయి చూపించారు. మళ్లీ ఆ గమ్యాన్ని అందుకోగల వారి కోసం ఎదురు చూస్తుంటే.. అందరికీ కనిపించిన ఆశా కిరణం పూజారి శైలజ. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ప్రతిభావంతురాలి ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఫామ్ కోల్పోవడం, డోపింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం, నిషేధం పూర్తయ్యాక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆమె సాధించిన విజయాలు మరుగున పడిపోయాయి. ఎట్టకేలకు ఆమెకు వైఎస్ జగన్ సర్కారు న్యాయం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగుర వేసిన శైలజకు శాప్‌లో కోచ్‌గా ఉద్యోగం ఇచ్చింది. శ్రీకాకుళం న్యూకాలనీ: పదేళ్ల కిందటి వరకు పూజారి శైలజ అంటే ఓ పాపులర్ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్‌లో కాంస్య పత కం సాధించిన కరణం మల్లేశ్వరికి సరితూగే క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్, జూనియర్ ఏషియన్ గేమ్స్ వంటి పోటీల్లో బంగారు పతకాలతో మోత మోగించారు. ఆ తర్వా త ఎందుకో ఆటలో ఆమె వెనుకబడిపోయారు. దీనికి తోడు అనూహ్యంగా డోపింగ్ ఆరోపణలతో జీవితం తల్లకిందులైపోయింది. శైలజపై ఉన్న బ్యాన్ (నిõÙధం) ఎత్తేసినా ఆమె పరిస్థితి మాత్రం మారలేదు. అంతకుముందు ఉన్న గుర్తింపు మొత్తం తుడి చిపెట్టుకుపోయింది. గత ప్రభుత్వ పెద్దల ముందు కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకు న్యాయం చేశారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌గా నియమించారు. దీంతో తన నిరీక్షణ ఫలించిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెత్తిపై డోపింగ్ బరువు.. 2006 కామన్ వెల్త్ అనంతరం క్రీడాకారులకు జరిపిన డోపింగ్ పరీక్షల్లో పూజారి శైలజ పాజిటివ్ అని తేలడంలో ఆమె ఆట తలకిందులైంది. అయితే తా ను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఫెడరేషన్ ముందు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. జీవితకాలంలో నిషేధం విధించారు. వాస్తవానికి గేమ్‌లో జీవితకాల నిషేధమంటే ఏడేళ్లే. ఆ తర్వాత ఆట ప్రారంభిద్దామని శైలజ భావించినా కుటుంబ నేపథ్యం, చిన్నపిల్లల పోషణ, ఆర్థిక కష్టాల వల్ల ఈ బరువును ఎత్తలేకపోయారు. చిన్నప్పుడే తండ్రి మృతి చెందడం, వివాహం తర్వాత తల్లి చనిపోవడం, అనంతరం కోవిడ్‌తో భర్త దూరం కావడంతో ఒంట రిగా పిల్లలతో కాలం గడుపుతున్న శైలజకు ఇన్నాళ్లకు సరైన న్యాయం జరిగింది. గత ప్రభుత్వాల పె ద్దలు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసినా ప్ర యోజనం లేకపోయిందని శైలజ ఇప్పటికే పలు మార్లు వాపోయారు. ఆమె నిరీక్షణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెరదించారు. శాప్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. విశాఖపట్నంలోని డీఎస్‌ఏలో గ్రేడ్–3 కోచ్ పోస్టులో నియమించారు. వంజంగి నుంచి కామన్వెల్త్కు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వంజంగి గ్రామానికి చెందిన పూజారి సీతారాం, అమ్మాజమ్మ దంపతులకు జని్మంచింది పూజారి శైలజ. 1996లో వెయిట్‌లిఫ్టింగ్ గేమ్ మొదలుపెట్టిన శైలజ జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో ఓనమాలు నేర్చుకున్నారు. అలాగే ఊసవానిపేట వ్యా యామ శాలలో శిక్షణ పొందారు. ఏలూరు సాయ్ అకాడమీలో శిక్షణ పొందారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. పోటీల్లో దిగితే బంగారు పతకాన్ని ముద్దాడే శైలజ ప్రతిభను గుర్తించిన నాటి వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ, అసోసియేషన్ ప్రతినిధులు మరింత ఉన్నతంగా శిక్షణను అందించడం మొదలుపెట్టారు. - 1996–97లలో మధురైలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. - 1998లో హైదరాబాద్‌లో జరిగిన ఇండిపెండెంట్ గోల్డ్ కప్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. - అదే ఏడాది కోల్‌కతాలో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. - అదే ఏడాది బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. - 1999లో కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదరన్ స్టేట్ గేమ్స్‌లో పసిడి పతకాన్ని సాధించారు. - 2000లో మైసూరులో జరిగిన దక్షిణ భారత క్రీడా పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించారు. - 2002లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో మూడు బంగారు పతకాలను సాధించారు. - 2005లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. - 2006 వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 బంగారు, ఒక రజత పతకం, జాతీయస్థాయిలో 26 బంగారు పతకాలు గెలిచారు. తర్వాత అనేక రాజకీయాల నడుమ ఒలింపిక్స్‌లో పాల్గొనే బర్త్ ను కోల్పోయారు. అయితే ఒలింపిక్స్ రికార్డుల ను జాతీయస్థాయిలోనే బద్దలుగొట్టి ‘ఇండియన్ స్ట్రాంగెస్ట్ ఉమెన్‘గా శైలజ పేరు సంపాదించారు. జగనన్నను కలిశాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న సీఎం జగనన్నను కలిశాను. నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగంలో నియమించి, కోచ్‌గా అవకాశం కల్పించారు. విశాఖపట్నం డీఎస్‌ఏలో గ్రేడ్–3 కోచ్ పోస్టును కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. జగనన్నకు రుణపడి ఉంటాను. దశాబ్దంన్నర పాటు నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. – పూజారి శైలజ, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, శ్రీకాకుళం -
అమ్మాయిలకు ఆదర్శం ఈ ‘శైలజాటీచర్’
‘శైలజాటీచర్కు’ తాజాగా 2021 సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ‘ఓపెన్ సొసైటీ ప్రైజ్’ లభించింది. గతంలో ఈ ప్రైజ్‌ను పొందిన వారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫిలాసఫర్ లు, నోబెల్ గ్రహీతలు ఉన్నారు. కోఫీ అన్నన్ కూడా ఉన్నారు. ప్రజారోగ్య సేవ ల వైపు యువతులు ఆకర్షితులయ్యేలా రోల్ మోడల్‌గా పని చేసినందుకు కెకె శైలజకు ఇప్పుడీ గౌరవం దక్కింది. గత ఏడాది ఇదే నెలలో ‘పబ్లిక్ సర్వీస్ డే’ కి యూఎన్‌లో ప్రసంగ ఆహ్వానం అందుకున్న ఏకైక భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందారు. టీచర్‌గా ఉండి, రాజకీయాలలోకి వచ్చి, ప్రజారోగ్య సేవలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శైలజ అమ్మాయిలకు రోల్ మోడల్. మలయాళంలో ‘వైరస్’ (2019) అని ఒక సినిమా వచ్చింది. రావడానికి ముందు ఆ సినిమా నిర్మాత రీమా కల్లింగళ్, ఆమె భర్త ఆషిక్ అబు కలసి అనుమతి కోసం అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ దగ్గరకు వచ్చారు. ‘‘మీ పాత్రను సినిమాలో రేవతి వేస్తున్నారు’’ అని చెప్పారు. ఆషిక్ ఆ సినిమాకు దర్శకుడు. సినిమా కథాంశం.. 2018 లో కేరళలో ప్రబలిన ‘నిఫా’ వైరస్. ఇప్పుడు కరోనాను కట్టడి చేసినట్లే అప్పుడూ నిఫా వ్యాప్తి చెందకుండా పాలనా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు శైలజ. ఆ పాత్రనే సినిమాలో రేవతి వేస్తున్నది. ‘‘అయితే ఒక రిక్వెస్ట్’’ అన్నారు శైలజ. ‘‘సినిమా సైంటిఫిక్‌గా ఉండాలి. భవిష్యత్తులో విద్యార్థులకు నాలెడ్జ్ ఇచ్చేలా ఉండాలి’’ అని చెప్పారు. సినిమా విడుదలైంది. బాగా ఆడింది. ‘‘మీ పాత్రను రేవతి చాలా బాగా చేశారు’’ అన్నారెవరో ఫోన్ చేసి. శైలజ పెద్దగా నవ్వారు. ‘‘సినిమాలో రేవతి మౌనంగా, విచారంగా ఉంటారు. నేను అలా ఉండను. నేను ఓకల్ అండ్ విగరస్’’ అన్నారు. మాట, చేత గట్టిగా ఉంటాయని. సినిమా మాత్రం ఆమె కోరుకున్నట్లుగానే వచ్చింది.. పిల్లలకు నాలెడ్జ్ ఇచ్చేలా. ఐదేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు పార్టీలో ముఖ్య హోదాలో ఉన్నప్పుడూ.. శైలజ ‘టీచరమ్మే’! శైలజా టీచర్ అంటారు. లేదంటే టీచరమ్మ అంటారు. అధికారంతో వచ్చే ఆడంబరాలేమీ ఆమెలో చొరబడలేకపోయాయి. సామాన్యుల మనిషి. అంతే తప్ప మంత్రీ కాదు, పార్టీ లీడరూ కాదు. హైస్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా చేశారు శైలజ. రాజకీయాల్లోకి వచ్చి పదిహేడేళ్లయినా కూడా నేటికీ ఆమె శైలజా టీచరే. ఇప్పుడు కేరళ అమ్మాయిలంతా ఆరోగ్యసేవల రంగంలోకి వచ్చేందుకు శైలజ స్ఫూర్తి అయినట్లే.. శైలజ రాజకీయాల్లోకి రావడానికి వాళ్ల అమ్మమ్మ కల్యాణి స్ఫూర్తి. కల్యాణి తండ్రి బ్రిటిష్ వాళ్ల టీ ఎస్టేట్‌లో సూపర్ వైజర్‌గా పని చేసేవారు. ఆయన్నంతా రమణ మేస్త్రీ అనేవారట! అప్పట్లో వాళ్ల జిల్లాలో (ఇప్పుడు కన్నూర్ జిల్లా) ఆయనే సంపన్నుడు. రాజకీయ స్పృహ ఉన్నవారు. అది ఆయన్నుంచి ఆయన కూతురికి, ఆ కూతురి నుంచి శైలజకు అందింది. రమణ మేస్త్రి కుటుంబం ఆనాడు రెండంతస్తుల బంగళాలో ఉండేది. చుట్టు పక్కలంతా గుడిసెలు ఉండేవి. ‘‘ఇప్పుడు ఆ బంగళాను గుడిసెను చేస్తూ, చుట్టుపక్కలంతా బంగళాలు వెలిశాయి’’ అని నవ్వుతూ చెబుతారు శైలజ. నవ్వు ఆమె నిరాడంబరత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది. ఇంట్లో ఒకటే అమ్మాయి శైలజ. తండ్రి రైతు. తల్లి గృహిణి. శైలజ మాత్రం వాళ్ల అమ్మమ్మ నోట్లోంచి ఊడినట్లుగా ఉంటుంది. ఆమె సోషల్ వర్క్‌ను చూసే ఈమె అటువైపు వెళ్లింది. 1981లో 25 ఏళ్ల వయసులో శైలజ జీవితంలో రెండు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. ఆమె రెండో డిగ్రీ పూర్తయింది. టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అదే ఏడాది ఆమె భాస్కరన్ అనే సీపీఎం కార్యకర్తను పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా టీచరే. ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి శోభిత్ (34) ఎలక్ట్రికల్ ఇంజనీరు. ప్రస్తుతం అబు ధాబిలో ‘కోవిడ్ హెల్త్‌కేర్ ఫెసిలిటీ’ ఆపరేషన్స్ హెడ్‌గా చేస్తున్నాడు. చిన్నబ్బాయి లలిత్ (32) ఎం.టెక్ చేసి, కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పని చేస్తున్నాడు. అబ్బాయిల చదువులు, ఉద్యోగాలు ఎలా ఉన్నా.. అమ్మాయిలు మాత్రం కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించాలని అంటారు శైలజ. మహిళలు తాము చేస్తున్న ఉద్యోగాన్ని కుటుంబం కోసం మానేయడమంటే సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమేనని కూడా అంటారు. బి.టెక్‌లు. ఎంబీఎలు చేసిన అమ్మాయిలు పెళ్లయ్యాక ఇంట్లోనే ఉండిపోవడం కరెక్ట్ కాదని శైలజ అభిప్రాయం. -
బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ.. తన ఫోన్ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచి్చన రామగుం డం ఆర్ఎస్సై అజ్మీరా ప్రవీణ్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు, కోర్టు పీసీ ఫోన్లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ వెళ్లే దారిలో మరోసారి వచి్చన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మేజిస్ట్రేట్ అనుమతితో మంథని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించారని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సైతం పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం) -
బ్రిటిష్ పత్రికలో భారతీయత
సమాజానికి చేసే మంచి పనులు ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంటాయి. ఆ మంచితనానికి జేజేలు పలుకుతూనే ఉంటాయి. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజను ‘టాప్ థింకర్ 2020’గా యుకె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఎంపిక చేసింది. కరోనా కాలంలో ఆమె చేసిన కృషి కారణంగా ఈ అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్ మ్యాగజైన్ ‘ప్రాస్పెక్ట్’ పత్రికలో తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసింది. పాఠకులు, నిపుణులు, సంపాదకుల బృందం అభిప్రాయం ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్ ప్రాస్పెక్ట్ జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. కరోనా కాలంలో రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకున్న శైలాజ పేరు 50వ స్థానంలో చేరింది. పత్రిక ప్రకారం ఈ జాబితాను ఖరారు చేయడానికి 20,000 కి పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ జాబితాలో కెకె శైలజ మాత్రమే భారతీయ మహిళ. శైలజను ప్రశంసిస్తూ ‘2018 సంవత్సరంలో కూడా కేరళలో వ్యాపించిన నిపా వైరసును శైలజ స్థిరంగా ఎదుర్కొంది‘ అని పత్రిక తెలిపింది. టీచర్ నుంచి రాజకీయాల్లోకి.. రాజకీయాల్లో చేరడానికి ముందు శైలజ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఏడేళ్లు సైన్స్ టీచర్‌గా విధులను నిర్వర్తించిన శైలజ టీచర్ 2004 నుంచి పూర్తిగా రాజకీయాల్లో ఉంది. అందరూ ఆమెను అభిమానంగా ఇప్పటికీ ’శైలాజ టీచర్’ అనే పిలుస్తుంటారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే కాదు తను ఎంచుకున్న రాజకీయ జీవితాన్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ మంచి పొలిటీషియన్ అనే పేరును సంపాదించుకుంటున్నారు. కరోనాను అరికట్టడానికి శైలజ చేసిన ప్రయత్నాలు అన్నింటా ప్రశంసలు అందుకున్నాయి. ప్రతిష్టాత్మక బ్రిటిష్ వార్తాపత్రిక ’ది గార్డియన్’ కూడా కరోనా కాలంలో శైలాజ చేసిన కృషిని ప్రశంసించింది. కోవిడ్–19 మహమ్మారి సమయంలో సరిహద్దులలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించే కార్యక్రమంలో తన ప్రసంగాన్ని వినిపించడానికి ఐక్యరాజ్యసమితి శైలజను ఆహ్వానించింది. ప్రాస్పెక్ట్ పత్రిక న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్‌ను రెండవ స్థానంలో నిలపడానికి కారణం కరోనా ప్రచారంలో సామాన్య ప్రజలకు ఆమె మద్దతుగా నిలవడం. మహమ్మారిని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలలో ఆమె కృషి. ఆ తర్వాత ప్రాస్పెక్ట్ జాబితాలో ఫ్రెంచ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి వీనర్ ఎస్తేర్ డఫ్లో ఉన్నారు. పలుసార్లు బుకర్ ప్రైజ్ అందుకున్న హిల్లరీ మాంటిల్, పర్యావరణవేత్త డేవిడ్ అటెన్‌బరో పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రాస్పెక్ట్ జాబితాలో పురుషుల కంటే మహిళల పేర్లు ఎక్కువ ఉన్నాయి. ఈ జాబితాలో 26 మంది మహిళల పేర్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. -
స్నేహితుని ప్రేమ కోసం..
పవన్, శైలజ జంటగా జి. మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా దోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి. వీరారెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మేరా దోస్త్’ టీజర్ చాలా బావుంది. వీరారెడ్డి మంచి డాక్టర్ కాబట్టి మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీసి ఉంటారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ నచ్చి సినిమా తీశాను’’ అన్నారు పి. వీరారెడ్డి. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. స్నేహితుని ప్రేమ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి సాహసం చేశాడు? ఆ ప్రేమికుల జంటను ఎలా కలిపాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు జి. మురళి. ‘‘ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించా’’ అన్నారు నటుడు అమిత్. ఈ కార్యక్రమంలో శైలజ, పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్న, కెమెరా: సుధీర్. -
స్నేహితుడి కోసం...
పవన్, శైలజ జంటగా జి.మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరాదోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి.వీరారెడ్డి నిర్మించారు. వి.సాయిరెడ్డి స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర పాటలను తెంగాణ వాటర్ బోర్డ్ చైర్మన్ వి.ప్రకాశ్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. జి.మురళి మాట్లాడుతూ– ‘‘డైనమిక్‌లాంటి అమ్మాయి ఒక బలహీనుణ్ని ప్రేమిస్తుంది. ఓ సందర్భంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. ఆ బలహీనుడి మిత్రుడైన హీరో... ఆ రాక్షసుడ్ని సంహరించి ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మేరాదోస్త్’. వీరారెడ్డిగారు ఇచ్చిన సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మురళి చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాం. ‘మేరాదోస్త్’ అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు పి.వీరారెడ్డి. ‘‘సినిమా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. ఆరో తరగతి నుంచే సినిమాలు విపరీతంగా చూసేవాణ్ణి. అల్లాణి శ్రీధర్‌గారి వద్ద దర్శకత్వశాఖలో పని చేశాను. అనుకోనుకుండా రాజకీయాల్లోకి వెళ్లాను. ఆ తరుణంలోనే తెంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో సినిమాకు దూరమయ్యాను. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది’’ అన్నారు వి.ప్రకాశ్. నిర్మాత సాయి వెంకట్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వి.సాయిరెడ్డి, కెమెరా: సుధీర్. -
సస్పెన్స్.. హారర్.. థ్రిల్
సమీర్‌ఖాన్ హీరోగా షేర్ దర్శకత్వంలో కె. వెంకటరాంరెడ్డి నిర్మించిన చిత్రం ‘కేఎస్ 100’. శైలజ, సునీతా పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. షేర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం అమ్మాయిలు సమాజంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు? అనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ అంశాలతో పాటు యూత్‌కి కావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉండటంతో ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ‘‘ట్రైలర్ చూసి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకు. ‘ఆర్ఎక్స్ 100’ కంటే ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘లయన్’ సాయివెంకట్. -
యాక్షన్ ఎంటర్టైనర్
మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ జంటగా నటించిన చిత్రం ‘కెఎస్ 100’. షేర్ దర్శకత్వంలో చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. షేర్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మా సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన రావడంతో విజయంపై మంచి అంచనాలున్నాయి. సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. అక్షిత, అషి, పూర్వీసునీత, శ్రద్ధా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, కెమెరా: వంశీ, నేపథ్యసంగీతం: రామ్ మోహన్ చారి. -
వంద రోజుల స్నేహం
‘‘షిరాజ్ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అతనికి సినిమా తీయడమే కాకుండా ఎలా ప్రమోట్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రేక్షకులని కూర్చోబెట్టే ప్రతిభ ఒక్క దర్శకుడికే ఉంటుంది. అది షిరాజ్‌కు ఉంది. తను హీరోగా పరిచయం అయ్యి దర్శకుడిగా మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత ముఖ్య తారలుగా షిరాజ్ (షేర్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెఎస్ 100’. చంద్రశేఖర్ మూవీస్ పతాకంపై కె. వెంకట్రామ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాతలు సాయి వెంకట్, మల్టీ డైమెన్షన్ వాసు, అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు. షిరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ తరం అమ్మాయిలు ఏవిధంగా ఫాస్ట్ కల్చర్‌ను అలవర్చుకున్నారు అనే పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. కెఎస్ అంటే హీరోల పాత్ర పేరు కుమార్, స్వామి. 100 అంటే వాళ్ల వంద రోజుల స్నేహమే. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. ఈ చిత్రంలో నటించిన వారికి మంచి ప్రతిభ ఉండటంతో వీరితో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు. ‘‘హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ మూవీ ఇది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని వెంకటరామ్ రెడ్డి అన్నారు. సమీర్ ఖాన్, సునీతా పాండే, అక్షత, కూసెట్టి, అజీబ్, సంగీత దర్శకుడు నవనీత్ చారి తదితరులు పాల్గొన్నారు. ∙సమీర్, సునీత