చిత్తూరు ,తిరుపతి మంగళం : పెళ్లయిన మొదటి రోజే భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన నవ వధువు శైలజను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ఆదివారం పరామర్శించారు. పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామనీ, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆమె మాట్లాడుతూ శైలజ భర్త రాజేశ్‌ను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి పరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామనీ, శైలజ అంగీకరిస్తే హైదరాబాద్‌లోని మాక్సివిజన్‌లో కళ్లకు అవసరమైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శైలజకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment