సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత కుమార్తెగా తనను ప్రకటించాలని కోరుతూ ఓ మహిళ సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల(37) జయ తన తల్లి అనీ, ఈ విషయాన్ని నిరూపించడానికి డీఎన్‌ఏ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నట్లు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనానికి విన్నవించారు.
జయలలిత చెల్లెలు శైలజకు తనను దత్తత ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా సంప్రదాయ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబానికి చెందిన జయలలిత భౌతికకాయాన్ని వెలికితీసి హిందూ ఆచారాల ప్రకారం దహనం చేసేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న సుప్రీం ఈ విషయంలో తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment