చిత్తూరు: నవవధువు శైలజపై దాడిచేసి దారుణంగా హింసించిన కేసులో.. నిందితుడు రాజేశ్‌కు లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు బుధవారం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పోలీసులు ఉపాధ్యాయుడైన రాజేశ్‌పై పలు అభియోగాలు మోపారు. లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించిన అనంతరం ఆ పరీక్షల ఆధారంగా మరిన్ని అభియోగాలు మోపాలని భావిస్తున్నారు. అయితే, రాజేశ్ ఒప్పుకుంటేనే అతనికి లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించింది. కాగా, రాజేశ్ తండ్రిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
తొలిరాత్రినాడే రాజేశ్ నవవధువు శైలజపై దాడి చేసి.. తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. పెళ్లిరోజు ఈ దంపతులకు తొలిరాత్రి ఏర్పాటుచేశారు. అయితే, తాను సంసారానికి పనికిరానని, ఈ విషయం బయట చెప్పవద్దని రాజేశ్ తొలిరాత్రి శైలజను కోరినట్టు తెలిసిందే. దీంతో శైలజ బయటకురాగా.. కుటుంబసభ్యులు ఆమెను మళ్లీ గదిలోకి పంపించారు. తన బండారాన్ని బయటపెట్టడంతో ఆగ్రహించిన రాజేశ్ తొలిరాత్రే శైలజను అత్యంత క్రూరంగా హింసించి చితకబాదాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలిరాత్రే భర్త చేతిలో చిత్రహింసలు ఎదుర్కొన్న శైలజ ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment