సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌ | KS 100 Movie Audio Launch | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

Published Sun, Mar 24 2019 2:09 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

KS 100 Movie Audio Launch - Sakshi

నందిత, సమీర్‌ఖాన్‌

సమీర్‌ఖాన్‌ హీరోగా షేర్‌ దర్శకత్వంలో కె. వెంకటరాంరెడ్డి నిర్మించిన చిత్రం ‘కేఎస్‌ 100’. శైలజ, సునీతా పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. షేర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం అమ్మాయిలు సమాజంలో ఏ విధంగా సఫర్‌ అవుతున్నారు? అనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌ అంశాలతో పాటు యూత్‌కి కావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. గ్యారెంటీగా హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన స్టోరీ ఇన్‌స్పైరింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ‘‘ట్రైలర్‌ చూసి డిస్ట్రిబ్యూషన్‌ చేస్తామని నా ఫ్రెండ్స్‌ చాలామంది చెప్పారు. అంత క్రేజ్‌ ఉంది ఈ సినిమాకు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కంటే ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘లయన్‌’ సాయివెంకట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement