స్నేహితుని ప్రేమ కోసం.. | mera dost teaser launch by raj kandukuri | Sakshi
Sakshi News home page

స్నేహితుని ప్రేమ కోసం..

Published Fri, Nov 29 2019 12:48 AM | Last Updated on Fri, Nov 29 2019 12:48 AM

mera dost teaser launch by raj kandukuri - Sakshi

శైలజ

పవన్, శైలజ జంటగా జి. మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా దోస్త్‌’. వి.ఆర్‌. ఇంటర్నేషనల్‌ పతాకంపై పి. వీరారెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 6న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మేరా దోస్త్‌’ టీజర్‌ చాలా  బావుంది. వీరారెడ్డి మంచి డాక్టర్‌ కాబట్టి మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీసి ఉంటారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ నచ్చి సినిమా తీశాను’’ అన్నారు పి. వీరారెడ్డి. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. స్నేహితుని ప్రేమ కోసం మరో ఫ్రెండ్‌ ఎలాంటి సాహసం చేశాడు? ఆ ప్రేమికుల జంటను ఎలా కలిపాడు?  అన్నది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు జి. మురళి. ‘‘ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటించా’’ అన్నారు నటుడు అమిత్‌. ఈ కార్యక్రమంలో శైలజ, పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్న, కెమెరా: సుధీర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement