Raj Kandhukuri
-
రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘ఏమైపోయావే’
రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరి కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఏమైపోయావే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించి చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలిన కోరుకుంటున్నా’అని అన్నారు. రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ సంగీతమందిస్తున్నాడు. -
స్నేహితుని ప్రేమ కోసం..
పవన్, శైలజ జంటగా జి. మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా దోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి. వీరారెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మేరా దోస్త్’ టీజర్ చాలా బావుంది. వీరారెడ్డి మంచి డాక్టర్ కాబట్టి మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీసి ఉంటారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ నచ్చి సినిమా తీశాను’’ అన్నారు పి. వీరారెడ్డి. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. స్నేహితుని ప్రేమ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి సాహసం చేశాడు? ఆ ప్రేమికుల జంటను ఎలా కలిపాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు జి. మురళి. ‘‘ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించా’’ అన్నారు నటుడు అమిత్. ఈ కార్యక్రమంలో శైలజ, పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్న, కెమెరా: సుధీర్. -
ఫుల్ స్పీడ్
మొదటి చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించారు శివ కందుకూరి. ‘పెళ్ళి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడే శివ కందుకూరి. ఈరోజు శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త చిత్ర విషయాలను ప్రకటించారు. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన భరత్ ఈ చిత్ర దర్శకుడు. ఈ ప్రేమ కథను నరాల శ్రీనివాస రెడ్డి, పుత్తాకర్ రోన్ సన్ నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని వేసవి తర్వాత రిలీజ్‌కు రెడీ అవుతోంది. శేష సింధు ఈ చిత్రానికి దర్శకురాలు. ఫస్ట్ సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమా అంగీకరించి ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు శివ కందుకూరి. భరత్ దర్శకత్వంలో చేసే ప్రేమకథా చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్టే
సూర్య చంద్ర ప్రొడక్షన్ లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలు గా నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రావే నా చెలియా'. ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ లోగో ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘రావే నా చెలియా అనే టైటిలే అట్ట్రాక్టివ్ గా ఉంది. కథలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా తప్పకుండా విజయం సాధిస్తుంది. చిత్ర యునిట్‌కు నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా’అన్నారు. దర్శకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చిత్ర బృందం నన్ను చాలా నమ్మి సపొర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చెయనని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా. డిఫరెంట్ లవ్ స్టోరీ తో వస్తున్నాం ఆదరించండి’ అని తెలిపారు. విరాజ్, కవిత, రచ్చ రవి, రోలర్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కుమార్ సంగీతాన్ని అందించారు. -
‘రంగు’లో హీరోలు విలన్లు ఉండరు
నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ... ‘టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’ అని రాజ్ కందుకూరి పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ..‘ చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా. గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని’అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. పరుచూరి బ్రదర్స్ కథతో ప్రయాణం చేశారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్లా మిగలుతుంది. ఈ సినిమాతో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దిగ్గజాలతో కలసి పనిచేసినందుకు గర్వంగా ఉంది.. హీరో తనీశ్ మాట్లాడుతూ..`నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జరుపుకుంటున్న తొలి ఫంక్షన్. ఈ మూడు కారణాలతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయగారు సినిమాను నాతో చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇందులో హీరోలు, విలన్స్ లేరు.. అన్ని పాత్రలే. ప్రతి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదనే విషయాలను నేర్పిస్తుంది. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యోగీశ్వర శర్మ, సినిమాటోగ్రాఫర్: టి.సురేందర్ రెడ్డి. -
కేసీఆర్ బయోపిక్.. ఫస్ట్ లుక్ ఇదే!
పద్మనాయక ప్రొడక్షన్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ ఉద్యమ సింహం టైటిల్ల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. కేసీఆర్ నాకు ఇష్టమైన నాయకులు. ఆయనపై ఎంతో ఇష్టంతో దర్శక, నిర్మాతలు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్న రోజుల్లో నాగేశ్వరరావు ఆయనపై అభిమానంతో, ఎంతో ఇష్టంతో కేసీఆర్ పై సినిమా చేయడం గొప్ప విషయం. కేసీఆర్ పై సినిమా అనగానే? అంతా ఆయన రాజకీయన నేపథ్యంపై చేస్తున్నారనుకుంటున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా. కేసీఆర్ బయోపిక్ లా ఆయన గురించి అన్ని విషయాలు సినిమాలో చూపిస్తున్నట్లు నాకు చెప్పారు. కొన్ని సీన్స్ చూసాను. చాలా బాగా తీశారు’ అని అన్నారు. చిత్ర నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, ` జూన్ లో సినిమా ప్రారంభించాం. నేటి (సోమవారం)తో షూటింగ్ పూర్తయింది. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. టెక్నికల్ గాను సినిమా బాగా వస్తోంది. 16న ఆడియా విడుదల చేస్తాం. అతిత్వరలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు. చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ` కథ ఎంత బాగో వచ్చిందో.. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. కేసీఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలో సినిమాలో చూపించబోతున్నాం. సినిమా నిర్మాణానికి నాగేశ్వరరావు ఎక్కడా రాజీపడలేదు. ఎంతో ఫ్యాషన్ తో సినిమా నిర్మిస్తున్నారు. ఈనెల 16న ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఆరోజున కేసీఆర్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? మిగతా నటీనటులు ఎవరు? అనేది రివీల్ చేస్తాం` అని అన్నారు.ఈ చిత్రంలో జెన్నీ, సి.హెచ్.పి.విఠల్, ఆకేళ్ల గోపాలకృష్ణ, గిరిధర్, జలగం సుధీర్, మాధవిరెడ్డి, లత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సి.హెచ్. రాములు, కొరియోగ్రఫీ: గణేష్, ఫైట్స్: సూపర్ ఆనంద్, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫి: ఉదయ్ కుమార్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రాపోలు కృష్ణ అందిస్తున్నారు. -
ఈజీ మనీ కోసం...
‘‘పైసా పరమాత్మ’ టైటిల్, పోస్టర్ చాలా బాగున్నాయి. కథను దర్శకుడు విజయ్ నాకు చెప్పారు. చాలా కొత్తగా ఉందనిపించింది. ప్రతిభ ఉన్నవారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఆ విషయం ‘గూఢచారి’ చిత్రంతో మరోసారి రుజువైంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. సంకేత్, సుధీర్, కృష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష ప్రధాన పాత్రల్లో విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పైసా పరమాత్మ’. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై విజయ్ జగత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ని రాజ్ కందుకూరి విడుదల చే శారు. విజయ్ కిరణ్ మాట్లాడుతూ –‘‘ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతులు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది ముఖ్య కథాంశం’’ అన్నారు. -
బాగా లేదంటే డబ్బు వాపస్
కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా రూపొందిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ‘యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. చైతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి, హీరో హవీశ్ విడుదల చేశారు. నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ –‘‘నా భార్య నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ‘ఆర్ ఎక్స్ 100’ బైక్. అజయ్‌గారు కథ చెప్పినప్పుడు షాకయ్యాను. తర్వాత గ్రేట్‌గా ఫీలయ్యాను. ట్రైలర్ విడుదలయ్యాక అందరూ మా సినిమా గురించి మాట్లాడుతుండటం గర్వంగా ఉంది. ‘7/జి బృందావన కాలనీ, సైరాట్, ప్రేమిస్తే’ సినిమాల్లో ఎంత కంటెంట్ ఉందో దానికి మించిన కంటెంట్ మా సినిమాలో ఉంటుంది. ఈనెల 12న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్న రోజుల్లో నాపై నమ్మకంతో నన్ను కలిసిన తొలి వ్యక్తి చైతన్ భరద్వాజ్. తర్వాత క్రమంగా ‘ఆర్ ఎక్స్ 100’ టీమ్ ఏర్పడింది. చాలా హానెస్ట్‌గా చేసిన సినిమా ఇది’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూశాక పెట్టిన డబ్బులు వేస్ట్ అయ్యాయని ప్రేక్షకులు అంటే వారికి నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా’’ అన్నారు కార్తికేయ. -
'నయనం' లోగో లాంచ్
లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న మొదటి చిత్రం 'నయనం'. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి వద్ద ఈగ, మర్యాద రామన్న , మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో 'పెళ్లి చూపులు' చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...''నయనం' టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్ట్ కూడా కొంచెం విన్నాను ఇంట్రస్టింగ్ గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి గారి శిష్యుడి డైరక్షన లో సినిమా వస్తుందంటే ఎలా ఉండబోతుందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిర్మాత కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు' అన్నారు. దర్శకుడు క్రాంతి కుమార్ వడ్లమూడి మాట్లాడుతూ... '' నయనం' టైటిల్ లోగో ఆవిష్కరణకు విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని' అన్నారు. నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ....'మా తొలి చిత్రం 'నయనం' లోగో లాంచ్ అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఎనౌన్స్ చేసిన నయనం టైటిల్ కు, థీమ్ ఏంటో గెస్ చేయండంటూ మేము నిర్వహించిన వినూత్నమైన కాంటెస్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి రోజున మా చిత్రానికి సంబంధించిన టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ పొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నాం' అన్నారు. -
సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో మూవీ మెంటల్ మదిలో... అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మెంటల్ మదిలో సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఇటీవల చిత్రయూనిట్ తో కలిసి మెంటల్ మదిలో ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. -
డబ్బింగ్ కార్యక్రమాల్లో 'మెంటల్ మదిలో'
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో సినిమా మెంటల్ మదిలో.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ షూటింగ్ ముగించుకునే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''పెళ్ళిచూపులు' విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. శ్రీవిష్ణు, నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ 'మెంటల్ మదిలో' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం 'మెంటల్ మదిలో' అని గర్వంగా చెప్పగలను. ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం.. జూలైలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలు ప్రకటిస్తాం' అన్నారు. -
దర్శకుడిగా మారుతున్న నిర్మాత
ఈ ఏడాదిలో చిన్న సినిమాగా విడుదలైన ఘనవిజయం సాధించిన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకుడు. రాజ్ కందుకూరి నిర్మాతగా కేవలం 80 లక్షల బడ్జెట్ నిర్మించిన ఈ సినిమా, ఏకంగా 20 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రాజ్ కందుకూరి వరుసగా మూడు సినిమాలను ప్రకటించారు. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా, విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుణ్ని పరిచయం చేస్తూ మరో సినిమాతో పాటు తానే స్వయంగా దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. ఓ స్టార్ హీరోతో తన దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించిన రాజ్ కందుకూరి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.