రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరి కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఏమైపోయావే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించి చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలిన కోరుకుంటున్నా’అని అన్నారు. రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment