కంటెంట్‌ ఉంటే ఏ సినిమా అయినా హిట్టే | Raave Naa Cheliya Movie Title And Logo Launch | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 11 2019 6:31 PM | Last Updated on Fri, Jan 11 2019 6:31 PM

Raave Naa Cheliya Movie Title And Logo Launch - Sakshi

సూర్య చంద్ర ప్రొడక్షన్ లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలు గా నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రావే నా చెలియా'. ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ లోగో ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు.

అనంతరం రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. ‘రావే నా చెలియా అనే టైటిలే అట్ట్రాక్టివ్ గా ఉంది. కథలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా తప్పకుండా విజయం సాధిస్తుంది. చిత్ర యునిట్‌కు నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా’అన్నారు.  దర్శకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చిత్ర బృందం నన్ను చాలా నమ్మి సపొర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చెయనని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా. డిఫరెంట్ లవ్ స్టోరీ తో వస్తున్నాం ఆదరించండి’ అని తెలిపారు.  విరాజ్, కవిత, రచ్చ రవి, రోలర్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కుమార్ సంగీతాన్ని అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement