logo Launched
-
Director Sukumar: ఈ చిత్రకథ గొప్పగా ఉంది
‘‘జగడం’ సినిమా ద్వారా గణేశ్‌ని కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. ఇప్పుడు ‘గౌడ్ సాబ్’తో తను దర్శకుడిగా మారడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రకథ గొప్పగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. దివంగత నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు బంధువు విరాట్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్ సాబ్’. కొరియోగ్రాఫర్ గణేశ్ దర్శకత్వంలో మల్లీశ్వరి సమర్పణలో రాజు, కల్వకోట వెంకటరమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘గౌడ్ సాబ్’ లోగోను సుకుమార్ లాంచ్ చేశారు. తొలి సీన్‌కి నృత్య దర్శకులు యాని, భాను, జానీ కెమెరా స్విచ్చాన్ చేయగా, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. ‘‘మా విరాట్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి. ‘‘ఇది నా కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు విరాట్ రాజ్. ‘‘లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు గణేశ్. ‘‘మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ’’ అన్నారు నిర్మాతలు. -
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో భారత్ జోడో యాత్ర లోగో, వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యాత్ర నిర్వాహక కమిటీ దిగ్విజయ్ సింగ్ మీడియా సమావేశంలో ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం(మిలే కదమ్.. జుడే వతన్)’అనే నినాదంతో కూడిన జోడో యాత్ర నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. యాత్రలో పాల్గొనదలిచిన వారు వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాల్గొనే ప్రధాన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 5 నెలలపాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగి కశ్మీర్లో ముగియనుందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ -
నిర్మాతగా మారిన డైరెక్టర్.. వీవీ వినాయక్‌తో లోగో ఆవిష్కరణ
VV Vinayak Launched Sri Ishta Kameswara Creations Logo: ‘ప్రేమంటే సులువు కాదురా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చందా గోవిందరెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ అనే నూతన నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్ లోగోని దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘నా చేతుల మీదుగా శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ అంచలంచెలుగా ఎదిగి, టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలి’’ అని తెలిపారు. ‘‘మా ఇలవేల్పు శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి పేరిట బ్యానర్ స్థాపించడం హ్యాపీ. తొలి చిత్రంగా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ని రూపొందించనున్నాను. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను’’ అని చందా గోవిందరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కె.సాగర్, ‘రఫ్’ చిత్ర డైరెక్టర్ సుబ్బారెడ్డి, సీనియర్ కో–డైరక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. -
అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ..
యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ లోగోను హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దక్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో ఉంది. ‘అరి’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిజాయితీగా పని చేస్తే సినిమా రంగంలో సక్సెస్ వస్తుంది.. అయితే రావడం ఆలస్యమైనా రావడం మాత్రం పక్కా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ‘‘అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం. అది ఎవరు? అనేది సినిమాలో చెప్పాను’’ అన్నారు జయశంకర్. ‘‘మనిషి ఎలా బతకకూడదో మా సినిమా చూపిస్తుంది’’ అన్నారు శేషు మారంరెడ్డి. ‘‘మా సినిమా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రామిరెడ్డి. ‘‘అరి’లో మంచి వినోదం కూడా ఉంది’’ అన్నారు అనసూయ. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ మూవీ లోగో విడుదల
జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది తెలుగులో గర్వించే సంస్థగా పేరొందిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర లోగోను సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రంతో ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఏడిద నాగేశ్వరరావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. వారి సినిమాల్లో ‘ఆపద్భాంథవుడు’ సినిమా చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడలేదని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆడలేదో ఆర్థం కాలేదు. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్‌కు హెల్ప్ అవడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సంస్థలో అవకాశం ఉంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇకపై శ్రీజ ఎంటర్టైన్మెంట్లో మంచి సినిమాలు రావాలి’ అని అన్నారు. అనంతరం దర్శకుడు అనుదీప్‌పై ఈ సందర్బంగా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాకు అనుదీప్ కథ, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫన్ ఉంటుంది. జాతిరత్నాలు హిట్ తర్వాత తన స్వార్థం చూసుకోకుండా తన తోటివారిని ఎంకరేజ్ చేయడం నాకు గర్వంగా ఉంది. దర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్. చదివాడు. సినిమాపై తపనతో ఈ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు అనుదీప్ వల్ల దర్శకుడు అయ్యాడు’ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, వివిఎల్. నరసింహారావు తదితరులు నటిస్తున్నారు. -
ప్రొ కబడ్డీ లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రొ కబడ్డీ లీగ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హుస్సేన్‌సాగర్ వేదికగా జరిగింది. సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్ద లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ అబోజర్‌తో పాటు జట్టు సభ్యులు, డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సారథి రోహిత్ కుమార్, సినీ హీరో సందీప్ కిషన్ పాల్గొన్నారు. ఈ సీజన్ తొలి అంచె పోటీలకు నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. 20వ తేదీ నుంచి జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌తో యు ముంబా జట్టు తలపడుతుంది. -
మనీష్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాడు
నటుడు, నిర్మాత, దర్శకుడు పి.సత్యారెడ్డి తనయుడు మనీష్ బాబు హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించిన ఈ చిత్రం లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘నా ఆప్తమిత్రుడు సత్యారెడ్డి తనయుడు మనీష్ హీరోగా చేసిన ఈ సినిమా మంచి హిట్ కావాలి. మనీష్ హీరోగా సక్సెస్ అయి మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నేను చెప్పిన మాటని ఆచరణలో పెడుతూ మనీష్‌ని హీరోని చేశారు సత్యారెడ్డి’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘సమాజంలో జరుగుతున్న అన్యా యం, అక్రమాలు, ప్రభుత్వ పాలసీలపై ఒక స్టూడెంట్ లీడర్ ఏ విధంగా పోరాడాడు? ఎలా ప్రశ్నించాడు? అనేది కథ’’ అని పి.సత్యారెడ్డి అన్నారు. ‘‘ఇండస్ట్రీలో గ్రాస్పింగ్ పవర్ ఉన్న హీరోల్లో కృష్ణగారి పేరు చెప్తారు. ఆయనలా ఈ చిత్రంలో మనీష్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాడు’’ అని రాజా వన్నెంరెడ్డి అన్నారు. నిర్మాతలు టి.ప్రసన్నకుమార్, దాసరి కిరణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాటల రచయిత రాజేంద్ర కుమార్, సంగీత దర్శకుడు వెంగి తదితరులు పాల్గొన్నారు. -
కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్టే
సూర్య చంద్ర ప్రొడక్షన్ లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలు గా నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రావే నా చెలియా'. ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ లోగో ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘రావే నా చెలియా అనే టైటిలే అట్ట్రాక్టివ్ గా ఉంది. కథలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా తప్పకుండా విజయం సాధిస్తుంది. చిత్ర యునిట్‌కు నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా’అన్నారు. దర్శకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చిత్ర బృందం నన్ను చాలా నమ్మి సపొర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చెయనని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా. డిఫరెంట్ లవ్ స్టోరీ తో వస్తున్నాం ఆదరించండి’ అని తెలిపారు. విరాజ్, కవిత, రచ్చ రవి, రోలర్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కుమార్ సంగీతాన్ని అందించారు. -
కీ హైట్స్ ఇన్ఫ్రా నూతన లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటీరియర్ డిజైన్ కంపెనీ కీ హైట్స్ ఇన్ఫ్రా నూతన లోగోను ఆవిష్కరించింది. అనంతరం అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీ రీసెర్చ్ మీడియాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. శనివారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కీ హైట్స్ ఇన్ఫ్రా ఫౌండర్ అండ్ చైర్మన్ వంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... 15 ఏళ్లుగా కీ హైట్స్ పేరిట సేవలందిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లో వందల గృహాలు, బహుళ అంతస్తులు, కార్పొరేట్ ఆఫీసు, వాణిజ్య సముదాయాలకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్స్ అందించామన్నారు. ఇటీవలి కృష్ణా పుష్కరాలు, హైదరాబాద్ మెట్రో, తిరుపతిలోని దైవలోక్ మైథలాజికల్ థీమ్ పార్క్‌లకు విజువల్ కాన్సెప్ట్‌లను అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ మీడియా గ్రూప్ సీఈఓ సీహెచ్ హరిలీలా ప్రసాద్, చైర్మన్ జే చైతన్య, క్రియేటివ్ హెడ్ లోహిత్ కుమార్, సాల్మన్ షానీ తదితరులు పాల్గొన్నారు. -
రైతు ప్రగతికి ‘ఆత్మ’ కృషి
లోగో విడుదల చేసిన కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంగారెడ్డి టౌన్: రైతు ప్రగతికి వ్యవసాయ సాంకేతిక యాజమన్యా సంస్థ (ఆత్మ) విభాగం కృష చేస్తోందని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. గురువారం ఆత్మ విభాగానికి సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. రైతులకు నూతన శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ పాడి పంటల అభివృద్ధికి ఆత్మ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు ఆత్మ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు లోగోను ఉపయోగించాలని సూచించారు. -
జగన్నాటకం మూవీ స్టిల్స్
-
గోదావరి అందాలతో...
విక్రమ్ శేఖర్, ప్రభ్జిత్కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’. బాలాజీ దర్శకుడు. శరద్‌మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మాతలు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీరభద్రమ్‌చౌదరి, టి.ప్రసన్నకుమార్ బ్యానర్, సినిమా లోగోలను ఆవిష్కరించారు. సినిమా విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. వినోదంతో పాటు చక్కని సందేశం కూడా ఉండే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. గోదావరి అందాల నడుమ తెరకెక్కుతోన్న యువతరం మెచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కేసి మౌళి, కెమెరా: జీఎల్ బాబు. -
జగన్నాటకం
శ్రీధర్, ప్రదీప్ నందన్, అభినవ్ గోమటం, ఖెనిశ చంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘జగన్నాటకం’. ప్రదీప్ నందన్ దర్శకుడు. ఆది శేషారెడ్డి ఇందుపూరు నిర్మాత. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పేషన్‌తో దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారని, తప్పకుండా సక్సెస్ సాధించే సినిమా అవుతుందని ప్రత్యేక పాత్ర పోషించిన శివాజీరాజా చెప్పారు. అందరి సహకారంతో అనుకున్నదానికంటే సినిమాను బాగా తీయగలిగానని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: అజయ్ అరసాడ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవర్ శ్రీను.