గోదావరి అందాలతో...
విక్రమ్ శేఖర్, ప్రభ్‌జిత్‌కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’. బాలాజీ దర్శకుడు. శరద్‌మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మాతలు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీరభద్రమ్‌చౌదరి, టి.ప్రసన్నకుమార్ బ్యానర్, సినిమా లోగోలను ఆవిష్కరించారు. సినిమా విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. వినోదంతో పాటు చక్కని సందేశం కూడా ఉండే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. గోదావరి అందాల నడుమ తెరకెక్కుతోన్న యువతరం మెచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కేసి మౌళి, కెమెరా: జీఎల్ బాబు.