యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ లోగోను హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దక్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో ఉంది. ‘అరి’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
‘‘నిజాయితీగా పని చేస్తే సినిమా రంగంలో సక్సెస్ వస్తుంది.. అయితే రావడం ఆలస్యమైనా రావడం మాత్రం పక్కా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ‘‘అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం. అది ఎవరు? అనేది సినిమాలో చెప్పాను’’ అన్నారు జయశంకర్. ‘‘మనిషి ఎలా బతకకూడదో మా సినిమా చూపిస్తుంది’’ అన్నారు శేషు మారంరెడ్డి. ‘‘మా సినిమా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రామిరెడ్డి. ‘‘అరి’లో మంచి వినోదం కూడా ఉంది’’ అన్నారు అనసూయ. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు.
చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?
Comments
Please login to add a commentAdd a comment