Intelligent Idiots
-
క్రైమ్ కామెడీతో...
హ్యాకింగ్ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ కామెడీ చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’. విక్రమ్ శేఖర్, ప్రభ్‌జీత్ కౌర్ జంటగా బాయీజీ దర్శకత్వంలో శరద్ మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన ఈ సినిమా ఈ 23న విడుదల కానుంది. శ్వేతాబసు ప్రసాద్ కీలకపాత్ర చేశారని, మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
ఇడియట్స్ ఏం చేశారు?
‘‘ఆధునిక టెక్నాలజీ ఫలితంగా మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం... దానివల్ల వచ్చే నష్టాలు ఏంటనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం. కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది’’ అని దర్శకుడు బాలాజీ చెప్పారు. విక్రమ్ శేఖర్, ప్రభ్జీత్కౌర్ జంటగా శరద్‌మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీని, దర్శకుడు మారుతి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా విభిన్నంగా ఉందని మారుతి పేర్కొన్నారు. పాటలు బాగున్నాయని భరద్వాజ్ చెప్పారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. సప్తగిరి, రాజ్‌కిరణ్, ‘డార్లింగ్’ స్వామి, షకలక శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఇంటిలిజంట్ ఇడియట్స్' ఆడియో ఆవిష్కరణ
-
గోదావరి అందాలతో...
విక్రమ్ శేఖర్, ప్రభ్జిత్కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’. బాలాజీ దర్శకుడు. శరద్‌మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మాతలు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీరభద్రమ్‌చౌదరి, టి.ప్రసన్నకుమార్ బ్యానర్, సినిమా లోగోలను ఆవిష్కరించారు. సినిమా విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. వినోదంతో పాటు చక్కని సందేశం కూడా ఉండే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. గోదావరి అందాల నడుమ తెరకెక్కుతోన్న యువతరం మెచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కేసి మౌళి, కెమెరా: జీఎల్ బాబు.