ఇడియట్స్ ఏం చేశారు?
‘‘ఆధునిక టెక్నాలజీ ఫలితంగా మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం... దానివల్ల వచ్చే నష్టాలు ఏంటనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం. కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది’’ అని దర్శకుడు బాలాజీ చెప్పారు. విక్రమ్ శేఖర్, ప్రభ్‌జీత్‌కౌర్ జంటగా శరద్‌మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీని, దర్శకుడు మారుతి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా విభిన్నంగా ఉందని మారుతి పేర్కొన్నారు. పాటలు బాగున్నాయని భరద్వాజ్ చెప్పారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. సప్తగిరి, రాజ్‌కిరణ్, ‘డార్లింగ్’ స్వామి, షకలక శంకర్ తదితరులు పాల్గొన్నారు.