
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్‌లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’.
బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు.
‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment