Komati Reddy Venkata Reddy
-
వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చారిత్రక నేపథ్యం కలిగిన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 116వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకురాగా.. యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల నాట్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి దేవీ మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమరి్పంచారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. కాగా, ఉదయం 10 గంటల అనంతరం అమ్మవారి ఆలయానికి వీఐపీల తాకిడి ప్రారంభమైంది. వీరి రాక అధికం కావడంతో బోనం ఎత్తుకున్న మహిళలు కాస్త అసౌకర్యానికి గురవ్వాల్సి వచి్చంది.ఇక సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచి్చంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమరి్పంచారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, కె.లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకటరమణారెడ్డి, రాజ్‌ఠాకూర్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలిమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిభాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచిన మంత్రిచార్మినార్ (హైదరాబాద్): భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారని.. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ప్రభుత్వం తరఫున చారి్మనార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలసి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కాగా, అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామ న్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరేనని గుర్తు చేశారు. -
ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
ఆగస్టుకు ముందే రుణమాఫీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రైతు రుణమాఫీని ఆగస్టు కంటే ముందే అందిస్తే ఏమైనా ఇబ్బందా’అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలపై ప్రజాభిప్రాయం సేకరిస్తామని, విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాతే అందిస్తామని ప్రకటించారు. అంతే కానీ నలుగురం కూర్చుని మాదేం పోయింది..ప్రజల డబ్బే కదా అన్నట్టుగా భావించి గుట్టలు ఉన్న చోట, పంటలు వేయని భూములకు రైతుభరోసా అందించే ఉద్దేశం లేదని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరందించలేకపోయారని విమర్శించారు. రూ.42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ పేరుతో ఖర్చు చేసినా, ఇప్పటివరకూ ఇంటింటికీ తాగునీరు రాని గ్రామాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయన్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బులను ఎవరికి పడితే వారికి పంచి, రూ.7లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని చెప్పారు. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సహకారంతో ఐటీ హబ్, పాల్వంచలో కొత్త «థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 12 ఆర్వోబీలకు ప్రతిపాదనలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కనెక్టివిటీ పెంచేందుకు 12 ఆర్వోబీలకు సేతుబంధన్ కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అందులో రూ.148 కోట్లతో నిర్మించే కొత్తగూడెం ఆర్వోబీ కూడా ఉందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచి్చన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు అమలు చేశామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.35 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ట్రయల్‌రన్ ద్వారా బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు అంకురార్పణ జరిగిందనిచ, మిగిలిన పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్‌నాయక్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీచైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు యాక్షన్ ప్లాన్ గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గోదావరి వరదల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. -
త్వరలో 13 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
నార్కట్‌పల్లి: త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టుల ను భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రా హ్మణవెల్లంల గ్రామంలో నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో ఆయన పాల్గొ ని విద్యార్థులకు నోట్‌బుక్స్, యూని ఫాం అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. బాత్రూమ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పా రు. నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల–ఉదయ సముద్రం ప్రాజెక్టులో నీళ్లు నింపి డిసెంబర్‌లోపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ బీమన్న, డీఈ మహేశ్, ఉదయ సముద్రం ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
నేడు ప్రాజెక్టులపై శ్వేతపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల, నీటిపారుదల రంగంపై ప్రజెంటేషన్ శనివారానికి వాయిదా పడ్డాయి. వీటిపై శాసనసభలో శుక్రవారమే చర్చ జరగాల్సి ఉన్నా ఇతర అంశాలపై చర్చతో జాప్యమవడం, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ సభ్యు ల నిరసనతో చాలా సేపు గందరగోళం నెలకొంది. నీటిపారుదల అంశం చాలా కీలకం కావడంతో.. ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనేందుకు వీ లుగా వాయిదా వేయాలని అధికార పక్షం కోరడం.. దీనికి ఎంఐఎం, సీపీఐ మద్దతివ్వడంతో స్పీకర్ శ నివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కి.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో శాసనసభలో కులగణనపై తీర్మానం ఆమోదం పొందాక స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తేనీటి విరామం ప్రకటించారు. తిరిగి సభ సాయంత్రం 6 గంటలకు సమావేశమైంది. తొలుత ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య లేచి.. శ్వేతపత్రంపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీనితో వాయిదా వద్దని, వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు లేచి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు హెలికాప్టర్లో వెళతారు. ఐదు నిమిషాల్లో రాగల సభకు రాకపోవడం ఏమిటంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. వాయిదాపై చర్చ తర్వాత బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్వేతపత్రంపై చర్చించడానికి గంటల తరబడి వేచి ఉన్నాం. రాత్రి 11 గంటల వరకు కూర్చోవడానికి సిద్ధం. శనివారం పార్టీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. మీరు ఎజెండాలో పెట్టి ఎందుకు చర్చ చేపట్టడం లేదు. వెంటనే చర్చ మొదలుపెట్టండి..’’ అని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకుంటూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు. సభ వాయిదాకు అభ్యంతరం లేదని ఎంఐఎం, సీపీఐ సభ్యులు తెలిపారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులపై స్పల్పకాలిక చర్చ శుక్రవారం ఉంటుందని, సమావేశాలు అదేరోజు ముగుస్తాయని బీఏసీలో నిర్ణయించారు. మధ్యాహ్నం కలసినప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు కూడా స్పల్పకాలిక చర్చ ఉంటుందన్నారు. కానీ ఇలా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా చర్చ లేకుండా వాయిదా వేస్తామనడం సరికాదు. ఎంతరాత్రయినా చర్చకు మేం సిద్ధం. ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తాం. ఇష్టానుసారం నిర్వహిస్తామనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. బీఏసీలో నిర్ణయించని ఇతర అంశాలను స్పీకర్ అనుమతితో చర్చిద్దామనుకున్నామని చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమని, అన్ని పారీ్టల ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనేందుకు వీలుగా శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిర్వహిద్దామని, ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కాగా.. కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. మీరంటే.. మీరు.. క్షమాపణల కోసం డిమాండ్ సభలో గందరగోళం నెలకొన్న తరుణంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుని.. శ్వేతపత్రంపై స్పల్పకాలిక చర్చకు సంబంధించి అన్నిపక్షాల సలహాలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అవకాశం ఇచ్చారు. ‘‘ప్రతిపక్ష నేత గురించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘నల్లగొండ సభలో ప్రతిపక్ష నేత సీఎంను, నన్ను దున్నపోతులంటూ వ్యాఖ్యానించారు. ఆయన సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు ప్రతిస్పందిస్తూ.. ‘‘గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కాల్చేయాలి, ఉరితీయాలి అని మాట్లాడలేదా? బాధ్యతయుత పదవిలో ఉన్నందున సభలో అలా మాట్లాడవద్దు’’ అని కౌంటర్ ఇచ్చారు. -
‘మెకానిక్’తో ఆ సమస్య అర్థమవుతుంది: మంత్రి కోమటిరెడ్డి
‘‘నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ సినిమాని ప్రజలందరూ ఆదరించాలి. ఈ మూవీ ద్వారా ఫ్లోరైడ్ సమస్య, బాధితుల బాధలు సమాజానికి అర్థమవుతాయి. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ఎం. నాగమునెయ్య (మున్నా) నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి. మంచి సందేశాత్మక చిత్రం ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్‌రెడ్డినే అవ్వొచ్చని అన్నారు. తెలంగాణ ప్రజలు మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ఆయన బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, చాలా చోట్ల బీఆర్ఎస్పై గెల్చిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెల్చారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చాలా చిన్న దెబ్బ మాత్రమేనని, అయినా ప్రజులు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. చాలా స్వల్ప మెజార్టీతో 14 స్థానాలను కోల్పోయామని అన్నారు. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్లో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్ అని చెప్పారు. 2009లో అల్గనూరులో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పారు. రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు, బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకట్ రెడ్డి అన్నరని గుర్తుచేశారు. దాన్నే తాను చెప్పుకొచ్చానని అన్నారు. వంద అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయాలంటారు.. అలా అబద్ధాలను నమ్ముకునే రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్లవన్నీ 420 హామీలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవముందా అని అడిగితే రేవంతేమన్నాడు? అదేం ఉంది అన్నారు. ఇప్పుడు తెలుస్తోంది అనుభవం ఎంత అవసరమో? అని కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు పేరు మార్చి రైతుభరోసా అని రేవంత్‌రెడ్డి దావోస్‌లో చెప్పారని విర్శించారు. మరి రైతుబంధు వచ్చిందా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రైతుబంధు పడలేదంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి రైతుబంధు రాని రైతులు ఇప్పుడు ఆలోచించాలి. వారిని చెప్పుతోని కొట్టాలా? లేదా ఓటుతోని కొట్టాలా అనేది ఆలోచన చేయాలన్నారు. చదవండి: ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు! -
యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి తిన్నారని నిందించారు. అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి దీటుగా స్పందించారు. 24గంటల విద్యుత్ ఎన్నడూ ఇవ్వలేదు: మంత్రి కోమటిరెడ్డి తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్ పూర్తిగా అవాస్తవమని, ఎనిమిదిన్నర గంటల నుంచి 12 గంటల వరకే విద్యుత్ ఇచ్చేదని పునరుద్ఘాటించారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో 16 గంటలు ఇచ్చి ఉండొచ్చు తప్ప 24 గంటలు ఎన్నడూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖలో నష్టాలకు కారణం అవినీతేనన్నారు. యాదాద్రి ప్రాజెక్టును 29వేల కోట్లకు నామినేషన్ మీద అప్పగించారని, జార్ఖండ్ విద్యుత్ ప్రాజెక్టుకు యాదాద్రికి రూ. రూ.6వేల కోట్లు తేడా ఉందన్నారు. ఇందులో పెద్ద స్కాం ఉందని, రూ. 10వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. అప్పటి మిర్యాలగూడ ఎమ్మెల్యే బినామీగా ఉండి తిన్నారని ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ప్రాజెక్టు అప్పగించుడే పెద్ద స్కాం అని ఆరోపించారు. సోనియా గాందీతో కొట్లాడి వైఎస్ ఫ్రీ పవర్ తెచ్చారు రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌కు పేటెంట్ కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియాగాం«దీతో కొట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేశారని అన్నారు. విచారణకు జగదీశ్ రెడ్డి సవాల్ తనపై గతంలో కూడా ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ విచారణలో ఎవరు దోషులుగా తేలితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. ఇటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్ కాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలని కొట్టిపారేశారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని జగదీశ్ రెడ్డి కోరారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తారా అనేది చూడాలని వ్యాఖ్యానించారు. -
శాసనసభ పాత భవనం పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి మార్పుచేర్పులపై చర్చించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. సెంట్రల్ హాల్‌గా ఏపీ అసెంబ్లీ భవనం గతంలో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలో కొనసాగేవి. ఆ భవనం పాతబడటంతో ప్రస్తుత శాసనసభ కొనసాగుతున్న భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే భవనం కొనసాగింది. పాత భవనంలో శాసనమండలిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పాత భవనంలోని హాలును ఏపీకి కేటాయించారు. అక్కడ శాసనసభ, శాసనమండలి నిర్వహించాల్సి రావటంతో, తెలంగాణ శాసనమండలిని జూబ్లీహాలులోకి మార్చారు. ఇప్పుడు పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్ హాల్‌గా మారుస్తారు. ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు. భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్ గార్డెన్తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహాత్ముడి విగ్రహం ప్రాంతంలో.. శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు. గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కొత్త భవనం నిర్మించే యోచన లేనట్టే..? కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వే శారు. కానీ వారసత్వ కట్టడంగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చాలన్న నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అంశం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటంతో, ఇక వేరే ప్రాంతంలో నిర్మాణానికి తెరపడినట్టేనని అంటున్నారు. -
డబుల్ మినిస్టర్స్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేబినెట్లో పెద్ద పీట!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేబినెట్లో పెద్ద పీట వేశారు. గురువారం కొలువుదీరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్లోకి ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులైన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తీసుకున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు వారిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే వారికి ప్రభుత్వం శాఖలను కేటాయించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు 14 ఏళ్ల తరువాత ఇద్దరు అమాత్యులయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కుందూరు జానారెడ్డి హోంమంత్రిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రి పదవి లభించింది. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఒక్కరే రెండు ప్రభుత్వాల్లోనూ విద్యాశాఖ, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ జిల్లాకు పెద్దపీట వేశారు. సీనియర్ నేతలు ఇద్దరికి ప్రస్తుత కేబినెట్లో మంత్రులుగా అవకాశం దక్కింది. త్యాగానికి దక్కిన గౌరవం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో, యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న తరుణంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ‘బలిదానాలు చేసుకోవద్దు అవసరమైతే మా పదవులను త్యాగం చేసి ప్రభుత్వంపై పోరాడుతాం’ అని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి, సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్ర నేతలు అడ్డుపడుతూ తెలంగాణ ప్రక్రియను ముందుకుసాగనివ్వని పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో 9 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆనాడు తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మళ్లీ మంత్రి పదవి లభించింది. తెలంగాణ ఉద్యమమే కాదు.. 1999లో మొదటిసారి నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు నల్లగొండ పట్టణానికి ఫ్లోరైడ్ రహిత నీరు అందించాలని 11 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత ప్రభుత్వం కృష్ణా జలాల సరఫరా ప్రక్రియను ప్రారంభించింది. పానగల్ ఉదయ సముద్రం నుంచి నల్లగొండ పట్టణానికి తాగునీరు అందించే ప్రాజెక్టు మంజూరైంది. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి ఎస్ఎల్బీసీ సొరంగమార్గాన్ని మంజూరు చేయించారు. సేవకు గుర్తింపు ఎయిర్ ఫోర్స్‌లో ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ వింగ్‌లో మిగ్–21, మిగ్–23 విమానాలను నడిపిన కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనేక సంవత్సరాలు దేశానికి సేవలందించారు. రాష్ట్రపతి భవన్లో ప్రతిష్టాత్మకమైన కంట్రోల్ ఆఫ్ సెక్యూరిటీ, ప్రొటోకాల్, అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం చేశారు. 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచారు. ఇప్పుడు ఆరోసారి విజయం సాధించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎక్స్‌సర్వీస్‌మెన్ సెల్ చైర్మన్‌గా, మాజీ సైనికుల పునరావాస కమిటీ సభ్యుడిగా సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై కేంద్ర హోంమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2019లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ఆయనతోపాటు ఆయన సతీమణి పద్మావతిరెడ్డి కూడా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందించిన సేవలకు ఫలితం దక్కింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌ను మరోసారి మంత్రి పదవి వరించింది. -
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి, పీసీసీ పీఠం?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడనున్న రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం దక్కనుంది. అత్యధికంగా మంత్రి పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ నల్లగొండకే ప్రాధాన్యం ఇచ్చేలా కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్ తరువాత అత్యధిక స్థానాలను ఇక్కడి నుంచి గెలిచిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎం పదవి ఆశించారు. అయితే, ఆ పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వడంతో ఉత్తమ్‌కు మంత్రివర్గంలో కీలక పదవి అప్పగించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠం దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా నల్లగొండ నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. మహబూబ్‌నగర్ తరువాత అత్యధిక స్థానాలను గెలిపించి ఇచ్చింది నల్లగొండ జిల్లానే. మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో మంత్రి పదవుల్లో అగ్ర తాంబూలం నల్లగొండ జిల్లాకే ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. మంత్రి పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ సముచిత ప్రాధాన్యం దక్కనుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి, పీసీసీ పీఠం? నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ నాయకుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన.. తెలంగాణ సాధన కోసం సొంత ప్రభుత్వం మీదనే పోరాడారు. మంత్రి పదవికి రాజీనామా చేసి నల్లగొండ పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంతేకాదు తెలంగాణ కోసం రెండు పర్యాయాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించలేదు. ఆ తర్వాత ఆయన నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా పనిచేశారు. సోనియా గాంధీ ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతానని ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మారిన సమీకరణల్లో భాగంగా వెంకట్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కాకపోయినా కీలక బాధ్యతలే.. ఉమ్మడి జిల్లాలో మరో సీనియర్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించడంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు. అఽధిష్టానం అన్ని విధాల చర్చించి రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పదవి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్‌రెడ్డికి కూడా.. మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతే. ఆయన ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చీఫ్ విప్ లేదా ప్రభుత్వంలో మరో కీలక పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. -
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తాం: కోమటిరెడ్డి
-
TS Election 2023: బీఆర్ఎస్కు షాక్ మీద షాక్..! మరో ఇద్దరు కాంగ్రెస్‌లోకి..
నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీలోని అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన రెండు మూడు రోజుల్లోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. మొదట మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్‌తో పాటు ఐదుగురు కౌన్సిలర్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా బుధవారం మరో ఇద్దరు కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, సమి కాంగ్రెస్‌లో చేరగా కోమటిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్లు కూడా పార్టీ మారడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. నీలగిరి మున్సిపాలిటీలో మున్ముందు కూడా వలసల పరంపర కొనసాగే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్ ఉన్నారు. నేడో, రేపో బీజేపీ నాయకులు! నల్లగొండలో బీజేపీకి చెందిన దాదాపు పది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో మాజీ కౌన్సి లర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, ఒకరి ద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నట్టు సమాచారం. వీరంతా నేడో రేపో కాంగ్రెస్‌లోకి రానున్నట్టు తెలుస్తోంది. వీరు ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మంతనాలు జరిపినట్టు తెలిసింది. -
టిక్కెట్లు అంశంపై అధిష్టానంతోనే మాట్లాడుకుంటా: కోమటి రెడ్డి వెంకట రెడ్డి
-
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా స్కూలు అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం
-
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని, తమ మేనిఫెస్టోలో కూడా పెడతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా 24 గంటలు ఇస్తానని ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పట్లో చంద్రబాబు రైతులను కాల్చి చంపారు. రైతులకు అండగా నిలిచి వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారు’’ అని కోమటిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావు. సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలు కూడా సరికావు. రేవంత్‌రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏవీ ఫైనల్ కావు. పీసీసీ అధ్యక్షుడి పదవి చాలా చిన్న పోస్ట్. ఉచిత విద్యుత్‌పై నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్‌కు లేదన్న కోమటిరెడ్డి.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలి’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు.. 3 గంటలు ఇస్తే చాలు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ‘‘రేవంత్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేతతో చర్చించాను. అవసరమైతే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తాం. అమెరికా వెళ్లిన రెండురోజుల్లో రేవంత్ ఎందుకింత గందరగోళంగా మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డిపై బాలకృష్ణ ప్రభావం పడిందా?’’ అంటూ కోమటిరెడ్డి వ్యంగంగా మాట్లాడారు. -
కాంగ్రెస్ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించా: జగ్గారెడ్డి
-
బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట
-
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదు: కోమటిరెడ్డి
-
సరికొత్త చర్చకు తెరలేపిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. హంగ్ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరికొత్త చర్చకు తెరలేపారు. ఎన్నికల్లో ‘హంగ్’ వస్తుందని.. ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని ఢిల్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలే ఊపుమీద ఉన్న బీజేపీ ఈ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా వాడుకుని విమర్శలకు దిగింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే అందుకుని.. కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒక్కటేనని, పోరాడుతున్నట్టుగా నాటకాలు ఆడుతున్నాయని తాము ముందు నుంచే చెప్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో మరోమారు రచ్చ మొదలైంది. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని పార్టీ నేతలు వరుసగా ప్రకటనలు చేయాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాకున్నా.. ఆ పార్టీ కేడర్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలనను మెచ్చుకుంటూ, ప్రధాని మోదీ పాలనను తూర్పారబడుతూ అసెంబ్లీ వేదికగా గణాంకాలతో సహా సీఎం కేసీఆర్ ప్రసంగించిన అంశం ప్రస్తావనకు వస్తోంది. మొత్తంగా ‘హంగ్, పొత్తు’ల అంశం ఏ పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తిగా మారింది. ‘హంగు’.. కాంగ్రెస్ ‘కంగు’! ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన హంగ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ శిబిరం ఒక్కసారిగా కంగుతిన్నది. ఈ నెల ఆరో తేదీ నుంచి హాథ్ సే హాథ్ జోడో పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జోరుగా పాదయాత్రలు చేస్తున్నారు. ఈ యాత్రలతో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందనే అంచనాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రేవంత్ యాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు సీనియర్ నేత వీహెచ్, మరికొందరు కూడా పాల్గొంటుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న వేళ ఒక్కసారిగా వెంకటరెడ్డి చేసిన హంగ్ వ్యాఖ్యలతో ఆ పారీ్టలో కలవరం మొదలైంది. తాము అధికారంలోకి రాలేమని పార్టీ ఎంపీ, సీనియర్ నాయకుడే చెప్పడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయాలు ఎన్నికల తర్వాతకు సంబంధించినవే అయినా.. అటు పార్టీ కేడర్‌కు, ఇటు ఓటర్లకు తప్పుడు సంకేతాలను తీసుకువెళతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి వ్యాఖ్యలను హుటాహుటిన ఖండించే పనిలో పడ్డారు టీపీసీసీ నేతలు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు అద్దంకి దయాకర్, ఈరవత్రి అనిల్, ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఏ పారీ్టతోనూ పొత్తు ఉండబోదని, కచి్చతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ప్రకటించారు. కేడర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, గందరగోళంలో పడేసేలా సీనియర్లు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంతర్యం ఏమైనా సరే.. ఈ వైఖరి పారీ్టకి నష్టం కలిగిస్తుందని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కొందరు నేతల నుంచి డిమాండ్ వినిపించడం గమనార్హం. ఆ రెండు పార్టీల్లోనూ ఇదే ‘ముచ్చట’! రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీల్లోనూ మంగళవారమంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ విషయంలో అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కానీ టీవీల్లో జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు ఈ విషయంపై మాట్లాడుకున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? అని కొందరు ఆరా తీయడం కనిపించింది. ఇక బీజేపీ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు మంచి అవకాశం అనుకుంటూ అందిపుచ్చుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, ఈ విషయాన్ని తాము ముందునుంచీ చెప్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినా వారు బీఆర్ఎస్లోకే వెళ్తారని కామెంట్ చేశారు. విమానాశ్రయంలో ఠాక్రే, కోమటిరెడ్డి భేటీ మూడు రోజుల పర్యటన కోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వెంకటరెడ్డి వ్యాఖ్యల దుమారంపై సమాచారం అందిన ఠాక్రే.. శంషాబాద్ విమానాశ్రయంలోనే కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఈ ఇద్దరు నేతలు.. కాంగ్రెస్‌తో మరే పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తన వ్యాఖ్యలను వక్రీకరించారని, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన పనిలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనడం గమనార్హం. -
బిగ్ క్వశ్చన్: బీఆర్ఎస్తో పొత్తు కాంగ్రెస్‌లో ఓ వర్గం కోరుకుంటోందా?
-
మాకు ఎవరితో పొత్తు ఉండదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
-
హంగ్ వ్యాఖ్యలపై స్పందించాల్చిన అవసరం లేదు: మంత్రి జగదీష్‌రెడ్డి
-
తెలంగాణలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు: కోమటిరెడ్డి
-
దక్షిణ తెలంగాణను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
-
మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు
న్యూ ఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది ఎవరో తనకు తెలుసని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం.. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తాను అందుబాటులో ఉండనని తెలిసే చండూరులో రేవంత్ సభ పెట్టారని ఆక్షేపించారు వెంకటరెడ్డి. పీసీపీ ప్రెసిడెంట్ అందరినీ ఇబ్బందిపెడుతున్నారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నా లోక్‌సభ పరిధిలో నన్ను అడగకుండానే రేవంత్ ఎలా మీటింగ్ పెడతారు? లోకల్ ఎంపీకి చెప్పకుండా సభ పెట్టడం తప్పు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని నేను. పదవుల కోసం వెంటపడే వ్యక్తి కాదు. నేను ఎవరికీ భయపడను. పాత కాంగ్రెస్ నేతలందరినీ పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లని చేర్చుకుంటారా?. మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు. నేను పార్టీ మారితే అందరికీ చెప్పే వెళ్తాను. కాంగ్రెస్‌ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నాడో.. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఈ రోజు మూడు ముఖ్యమైన సమావేశాలు జరిపినట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల వరద సహాయం చేయమని అడిగినట్లు చెప్పారు. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికే హోం మంత్రిని కలిసినట్లు స్పష్టత ఇచ్చారు. మునుగోడు సభ కంటే అభివృద్ధి ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. అమిత్‌షాను తెలంగాణలో ఏరియల్ సర్వే చేయమని కోరానని, రూల్ 377 కింద ఫ్లడ్స్ విషయాన్ని లేవనెత్తానని. ఆర్థిక శాఖ సంప్రదింపుల సమావేశానికి హాజరయ్యానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
రాష్ట్రపతి ఎన్నికతో కేసీఆర్ గుట్టురట్టు: కోమటిరెడ్డి
నల్లగొండ: రాష్ట్రపతి ఎన్నికతోనే కేసీఆర్ బండారం బయట పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పతి ఎన్నికలో బీజేపీని ఓడగొట్టాలంటే విపక్షా లతో కలిసి రావాల్సిందేనని, ఆయనకున్న 9 మంది ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో ఏవిధంగా ఓడగొడతారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి శనివారం నల్లగొండలో విలేకరు లతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి లబ్ధిపొందేందుకు బీజేపీతో కొట్లాట పెట్టుకున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓట్ల శాతం పెంచేందుకే కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడ ఇదని చెప్పారు. కేసీఆర్ చేతగాని తనం వల్లే గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని, గవర్నర్ నుంచి వచ్చిన పిటిషన్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజుకో చోట మహిళ లు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం బాధ కలిగిస్తోంద న్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో తొమ్మిదివ నిందితుడిగా ఉన్న హోం మంత్రి మనవడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయ లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే ఉత్తమ డీజీపీగా అవార్డు అందుకున్న మహేందర్‌రెడ్డి ఇలాంటి చేతగాని సీఎం దగ్గర పనిచేసే బదులు రాజీనామా చేసి వైదొలగాలని హితవు పలికారు. సమావేశంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నల్లగొండ జెడ్పీటీసీ లక్ష్మయ్య, నాయకుడు సైదులుగౌడ్ ఉన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. జిల్లా పరిధిలోని ప్రాజెక్టులకు సంబంధించి ఆయన మంగళవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌తో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, బ్రాహ్మణవెల్లెంల, ఎస్సె ల్బీసీ టన్నెల్ పనులపై చర్చించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, రూ.100 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని కోమటిరెడ్డి వివరించారు. కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తయిన శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాగా, సీఎం దృష్టికి తీసుకెళ్లి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే
సాక్షి, నల్లగొండ: ‘నామినేషన్ వేశాక నేను ఒక్క ఓటరును కూడా కలవను. మీరు అంగీకరిస్తరా? టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇలా ఓటర్లను కలవకుండా ఈ ఎన్నికల్లో పాల్గొంటారా? సీఎం కేసీఆర్ నా సవాల్‌ను స్వీకరించి జవాబు ఇవ్వాలి. బీజేపీ కూడా ఈ సవాల్‌ను స్వీకరిస్తుందా? గతంలోనే ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర ఈ దేశంలో నా ఒక్కడిదే. ఇప్పుడూ అదే సవాల్ చేస్తున్నా’అని నాగార్జునసాగర్ ఉపఎన్నిక బరిలో నిలిచినకాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను ఉదహరిస్తూ ‘ఓటు అనే కత్తిని ఉపయోగించుకొని రాజుల్లా నిలబడతారా? లేక అమ్ముడుపోయి బానిసలుగా మిగిలిపోతారా? నిర్ణయం మీది’ అంటూ నియోజకవర్గ ఓట ర్లను జానా ప్రశ్నించారు. హామీల అమలులో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివా రం నల్లగొండ జిల్లా హాలియాలోని ఎంసీఎం కళా శాలలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. శనివారం నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన సాగర్ జనగర్జన సభకు హాజరైన జనం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ‘కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది... తెలంగాణ ఇచ్చింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని త్యాగం చేసింది. మా పదవులనూ త్యాగం చేశాం’అని జానారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ది అసమర్థ ప్రభుత్వమని, 15 ఏళ్ల కిందటే దేశంలో ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. తమ పార్టీ పాలన హయాంలోనే ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, మహిళా సంఘాలు, రుణమాఫీ, పంటలకు మద్దతు ధరలు ఇవ్వడంతోపాటు రైతులపక్షాన అడుగడుగునా అండగా ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని పేర్కొనారు. నాగార్జునసాగర్‌లో ఏం అభివృద్ధి జరిగింది? శూన్యం అంటున్న టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ వల్లే పదవులు వచ్చాయని, టీఆర్ఎస్కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకూ వివిధ పదవులు వచ్చింది కాంగ్రెస్ వల్లేనన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేది పదవుల కోసం కాదని, ఈ స్థానాన్ని గెలిచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వడం కోసమేనన్నారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాలను ఎండగట్టడమే ఈ ఎన్నికల ప్రధాన ఎజెండా అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఇవి చరిత్రాత్మక ఎన్నిక అని, సాగర్ ప్రాజెక్టు కింద నిలబడి మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ కొత్త ప్రకటనలు చేశారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు ఈ ఎన్నికలో విజయం ఒక సందేశం ఇస్తుందని, జానారెడ్డి గెలుపు చారిత్రక అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమరిశంచారు. రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలన: ఎంపీ కోమటిరెడ్డి ‘రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. అవినీతి, నిరంకుశ పాలన పోవడానికి కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. జానా జనంలో పుట్టిన నాయకుడు’అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానమని అహంకారంతో మాట్లాడిన కేసీఆర్‌ని చెప్పు ముఖ్యమంత్రి అని పిలవాలన్నారు. ఎన్నికల్లో చెప్పు పెట్టినా ఓటు వేయాలని, ఎవరిని నిలబెట్టినా ఓటు వేయాలని చెబుతున్న కేసీఆర్‌కి సిగ్గుండాలని దుయ్యబట్టారు. సాగర్ ఉప ఎన్నికలో 23 మంది టీఆర్ఎస్ ఎమ్మేల్యేలను ఊరూరా తిప్పుతూ కాంగ్రెస్ నేతలను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బందిపోట్లుగా మారారని, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు బ్రోకర్‌గా మారాడని ధ్వజమెత్తారు. కౌలు రైతులను ఆదుకోవాలని గత ప్రభుత్వ హయాం నుంచి కాంగ్రెస్ పోరాడుతోందని, కానీ సీఎంకు ఏమాత్రం కనికరం లేకుండా పోయిందన్నారు. అప్పులు తీర్చే దారిలేక భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గురించి ‘సాక్షి’దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనాన్ని కోమటిరెడ్డి తన ప్రసంగంలో చదివి వినిపించారు. సభలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, ఆర్. దామోదర్‌రెడ్డి, కొండా సురేఖ, వి. హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
చిచ్చు రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన ప్రక్రియ పార్టీలో చిచ్చు రాజేస్తుంది. ఇప్పటికే పదవి కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడి, జగ్గారెడ్డి తదితరులు నేడో, రేపో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇస్తే.. తాము పార్టీలో ఉండలేమని కొందరు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. -
పార్టీని బతికించుకునేందుకు జిల్లాల దత్తత
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు సీనియర్ నాయకులందరు ఒక్కో జిల్లాను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం నాగార్జున సాగర్ విజయ విహార్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలని నిర్ణయించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ కమిషన్ల కోసమే అని ఆయన ఆరోపించారు. ఉస్మానియాలో రోగులకు మందులు లేవు గాని నూతన అసెంబ్లీ భవనాలకు ముహుర్తాలు పెడుతున్నారని కోమటిరెడ్డి మండి పడ్డారు. పాత భవనాలు కూలగొట్టకుండా కోర్టుకు వెళ్లామని తెలిపారు. రైతు బంధు డబ్బుతో రైతులు సంతోషంగా లేరని.. వచ్చిన డబ్బులను బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం అన్నారు. రానున్న నాలుగున్నరేళ్లు ప్రజల్లోనే ఉంటామన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. -
భువనగిరి బరిలో కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకిదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన చేసిన ప్రతిపాదనకు అధిష్టానం సమ్మతించినట్టు సమాచారం. నల్లగొండ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వెంకటరెడ్డికి భువనగిరి నియోజకవర్గంతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకటరెడ్డితోపాటు ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నాయి. 2009లో ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాజగోపాల్‌రెడ్డి 2014లో సమీప ప్రత్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అనుకూలతలను విశ్లేషించడంతో అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థిత్వంపై సుముఖత వ్యక్తం చేసినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ అంశంపై కోమటిరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడుతూ ‘పోటీలో నిలిపేందుకు పార్టీ సుముఖంగా ఉంది. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం’అని పేర్కొన్నారు. నల్లగొండ నుంచి ఉత్తమ్? నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైనప్పటికీ తెలంగాణ నుంచి కొన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని అధిష్టానం చూస్తుండగా.. నల్లగొండ నుంచి తాను బరిలో ఉండేందుకు సిద్ధమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన హుజూర్నగర్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోదాడలో ఆయన సతీమణి పద్మావతి రెడ్డి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. నల్లగొండ లోక్‌సభ నుంచి ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి 2009లో, 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. నల్లగొండ నుంచి 6 సార్లు సీపీఐ అభ్యర్థి గెలవగా, 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. రెండుసార్లు టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఒకసారి సీపీఎం అభ్యర్థి, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి గెలుపొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపుతో ఇక్కడ కూడా జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ లోక్‌సభ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా కార్యకర్తల బలం ఉండటంతో పా టు తన సామాజిక వర్గ ఓటుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవే అంశాలను ఏఐసీసీ కూడా పరిగణనలోకి తీ సుకుని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్..!
సాక్షి, నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్), రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్ఎస్ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. తాజాగా నకిరేకర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైన చిరుమర్తి.. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరనున్నాడనే ప్రచారం తీవ్రచర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికి టికెట్ నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి మరి టికెట్ ఇప్పించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయనను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రావడంలేదు. చిరుమర్తి, ఆయన సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఇంతటి నమ్మకద్రోహమా? ఇక చిరుమర్తి పార్టీ మారుతున్నాడనే వార్తలపై మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిచారు. ఇంతటి నమ్మకద్రోహం చేస్తారనుకోలేదని, పార్టీ మారే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వార్తల ద్వారనే తెలుసుకొని ఆశ్చర్యపోయానన్నారు. రెండు సార్లు టికెట్ ఇప్పించి ఆయన గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇక చిరుమర్తి పార్టీ మారడంతో జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యే అవకాశం ఉంది. -
మొదటి ఓటు మా నాన్నకే వేయడం నా అదృష్టం
నల్లగొండ: మొదటిసారి నాకు ఓటు హక్కు వచ్చింది. నా ఓటును నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వేయడం నా అదృష్టం. మా నాన్న తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు నాకు అవకాశం దక్కలేదు. అమెరికాలో ఉన్నాను.ఓటు హక్కును వినియోగించుకునేందుకు కళాశాలకు సెలవులు ఉన్నందున నేరుగా అమెరికా నుంచి వచ్చి నాన్న, అమ్మతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఓ మధురానుభూతి. నా మొదటి ఓటు మానాన్నకే వేసే అవకాశం నాకు దేవుడు కలిగించిన అదృష్టంగా భావిస్తున్నాను. – కోమటిరెడ్డి శ్రీనిధి -
కోమటిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి
నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని డక్అవుట్ చేయండి.. కోమటిరెడ్డి మంచిమనిషి భారీ మెజారిటీతో గెలిపించండి.. ఆ తర్వాత నల్లగొండలో యువతతో క్రికెట్ ఆడేందుకు వస్తానని ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ సభ్యు డు, మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. మంగళవారం నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపుకోసం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అద్దంకి బైపాస్ మర్రిగూడనుంచి పెద్దగడియారం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి తులసీ నగర్, పాతబస్తీ, అక్కచల్మ, పూల్ మీదుగా తిరిగి వన్‌టౌన్ వరకు వేలాది మంది మైనార్టీలతో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ప్రజలనుద్దేశించి అజారుద్దీన్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గెలిస్తే నల్లగొండ మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ల పేర మైనార్టీలను మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వమే 4శాతం రిజర్వేషన్ కల్పించి మైనార్టీల కుటుంబాల్లో వెలుగు నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, చిన్న పార్టీల వల్ల అభివృద్ధి జరగదు. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ.. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ అని అలాంటి పార్టీ వల్లనే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారన్నారు. నల్లగొండతో తనకు అవినాభావ సంబంధం ఉంది.. 1976లో నల్లగొండలో క్రికెట్ ఆడేందుకు వచ్చా నని గుర్తు చేసుకున్నారు. ‘జీవితాంతం కోమటిరెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించండి.. మైనార్టీలకు అండగా ఉంటాడు. క్రికెటర్‌గా నేను మాట ఇస్తున్నా.. కోమటిరెడ్డి పనిచేయకపోతే నన్ను నిలదీయండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తానని’ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, మోదీ ఇద్దరూ ఒక్కటే.. వారి వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచే పోటీ చేస్తారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని, అజారుద్దీన్ కేంద్ర మంత్రి అవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు హఫీజ్‌ఖాన్, వంగాల స్వావి ుగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి నరేందర్‌రెడ్డి, అమీన్ బాబా, పన్నాల గోపాల్‌రెడ్డి, ఇంతియాజ్, దుబ్బ మధు, సమీఖాద్రి, లతీఫ్ పాల్గొన్నారు. -
సీఎం ఎవరైనా కీలక పదవిలో ఉంటా
నల్లగొండ: రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, ఈసారి ఎవరు సీఎం అయినా తాను ముఖ్య మైన పదవిలో ఉంటానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి ఇదే తన చివరి పోటీ అని, వచ్చేసారి పోటీచేస్తే పార్లమెంట్కేనని చెప్పారు. కేసీఆర్ తనను ఓడించేందుకు చూస్తున్నారని, అది ఆయన వల్ల కాదని, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌వైపే ఉన్నారన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరి ష్కారం కోసం నల్లగొండ నియోజకవర్గ కేంద్రం, హైదరాబాద్‌లో కాల్సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటిలో ఐదుగురు 24 గంటల పాటు అం దుబాటులో ఉంటారన్నారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు వైద్యం, ఉన్నత చదువుల విషయంలో కాల్‌సెంటర్ తగిన సలహాలు ఇస్తుందన్నారు. -
మేం వస్తే యాదాద్రి ప్లాంట్‌ను ఆపేస్తాం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఆపితీరుతాం. ఆ ప్రాజెక్టు వల్ల జిల్లా కాలుష్యం బారిన పడుతుంది. థర్మల్ పవర్ ప్రాజెక్టు కారణంగా ఆ ప్రాంతం ప్రజలు బొగ్గు.. పొగతో చస్తారు. ఇది అంత గొప్ప ప్రాజెక్టు అయితే.. సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఎందుకు నెలకొల్పలేదు. జిల్లా మంత్రికి, ఆయన చెంచాలకు కాంట్రాక్టులు ఇచ్చి ప్రజలకు నష్టం జరిగే విధంగా ఇక్కడ పెట్టారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి , పార్టీలోకి తీసుకున్నారు. భూముల కోసం ఆయన రైతులను ఇబ్బందులు పెడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును ఆపితీరుతాం’అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ, దామరచర్లలోని పవర్ ప్రాజెక్టును ఇప్పుడు రూ.30 వేల కోట్లతో ప్రారంభించినా, అది పూర్తయ్యే సరికి కనీసం రూ.80 వేల కోట్లు అవుతుందని, కేవలం దోచుకునేందుకు మాత్రమే దీనిని ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండలో టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటిమాటికీ చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చానని చెప్పుకుంటున్నారని, అసలు ఆయన చేసిందంతా దొంగ దీక్షని ఆరోపించారు. గ్లూకోజ్ పెట్టుకొని దీక్ష చేస్తే ఎవరైనా చనిపోతారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ఏళ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి మచ్చలేని నాయకుడని, అలాంటి వ్యక్తిని దొంగ అంటున్న కేసీఆరే గజదొంగని విమర్శించారు. మహిళలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న కేసీఆర్ తన మంత్రివర్గంలో వారికి ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు ఇవ్వడం ఓ పెద్ద కుంభకోణం అని, కిలోల లెక్కన ఇతర రాష్ట్రాలనుంచి కొనుకొచ్చి ఇక్కడ తయారు చేయిస్తున్నట్టు చెబుతున్నారని దుయ్యబట్టారు. -
కేసీఆర్ కుటుంబ సభ్యులే సీఎంలు: కోమటిరెడ్డి
తిప్పర్తి (నల్లగొండ): టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రులు అయ్యేది కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, ఆ తర్వాత ఆయన మనుమడేనని, అదే కాంగ్రెస్ పార్టీలో అయితే ఎవరికైనా సీఎం అయ్యే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనని ఇటీవల ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి స్పందించారు. మంగళవారం నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీఎంను రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని, తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లానే ముందుందన్నారు. ‘ముస్లిం రిజర్వేషన్‌ను మేనిఫెస్టోలో చేర్చండి’ సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని టీఏ మేవా (తెలంగాణ ఆల్ మైనారిటీస్ ఎంప్లాయీస్ వర్కర్స్ అసోసియేషన్) టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం గాంధీ భవ న్లో ఆయన్ను కలిసి వినతి పత్రం అందించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేసి బిల్లు కేం ద్రానికి పంపి చేతులు దులుపుకుందని విమర్శిం చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లు పార్లమెంట్లో ఆమోదించే విధంగా చర్యలు చేపట్టాలని, ఉర్దూను రెండో ఐచ్ఛిక భాషగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో టీఏమేవా అధ్యక్షుడు గులాం గజియొద్దీన్, షేక్‌ఫారుక్ హుస్సేన్, రశీద్, ఆరిఫ్, వహీద్, సుజావుద్దీన్, ఇస్మాయిల్, మసూద్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు..రూ.4వేల కోట్లతో రైతు కార్పస్‌ఫండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షే మమే ధ్యేయంగా ఎన్నికల వరాలను ప్రకటిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరో 2 కీలక ప్రకటనలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ మేని ఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వెల్ల డించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రూ.4వేల కోట్లతో రైతు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గాంధీభవన్‌లో రాజనర్సింహ అధ్యక్షతన గురువారం జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్ ఎం.కె.గౌడ్, సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, గంగారాం, కూన శ్రీశైలం గౌడ్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు. రాజనర్సింహ విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ వర్గాల్లో చాలా డిమాండ్ ఉందని, ఈ సమస్యపై మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సీపీఎస్‌ను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగులతో చర్చించి మధ్యంతర భృతిని వారికి అనుకూలంగా ప్రకటిస్తామని, పీఆర్సీ విషయంలో న్యాయం చేస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి భాగస్వాములతో మాట్లాడి, నివేదికలు తీసుకున్న తర్వాతే ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. వారం పదిరోజుల్లో మేనిఫెస్టో సిద్ధం చేసి అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తామన్నారు. వందలాది వినతులు వస్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ గత మూడు రోజులుగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తోందని, వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయని రాజనర్సింహ చెప్పారు. ఏపీ కార్మిక సంక్షేమ మండలి తరహాలో అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలని, ఈబీసీ కార్పొరేషన్, వికలాంగులకు పింఛన్లు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, ఇళ్లు, రిజర్వేషన్లు ఇవ్వాలని, విదేశీవిద్యకు నిధుల కేటాయింపు, సాక్షరతా భారత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జూనియర్, డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గురుకుల పాఠశాలల్లో వార్డెన్ వ్యవస్థ ఏర్పాటు, కమలనాథన్ కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన 600 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, 350 మందికి పైగా నాన్‌గెజిటెడ్ అధికారులు మళ్లీ తెలంగాణకు రాక లాంటి అంశాలపై గురువారం మేనిఫెస్టో కమిటీకి వినతిపత్రాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష మేనిఫెస్టో కమిటీ భేటీలో భాగంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష జరిగింది. బీసీ, ఈబీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, పారిశ్రామిక విధానం, మైనార్టీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన కమిటీలతో పలు ప్రతిపాదనలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కమిటీలు నివేదికలు సమర్పించిన అనంతరం మరోమారు ఆ ప్రతిపాదనలపై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 700 వీఆర్వో పోస్టులకు 11లక్షల మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 4.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ మేనిఫెస్టో తయారవుతోందన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసి వారికి ఉపాధి కల్పించేందుకు గాను మండల స్థాయిలో నైపుణ్య వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణ రంగ పరిశ్రమలు, ఎంఎన్‌సీలు ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇస్తే ఆయా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా డీఎస్సీ లేక, ఉద్యోగ భర్తీలు లేక యువత అల్లాడిపోతోందని, యువత త్యాగాల పునాదుల మీదే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ మరచిపోయిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. -
61 రోజుల జాప్యాన్ని మన్నించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ వ్యవహారంలో మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకుంది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానాన్ని, వీరిద్దరి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన తీర్పు అమలును 2 నెలల పాటు ధర్మాసనం నిలిపేసింది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ కార్యదర్శి వి.నిరంజన్‌రావుకు కోర్టు ధిక్కారం కింద ఫామ్–1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలును సైతం నిలుపుదల చేసింది. కోర్టు ధిక్కార వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లలో జరిగిన 61 రోజుల ఆలస్యాన్ని కూడా మన్నించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ను బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు ఈ ఏడాది ఏప్రిల్ 17న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌కు విచారణార్హత లేదంటూ ధర్మాసనం దానిని కొట్టేసింది. అయితే కోర్టు తీర్పు మేరకు తమ పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో చేర్చలేదని, దీనికి గాను కోర్టు ధిక్కారం అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులను శిక్షించాలంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనేందుకు ప్రాథ మిక ఆధారాలున్నాయంటూ వారిద్దరికీ ఫామ్–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల భద్రతను పునరుద్ధరించనందుకు డీజీపీతో పాటు నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలకు ధిక్కార నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్పీకర్ మధుసూదనాచారికి సైతం షోకాజ్ నోటీసులిచ్చారు. జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఇరువురు కార్యదర్శులు కూడా ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలు చేశారు. ఇయర్ ఫోన్లు విసరలేదని ఎమ్మెల్యేలు చెప్పడం లేదు.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించే సమయంలో జరిగిన వివాదం తాలూకు వీడియో ఫుటేజీ కోర్టు ముందు సమర్పించకపోవడాన్నే సింగిల్ జడ్జి ప్రధాన అంశంగా పరిగణించారని, ఇది సరికాదన్నారు. ఇరువురు ఎమ్మెల్యేలు కూడా ఇయర్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారని, దీంతో వారిద్దరినీ బహిష్కరిస్తూ శాసనసభ తీర్మానం చేసిందని, ఆ తరువాత వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఘటన జరిగిన మార్చి 12న గానీ, బహిష్కరణ జరిగిన 13న గానీ ఇరువురు ఎమ్మెల్యేలు మౌనంగా ఉండి ఆ తరువాత వినతిపత్రం సమర్పించారన్నారు. మండలి చైర్మన్‌పై ఇయర్ ఫోన్లు విసరలేదని ఇరువురు ఎమ్మెల్యేలు చెప్పడం లేదని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందన్న సింగిల్ జడ్జి తీర్పు సరికాదన్నారు. బహిష్కరణ విషయంలో న్యాయ సమీక్షకు అవకాశం లేదన్న ఉద్దేశంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. అందుకే 61 రోజుల జాప్యం జరిగిందని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం సంగతి తరువాత తేలుస్తామని, ఈ అప్పీళ్లపై విచారణ జరిపే పరిధి ఉందో లేదో చెప్పాలని స్పష్టం చేసింది. తమ అప్పీళ్లకు విచారణార్హత ఉందని రోహత్గీ తెలిపారు. సభ తీర్మానంపై న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. న్యాయ సమీక్షకు ఆస్కారం లేదు.. న్యాయశాఖ కార్యదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది హరేన్ రావెల్ వాదనలు వినిపిస్తూ, సభ నిర్వహణ పూర్తిగా స్పీకర్ పరిధిలోని వ్యవహారమన్నారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయం స్పీకర్‌ది కాదని, మొత్తం సభే తీర్మానం చేసిందని ఆయన వివరించారు. సభ తీర్మానం విషయంలో న్యాయ సమీక్షకు ఆస్కారం లేదన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి... కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బహిష్కరణ తరువాత పిటిషనర్లకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అప్పీళ్ల దాఖలులో జరిగిన జాప్యంపై వాదనలు వినిపించకుండా సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పునిచ్చినప్పుడు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరించిన కార్యదర్శులు, కోర్టు ధిక్కార నోటీసుల జారీతో ఈ అప్పీళ్లు జారీ చేశారన్నారు. అంతేకాక సింగిల్ జడ్జి ముందు ఇరు కార్యదర్శులు కూడా కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ పని చేయకుండా ఈ అప్పీళ్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. లోతుగా విచారణ అవసరం ధర్మాసనం జోక్యం చేసుకుని, 12 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణార్హ త లేదంటూ కొట్టేసిందే తప్ప, కేసు పూర్వాపరాల ఆధారంగా కాదని తెలిపింది. ఇప్పుడు ఇరువురు కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లకు విచారణార్హత లేదనడం సరికాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అప్పీళ్ల దాఖలులో జరిగిన 61 రోజుల ఆలస్యానికి కారణం ఉందని అభిప్రాయపడింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల బహిష్కరణ తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ జడ్జి ముందు కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుతో సహా తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది. -
టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
-
అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని గత వారం చెప్పారు. అయితే ఇప్పుడు దాని గురించి ఎలాంటి ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు ను అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావులకు సోమవారం ఫారం–1 నోటీసులు జారీ చేస్తాం’’అని న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తేల్చిచెప్పారు. నోటీసులు జారీ చేయడానికి ముందు కావాలంటే వాదనలు వినిపించుకోవచ్చని వారి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫారం–1 నోటీసులు జారీ చేసేటప్పుడు వాదనలు వినాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అవకాశం ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. తీర్పు అమలుకు ప్రయత్నాలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం జరిగిన విచారణ సందర్భంగా తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు. ఈలోపు జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వేర్వేరుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు నిరాకరించిన ధర్మాసనం, విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. వాటితో సంబంధం లేదు కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ శివశంకరరావు శుక్రవారం విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదుల వెంకటరమణ తాము దాఖలు చేసిన అప్పీళ్ల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, స్టే ఏమైనా వచ్చిందా? అని ఆరా తీశారు. స్టే రాలేదని చెప్పడంతో, అయితే ఆ అప్పీళ్లతో తనకు సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘గత వారం ఈ కేసు విచారణ సందర్భంగా నేను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాని ఇప్పుడు ఆ విషయం గురించి కనీసం ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు అమలు గురించి చెప్పకుండా, అప్పీళ్ల గురించి చెబుతారేంటి’’ అని నిలదీశారు. విచారణను వాయిదా వేయాలని వెంకటరమణ కోర గా, న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ‘మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి.. వింటాను. నిబంధనల ప్రకారం మీ వాదనలు వినాల్సిన అవసరమే లేదు. అయినా కూడా వింటా’అని అన్నారు. దీంతో అటు వేదుల వెంకటరమణ, ఇటు న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావుకు ఏం చేయాలో పాలు పోక అలా ఉండిపోయారు. ఈ సమయంలో వేదుల వెంకటరమణ.. కనీసం సోమవారానికన్నా వాయిదా వేయాలని అభ్యర్థించడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున కార్యదర్శులిద్దరికీ ఫారం–1 కింద నోటీసులు జారీ చేస్తానని, దానికి ముందు వాదనలు వినిపించాలనుకుంటే వినిపించుకోవచ్చని చెప్పారు. ఫారం–1 నోటీసులు జారీ చేసేందుకు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్లు తమకు ఎంత మాత్రం అడ్డంకి కాదని పేర్కొన్నారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. -
మెట్టు దిగిన అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చినా, దాన్ని అమలు చేయకుండా బెట్టు చేసిన శాసనసభ కార్యదర్శి మెట్టు దిగారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రెండు వారాల గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. హైకోర్టు, వారంలోపు తీర్పును అమలు చేస్తున్నారా? లేదా? స్పష్టంగా చెప్పమంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, అలాగే తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా దానిని అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ ఇటీవల హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. నరసింహాచార్యులు తరఫున సీని యర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ధిక్కారానికి పాల్పడ్డారని ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు కోర్టు ఫాం–1 నోటీసు జారీ చేయాలనుకుంటే తాము మొదట వాదనలు వినిపిస్తామన్నారు. ఫాం–1 కింద నోటీసు జారీ చేసేటప్పుడు నోటీసులు అందుకునే వ్యక్తుల వాదనలు వినాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పును అమలు చేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వేదుల బదులిచ్చారు. రెండు వారాలు గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీనికి న్యాయమూర్తి వారమే గడువిస్తానన్నారు. -
కలహాల కాంగ్రెస్..!
ఆధిపత్యం, వర్గ పోరు, గ్రూప్ తగాదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో.. సమస్య సమసిపోకపోగా అధికమవుతోంది. ఇటీవల భువనగిరిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే శ్రేణులు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడం.. కాంగ్రెస్ మార్క్ రాజకీయం మరోమారు బయటపడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ నేతలు ఎవరికి వారే వ్యవహరిస్తున్న తీరు.. నియోజకవర్గాల వారీగా వారిని సమన్వయం చేయడం పార్టీకి సవాల్‌గా మారింది. సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. 2014 ఎన్నికల సమయం నాటి పరిస్థితులు, ఇప్పటి పరిణామాలు చూస్తుంటే పెద్ద తేడా లేనట్లు కనిపిస్తోంది. ఈనెల 16వ తేదీన భువనగిరిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ సలీం అహ్మద్ సమక్షంలో జరిగిన వివా దాలు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితికి అద్దంపట్టింది. శక్తి యాప్ నిర్వహణ, బూత్‌కమిటీల పనితీరును బలోపేతం చేయడం కోసం తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఏమేం చేస్తే వచ్చే ఎన్నికల్లో విజ యం సాధించడానికి వీలు కలుగుతుందన్న విషయాలను వివరించడానికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నేతలు వర్గాలుగా విడిపోయి బల ప్రదర్శనకు దిగారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , కోమటిరెడ్డి వర్గీయులుగా విడిపోయి గొడవలకు దిగడంతో పరిశీలకుని ముందే రసాభాసగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితిజిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మార్కు వర్గపోరు, గ్రూప్ తగాదాలు, అధిపత్య పోరాటాలు సమసిపోలేదు సరికదా మరింత పెరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని నియోజకవర్గాల వా రీగా ఐక్యం చేయడం సవాల్‌గా మారింది. ఇలాం టి గొడవలతోనే గత ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌తోపాటు 7అసెంబ్లీ నియోజకవర్గాలో కాం గ్రెస్ ఓటమి చవిచూసింది. గత ఎన్నికల నాటి గ్రూపు రాజకీయాలతో జరిగిన నష్టం నుంచి పా ర్టీ గుణపాఠం నేర్చుకుంటుందా? ఇదే తంతు కొ నసాగిస్తుందా అని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉంది. భువనగి రి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. భువనగిరిలో నియోజకవర్గంలో.. భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రాజగో పాల్‌రెడ్డి వర్గీయుల మధ్యన విభేదాలున్నాయి. ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంతో అనిల్‌కుమార్‌రెడ్డి కొంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరీ ్గయులు, అనిల్‌కుమార్‌రెడ్డి వర్గీయుల మధ్యన వి భేదాలున్నాయి. సమీక్ష సమావేశంలో భువనగిరి బీబీనగర్‌కు చెందిన స్థానిక నేతలు పరస్పరం ఘర్షణకు దిగడంతో అర్ధాంతంగా నిలిచిన సమీక్ష సమావేశాన్ని చివరగా ముగించారు. అలాగే జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సర్పం చ్ల పోరం భువనగిరి నియోజకవర్గం కన్వీనర్ పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, అందెల లింగంయాదవ్, పంజాలరామాంజనేయలు గౌడ్లు ఎవరికి వారే తమ వాదనలు విన్పించి వచ్చే ఎన్నికల్లో పోటి చేయడానికి తమకుఅవకాశం ఇవ్వాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ వర్గాలు విడిపోయి ఎవరికి వారే పోటా పోటీగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు, కొండెటే మల్లయ్య, ప్రసన్నరాజులు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్దం చేసుకుం టున్నారు. రిజర్వుడు నియోజకర్గంలో కోమటిరెడ్డి వర్గీయుడైన నియోజకవర్గం ఇంచార్జ్ చిరుమర్తి లింగయ్యకు పోటీగా ప్రసన్న రాజు, కొండేటి మల్లయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ కార్యక్రమాలతోపాటు వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అధిష్టానంఎవరికి సీటు ఇస్తుందో గాని సమీక్ష సమావేశంలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు, నాయకులు విడిపోయి తన్నుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో.. నియోజకవర్గ ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురైన స్రవంతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన ని ఇప్పటికే ప్రకటించడంతో ఇరువురి మధ్యన వి భేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడొకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రారంభించారు. జనగామ నియోజకవర్గంలో.. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల మధ్యన విభేదాలు ఉన్నాయి. సమీక్ష సమావేశం రోజున జనగామకు చెందిన మాజీ మన్సిపల్చైర్మన్లు వేముల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి పొన్నాల పార్టీని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశా>రు. సమీక్ష సమావేశంలో పాల్గొనకుండానే పొన్నాల అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోటి రూపాయలతో జనగామలో వృద్ధాశ్రమం కట్టిం చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేమ మల్లేషం మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల నాటినుంచే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కేమ మల్లేషంపై మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలకుడికి ఫిర్యాదు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో.. రిజర్వుడు నియోజకవర్గమైన తుంగతుర్తిలో 2014 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి ద యాకర్, 2009లో పోట చేసి ఓడిపోయిన మామి డి నర్సయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సి ద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల నాటికి మరికొందరు అశావాహులు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. -
డీలర్లే ప్రభుత్వాన్ని తొలగిస్తారు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కమీషన్ పెంచాలని డీలర్లు సమ్మె చేస్తే వారిని తొలగించాలని చూస్తున్న ప్రభుత్వాన్ని ఆరునెలల తర్వాత అధికారంలో నుంచి డీలర్లే తొలగిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా రూ.410 కోట్ల బకాయిలను తక్షణం చెల్లించాలని, డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 17 వేల మంది రేషన్ డీలర్లు సమస్యల పరిష్కారం కోసం ఎంతో కాలంగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించకుండా రేషన్ డీలర్లకు నోటీసులు పంపడం నియంత పోకడలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘రద్దు’పై మళ్లీ రగడ
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దుపై మలిదశ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలవనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ప్రతినిధుల బృందం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలసి వినతిపత్రం ఇవ్వనుంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు రాష్ట్రపతిని కలవాలని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, త్వరలో నిర్వహించనున్న బస్సుయాత్రలోనూ ఈ అంశాన్ని ఫోకస్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సభ్యత్వాల రద్దుపై తొలిదశలో 48 గంటల దీక్షలతో పాటు గవర్నర్‌ను కలసి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. హైకోర్టునూ ఆశ్రయించారు. సభ్యత్వాల రద్దుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. రెండు సార్లు తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ పరంగా సరిగా స్పందించలేదని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడిన నేపథ్యంలో మరో పోరాటానికి కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. ఈ వారంలోనే ‘సుప్రీం’లో పిటిషన్.. సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి కార్యాచరణను నేతలు అమలు చేయనున్నారు. స్పీకర్‌ను కలవడంతో పాటు ఏఐసీసీ పెద్దల ద్వారా రాష్ట్రపతిని కలసి విన్నవించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే కబురు పంపారు. త్వరలోనే అపాయింట్మెంట్ లభిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతిని కలవడంతో పాటు కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫు న్యాయవాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ వారంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. మూకుమ్మడి రాజీనామాలు..? న్యాయ, రాజ్యాంగపర ప్రయత్నాలతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా సభలు నిర్వహించడం, బస్సుయాత్రలో నిర్వహించే సభల్లోనూ నొక్కి వక్కాణించడం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. ఖమ్మం, అలంపూర్‌లలో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పార్టీలో చర్చ జరుగుతున్న విధంగా మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతారా.. వేచిచూడాల్సిందే! -
2019లో కేసీఆర్‌కి ఓటు వస్తే బీజేపీకి వేసినట్లే ?
సాక్షి, నల్గొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే థర్డ్ ఫ్రంట్ మొదలు పెట్టారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో కేసీఆర్‌కి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తాని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. ముస్లింలకు ఇళ్లు, స్థాలాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో 40 వేల మంది ముస్లింలు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రంజాన్ దుస్తులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దుస్తుల పేర్లతో ముస్లింలను మోసం చేస్తున్నారని కోమిటి రెడ్డి వ్యాఖ్యానించారు. -
ధిక్కరణపై కోర్టుకు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయ పోరాటం చేస్తూనే ఈ నెల 11న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని, అనంతరం దశలవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్రపతిని సైతం కలవాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మార్పు, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక తదితర పరిణామాలపై చర్చించారు. కోమటిరెడ్డిపై జానా సీరియస్ ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా, మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న కోమటిరెడ్డి డిమాండ్‌పై సీఎల్పీలో ప్రస్తావన వచ్చింది. బహిరంగ వేదికలపై తనపై ఎలా నిందలు వేస్తారని, ఇలా వ్యవహరించి పార్టీని పలుచన చేయరాదని కోమటిరెడ్డిపై జానా మందలింపు ధోరణితో అన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మారడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు ఎవరు బాధ్యత వహించాలన్న అంశంపైనా వాడివేడిగా చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై చర్చించారు. సమ్మెకు దిగితే ఉద్యోగాలు ఊడుతాయంటూ సీఎం వ్యాఖ్యానించటం దురదృష్ణకరమని, ఈ విషయంలో కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించారు. మూకుమ్మడి రాజీనామాలపై చర్చే జరగలేదని సమావేశం అనంతరం మీడియాతో జానారెడ్డి స్పష్టం చేశారు. కోర్టులంటే సీఎంకు గౌరవం లేదు: ఉత్తమ్ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కోర్టుల పట్ల ప్రభుత్వానికి, స్పీకర్‌కు కనీస గౌరవంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తామని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. త్వరలోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖమ్మం, అలంపూర్‌లో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టి, తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భట్టి నివాసంలో మరో భేటీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, మధుయాష్కీ హాజరయ్యారు. పార్టీ జిల్లాల అధ్యక్షులను పాత పది జిల్లాలకే ఉంచాలా లేదా 31 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలా అన్న అంశంపై చర్చ జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని, పార్టీ ఎజెండాను 8 నెలల ముందే జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమంలో పాల్గొన్న కార్మికులనే బెదిరిస్తారా: జీవన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైతే ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడం దురదృష్టకరమని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. ప్రభుత్వ రాయితీలు ఇవ్వకుండా డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
రాజీనామాపై కోమటిరెడ్డి నాతో చర్చించలేదు
-
మాకు ప్రాణ హాని ఉంది : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌లు రాష్ట్ర డీజీపీను కోరారు. గురువారం డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆయన్ను కలుసుకున్నారు. హైకోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పునిచ్చిందని, ఉపసంహరించిన గన్మెన్లను తిరిగి ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పు తర్వాత సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా పోలీసులు కార్యకర్తలను టార్గెట్ చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు ఆపకపోతే జంతర్‌మంతర్ వద్ద రెండు, మూడు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఓ ఎమ్మెల్యేకు కల్పించే సదుపాయాలను ప్రభుత్వం తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించడంపై సెక్యూరిటీ కమిటీకి నివేదిస్తానని డీజీపీ చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్‌లు వెల్లడించారు. -
వారికి ఏం రక్షణ ఉన్నట్లు?
సాక్షి, హైదరాబాద్ : ‘అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో ఉండటం అసౌకర్యంగా ఉందని భావించి, వారిని బహిష్కరిస్తుంటే, ఆ సభ్యులకు చట్ట ప్రకారం ఏం రక్షణ ఉన్నట్లు’అని హైకోర్టు ప్రశ్నించింది. కోమటిరెడ్డి బహిష్కరణకు మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్ విసరడం కారణమైనప్పుడు, సంపత్‌ను ఏ కారణంతో బహిష్కరించారో చెప్పాలని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదిని నిలదీసింది. ఈ రెండు విషయాలపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానంతోపాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఈనెల 17న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా? వద్దా? అనే దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలను వినిపిస్తూ, సభ ప్రతిష్టను దిగజార్చేలా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారిని బహిష్కరించే అధికారం సభకు ఉందని వివరించారు. బహిష్కరణకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 184(3) ప్రకారం సభకు కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకు ఉందని, ఆ మేరకే కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించారని చెప్పారు. సింగిల్ జడ్జి తన తీర్పులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బహిష్కరణ ఉందని చెప్పారే తప్ప, సభ్యుల అనుచిత ప్రవర్తన గురించి పట్టించుకోలేదని వివరించారు. మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్ తమ పిటిషన్లోనే అంగీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తీర్మానంలో ప్రస్తావించలేదు కదా? హెడ్‌ఫోన్ విసరడం వల్లే బహిష్కరించినట్లు ఎక్కడ పేర్కొన్నారు? అని ప్రశ్నించింది. హెడ్‌ఫోన్ విసిరి గాయపరిచిన ఘటనకు సభ మొత్తం సాక్ష్యమని, అలాంటి వాటికి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని వైద్యనాథన్ తెలిపారు. దీనికి ధర్మాసనం.. కోమటిరెడ్డిని హెడ్‌ఫోన్ విసిరిన కారణంగా బహిష్కరించామంటున్నారు.. మరి సంపత్‌ను ఏ కారణంతో బహిష్కరించారని అడిగింది. దీనికి వైద్యనాథన్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై తమకు స్పష్టతనివ్వాలని వైద్యనాథన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోమటిరెడ్డి న్యాయవాదిపై ఆగ్రహం వాదనలు ప్రారంభం కావడానికి ముందు కోమటిరెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సింగిల్ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫున ఒక్కరే అఫిడవిట్లు దాఖలు చేసి.. తమ ముందు మాత్రం వేర్వేరుగా దాఖలు చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబితే, విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వైద్యనాథన్ స్పందించకపోవడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. -
‘క్విడ్ ప్రోకో’లో భాగమే
సాక్షి, హైదరాబాద్: క్విడ్ ప్రోకో (నాకిది, నీకది)లో భాగంగానే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణాన్ని ప్రైవేటు భూముల్లో తలపెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్(ప్రభుత్వ నిర్ణయాలను ముందే తెలుసుకుని, వాటి ద్వారా బహిరంగ మార్కెట్లో లబ్ధి పొందడం)కు పాల్పడుతూ మోసం చేస్తున్నారు. సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మాణానికి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 55.38 ఎకరాలు ఆమోదయోగ్యమని తేల్చినా కోట్లు ఖర్చు చేసి ప్రైవేటు భూముల్లో నిర్మించ తలపెట్టారు. కుడకుడ గ్రామంలో 17 మంది రైతుల నుంచి 2016లో జగదీశ్‌రెడ్డి 34 ఎకరాలు రూ.1.2 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడే శ్రీ సాయి డెవలపర్స్ 41.28 ఎకరాలు కొన్నది. ఈ భూముల్లో రియల్టీ వ్యాపారం కోసమే కలెక్టరేట్/ఎస్పీ కార్యాలయాల సముదాయాన్ని సూర్యాపేటకు దూరంగా ఉన్న బీబీగూడెం, కుడకుడ గ్రామాల మధ్య నిర్మిస్తున్నారు. శ్రీ సాయి డెవలపర్స్‌లో 4వ భాగస్వామి అయిన జి.ప్రకాశ్ సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ భర్త’’ అని ఆరోపించారు. ఈ వివరాలన్నింటినీ కోర్టు దృష్టికి తెచ్చేందుకే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. బీబీగూడెం, కుడకుడల్లో కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టడానికి కారణాల్ని వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై చకిలం రాజేశ్వర్‌రావు వేసిన పిల్‌ను ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారించింది. గత ఆదేశాల మేరకు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు జీవోల నోట్ ఫైల్‌ను ధర్మాసనానికి అందజేశారు. -
మా అప్పీల్‌పై వాదనలు వినండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సోమవారం హైకోర్టును కోరారు. ఈ అప్పీల్‌పై వాదనలు వినడంతో పాటు విచారణార్హత తేల్చాలని కోర్టును కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం లేదని, అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది. బహిష్కరణ తీర్మానంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మళ్లీ ఇక్కడ ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని అడిగింది. ఈ విషయం పైనా వాదనలు వినిపిస్తామని, అందువల్లే వాదనలు వినాలని కోరుతున్నట్లు వైద్యనాథన్ చెప్పారు. అప్పీల్ దాఖలుకు అనుమతివ్వడంపై ఈ నెల 26న విచారణ చేపడతామని దర్మాసనం తెలిపింది. -
టీఆర్ఎస్పై పోరు ఉధృతం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించారు. శాసనసభ్యత్వాల రద్దు వ్యవహారంలో హైకోర్టులో ఊరట పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌తోపాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో రాహుల్‌ను కలిశారు. తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టులో విజయం సాధించిన పరిణామాలపై రాహుల్‌కు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కోమటిరెడ్డి, సంపత్ కృషి చేశారంటూ రాహుల్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. కోమటిరెడ్డిని ఆలింగనం చేసుకుని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఈ బృందానికి సూచించారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘కోర్టు తీర్పును రాహుల్‌గాంధీకి వివరించాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన కృషిని ఆయన అభినందించారు. టీఆర్ఎస్ సర్కారుపై ఏ స్థాయిలోనైనా పోరాటం ఉధృతంగా ఉండాలన్నారు. బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కూడా రెండు రోజులు పాల్గొంటారు’’అని ఉత్తమ్ వివరించారు. హైకోర్టు తీర్పు తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందని కుంతియా పేర్కొన్నారు. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని ఆయన సూచించారు. గ్రూపులకు అతీతంగా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి అన్నారు. ‘‘శాసనసభను అవమానించిందే టీఆర్ఎస్ పార్టీ’’అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు స్ఫూర్తితో అన్ని విషయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని రాహుల్ సూచించినట్టు సంపత్ కుమార్ తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, కటకం మృత్యుంజయం, తదితరులు రాహుల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని ఈసీ హామీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ ఉప ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌లు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు కోట్టేసిందని, అందువల్ల రద్దు చేసిన అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ప్రభుత్వం పంపిన నోటిఫికేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, ఉప ఎన్నికల కోసం అందిన నోటిఫికేషన్‌పై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి హామీ ఇచ్చినట్టు నేతలు మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న 15 లక్షల ఓటర్లను తొలగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనిపైనా రావత్‌కు వివరించామన్నారు. -
అనర్హత తీర్పుపై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసన సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంపై టీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. కోర్టు తీర్పు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నత చట్టసభగా శాసనసభ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో సీఎం సమావేశమయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందా, అసెంబ్లీని ఆదేశించిందా అన్న దానిపై స్పష్టత తీసుకుంటున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా అన్న అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శాసనసభ అయితే, హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అనర్హత వేటు వేసిన శాసనసభ మాత్రమే దీనిపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రభుత్వానికి సంబంధమే లేదని టీఆర్ఎస్ ముఖ్యులు అంటున్నారు. ఇద్దరు సభ్యులపై వేటు వేయడంలోనూ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనూ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. న్యాయ నిపుణులేమంటున్నారు? ప్రభుత్వానికి సంబంధం లేని నిర్ణయాన్ని అమలుచేసే అధికారం ఎలా ఉంటుందని న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు. కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ నిర్ణయమైనా అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే చట్టపరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై గులాబీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శాసనసభా, ప్రభుత్వమా అన్న సాంకేతిక అంశాలను పక్కనబెడితే రాజకీయ వర్గాల్లో చోటుచేసుకోనున్న పరిణామాలనూ అధికార పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. స్పీకర్, చైర్మన్, కార్యదర్శి అత్యవసర భేటీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. స్పీకర్ కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని చట్టసభలు గతంలో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సందర్భాలు, ఆ సమయంలో ఆయా సభలు వ్యవహరించిన తీరుపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఈ అంశంపై గతంలోని ఉదాహరణలను అధ్యయనం చేసి, నివేదికను అందజేయాలని కార్యదర్శికి స్పీకర్ సూచించారు. అధ్యయనం తర్వాతే నిర్ణయం: స్పీకర్ హైకోర్టు తీర్పులో ఏముందో అధ్యయనం చేసిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వెల్లడించారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మాట్లాడతామని, అప్పటిదాకా మాట్లాడేదేమీ లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై స్పందించేందుకు వి.నర్సింహాచార్యులు కూడా నిరాకరించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు చెల్లదు
-
మీ దత్తపుత్రుడి అవినీతి చూడండి కేసీఆర్
-
కోమటిరెడ్డిని...ఎదుర్కోలేకనే..
మునుగోడు : కోమటిరెడ్డి బ్రదర్స్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే శాసనసభా సభ్యత్వాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి నారబోయిన రవి విమర్శించారు. శనివారం మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన గూర్చి ప్రజలకు వివరిస్తున్నారనే కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రభుత్వం కక్ష పెంచుకుందన్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన గన్మెన్లని తొలగించడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఎత్తులువేసినా 2019లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ నెల 9న కోర్టు ఇచ్చే తీర్పులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అనుకూలంగా వస్తుందని, అందుకు సీఎం కేసీఆర్ తలవంచక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేమిరెడ్డి జితెందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు, బీసం విజయ్, అబ్బరబోయిన బాలక్రిష్ణ, ఆరేళ్ల సైదులు, నారబోయిన శరత్, దొటి మహేష్ యాదవ్ పాల్గొన్నారు. -
దురుద్దేశంతోనే బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఎలాంటి చర్చ, సంప్రదింపులు లేకుండానే, మా వివరణ తీసుకోకుండానే మమ్మల్ని సభ నుంచి బహిష్కరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. శాసనసభా నిబంధనల్లో ఎక్కడా బహిష్కరణ అనేది లేదు. బహిష్కరణ చాలా కఠినమైన శిక్ష. బహిష్కరణకు గురైన సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఖాళీ అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సభా నిబంధనల్లో బహిష్కరణను చేర్చలేదు. ఏ ఆరోపణ ఆధారంగా మమ్మల్ని బహిష్కరించారో, ఆ ఆరోపణ గురించి బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదు. మా బహిష్కరణ విషయంలో సభ లోపల చెప్పిన కారణాలు, సభ వెలుపల చెప్పిన కారణాలు, కోర్టుకు చెప్పిన కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మా బహిష్కరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది’’అని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ‘‘అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఓ రాష్ట్రం తరఫున న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తారు. రాష్ట్రం అంటే ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సమర్పిస్తానని కోర్టుకు ఏజీ స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి.. ఈ హామీకి ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఏజీ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు కాబట్టి ఏజీ ఇంకా కొనసాగుతున్నట్లే. ఆయన ఇచ్చిన హామీ కూడా ఇంకా అమల్లో ఉన్నట్లే’’ అని వివరించారు. ఈ హామీకి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, దాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. రిప్లై అఫిడవిట్ దాఖలు సభ నుంచి తమను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కూడా వారు సవాలు చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో చోటుచేసుకున్న పరిణామాల తాలూకు వీడియో ఫుటేజీలను సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు సమాధానంగా కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ రిప్లై అఫిడవిట్ (తిరుగు సమాధానం) దాఖలు చేశారు. ఏజీ ఇంకా కొనసాగుతున్నట్లే! ‘‘అడ్వొకేట్ జనరల్‌ను గవర్నర్ నియమిస్తారు. ఏజీకి రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ తరఫున హాజరయ్యే అధికారం ఉంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తరఫున, అసెంబ్లీ తరఫున ఆయన హామీ ఇవ్వొచ్చు. ఈ కేసులో మార్చి 19న కోర్టుకు హాజరైన ఏజీ.. గవర్నర్ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. తర్వాత అదనపు అడ్వొకేట్ జనరల్ మార్చి 27న హాజరై ఏజీ రాజీనామా చేశారని తెలిపారు. అయితే ఏజీ సిఫారసుల మేరకు హైకోర్టులో పలువురు ప్రభుత్వ సహాయ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం మార్చి 31న జీవోలు జారీ చేసింది. అంటే అడ్వొకేట్ జనరల్ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. కాబట్టి ఆయన ఇంకా ఏజీగా కొనసాగుతున్నట్లే లెక్క’’అని తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. మా వ్యాజ్యానికి విచారణార్హత ఉంది ‘‘సభా నిర్ణయాల్లో దురుద్దేశాలు ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా, అహేతుకంగా ఉన్నప్పుడు, ఆ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. సహజ న్యాయ సూత్రాలను పాటించనప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి మా వ్యాజ్యానికి విచారణార్హత ఉంది. అందువల్ల మా నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఇచ్చిన గెజిట్‌ను రద్దు చేయండి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ప్రసంగం సభా కార్యకలాపాల కిందకు రాదు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాతే సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అసాధారణ కేసుల్లో ప్రధాన అభ్యర్థనను మధ్యంతర ఉత్తర్వుల జారీ సమయంలోనే ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో పిటిషనర్లకు తీరని నష్టం కలుగుతుందని కోర్టు భావిస్తే ఆ మేరకు తగిన నిర్ణయం తీసుకోవచ్చు. మాకు అన్యాయం జరిగిందనేందుకు గట్టి ప్రాథమిక ఆధారాలున్నాయి. ఈ విషయంలో సత్వరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుంటే జరిగే నష్టం కూడా అపారమనేందుకు ఆధారాలున్నాయి. కాబట్టి మా బహిష్కరణను రాజ్యాంగ విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించండి’’అని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ కోరారు. -
మా పాత్రేమీ లేదు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వ రద్దు, వారు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ వ్యవహారంలో తమ పాత్రేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ‘వారు దురభిప్రాయంతో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు. పైగా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలివ్వాలని కోరారు తప్ప మాకు నిర్దిష్ట ఆదేశాలివ్వాలని కోర్టును కోరలేదు. కాబట్టి మాపై వ్యాజ్యాన్ని పిటిషనర్లకు జరిమానా విధించి మరీ కొట్టేయండి’ అని కోర్టును అభ్యర్థించింది! తమ శాసనసభ్యత్వాల రద్దును, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. హెడ్ ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచామన్నందున సంబంధిత వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కూడా వారు కోర్టును కోరారు. కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి. 3 పేజీల ప్రభుత్వ కౌంటర్లో ఈ వ్యవహారంలో భవిష్యత్తులోనూ తమ ప్రమేయం ఉండబోదని తెలిపింది. ఇక, పిటిషనర్లు తమపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు గనుక సభలో జరిగిన ఉదంతంపై బదులివ్వాల్సిన అవసరం లేదని ఈసీ తన 4 పేజీల కౌంటర్లో తెలిపింది. ‘మీ ఆదేశాల మేరకు నల్లగొండ, అలంపూర్ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహణపై మేం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాబట్టి మాపై వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి సోమవారం నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. -
నన్ను చంపేందుకు కేసీఆర్ కుట్ర: కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి/వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ నాయకులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన యాదాద్రి జిల్లా భువనగిరిలో, వరంగల్‌లో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. తనకు ఉన్న గన్మెన్లను ఉప సంహరించడంతో హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. తనను అడ్డుకునేందుకే అత్యంత సన్నిహితుడైన బొడ్డుపల్లి శ్రీనును హత్య చేశారని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను శాసనసభలో, బయట ప్ర«శ్నిస్తున్నందుకే తనపై కక్షగట్టి అంతం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తనకేమైనా జరిగితే ప్రజలు ప్రగతి భవన్, కేసీఆర్ ఫాంహౌజ్‌ను నేలమట్టం చేస్తారని హెచ్చరించారు. -
కోమటిరెడ్డికి భద్రత పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: తనకు ప్రాణహాని ఉందని ఓవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తుండగానే ఆయన గన్‌మెన్‌ను తొలగించడం దారుణమని, ఇది కక్షసాధింపు చర్యేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కోమటిరెడ్డికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభలో జరిగిన ఉదంతానికి సంబంధించి వీడియో ఫుటేజీ అడిగి పక్షం రోజులు కావస్తున్నా ఇవ్వడం లేదని, ప్రభుత్వానికి ఉన్న భయమేంటో స్పష్టం చేయాలని అన్నారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా కొప్పుల రాజు చాలా క్రియాశీలకంగా పనిచేశారని, కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కార్యాలయంలో ఆయన నియామకం సంతోషకరమన్నారు. -
టీఆర్ఎస్ సర్కారు దిగజారుడుకు పరాకాష్ట!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గన్మన్లను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది టీఆర్ఎస్ సర్కారు రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి గన్మన్ల తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల రద్దుపై తాము కోర్టులో పోరాడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గన్మన్లను ఉపసంహరించిందని ఆరోపించారు. కొద్దిరోజుల కింద కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యారని.. ఇలాంటి సమయంలో వెంకట్‌రెడ్డి గన్మన్లను తొలగించడం కక్షపూరిత చర్య కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని, ఎక్కడ ఎవరికి ఎలాంటి హాని జరిగినా ఊరుకునేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరు సరికాదు: జానారెడ్డి వెంకట్‌రెడ్డి గన్మన్ల తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రభుత్వ తీరు సరికాదని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఇంటెలిజెన్స్ అధికారులు పునరాలోచించుకోవాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని కోమటిరెడ్డి ఎప్పటినుంచో చెబుతున్నారని.. ప్రాణహాని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఇతరులకు సెక్యూరిటీ కల్పిస్తున్న ప్రభుత్వం.. కోమటిరెడ్డికి సెక్యూరిటీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డికి గన్మన్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కక్షపూరితమని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డికి భద్రతను తొలగించడం దారుణమన్నారు. -
రాజీనామాల యోచనలో కాంగ్రెస్?
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ అంశంపై మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఇద్దరు సభ్యులకు మద్దతుగా రాజీనామాలు సమర్పిస్తే ఎలా ఉంటుంది? ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? అన్న కోణంలో చర్చ జరిగింది. కానీ ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ముందు ఆ ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో స్పష్టమయ్యాక అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు వెళ్దామన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. మొత్తమ్మీద తమ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసే దిశలో కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. దీనిపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని, పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ.. ప్లీనరీ సమావేశాలకు వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించింది. కుంతియాతో మంతనాలు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఇతర సభ్యులను సస్పెండ్ చేస్తూ అధికార పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ లాబీల్లోని సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తర్వాత సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి మాట్లాడారు. సభ్యుల సలహాలను తీసుకున్న తర్వాత ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు అంశాన్ని.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. అధికార పక్షం అనుకున్నదే తడువుగా ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి గెంటేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ విషయాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏఐసీసీ ప్లీనరీలో దీనిపై చర్చించి.. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా తీర్మానాన్ని ఆమోదింపజేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి ఆందోళనలు పార్టీ కేడర్‌ను ఇదే అదనుగా సమాయత్తం చేసే కార్యాచరణను సీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కేడర్ ఆందోళనకు దిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం రసాభాసగా మారింది. -
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
-
కోమటిరెడ్డిపై వేటు!
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు దాదాపుగా ఖాయ మైంది. మంగళవారం సభ ప్రారంభంకాగానే కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల వరకే సస్పెన్షన్‌ను పరిమితం చేస్తారా, పూర్తి పదవీకాలం వరకు సస్పెండ్ చేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. వివిధ రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకున్నారన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల నిబంధనలతోపాటు పొరుగు రాష్ట్రాల ఉదాహరణలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని హరీశ్ వెల్లడించారు. వీడియో క్లిప్పింగులను ప్రభుత్వం పరిశీలించింది. నిరసన తెలియజేసే క్రమంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరెవరు దూకుడుగా వ్యవహరించారు, చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయం కావడానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న అంశాలను పరిశీలించారు. అసెంబ్లీలో నిరసన సందర్భంగా ఎవరు దూకు డుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ గతంలోనే హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పేపర్లు విసిరినా, ఇతర పద్ధతుల్లో ఆటంకం కలిగించినా బడ్జెట్ సెషన్ పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ముందుగా హెచ్చరించినా పట్టించుకోకుండా గవర్నర్‌పై దాడికి యత్నించిన కాంగ్రెస్ సభ్యులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతకుముందు సమావేశాల్లో టీడీపీ సభ్యుడిగా ఉన్న ఎ.రేవంత్‌రెడ్డి తన టేబుల్ దగ్గర నిలబడి నిరసన తెలిపారు. అందుకు ఆయన్ను సమావేశాలు జరిగిన పూర్తికాలం సస్పెండ్ చేశారు. కేవలం తన టేబుల్ దగ్గర నిలబడి, నిరసన తెలియజేసినందుకే సస్పెండ్ చేసిన అధికారపక్షం.. తాజా ఘటనపై మరింత కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే కాంగ్రెస్ సభ్యులు దాడికి ప్రయత్నించలేదని ప్రతిపక్షనేత జానారెడ్డి వాదిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన వ్యక్తం చేసే సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను, భౌతికదాడి కోణంలో చూడొద్దని అంటున్నారు. సభలో ప్రజల వాణిని వినిపించే బాధ్యత ఉన్న సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని, ఇలాంటివి జరిగితే చర్చించి, మరోసారి చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సస్పెన్షన్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అధికారపక్షం గట్టిగా భావిస్తోంది. -
నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తా: కోమటిరెడ్డి
వేములపల్లి/తిప్పర్తి: 2019 ఎన్నికల్లో తా ను నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్‌రెడ్డికి, ఎమ్మెల్యే భాస్కర్రావులకు డిపాజిట్ దక్కకుండా ఓడిస్తామని శపథం చేశా రు. మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లు మామ, అల్లుడి నియోజకవర్గాలకేనని, అది కూడా రూ.40 వేల కోట్ల కాళే« శ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు పెంచి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పజెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
శ్రీనివాస్ హత్యపై ఎస్పీ అవాస్తవాలు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ కాంగ్రెస్ నేత, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయమై జిల్లా ఎస్పీ పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చిబండి వివాదమే కారణమని చెబు తున్న పోలీసులు ఇప్పటిదాకా ఆ మిర్చిబండి యజమాని యాదయ్యను విచారించలేదన్నారు. తన భర్త కనిపిం చట్లేదని లక్ష్మి పోలీసులను కలిసినా స్పందించలేదని, మోహన్ అనే వ్యక్తి స్పందించి శ్రీనివాస్ శవాన్ని చూపిం చాడని వెల్లడించారు. పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా భర్త శవాన్ని లక్ష్మి ముందుగా చూసినట్టుగా అబద్ధం చెప్పా రన్నారు. ఈ హత్య గురించి పోలీసులకు ముందుగానే తెలుసునని, ఇది పథకం ప్రకారం జరిగిందని, దీనిలో సీఎం కేసీఆర్, డీజీపీ, ఎస్పీ పాత్ర ఉందని ఆరోపించారు. శ్రీనివాస్‌ను చంపేస్తామని 20 రోజుల ముందుగానే బెదిరింపులు వచ్చాయని చెప్పారు.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చంపేస్తామంటూ ఎమ్మెల్యే వీరేశం మనుషులు ఫోన్లలో బెదిరిస్తున్నారని, ఆయనను చంప డానికి కుట్ర జరుగుతున్నదన్నారు. బెదిరింపులు వస్తున్న ఫోన్ నంబర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదన్నారు. కేసును సీబీఐకి అప్పగించాల న్నారు. కేసుపై కోర్టులో అప్పీలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ పార్టీ చంపిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కోదండరాంను, తనను చంపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్ ప్లాంట్లలో భారీ స్కాం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిని ఆధారాలతో సహా నిరూపిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ కుంభకోణంపై ఎవరు చర్చకు వచ్చినా నిరూపించడానికి సిద్ధమన్నారు. ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్‌కు భాగస్వామ్యం ఉందని, స్కాం జరగలేదనే ధైర్యముంటే కేసీఆర్ చర్చకు రావాలని కోమటిరెడ్డి సవాల్ చేశా రు. పవర్ లేని విద్యుత్ శాఖ మంత్రి జగ దీశ్‌రెడ్డితో అవసరం లేదన్నారు. కుంభకోణాన్ని నిరూపించలేకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. -
నకిరేకల్‌లో కాంగ్రెస్ గెలవకుంటే రాజకీయ సన్యాసం!
నకిరేకల్: ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శనివారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే ఎమ్మెల్యే వేముల వీరేశానికి గుబులు పుడుతుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం దిగివచ్చినా ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మూడవ కన్ను తెరిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా తమకు టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. -
పేదల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆసుపత్రులకు నిధులను ఇవ్వడం లేదని సీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గాంధీ ఆసుపత్రిని శనివారం సందర్శించిన అనంతరం మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులే కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు గాంధీ ఆసుపత్రిలో దుస్థితికి ఎక్కడా పొంతన లేదన్నారు. రోజుకు 4,500 రోగులు గాంధీకి వస్తున్నారని, అక్కడ 2,200 మాత్రమే బెడ్స్ ఉన్నాయి. నిర్వహణకు కూడా నిధులను కేటాయించడం లేదన్నారు. గాంధీలో 700 మంది నర్సులు ఉండాల్సి ఉండగా.. 400 మందే ఉన్నారని చెప్పారు. నర్సు పోస్టులు 300 ఖాళీగా ఉన్నాయన్నారు. మందులన్నీ బయటే కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. డెంగ్యూతో వచ్చిన పేదరోగులు ప్లేట్లెట్ల కోసం, మందుల కోసం అప్పుల పాలవుతున్నారని చెప్పారు. గాంధీలో రోజుకు 4గురు చనిపోతున్నారని కోమటిరెడ్డి చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ దబాయింపులు, సొల్లు మాటలను ఆపి పేదల ఆరోగ్యానికి నిధులను ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. -
ఉత్తమ్ నాయకత్వంలో పోటీ చేయను
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న సీనియర్లను గౌరవించుకోవాలనే బుద్ధి, ఇంగిత జ్ఞానం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ నాయకత్వంలో పార్టీకి ఐదారు సీట్లకు మించి రావన్నారు. పొన్నాల లక్ష్మయ్యకంటే ఉత్తమ్ నాయకత్వం అధ్వాన్నమన్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వల్ల పార్టీ గత ఎన్నికల్లో నష్టపోయిందని కుంతియా వ్యాఖ్యా నించారని, కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడైన ఉత్తమ్‌ను చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓట్లేస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తమలాంటి సీనియర్లను పార్టీ నుంచి పంపిస్తే ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలో ఉత్తమ్ ఉన్నారన్నారు. జీహెచ్ఎంసీ, రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఉత్తమ్ అసమర్థత కారణమన్నారు. తాము పార్టీ వీడతామని వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. -
ఎన్టీఆరే ఓడిపోయారు... కేసీఆర్ ఎంత?
అక్టోబర్‌లో పీసీసీ మార్పు: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: సినీ గ్లామర్, చరిష్మా ఉన్న ఎన్టీఆర్ వంటి నాయకుడే ఎమ్మెల్యేగా ఓడిపోయారని, నోరుతెరిస్తే అబద్ధాలు తప్ప ఏనాడూ నిజాలు మాట్లాడని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత అని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 65–70 సీట్లు వస్తాయని చెప్పారు. అక్టోబర్‌లో పీసీసీలో మార్పు ఉంటుందని, సంస్థాగత ఎన్నికలు అందుకోసమేనని, పీసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తామని కోమటిరెడ్డి ప్రకటించారు. రాహుల్‌గాంధీని కలసి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరి నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులపై తనకు ఆసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. కాగా, మియాపూర్ భూముల్లో రూ.50 వేల కోట్ల స్కాం జరిగిందని, దీనిలోని సూత్రధారులను అరెస్టు చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హోంమంత్రిని కోమటిరెడ్డి మంగళవారం కలిశారు. -
రాష్ట్రావిర్భావం రోజు బహిరంగ సభ
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావిర్భావాన్ని పురస్కరించుకుని జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కాంగ్రెస్‌పై తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా పట్టుదలను ప్రజల్లోకి తీసుకుపోతామని, దీనికి టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే బాగుంటుందని, అనుమతివ్వకుంటే నల్లగొండలోనే నిర్వహిస్తామన్నారు. సోనియా, రాహుల్‌ను సభకు ఆహ్వానిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో ఐక్యతా రాగం!
► నల్లగొండ వేదికగా జానా, ఉత్తమ్, కోమటిరెడ్డి భేటీ ►2009 తర్వాత తొలిసారి కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్ ►ముగ్గురూ కలసి భోజనం.. రాజకీయ మంతనాలు సాక్షి, నల్లగొండ: రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఐక్యతారాగం వినిపించింది. ఉప్పు, నిప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీనియర్ అయిన జానారెడ్డి ఒక్క చోట చేరారు. నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఈ ముగ్గురు నేతలు కలసి భోజనం చేశారు. మంతనాలు చేశారు. కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్ రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 2019లో అ«ధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కలిసుండాలనే సంకేతాలివ్వడం గమనార్హం. ఇన్నాళ్లు ఎడమొహం.. పెడమొహమే కీలకమైన టీపీసీసీ చీఫ్, సీఎల్పీ నేత పదవు ల్లో ఉన్న ఉత్తమ్, జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాత నల్లగొండ జిల్లాకు చెందినవారే. 2009 తర్వాత కోమటిరెడ్డి మంత్రి అయిన నాటి నుంచి విభే దాలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఉత్తమ్‌కు మంత్రిగా అవకాశం లభించడం లాంటి ఘటనలు అంతరాన్ని మరింత పెంచాయి. గతంలో హుజూర్నగర్ పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి వర్గీయులకు, ఉత్తమ్ వర్గీయులకు బాహా బాహీ కూడా జరిగింది. ఉప్పు, నిప్పులా ఉండే నేతలిద్దరూ ఇప్పుడు కలిసిపోవడం.. ఏడేళ్ల తర్వాత ఉత్తమ్ కోమటిరెడ్డి నివా సానికి రావడం, తో కలసి రాజకీయ చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
టీఆర్ఎస్పై యుద్ధమే
సీఎల్పీ నేత కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: హామీల అమలులో వైఫల్యం, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వంపై శాసన సభలో యుద్ధం చేస్తామని సీఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చ రించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయకపోవడం, కేంద్రం నుంచి వచ్చిన 790 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని దారి మళ్లించడం వల్ల రైతాం గానికి తీవ్ర ఇబ్బందులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకిగా వ్యవహ రిస్తున్నారని వ్యాఖ్యానించారు. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, దళితు లకు మూడెకరాల భూమిని పంపిణీ చేయడం లేదని ఆయన విమర్శించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వ కుండా ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో పెద్ద కుట్ర జరుగుతున్నదని అన్నారు. -
ఫాంహౌస్‌లో ఉంటే సమస్యలు తెలుస్తాయా
ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. తీవ్రమైన కరువుతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, ప్రభుత్వం నుంచి రుణమాఫీ అందకపోవడం వంటివాటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమరిశంచారు. వెంటనే రుణమాఫీని ఒకేసారి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలకు నీరందకుండా కష్ణా ట్రిబ్యునల్ నిర్ణయం బాధాకరమని వెంకట రెడ్డి అన్నారు. -
వాళ్లు మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ వీడిన గుత్తా, భాస్కర్ రావులు స్వప్రయోజనాలకోసమే పార్టీ వీడారన్నారు. పార్టీలో అంతర్గత కలహాల వల్లే పార్టీ వీడానని గుత్తా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నైతిక విలువలు ఉంటే వెంటనే గుతా పదవికి రాజీనామా చేయాలన్నారు. గుత్తా పార్టీ వీడినందుకు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అధిష్టానం ఆదిశిస్తే నల్గొండ ఎంపీగా పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుస్తానని అని చెప్పాడు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదన్నారు. -
‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పార్టీ మారి పరువును పోగొట్టుకోవద్దని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ పార్టీ మారుతారని తాము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ మెట్లు ఎక్కకున్నా, పార్టీ సభ్యత్వం లేకున్నా సోనియాగాంధీ చలువతో రెండుసార్లు ఎంపీ అయ్యాడన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఒకే విడతలో రుణమాఫీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకోసం రూ. 300 కోట్లు ఖర్చుచేయడం అవసరమా అని ప్రశ్నించారు. -
'కాంట్రాక్టులు కావాలంటే టీఆర్ఎస్లోకి వెళ్లొచ్చు'
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించేలా ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించడం క్రమశిక్షణా రాహిత్యమేనని చెప్పారు. టీఆర్ఎస్కు మద్దతుగా కోమటిరెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టులు కావాలంటే టీఆర్ఎస్లోకి వెళ్లొచ్చునని సూచించారు. అంతేకానీ కోవర్టు రాజకీయాలు చేయొద్దని శ్రవణ్ హితవు పలికారు. -
చంపుతామంటున్నారు: కోమటిరెడ్డి
తాను ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే టీఆర్ఎస్ నేతలు చంపుతామని బెదిరిస్తున్నారని అయినా భయపడేది లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన కౌన్సిలర్లను, ఎంపీటీసీలను, తనను కూడా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. చావడానికైనా భయం లేదని తాను దేనికీ భయపడే వ్యక్తిని కాదని, కార్యకర్తలకు ఏమవుతుందోనని ఆందోళన కలుగుతోందన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని, అలాంటిది తనపైనే బెదిరింపులకు పాల్పడటం చూస్తే బాధ కలుగుతోందన్నారు. తమపైన దౌర్జన్యాలు చేయడం సరైంది కాదని ఎవరైనా ప్రజల కోసం పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించకుండా అధికారులను కూడ బెదిరించారని, మున్సిపల్ ఈఈనిచెప్పడానికి వీలులేని భాషలో దూషించారన్నారు. వాటర్‌ట్యాంక్ ప్రారంభోత్సవానికి రాకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి బెదిరించడం శోచనీయమన్నారు. వారం రోజుల క్రితం అదనపు డీజీపీని కలిసి అన్ని విషయాలు వివరించానని తెలిపారు. తానంటే సీఎంకు గౌరవం ఉందని, కానీ నల్లగొండలో దానికి విరుద్ధంగా నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో జరుగుతున్న ఘటనలపై రిపోర్టు తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరిగిపోయి ప్రజలకు మంచినీరు, పశువులకు గడ్డి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏఎమ్మార్పీ ద్వారా నీటి విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని తెలిపారు. సాగర్ నీళ్లు హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని కానీ జిల్లాలో మాత్రం సరఫరా కావడం లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ఉన్నారు. -
టీఆర్ఎస్ దౌర్జన్యాలపై సభలో నిలదీస్తా
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ రూరల్: టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యాలు, దందాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నీలదీస్తామని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంతోపాటు, ఇసుక దందాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులను నిరసిస్తూ జాతీయ రహదారిపై లక్ష మందితో ధర్నా చేస్తామన్నారు. ఆషామాషీ తెలంగాణ కాదు... అభివృద్ధి అంటూ సీఎం ఓ పక్క ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ... మరో పక్క యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో కిందిస్థాయి టీఆర్ఎస్ నాయకులు మాత్రం దాడులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. -
మనమిద్దరం కొత్తపార్టీ పెడదామా?
హైదరాబాద్ : తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఆవిర్భావించబోతోందా? కొత్త పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే 40 సీట్లు సాధిస్తుందా? అవునంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ ప్రాంగణంలో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమ తమ పార్టీల్లో సరైన గుర్తింపు దొరకడం లేదని ఇద్దరూ ఆవేదన చెందారు. ఈ క్రమంలో తెలంగాణ రెడ్డి సమితి పేరుతో పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ పార్టీకి ప్రెసిడెంట్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ అయితే బాగుంటుందని ఇద్దరు ఎమ్మెల్యేలు తీర్మానింటారు. టీడీపీలో గట్టి నోరున్న నేత అయినప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు కారణంగా తగిన గుర్తింపు లభించడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. -
'ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సహకరించను'
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించి రెండోసారి అధిష్టానం తప్పు చేసిందని మాజీమంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ సంక్షోభ సమయంలో అందరినీ కలుపుకోగలిగే సమర్థవంతమైన నాయకుని కోసం అన్వేషించకుండా ఉత్తమ్ నియామకంపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సహకరించబోనన్నారు. ముందుగా సీనియర్లతో చర్చించి ఉంటే ఇలాం టి తప్పుడు నిర్ణయం రెండోసారి జరిగేది కాదన్నారు. గత ఎన్నికల్లో పొన్నాలను నియమించి మొదటి తప్పు, ఈసారి ఉత్తమ్‌ను నియమించి రెండోసారి తప్పు చేసిందన్నారు. నల్లగొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా బత్తాయితోటలు నీరులేక ఎండిపోతున్నాయన్నారు. నీటి విడుదలకోసం మంత్రి హరీష్‌రావును కలిసినట్టుగా కోమటిరెడ్డి వెల్లడించారు. -
సీఎల్పీ భేటీ నుంచి కోమటిరెడ్డి వాకౌట్
* పొన్నాల రాజీనామా చేయాలని డిమాండ్ * రేణుకా చౌదరిపై రాంరెడ్డి మండిపాటు * టీఆర్ఎస్కు అనుకూలమనే ప్రచారం సరికాదన్న డీఎస్, జానా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం తొలి సమావేశం బుధవారం హాట్‌హాట్‌గా జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో, బయటా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు పరోక్షంగా చురకలంటించుకున్నారు. సీఎల్పీ భేటీ ప్రారంభమైన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చారు. ‘‘ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం పొన్నాల లక్ష్మయ్యే. ఆయన కూడా 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయకుండా ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి అధ్యక్షత వహించే ఈ సమావేశంలో నేనెందుకు ఉండాలి? నిరసన తెలిపి బయటకు వచ్చేశా’’అని మీడియాకు వివరించారు. ఆ తరువాత మరో మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సైతం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీరును సమావేశంలో తప్పుపట్టినట్లు తెలిసింది. ‘‘ఎన్నికల్లో కష్టపడి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులను గెలిపించుకునేది మేము. పార్టీలో మాత్రం ఆమె మాటే చెల్లుబాటవుతోంది. ఇదేం పద్ధతి? ఇలాంటి నిర్ణయాలవల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చింది’’అని రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిసహా ఖమ్మం నేతలు రాంరెడ్డికి మద్దతుగా మాట్లాడారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఓడిపోయినా మన నాయకుల మైండ్ సెట్ మారలేదు. ఇంకా అధికారంలో ఉన్నామని, బుగ్గకార్లలో తిరుగుతున్నామనే భావనలోనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాస్తవంలోకి రావాలి. కలసికట్టుగా పనిచేస్తూ పార్టీని బతికించుకోవాలి’’అని సూచించారు. వైదొలగుదామనుకున్నా.. జానారెడ్డి మొన్నటి ఎన్నికల తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుందామని అనుకున్నానని, అయితే పార్టీ పరిస్థితి చూశాక నిర్ణయం మార్చుకున్నానని జానారెడ్డి సమావేశంలో తెలిపారు. పార్టీని బలోపేతం చేసి ఒకటిరెండేళ్లలో రిటైర్ అవుతానని జానా చెప్పగా డీఎస్ జోక్యం చేసుకుని అవన్నీ ఇప్పుడెందుకని వారించినట్లు తెలిసింది. ఇదెక్కడి వివుర్శ? డీఎస్, జానారెడ్డి సైతం తాము టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నామని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణకు భాగసామ్యం కల్పించకూడదని, విద్యుత్‌లో వాటా ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంతాపం చెబుతూ తీర్మానం చేశారు. -
పార్టీ మారను.. కాంగ్రెస్ ను వీడను: కోమటిరెడ్డి
ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఏదిఏమైనా చివరి వరకు కాంగ్రెస్ పార్టీ వీడను అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలను కోమటి రెడ్డి ఖండించారు. భువనగిరి ఎంపీ టికెట్ కేటాయింపుపై సందేహాలు తలెత్తడంతో కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడుతున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భువనగిరి సీటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాకుండా తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య లేదా ఆయన కోడలు వైశాలికి భువనగిరి టికెట్ కేటాయింపు చేయవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ వీడే యోజనలో ఉన్నారని మీడియాలో కథనాలు వెల్లవడిన సంగతి తెలిసిందే. -
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం
నల్గొండ: రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. అవినీతి ఫైళ్లపై సీఎం కిరణ్ సంతకాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. అవినీతి పరుడైన సీఎంను జైలుకు పంపి తీరుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరపడుతున్న కొద్దీ..సీఎం అవినీతి ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.సీఎంతో సహా సీమాంధ్రలో ఉన్న మరికొందరు నేతలు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి తెలిపారు. -
ఆధిపత్య కాంగిరేసు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్‌లో ప్రధానవర్గంగా కొనసాగుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రధాన కేంద్రంగా తయారయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ దిశలో చాలా దూరమే ప్రయాణించారు. ఇద్దరు మంత్రులు, తన వ్యతిరేక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను కాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చిన కోమటిరెడ్డి ఆ కార్యక్ర మాన్ని విజయవంతం చేసి, జిల్లా కాంగ్రెస్‌లో తన పట్టును నిరూపించుకున్నారు. ఓ వైపు తెలంగాణ స్థాయి పది జిల్లాల హాకీ టోర్నమెంటు.. మరోవైపు నల్లగొండ పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు, కోమటిరెడ్డి అనుకూల నినాదాలతో సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇద్దరు ఎంపీలు సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పూల రవీందర్, ఇలా.. అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన కోమటిరెడ్డి ఒక విధంగా బలప్రదర్శన చేసినట్లే కనిపించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే భారీగా జనాన్ని సమీకరించి క్లాక్‌టవర్ బహిరంగ సభను విజయవంతం చేశారు. చానాళ్లుగా జిల్లా కాంగ్రెస్‌లో ప్రధానమైన వర్గంగా కొనసాగుతున్న కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యక్రమం ద్వారా కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి వర్గానికి స్పష్టమైన సంకేతాన్ని పంపించాలనే ఎత్తుగడ ను పక్కాగా అమలు చేశారు. కోమటిరెడ్డి సభను ఓసారి విశ్లేషిస్తే.. దీని ద్వారా ఏ అంశాలకు ప్రాచుర్యం కల్పించాలని భావించారో ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది.. చివరికంటా కొట్లాడింది తామేనన్న విషయాన్ని మరోమారు జిల్లా ప్రజలకు వివరించడం. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలు, ఉద్యోగ, విద్యార్థి, ఇతర తెలంగాణ వాద సంఘాల్లో తాను చేసిన మంత్రిపదవి త్యాగాన్ని గుర్తు చేయడం, కాంగ్రెస్‌లో పట్టు నిలపుకోవడం. పార్లమెంటులో తెలంగాణ కోసం గళమెత్తడం, అధికార పార్టీ సభ్యుడై ఉండి కూడా సస్పెండ్ అయిన ఎంపీ రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ పోరాటాన్ని మరో మారు వివరించడం. ఇక, తెలంగాణ ఏర్పాటైతే..కాబోయే సీఎం రేసులో చాలా మంది నాయకులే ఉండడం, వారిలో జిల్లాకు చెందిన సీనీయర్ మంత్రి జానారెడ్డి ఉండడం, అదే రేసులో ఉన్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను సీఎం చేయాల్సిందేనని బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఎస్సీ,ఎస్టీల మనసులు చూరగొనడం. రాబోయే తెలంగాణలో ఓ ముఖ్యనేత వర్గంలో తాముంటున్నామన్న సంకేతాన్ని ఇవ్వడం. మంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేయలేక పోయానని, తెలంగాణ పునర్నిర్మాణలో.. నవ నల్లగొండ నిర్మాణానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరడం. మొత్తంగా జిల్లాలో ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన కోమటిరెడ్డి సోదరులు పార్టీలోని ప్రత్యర్థి వర్గ నేతలపైనా త్రీవమైన విమర్శలే చేశారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సీఎం కిరణ్కుమార్రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. నల్లగొండ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి తెర ఎత్తారు. -
అభివృద్ధికి పట్టం కట్టండి
కురంపల్లి(కనగల్), న్యూస్లైన్ర ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కనగల్ మండలం కురంపల్లి గ్రామ వాగులో *4.4 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ, బీటీరోడ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్యం, తాగు,సాగునీటి సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. తనను మరోమారు గెలిపిస్తే నల్లగొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.అంతకుముందు పగిడిమర్రిలో *5 లక్షలతో నిర్మించే కృష్ణాజలాల సంపు నిర్మాణం పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇదే నిధులతో నిర్మించిన కృష్ణాజలాల మినీ ట్యాంక్‌ను ప్రారంభించారు. అనంతరం సవుళ్లగూడేనికి చెందిన టీడీపీ వార్డుసభ్యురాలు వేమిరెడ్డి మంజుల, మోహన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, లింగారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డితో పాటు మరో 40 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఈఈ రఘునందన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జి.భిక్షంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, డి.వెంకట్‌రెడ్డి, కురంపల్లి, పగిడిమర్రి సర్పంచ్‌లు ఓర్సు పెంటయ్య, గో లి జగాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, అంజిరెడ్డి, వెంకన్న, రవీందర్, భారతి వెకటేశం, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి సాక్షి : జిల్లా కేంద్రం రైతుబజారు సమీపంలో ఉన్న బీసీ బాలికల కళాశాల హాస్టళ్లలో మౌలిక వసతులు క ల్పిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన ఆకస్మికంగా హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారి ఇబ్బందులకు చలించిపోయిన మాజీమంత్రి *10 లక్షలతో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. రెండు హాస్టళ్లలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు, హాస్టళ్ల చుట్టూ ప్రహరీ, డైనింగ్ టేబుల్, తల్లిదండ్రులతో మాట్లాడడానికి వీలుగా కాయిన్ బాక్స్‌లు ఏర్పాటు చేయిస్తానని చెప్పా రు. వారం రోజుల్లో ఇవన్నీ అందుబాటులోకి తెస్తానన్నారు. వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ ఉన్నారు. -
సిగ్గుపడే పరిస్థితి తెచ్చారు..
సీఎం కిరణ్, చంద్రబాబులపై కోమటిరెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆదర్శంగా నిలవాల్సిన సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలంగాణ విషయంలో తమ వైఖరితో నాయకులమని చెప్పుకోవటానికే సిగ్గుపడే పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ముందు చెప్పిన మాటను ఇప్పుడు మార్చి గందరగోళం సృష్టిస్తున్నార ని విమర్శించారు. బిల్లుపై చర్చలో గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘‘సీఎం సభలో మాట్లాడిన విషయాల్లో ఎన్నో తప్పులున్నారుు. ఆయన పదవికి రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుంది. చిత్తూరుకు మంచినీళ్ల కోసం రూ. వేల కోట్లు ఇచ్చిన ఆయనకు నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య కనిపించలేదా? యువకుల బలిదానాలను టీడీపీ జోక్‌గా తీసుకుంటోంది. బాబు నాయకత్వంలో కొనసాగుతున్నందుకు ఆ పార్టీ తెలంగాణ నేతలు సిగ్గుపడాలి’’ అని అన్నారు. -
పేదలందరికి పక్కా ఇళ్లు
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలతోపాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక మామిళ్లగూడెం ఇందిరమ్మ కాలనీలో హౌసింగ్ బోర్డు నిధులు *1.09 కోట్లతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా సీసీ రోడ్లు మం జూరు చేయించామన్నారు. కంచనపల్లి సమీపంలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం 150 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఇళ్లకు కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని కాలనీ మహిళలు తెలపడంతో ఎమ్మెల్యే ట్రాన్స్ కో ఎస్సీతో ఫోన్లో మాట్లాడి బిల్లులను సరిచేయించాలని ఆదేశించారు. టీడీపీ వాళ్లు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మారారని, మానవత్వం లేని కమ్యూనిస్టులు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారని వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీ, సీపీఎంల నాయకులను గ్రామాలకు రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిగూడెంలో 60 ఎకరాల భూమిలో నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి నిర్మాణం కాకుండా సీపీఎం నేతలు అడ్డుకున్నారని తెలిపారు. వెలుగుపల్లి, రసూల్‌పురం, మామిళ్లగూడెం గ్రామాల్లో అర్హులైన పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం స్థల సేకరణ చేస్తుంటే సీపీఎం నాయకులు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంటే అసత్య అరోపణలు చే స్తూ ప్రజలకు మోసం చేస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టుల కుయుక్తులను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శరత్‌బాబు, నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వంగూరు లక్ష్మయ్య, నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, బాబ, పెరికకిషన్, ఉడుత వెంకన్న, పనస శంకర్‌గౌడ్, దైద వెంకట్‌రెడ్డి, చింతల భిక్షం, మార్త యాదగిరిరెడ్డి, దైద శేఖర్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, పెరిక మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన కోమటిరెడ్డి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్ర మంత్రి దిగ్విజయ్‌సింగ్‌ను గురువారం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో దిగ్విజయ్‌సింగ్‌ను కోమటిరెడ్డితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్లు కలిశారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు. తెలంగాణను ఇచ్చినందుకు పార్టీ ఆధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలి పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్య క్షుడు పనస శంకర్‌గౌడ్ ఉన్నారు.