కురంపల్లి(కనగల్), న్యూస్‌లైన్‌ర ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కనగల్ మండలం కురంపల్లి గ్రామ వాగులో *4.4 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ, బీటీరోడ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్యం, తాగు,సాగునీటి సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. తనను మరోమారు గెలిపిస్తే నల్లగొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.అంతకుముందు పగిడిమర్రిలో *5 లక్షలతో నిర్మించే కృష్ణాజలాల సంపు నిర్మాణం పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇదే నిధులతో నిర్మించిన కృష్ణాజలాల మినీ ట్యాంక్‌ను ప్రారంభించారు.
అనంతరం సవుళ్లగూడేనికి చెందిన టీడీపీ వార్డుసభ్యురాలు వేమిరెడ్డి మంజుల, మోహన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, లింగారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డితో పాటు మరో 40 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ లింగయ్య, ఈఈ రఘునందన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జి.భిక్షంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, డి.వెంకట్‌రెడ్డి, కురంపల్లి, పగిడిమర్రి సర్పంచ్‌లు ఓర్సు పెంటయ్య, గో లి జగాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, అంజిరెడ్డి, వెంకన్న, రవీందర్, భారతి వెకటేశం, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
సాక్షి : జిల్లా కేంద్రం రైతుబజారు సమీపంలో ఉన్న బీసీ బాలికల కళాశాల హాస్టళ్లలో మౌలిక వసతులు క ల్పిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన ఆకస్మికంగా హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారి ఇబ్బందులకు చలించిపోయిన మాజీమంత్రి *10 లక్షలతో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. రెండు హాస్టళ్లలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు, హాస్టళ్ల చుట్టూ ప్రహరీ, డైనింగ్ టేబుల్, తల్లిదండ్రులతో మాట్లాడడానికి వీలుగా కాయిన్ బాక్స్‌లు ఏర్పాటు చేయిస్తానని చెప్పా రు. వారం రోజుల్లో ఇవన్నీ అందుబాటులోకి తెస్తానన్నారు. వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ ఉన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి
Published Sun, Feb 2 2014 4:30 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement