Crores of rupees
-
మరో ఘటన.. ఫార్మసీ ఉద్యోగి అకౌంట్లో రూ.753 కోట్లు.. ఏం చేశాడంటే..
సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సమాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపు పొరపాట్లను తెలుసుకుని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra bank) ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) రూ.2000 లను స్నేహితుడికి బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోగా రూ. 753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది. బ్యాంక్ అకౌంట్లో అంత పెద్ద మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్‌ను స్తంభింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్లో ఖాతాలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రూ.9,000 కోట్లు డిపాజిట్ చేసింది. పొరపాటును గుర్తించిన బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అంతకు ముందు తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోనూ రూ. 756 కోట్లు జమయ్యాయి. -
కోటి రూపాయల ఆస్తి కాజేసి.. తల్లిని గెంటేసిన కన్నకొడుకు
తిరువళ్లూరు: కోటి రూపాయల ఆస్తులను కాజేసి ఇంటి నుంచి గెంటేసిన కన్న కొడుకుపై చర్యలు తీసుకోవడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని మాపోసి రోడ్డుకు చెందిన రవికుమార్. ఇతనికి భార్య మునియమ్మాల్(56)తో పాటు కొడుకు మహేష్‌బాబు కుమార్తెలు లోకేశ్వరి, దేవిక, విజయలక్ష్మి ఉన్నారు. ఈ నేపథ్యంలో పది సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునియమ్మాల్ తీవ్రంగా గాయపడి లేవలేని స్థితికి చేరింది. దీంతో పాటు 2012లో భర్త రవికుమార్ సైతం మృతి చెందాడు. దీనిని అదునుగా భావించిన మహేష్‌బాబు 2013లో తల్లి పేరుపై వున్న సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం తల్లిని బయటకు గెంటేయడంతో కుమార్తెల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు విన్నవించాలని కలెక్టరేట్‌కు వచ్చింది. దీంతో వృద్ధురాలికి వద్దకు వచ్చి స్పృహతప్పి పడిపోయింది. దీంతో కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్ స్వయంగా వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే 108 ద్వారా వైద్యశాలకు తరలించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. -
వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి బదిలీ చేశాయి. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి చివరి నాటికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసిన డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తాజాగా లోక్‌సభలో తెలియజేశారు. (రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు) ఆర్బీఐకి బదిలీ చేసిన రూ. 35,012 కోట్ల అన్ క్లయిమ్డ్ డిపాజిట్లలో అత్యధికంగా రూ. 8,086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు సంబంధించినవి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులవి రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 3,904 కోట్లు ఉన్నాయి. -
నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్
పీఎం పాలెం (భీమిలి): ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి పరిచయమైన రౌడీషీటర్ అతడినే కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఓ ల్యాండ్ డెవలప్మెంట్ విషయపై ఒప్పందం చేసుకుందామని పిలిచి.. కారులో ఎక్కించుకుని అపహరించేందుకు ప్రయత్నించాడు. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతానని బెదిరించడంతో... ఆ వ్యాపారి రూ.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పోలీసుల రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. దీంతో రియల్టర్‌ను కారులో నుంచి తోసేసి కిడ్నాపర్ పరారయ్యాడు. నగర శివారులో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పాచి రామకృష్ణ కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడైన రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్ (30) దృష్టి పడింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు రామకృష్టకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాను అలకనందా రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. బాగా నమ్మకం పెరిగాక ఓ ల్యాండ్ డెవలప్మెంట్ విషయపై ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రుషికొండ సమీపానికి వస్తే ఒప్పందం పూర్తి చేసుకుందామని రామకృష్ణను హేమంత్ పిలిచాడు. నిజమేనని నమ్మిన రామకృష్ణ రుషికొండ వెళ్లగా... ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం కారులో కూర్చున్న రామకృష్ణను హేమంత్ తాళ్లతో బంధించాడు. కోటి రూపాయలు చెల్లిస్తేనే విడిచిపెడతానని బెదిరించాడు. అనంతరం కారును విజయనగరం వైపు తీసుకుని బయలుదేరాడు. సీసీ కెమెరా పుటేజీతో అప్రమత్తం రామకృష్ణను హేమంత్ బెదిరించి కారులో తీసుకెళ్లిపోతున్న తతంగం అంతా సమీపంలోని ఓ రిసార్టు సీసీ కెమెరాలో రికార్డు కాగా గమనించిన అక్కడి సిబ్బంది విషయాన్ని నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సీపీ పీఎంపాలెం పోలీసులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ వాడుతున్న కారు డ్రైవర్ సెల్ ఫోను నంబరు లొకేషన్ ఆధారంగా కారుని గుర్తించి పోలీసులు వెంబడించారు. అప్పటికే బాధితుడు రామకృష్ట తనను విడిచిపెడితే రూ.50 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతలో పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలుసుకున్న కిడ్నాపర్ హేమంత్ కథ అడ్డం తిరిగిందని భావించి రామకృష్ణను కారు లోనుంచి బయటకు తోసేసి పరారయ్యాడు. అనంతరం జరిగిన సంఘటనపై రామకృష్ణ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం డీసీపీ గరుడ సుమిత్ సునీల్ పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయమై ఆరా తీశారు. హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి... కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌కు కరుడుగట్టిన నేర చరిత్ర ఉంది. భీమిలి పోలీస్ స్టేషన్లో గతంలో రౌడీషీట్ తెరిచారు. భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నేళ్ల కిందట నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ లీడర్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. రూ.1.35 కోట్ల విలువైన ప్లాటు కొనుగోలు విషయమై విజయారెడ్డి ఇంటికి వెళ్లి మరీ భయంకరంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి బంగారు నగలు అపహరించుకుని ఆమె కారులోనే పరారయ్యాడు. నగలు విక్రయించగా వచ్చిన డబ్బులతో ప్రియురాలితో కలిసి విజయవాడలో జల్సాలు చేశాడు. ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం బయటకు వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. (చదవండి: ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’) -
షిర్డీ సంస్థాన్‌కు భారీ దెబ్బ.. రూ. 300 కోట్ల నష్టం
షిర్డీ: కరోనా మహమ్మారి కొనసాగిన సమయంలో శ్రీ షిర్డీ సాయి సంస్థానానికి భక్తులరాక తగ్గిపోవడంతో కానుకల ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్‌లో షిర్డీ సాయిబాబా మందిరం ఎనిమిది నెలలు మూసివేయాల్సి వచ్చింది. అలాగే రెండవ దశలో ఆరు నెలలపాటు ఆలయాన్ని మూసివేయాల్సి వచ్చింది. దీంతో కరోనా మహమ్మారి రెండు దశలలో మొత్తం 14 నెలలపాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. దీంతో శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు సుమారు రూ. 300 కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా మహమ్మారికి ముందు శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు ప్రతి రోజు సుమారు 50 నుంచి 60 వేల భక్తులు షిర్డీకి వచ్చేవారు. ఆ సమయంలో హుండీలో భక్తులు కానుకల రూపంలో బంగారం, వెండి, నగదుతోపాటు ఆన్లైన్లో కూడా కానుకలు సమర్పించేవారు. ఇలా ప్రతిరోజూ సగటున రూ. ఒక కోటి నుంచి రూ. 1.25 కోట్ల వరకు దేవాలయానికి కానుకలు లభించేవి. అయితే లాక్డౌన్ కారణంగా ఆలయం మూసివేయడంతో భక్తులు లేక శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. అయితే ప్రస్తుతం మళ్లీ అక్టోబర్ ఏడవ తేదీ నుంచి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే భౌతికదూరం నిబంధనల దృష్ట్యా ప్రారంభంలో కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించినప్పటికీ, ప్రస్తుతం 25 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. కాని వయో పరిమితి నిబంధనతో అనేక మంది భక్తులు తమ వయోవృద్ధులైన తల్లిదండ్రులతోపాటు పదేళ్లలోపు పిల్లలతో సాయిని దర్శించుకునేందుకు వీలులేకుండాపోయింది. దీంతో అనేక మంది ఇంకా షిర్డీకి రావడంలేదని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెరిగితేనే ఖజానా నిండనుందని చెప్పవచ్చు. మరోవైపు దీపావళి పండుగ సెలవులలో మాత్రం కోట్లాది రూపాయలు కానుకల రూపంలో వచ్చాయి. కానీ గత నెల రోజులుగా పరిశీలించినట్టయితే ప్రతి రోజు సగటున కేవలం రూ.35 నుంచి రూ.40 లక్షల కానుకలు మాత్రమే అందుతున్నాయి. నిర్వహణపై నిధుల ప్రభావం... భక్తుల నుంచి కానుకలు తగ్గడంతో షిర్డీసాయి సంస్థాన్‌పై ఆర్థిక ప్రభావం పడుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా సాయిసంస్థాన్‌లో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మినెంట్ కార్మికుల తో కలిపి మొత్తం సుమారు నాలుగు వేల మంది ఉన్నారు. సంస్థాన్ పరిధిలో రెండు ఆసుపత్రులుండగా వీటి లో ఒక ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తా రు. అదేవిధంగా సాయిబాబా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో స్వల్ప ధరలకే చికిత్స అందిస్తున్నా రు. మరోవైపు సాయి ప్రసాదాల యంలో ఉచితం గా భోజనాలు, దర్శనం కోసం క్యూలో ఉండే భక్తులకు ఉచితంగా బూందీ లడ్డు ప్రసాదం ఇస్తారు. అత్యల్ప ధరలకే సాయిభక్తి నివాసాల్లో ఉండేందు కు గదులు.. ఇలా అనేక సౌకర్యాలను షిర్డీ సాయి సంస్థాన్ కల్పిస్తోంది. అదేవిధంగా జాతీయ విపత్తుల సమయంలో పెద్దఎత్తున షిర్డీ సాయి సంస్థా న్ ఆర్థికంగా ప్రభుత్వానికి సాయం చేస్తోంది. కరో నా మహమ్మారి సమయంలో కూడా సాయి సంస్థా న్ ఆసుపత్రిలో రోగులకు ఉచిత చికిత్స అందిం చారు. వీటన్నింటి కోసం సాయి భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చే డబ్బులనే వినియోగిస్తారు. అయితే గత కొంతకాలంగా భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గి సుమారు రూ. 300 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఇటీవల కాలంలో మళ్లీ భక్తుల సంఖ్య పెరుగుతోందని, త్వరలోనే మంచి రోజులు వస్తా యని భక్తులందరికీ దర్శనానికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని మాజీ ట్రస్టీ సచిన్ తాంబే మీడియాకు తెలిపారు. -
కోట్లు దోచేస్తున్న యాప్స్ : చెక్ చెప్పిన చిన్నారి
సాక్షి, న్యూఢిల్లీ: ఆడపిల్లలని చులకనగా చూడకండి..వారు ప్రపంచాన్ని సృష్టించడమే కాదు.. తమ నైపుణ్యంతో ప్రపంచాన్ని కాపాడతారు కూడా. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లోని ఒక చిన్న అమ్మాయి నిరూపించింది ఇదే. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాలావేర్ గుర్తించి,కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది. తద్వారా టెక్ సంస్థలు నష్టపోతున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోని యాప్స్ భద్రతపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్కామర్ల ముప్పు తప్పడం లేదు. పిల్లలను లక్ష్యంగా ఈ యాప్స్ 2.4 మిలియన్లకు పైగా సార్లు డౌన్లోడ్ అయినట్టు పరిశోధకులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళ్లితే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఏడు నకిలీ యాప్స్ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల డాలర్లను (సుమారు రూ.3.7 కోట్లు) దోచేశారు. ప్రధానంగా టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ మోసపూరిత యాప్స్‌కు సంబంధించిన ప్రకటను ప్లే అవుతాయట. ఇవి సాధారణంగా ఎవరికీ కనిపించకుండా మాల్వేర్ ద్వారా లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాయి. ఈ యాప్స్ ద్వారా ఒక్కో యూజర్ ద్వారా 10 డాలర్ల మధ్య ఆర్జిస్తున్నాయి. అయితే టిక్‌టాక్‌లో ఇలాంటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై ఫిర్యాదు చేసింది. పిల్లలు ఆన్లైన్లో ఎలా సేఫ్‌గా ఉండాలో తెలిపే అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. దీంతో వారు రంగంలోకి మరింత పరిశోధించడంతో విషయం వెలుగు చూసింది. ఇవి వాల్‌పేపర్, మ్యూజిక్ లేదా ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ముసుగులో ఉంటాయని, వీటి ద్వారానే యాడ్వేర్ స్కామ్‌లు జరుగుతున్నట్లు సెన్సార్ టవర్‌కు సంబంధించిన పరిశోధకులు తెలిపారు. అంతేకాదు టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయమని పరిశోధకులు వ్యాఖ్యానించారు. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారట. దీన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్నారికి అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే పరిశోధకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు. -
ప్రధాని సభకు జనం కోసం రూ.7 కోట్లు!
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ర్యాలీ కోసం రాజస్తాన్ ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించే ఈ భారీ ర్యాలీ ఈ నెల 7న జైపూర్‌లో జరగనుంది. ప్రజల తరలింపునకు అయ్యే ఖర్చును వివిధ పథకాల నిధుల నుంచి మళ్లించినట్లు కూడా అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులైన దాదాపు 2.5లక్షల మంది ఈ ర్యాలీకి తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జైపూర్‌లోని అమృదోన్ కా బాగ్ స్టేడియంలో జరిగే సభకు 33 జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం 5,579 బస్సులను కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.2కోట్లు ఖర్చు పెడుతోందని సాధారణ పాలనా విభాగం తెలిపింది. -
మార్కెట్‌కు దారేది ?
తెనాలి టౌన్: కోట్ల రూపాయల్లో వస్తున్న నిధులను జీతభత్యాలకు, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు అవసరమైన డొంక రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో మార్కెట్ కమిటీల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రైతు శ్రేయస్సును విస్మరించిన మార్కెట్ కమిటీలు సొంత ప్రయోజనాలను చక్కబెట్టుకోవటం గమనార్హం.గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి కమిటీల నుంచి 25శాతం నిధులు మంజూరు చేసేవారు. ఆ నిధులతో డొంక రోడ్లు వేయడం వల్ల రైతు పండించిన ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉండేది. ప్రస్తుతం డొంక రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు, ముళ్ల చెట్లతో నిండిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి దుగ్గిరాలకు వెళ్లే రోడ్డు పిచ్చిచెట్లతో మూసుకు పోయింది. గుం టూరు, పల్నాడు ప్రాంతాల రైతులు పండించిన పసుపును దుగ్గిరాల మార్కెట్ యార్డుకు గతంలో ఈ రోడ్డు ద్వారా తీసుకు వెళ్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కమిటీలపై తెలుగు తమ్ముళ్ల కన్ను.. జిల్లాలో 20వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో గుంటూరు, తెనాలి, దుగ్గిరాల యార్డులు పూర్తి గా రెగ్యులేటేడ్ యార్డులుగా కొనసాగుతున్నాయి. ఈ కమిటీల ఆదాయం కోట్ల రూపాయల్లోనే ఉంది. ఏడాదికి గుంటూరు యార్డుకు రూ.30 కోట్లు, తెనాలి యా ర్డుకు రూ.5కోట్లు, దుగ్గిరాల యార్డుకు రూ.3నుంచి 4 కోట్లు ఆదాయం ఉంటుంది. తెనాలి, దుగ్గిరాల, పొ న్నూరు, బాపట్ల, ఈపూరు, పిడుగురాళ్ళ, నరసరావుపేట, చిలకలూరిపేట, రాజుపాలెం, వినుకొండ, రొంపిచర్ల మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. గుంటూరు, మంగళగిరి, కూచినపూడి, రేపల్లె, క్రోసూరు, సత్తెనపల్లి, తాడికొండ, ఫిరంగిపు రం, మాచర్ల వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ఈ కమిటీలలో పదవులను ఆశించే తెలుగు తమ్ముళ్లు ఎక్కువ కావడంతో కమిటీ పాలకవర్గ నియామకం ఆలస్యం అవుతుంది. తెనాలి కమిటీ నుంచి వేరుగా వేమూరు కమిటీ ఏర్పాటుకు కొత్తగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం కార్యాలయంలో ఉందని అధికారులు తెలిపారు. జీవో జారీ చేయాలి.. ఇంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మార్కె ట్ కమిటీల నిధుల నుంచి లింకురోడ్డుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో వాటిని రద్దు చేశారు. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రోడ్ల నిర్మాణానికి నిధులు వాడవచ్చని జీవో జారీ చేసినప్పటికి అమలు కాలేదు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున దెబ్బతిన్న లింక్ రోడ్డులకు మార్కెట్ కమిటీల నుంచి నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
- వార్షిక లక్ష్యం రూ.11936.07 కోట్లు విజయవాడ : 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11,936కోట్ల రూపాయలు జిల్లా వార్షిక రుణ ప్రణాళికగా నిర్ధేశించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ బాబు.ఏ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11936.07కోట్ల రూపాయలు వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించి వివిధ రంగాలకు కేటాయించామన్నారు. ప్రాథమిక రంగాలకు 9,393.65 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా 9,34,568 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ గా కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2442.42 కోట్ల రూపాయలు కేటాయించి సుమారు 7.40లక్షల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరే విధంగా వార్షిక రుణప్రణాళికలో కేటాయింపులు జరి గాయన్నారు. ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2085.07 కోట్ల రూపాయలు కేటాయింపులతో వార్షిక రుణప్రణాళిక సంప్రదింపుల కమిటీ సమావేశం లో కలెక్టర్ విడుదల చేశారు. పెలైట్ ప్రాజెక్టుగా జిల్లాలో సామాజిక భద్ర తా పింఛన్లును ఇంటర్ ఆపరబుల్ విధానంలో మల్టీచానల్ సింగిల్ అకౌంట్ మోడల్‌గా సుమారు 25వేల కు పైగా పింఛన్లు ఈ నెల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కెనరాబ్యాంకుల ద్వారా బిజి నెస్ కరస్పాండెట్లతో పంపిణీ చేయనున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి గా జిల్లాలో పెలై ట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన మల్టీచానల్ అకౌంట్ మోడల్, ఇంటర్ ఆఫరబుల్ మైక్రో ఎటిఎం విధానం ద్వారా భద్రతా పింఛన్లును పంపిణీ చేసేందుకు నిర్దేశించిన ప్రాజెక్టుకు బ్యాంకుల నిర్వహణపట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జేసీ గంధం చంద్రుడు, డీఆర్డీఏ పీడీ డి. చంద్రశేఖర్ రాజు, ఆర్.బి.ఐ. డీజీఎం ఎ.ఎస్. వి. కామేశ్వరరావు, ఇండియన్ బ్యాం కు డీజీఎం రఘునందనరావు, ఎల్.డి.ఎం. నరసింహారావు పాల్గొన్నారు. -
టీడీపీలో ‘జెడ్పీ’ లొల్లి
సాక్షి, నెల్లూరు: కరవమన్న పాము ఎదురుతిరిగి కాలికే చుట్టుకున్నట్టు తయారైంది టీడీపీ నేతల పరిస్థితి. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి ప్రలోభాలతో ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ నేతలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కోట్ల రూపాయలు ఇస్తాం.. తమ పక్షంలోకి రండంటూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను ఆకర్షించే ప్రయత్నం చేసినవారి ప్రలోభాల కథ ఇప్పుడు అడ్డం తిరుగుతోంది. ప్రతిపాక్ష పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం గమనించిన సొంతపార్టీ సభ్యులు ఎదురుతిరుగుతున్నారు. ఎదుటి పార్టీ వారికే అంత ఇచ్చినప్పుడు తమ సంగతేంటని ప్రశ్నిస్తుండడంతో నేతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవలే టీడీపీకి చెందిన ఓ జెడ్పీటీసీ సభ్యుడు వైస్ చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలనే డిమాండ్‌ను నాయకుల ముందు పెట్టాడు. ఖంగుతిన్న నాయకులు ఆయనను వెంటనే నగర శివారులో ఉన్న తమ అడ్డాకు తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ‘కావాలంటే అంతో.. ఇంతో ఇస్తాం. వైస్ ైచె ర్మన్ పదవి కావాలంటే ఎలా’అని ఆ సభ్యుడిని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. తర్వాత రోజు ఉదయాన్నే ఆ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపక్ష పార్టీ నేతను కలిసి వైస్ చైర్మన్ పదవి తనకు ఇస్తే ‘నా మద్దతు మీకే’ అంటూ ఆఫర్ పెట్టాడు. ఇది తెలుసుకున్న టీడీపీ నేతలు షాక్‌కు గురై వెంటనే సభ్యుడిని మళ్లీ తమ అడ్డాకు తీసుకెళ్లి బుజ్జగించినట్లు సమాచారం. ఇదంతా తెలుసుకున్న ఆ పార్టీకి చెందిన మరికొంత మంది సభ్యులు కూడా తమ సంగతేంటంటూ బేరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అసలుకే మోసం వస్తుందేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. గెలుపుపై ధీమా: ప్రజాబలంతో అత్యధిక జెడ్పీటీసీలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉంది. మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందని, జెడ్పీ పీఠం దక్కించుకోవడం ఖాయమని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. -
కడ‘గండ్లు’ పూడేదెప్పుడో
అధ్వానంగా చెరువు కట్టలు, తూములు, సప్లైచానెళ్లు పట్టించుకోని అధికారులు పలమనేరు, న్యూస్‌లైన్: చెరువుల మరమ్మతు కోసం ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. గతంలో తెగిన చెరువు కట్టలు, సప్లయ్ చానెళ్లు ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. కొద్దిమేర వర్షాలు పడుతున్నా నీరు నిల్వ ఉండే పరిస్థితి లేక రైతులు లబోదిబోమంటున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 19 పెద్ద చెరువులు, 892 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు తెగిపోయాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ దఫా వర్షాలు కురిసినా చుక్కనీరు నిల్వ ఉండే పరి స్థితి లేదు. గతంలో ఇందిరమ్మ పథకంలో 150 చెరువుల మరమ్మతు పనులు చేపట్టారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ అర్ధాంతరంగా ఆపేయడంతో వాటి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. వర్షాలు కురిసి నీరు చేరితే తెగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. చెరువులకు వరద నీటిని తీసుకొచ్చే సప్లయ్ చానెళ్లు చాలావరకు పూడిపోయాయి. మిగిలినవి ఆక్రమణకు గురయ్యాయి. తద్వారా ఎంత వర్షం కురిసినా చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడింది. పలమనేరు మండలంలో 114 చెరువులుండగా వీటిలో 43కు కట్టలు బలహీనంగా ఉన్నాయి. నాలుగు చెరువు కట్టలకు గండిపడి మూడేళ్లవుతున్నా పట్టించుకునే దిక్కులేకుం డా పోయింది. చాలా చెరువులకు మొరవలు ధ్వంసమయ్యాయి. సప్లయ్ చానెళ్లు కబ్జాకు గురయ్యాయి. గంగవరం మండలంలో కొన్నేళ్లుగా వర్షాలు పడకపోవడంతో చెరువుల్లో చుక్క నీరులేదు. దీనికితోడు సప్లయ్ చానెళ్లు ఆక్రమణకు గురయ్యాయి. మన్నార్నాయనిపల్లె చెరువుకు గతంలో గండిపడినా మరమ్మతుకు నోచుకోలేదు. పెద్దపంజాణి మండలంలో 259 చెరువులుండగా చెన్నారెడ్డిపల్లె, వీరప్పల్లె, సొలింపల్లె, బేరుపల్లె, పెనుగొలకల గ్రామాల్లోని చెరువులకు గండ్లు పడ్డాయి. వాటికి నామమాత్రంగా మరమ్మతు చేసి చేతులు దులుపుకున్నారు. బెరైడ్డిపల్లె మండలంలో 150 చెరువులున్నాయి. 15 మినహా మిగిలిన వాటిలో సప్లై చానెళ్లు ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. చెరువు స్థల మూ ఆక్రమణకు గురైంది. వి.కోట వుండలంలో 183 చెరువులుండగా కీలపల్లె, చింతల ఎల్లాగరం, బైరుపల్లె చెరువులు ఆక్రవుణకు గురయ్యూరుు. పది చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయి. పీఆర్ చెరువుల పరిస్థితి మరీ అధ్వానం గతంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉండి ఇరిగేషన్ శాఖకు బదిలీ అయిన చెరువులు చాలావర కు అధ్వానంగా ఉన్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. నియోజకవర్గంలోని చెల్లెమ్మ చెరువు, సర్కార్పెద్దచెరువు, కౌండిన్యా ఆనకట్ట, ఆరె మ్మ, కన్నికల, నాయిని, దండపల్లె, బెరైడ్డిపల్లె పెద్దచెరువులు, పాతపేట చెరువు, బైరుపల్లె, ఎల్లాగరం, కీలపల్లె, బ్రాహ్మణపల్లె, చలమంగళం, మాడి చెరువుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఏపీసీబీ టీఎంపీ, వర్డల్బ్యాంక్ నిధుల ద్వారా కొన్ని చెరువులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. త్రిబుల్ఆర్(రిపేర్స్ రెన్నివేషన్ అండ్ రిస్టోరేషన్) ద్వారా కొన్నింటికి, ఉపాధి హామీ ద్వారా 80 చెరువులకు త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. -
అభివృద్ధికి పట్టం కట్టండి
కురంపల్లి(కనగల్), న్యూస్లైన్ర ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కనగల్ మండలం కురంపల్లి గ్రామ వాగులో *4.4 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ, బీటీరోడ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్యం, తాగు,సాగునీటి సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. తనను మరోమారు గెలిపిస్తే నల్లగొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.అంతకుముందు పగిడిమర్రిలో *5 లక్షలతో నిర్మించే కృష్ణాజలాల సంపు నిర్మాణం పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇదే నిధులతో నిర్మించిన కృష్ణాజలాల మినీ ట్యాంక్‌ను ప్రారంభించారు. అనంతరం సవుళ్లగూడేనికి చెందిన టీడీపీ వార్డుసభ్యురాలు వేమిరెడ్డి మంజుల, మోహన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, లింగారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డితో పాటు మరో 40 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఈఈ రఘునందన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జి.భిక్షంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, డి.వెంకట్‌రెడ్డి, కురంపల్లి, పగిడిమర్రి సర్పంచ్‌లు ఓర్సు పెంటయ్య, గో లి జగాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, అంజిరెడ్డి, వెంకన్న, రవీందర్, భారతి వెకటేశం, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి సాక్షి : జిల్లా కేంద్రం రైతుబజారు సమీపంలో ఉన్న బీసీ బాలికల కళాశాల హాస్టళ్లలో మౌలిక వసతులు క ల్పిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన ఆకస్మికంగా హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారి ఇబ్బందులకు చలించిపోయిన మాజీమంత్రి *10 లక్షలతో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. రెండు హాస్టళ్లలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు, హాస్టళ్ల చుట్టూ ప్రహరీ, డైనింగ్ టేబుల్, తల్లిదండ్రులతో మాట్లాడడానికి వీలుగా కాయిన్ బాక్స్‌లు ఏర్పాటు చేయిస్తానని చెప్పా రు. వారం రోజుల్లో ఇవన్నీ అందుబాటులోకి తెస్తానన్నారు. వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ ఉన్నారు. -
భరోసా ఇవ్వని ‘ఆహార భద్రత’
=మురుగుతున్న నిధులు = రైతుల దరిచేరేందుకు యత్నించని అధికారులు సాక్షి, విశాఖపట్నం : పథకం ఎంత గొప్పదైనా ఫలితం క్షేత్రస్థాయికి చేరితేనే ప్రయోజనం. ఏటా కోట్లాది రూపాయలు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించినా వాటిని సకాలంలో అందించికపోతే ఫలితం శూన్యం. ఆ కోవలోకి ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం చేరింది. దీంతో విడుదలైన కోట్లాది రూపాయల నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. సుస్థిరమైన పద్ధతిలో సాగుచేసి ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ మేరకు నూతన యాజమాన్య సాగు పద్ధతులు, శ్రీ వరి సాగు, హైబ్రిడ్ వరిసాగు, పప్పు దినుసుల సాగు ప్రదర్శన, సస్య రక్షణ రసాయనాలు, జీవ సంబంధిత మందులకు ప్రోత్సాహకాలు, వ్యవసాయ పనిముట్లకు ప్రోత్సాహకాలు, పొలంబడి పద్ధతిలో రైతులకు శిక్షణ ఇవ్వవల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలేవి సక్రమంగా జరగడం లేదు. సాగు ప్రదర్శనలు తప్ప మిగతావేవి రైతులకు చేరడం లేదు. ఈ ఏడాది వరి, పప్పు దినుసుల సాగు ప్రోత్సాహం కోసం 50 శాతం సబ్సిడీతో వివిధ పనిముట్లు అందజేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 1248 యూనిట్లు పంపిణీ చేయాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఇంతవరకు రూ.43 లక్షల విలువైన 443 యూనిట్లు మాత్రమే రైతులకు చేరాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1097 యూనిట్లు పంపిణీ చేసేందుకు గాను రూ.2.01 కోట్లు విడుదలవ్వగా వీటిలో రూ.6.19 లక్షలు విలువైన 313 యూనిట్లు మాత్రమే రైతులకు అందజేశారు. అక్కరకురాని నిధులు జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ఈ ఏడాది 100 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా తీసుకొని, ప్రదర్శన కోసం వరి సాగు చేయడానికి రూ.2.68 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు కేవలం రూ.1.64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే 100 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా చేసుకుని పప్పు దినుసులు సాగు చేయడానికి రూ.1.21 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు కేవలం రూ. 3 లక్షలు మాత్రమే వెచ్చించారు. దీన్ని బట్టి జిల్లాలో ఆహార భద్రతా మిషన్ కార్యక్రమం అమలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటి కోసం విడుదలైన నిధులు ఎంతమేర అక్కరకు రాకుండా ఉన్నాయో గమనించొచ్చు. వాస్తవానికైతే వీటిని రైతుల దరిచేర్చేందుకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రైతు సదస్సులు, కిసాన్ మేళాలు ద్వారా అర్హులైన సాగు రైతుల్ని గుర్తించి, యూనిట్లు అందజేయవచ్చు. అలాగే రైతు మిత్ర సంఘాలు, ఆదర్శ రైతుల ద్వారా అర్హులైన రైతులను ఎంపిక చేసి ప్రయోజనం కల్పించడానికి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విడుదలైన కోట్లాది రూపాయల నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని స్పష్టమవుతోంది.