దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35 వేల కోట్ల అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి బదిలీ చేశాయి.
(అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు)
ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి చివరి నాటికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసిన డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తాజాగా లోక్‌సభలో తెలియజేశారు.
(రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు)
ఆర్బీఐకి బదిలీ చేసిన రూ. 35,012 కోట్ల అన్ క్లయిమ్‌డ్ డిపాజిట్లలో అత్యధికంగా రూ. 8,086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు సంబంధించినవి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులవి రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 3,904 కోట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment