- వార్షిక లక్ష్యం రూ.11936.07 కోట్లు
విజయవాడ : 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11,936కోట్ల రూపాయలు జిల్లా వార్షిక రుణ ప్రణాళికగా నిర్ధేశించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ బాబు.ఏ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11936.07కోట్ల రూపాయలు వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించి వివిధ రంగాలకు కేటాయించామన్నారు.
ప్రాథమిక రంగాలకు 9,393.65 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా 9,34,568 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ గా కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2442.42 కోట్ల రూపాయలు కేటాయించి సుమారు 7.40లక్షల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరే విధంగా వార్షిక రుణప్రణాళికలో కేటాయింపులు జరి గాయన్నారు.
ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2085.07 కోట్ల రూపాయలు కేటాయింపులతో వార్షిక రుణప్రణాళిక సంప్రదింపుల కమిటీ సమావేశం లో కలెక్టర్ విడుదల చేశారు. పెలైట్ ప్రాజెక్టుగా జిల్లాలో సామాజిక భద్ర తా పింఛన్లును ఇంటర్ ఆపరబుల్ విధానంలో మల్టీచానల్ సింగిల్ అకౌంట్ మోడల్‌గా సుమారు 25వేల కు పైగా పింఛన్లు ఈ నెల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కెనరాబ్యాంకుల ద్వారా బిజి నెస్ కరస్పాండెట్లతో పంపిణీ చేయనున్నామన్నారు.
రాష్ట్రంలోనే తొలిసారి గా జిల్లాలో పెలై ట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన మల్టీచానల్ అకౌంట్ మోడల్, ఇంటర్ ఆఫరబుల్ మైక్రో ఎటిఎం విధానం ద్వారా భద్రతా పింఛన్లును పంపిణీ చేసేందుకు నిర్దేశించిన ప్రాజెక్టుకు బ్యాంకుల నిర్వహణపట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జేసీ గంధం చంద్రుడు, డీఆర్డీఏ పీడీ డి. చంద్రశేఖర్ రాజు, ఆర్.బి.ఐ. డీజీఎం ఎ.ఎస్. వి. కామేశ్వరరావు, ఇండియన్ బ్యాం కు డీజీఎం రఘునందనరావు, ఎల్.డి.ఎం. నరసింహారావు పాల్గొన్నారు.
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
Published Sun, Apr 26 2015 4:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement