Debt plan
-
రుణ ప్రణాళిక రూ.4437.65 కోట్లు
ప్రకటించిన కలెక్టర్ సంగారెడ్డి క్రైం : రూ.4437.65 కోట్ల అంచనాలతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 4437.65 కోట్ల రూపాయలని, ఇందులో పంట రుణాల కింద 1997.25 కోట్లు, టర్మ్, ఇతర పనులకు 388 కోట్లు, స్వయం సహాయక బృందాలకు 583 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 626 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు 325 కోట్లు, ఇతర రుణాల కింద 518 కోట్ల రూపాయలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఈ ఏడాది 2014-15 ప్రణాళిక కన్నా 325.65 కోట్ల రూపాయలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. రుణ ప్రణాళిక వంద శాతం సాధించేందుకు బ్యాంకర్లంతా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.వి.రమణారెడ్డి, ఎల్డీఎం రఘురాం, ఎస్బీహెచ్ జిల్లా కోఆర్డినేటర్ విజయమూర్తి, నాబార్డ్ డీడీఎం జి.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
- వార్షిక లక్ష్యం రూ.11936.07 కోట్లు విజయవాడ : 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11,936కోట్ల రూపాయలు జిల్లా వార్షిక రుణ ప్రణాళికగా నిర్ధేశించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ బాబు.ఏ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11936.07కోట్ల రూపాయలు వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించి వివిధ రంగాలకు కేటాయించామన్నారు. ప్రాథమిక రంగాలకు 9,393.65 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా 9,34,568 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ గా కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2442.42 కోట్ల రూపాయలు కేటాయించి సుమారు 7.40లక్షల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరే విధంగా వార్షిక రుణప్రణాళికలో కేటాయింపులు జరి గాయన్నారు. ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2085.07 కోట్ల రూపాయలు కేటాయింపులతో వార్షిక రుణప్రణాళిక సంప్రదింపుల కమిటీ సమావేశం లో కలెక్టర్ విడుదల చేశారు. పెలైట్ ప్రాజెక్టుగా జిల్లాలో సామాజిక భద్ర తా పింఛన్లును ఇంటర్ ఆపరబుల్ విధానంలో మల్టీచానల్ సింగిల్ అకౌంట్ మోడల్‌గా సుమారు 25వేల కు పైగా పింఛన్లు ఈ నెల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కెనరాబ్యాంకుల ద్వారా బిజి నెస్ కరస్పాండెట్లతో పంపిణీ చేయనున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి గా జిల్లాలో పెలై ట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన మల్టీచానల్ అకౌంట్ మోడల్, ఇంటర్ ఆఫరబుల్ మైక్రో ఎటిఎం విధానం ద్వారా భద్రతా పింఛన్లును పంపిణీ చేసేందుకు నిర్దేశించిన ప్రాజెక్టుకు బ్యాంకుల నిర్వహణపట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జేసీ గంధం చంద్రుడు, డీఆర్డీఏ పీడీ డి. చంద్రశేఖర్ రాజు, ఆర్.బి.ఐ. డీజీఎం ఎ.ఎస్. వి. కామేశ్వరరావు, ఇండియన్ బ్యాం కు డీజీఎం రఘునందనరావు, ఎల్.డి.ఎం. నరసింహారావు పాల్గొన్నారు. -
వార్షిక రుణ ప్రణాళిక రూ. 10,107.08 కోట్లు
సకాలంలో రుణాలివ్వండి రుణాల రీషెడ్యూల్కు పూర్తి సమాచారమిస్తాం ప్రతీ కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ తెరవాలి బ్యాంకర్లకు కలెక్టర్ సూచన 40వేల మందికి రుణ అర్హత కార్డులు విజయవాడ : ప్రభుత్వ పథకాలకు సకాలంలో రుణాలు అందించటంలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. రఘునందనరావు బ్యాంకర్లను కోరారు. జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో నిర్వహించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఆర్థికంగా అభివృద్ధిపరచడానికి ప్రారంభించే యూనిట్ల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ రంగంలో రుణాలను రీషెడ్యూలు చేయడానికి బ్యాంకర్లకు పూర్తి డేటాను అందిస్తామని, జిల్లాలో నూతనంగా 40 వేల మందికి రుణ అర్హత కార్డులను జారీచేశామన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబానికీ ఖాతాలను తెరవాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. 10,107.08 కోట్లతో 2014-15 వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం 2014-15 సంవత్సరానికి గాను 10,17,986 మందికి వివిధ పథకాల కింద వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా 10 వేల 107 కోట్ల మేరకు రుణాలను అందించాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించి ఆమోదించారు. క్రాప్‌లోన్ నిమిత్తం 6,18,018 మంది రైతులకు 3659.27 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించ గా.. ఇప్పటివరకూ 90,688 మందికి రూ.604.63 కోట్లను రుణాలుగా అందించినట్లు బ్యాంకర్లకు లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్వి నరసింహారావు వివరించారు. వ్యవసాయ రుణాల రద్దు ప్రకటనవల్ల రికవరీ శాతం తగ్గిందని, ప్రభుత్వం ఈ విషయంలో నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీచే యటంతో త్వరలోనే వసూళ్లు పెరిగే అవకాశం వుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 28,783 మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతంలో రూ.1036.67 కోట్లకుగాను ఇప్పటివర కు 95.16 కోట్ల రూపాయలను అందించామన్నారు. పట్టణ ప్రాంతంలో 92 కోట్లకుగాను 19.30 కోట్లను.. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 140 కోట్లకు గాను 12కోట్ల రూపాయల రుణాలను అందించామన్నారు. రిజర్వు బ్యాంకు ప్రతినిధి ఏఎన్‌వి కామేశ్వరరావు, ఆంధ్రా బ్యాంకు డీజీఎం జీఎన్వీ కృష్ణారావు, సప్తగిరి బ్యాంకు ఆర్యం సత్యనారాయణ, నాబార్డు ఏజీయం మధుమూర్తితోపాటు వివిధ బ్యాంకర్లు పాల్గొన్నారు. -
రూ.7,260 కోట్లతో రుణప్రణాళిక
లక్ష్యాలను అధిగమించాలి బ్యాంకర్లకు కలెక్టర్ పిలుపు విశాఖ రూరల్: వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7,260 కోట్లకు మించి అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకర్లను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రాధాన్యత రంగాలకు రూ.5,377 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,883 కోట్ల మేర రుణాలు మంజూరుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమైనందున, ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలు అందిన వెంటనే ఆలస్యం చేయకుండా అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. అనకాపల్లి మండలం శంకరంలో రాజీవ్ గృహ కల్ప పథకం లబ్ధిదారుల్లో 314 మందికి బ్యాంకు రుణాలు సత్వరమే మంజూరు చేయాలని కోరారు. ఏజెన్సీలో విలీనం చేసిన, రీలొకేట్ చేసిన బ్యాంకులశాఖలను అవసరం ఉన్న ప్రాంతాల్లో మళ్లీ ఏర్పాటు చేయాలన్నారు. రుణాల రికవరీ విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, మొండి బకాయిలను వసూలుకు అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలుచేస్తామన్నారు. జిల్లాలో 91 శాతం ఆధార్‌కార్డుల జారీపూర్తయిందని, దశల వారీ అన్నిబ్యాంకు అకౌంట్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలన్నారు. ఎస్బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నివేదిక ఆవిష్కరణ అనకాపల్లిలో నిర్వహిస్తున్న స్టేట్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన గతేడాది వార్షిక కార్యాచరణ నివేదికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.జయబాబు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నూతనంగా 54 బ్యాంక్ శాఖలుప్రారంభించామని, 734 ఏటీఎం కేంద్రాలతో విస్తృత సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్బీఐ ఏజీఎం కామేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం ప్రసాదరావు, స్టేట్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంచాలకుడు షేక్‌బాబర్ వారు అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికలను కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాస్, జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, డుమా పీడీ శ్రీరాములు నాయుడు, మెప్మా పీడీ పాండురంగారావు, యూసీడీ పీడీ ప్రేమ స్వరూపారాణి, గృహ నిర్మాణ సంస్థ పీడీ ప్రసాదరావు పాల్గొన్నారు.