The goal
-
ఒక అసాధ్యాన్ని సాధిస్తా! ఈ భూమిని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా
మనం అందరం కారణజన్ములం. ఏదో ఒక ప్రత్యేకమైన గొప్ప పని చేసేందుకు ఈ భూమిపై జన్మించాం. ఇంత గొప్ప అవకాశం వృథా చేసుకోకండి. ఈ సంవత్సరం ఏదైనా కొత్త, సృజనాత్మకమైన పని మొదలుపెట్టండి. ఏదైనా కొత్త పని చేయకుండా ఏ సంవత్సరమూ గడచిపోకూడదు. మీకు ఏ కలలూ లేకపోతే, వాటిని నిజం చేసుకోలేరు కదా! ఏ కొత్త ఆవిష్కరణ అయినా ఒక కలతో మొదలవుతుంది. ఉన్నతంగా కలలుగనే, ఆలోచించే స్వేచ్ఛని మీకు మీరు ఇచ్చుకోండి. ఆపై, వాటిని సాధించేందుకు నూరుశాతం ధైర్యంతో, సమర్పణ భావంతో పనిచేయండి. చాలాసార్లు ఉన్నతమైన కలలు కనేవారిని ఇతరులు అపహాస్యం చేశారు. కానీ వారు వెనక్కు తగ్గకుండా, తమ లక్ష్యాలను సాధించేవరకూ స్థిరంగా నిలబడ్డారు. మనలో ఉండే ప్రాణశక్తి ప్రవహించేందుకు ఒక దిశను చూపటం అవసరం. దానికి సరైన దిశను చూపకపోతే మీరు గందరగోళంలో చిక్కుకుపోతారు. జీవశక్తి ఒక నిర్దిష్ట దిశలో పయనించేలా చేయాలంటే మనకు నిబద్ధత అవసరం. ఈ రోజున చాలామంది, తమ జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, దిశానిర్దేశం లేకపోవడం చేత అయోమయంలో ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ ప్రాణశక్తి తారాస్థాయిలో ఉంటుంది, మరి అంత ఎక్కువగా ఉన్న ఆ ప్రాణశక్తికి, ఎటువెళ్లాలో చెప్పకపోతే, అది అక్కడే చిక్కుకుపోతుంది. ఒకేచోట పేరుకుపోతే ఏమౌతుంది? కుళ్ళిపోయి, పనికి రాకుండా పోతుంది. ఇక్కడ రహస్యం ఏమిటీ అంటే, మన లక్ష్యం పట్ల నిబద్ధత ఎంత గొప్పగా ఉంటే, దాన్ని సాధించేందుకు అంత గొప్ప శక్తి మనకు లభిస్తుంది. లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే, పనులు అంతా సులభంగా, తేలికగా జరిగిపోతాయి. అదే చిన్న లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే మీలో సామర్థ్యం కొండంత ఉంది, మీరేమో ఈ చిన్న పనిలో ఇరుక్కుపోయారు అనిపించి మీకే చికాకుగా ఉంటుంది. మీరు సమాజం బాగు కోసం పనిచేస్తున్నప్పుడు, మీరు పది పనులు చేస్తున్నారనుకుందాం. వాటిలో ఒక పనిలో పొరపాటు జరిగినా, మిగతా తొమ్మిది పనులూ చేస్తూ ఉంటే, ఈ మొదటి పనిలో పొరపాట్లు వాటంతట అనే సర్దుకుంటాయి. సాధారణంగా కృప అనేది ఇలా పనిచేస్తుంది. మొదట అవసరమైన వనరులు సమకూరితే, అప్పుడు పెద్ద లక్ష్యం పెట్టుకుని పని చేద్దామమని మనం సాధారణంగా అనుకుంటాం. కాని, మొదట మీ లక్ష్యం గొప్పగా ఉంటే, వనరులు వాటంతట అనే సమకూరుతాయి. మనం పెట్టుకున్న లక్ష్యమే మనకు ఆ శక్తిని బహుమతిగా ఇస్తుంది. మీరు మీ కుటుంబ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి, ఆ కుటుంబమే మీకు సహాయం చేస్తుంది. మీరు సమాజం మొత్తానికి గొప్ప పనిచేయాలని సంకల్పించుకుంటే సమాజం మొత్తం మీకు సహాయపడటాన్ని మీరే చూస్తారు. మీకు కావలసిన సహాయం మీరు అడక్కముందే వచ్చి చేరుతుంది. సాధారణంగా మనం మనసులో తపనపడుతూ ఉంటాము, కానీ మన చర్యలు నెమ్మదిగా ఉంటాయి. విజయానికి సోపానం ఏమంటే, మనసులో ఓరిమి, పనిలో ఉత్సాహం. అభిరుచిని, వైరాగ్యాన్ని సరిసమానంగా స్వీకరించండి. మీ లక్ష్య సాధనకై ధైర్యంగా ముందుకు సాగండి, అవసరమైనప్పుడు వదిలేయడం కూడా నేర్చుకోవాలి. అపుడు సహజంగా సమృద్ధి చేకూరుతుంది. మీరు ధ్యానం చేసినపుడు మీరు సూక్ష్మంగా గమనించగలుగుతారు. మీకు పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది, అదే సమయంలో బుద్ధి, వివేచన, సద్యఃస్ఫూర్తి వృద్ధి చెందుతాయి. మీరు ఎఱుకతో ఉండి పనిచేస్తే అది సరైన పని అవుతుంది. చెదిరిపోని దృష్టి, సద్యఃస్ఫూర్తితో పనిచేసే మనసు మీ లక్ష్యాన్ని సాధించేందుకు సహాయ పడతాయి. ఒత్తిడి లేని, ఉత్సాహభరితమైన జీవితానికి, మీరు అనుకున్న లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో పనిచేసేందుకు సరైన మార్గం ధ్యానం. నిబద్ధత అనేది దీర్ఘకాలంలో ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా జీవించే అద్భుత ప్రదేశంగా మార్చాలని కంకణం కట్టుకోండి. అసాధ్యమైన కల కనండి! మీ నిబద్ధతకు ఆశించిన ఫలితం రావాలంటే సరైన ఆలోచనలు, సరైన చర్యలు రెండూ అవసరమే. మీరు సాధించాలనుకుంటున్న అన్ని విషయాలతో పెద్ద చిట్టా తయారు చేసుకోకండి. స్థూలంగా పరిశీలించి, నిజంగా అవసరమైన కొన్ని లక్ష్యాలను ఎంచుకోండి. మనకు అత్యంత సంతృప్తిని ఇచ్చే వాటిని, దీర్ఘకాలంలో పదిమంది జీవితాలను తీర్చిదిద్దే వాటిని ఎంచుకుని పని చేసినపుడు, మగిలిన చిన్నాచితక విషయాలు వాటంతట అవే గాడిలో పడతాయి. మనస్సు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు, మీకు సరైన ఆలోచనలు వస్తాయి. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా, వాటిని సాధించే విధానం కూడా ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ళ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ఇరవై ఏళ్ల తర్వాత? నలభై ఏళ్ళ తర్వాత? ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ విధిని నూరు శాతం నిర్వర్తించండి. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ -
సంచలనం సృష్టించేనా?
కోల్‌కతా: అచ్చొచ్చిన వేదికపై అద్భుతం సృష్టించాలనే లక్ష్యంతో భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్ కప్ బరిలోకి దిగుతోంది. మాజీ చాంపియన్ ఇటలీతో నేడు మొదలయ్యే క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్‌ను నిర్వహిస్తారు. రెండో రోజు తొలుత డబుల్స్ మ్యాచ్... ఆ తర్వాత రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి (ఇటలీ)తో 129వ ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్... రెండో సింగిల్స్‌లో ప్రపంచ 129వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో భారత నంబర్‌వన్, ప్రపంచ 102వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తలపడతారు. ఇటలీ టాప్ ర్యాంకర్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న మార్కో సెచినాటోను డబుల్స్‌లో ఆడించాలని ఆ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ కొరాడో బారాజుటి తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో సెచినాటో–సిమోన్ బొలెలీ (ఇటలీ) ద్వయంతో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట ఆడుతుంది. రివర్స్ సింగిల్స్‌లో బెరెటినితో రామ్‌కుమార్; సెప్పితో ప్రజ్నేశ్ తలపడతారు. సొంత గడ్డపై ఆడనుండటం... అదీ ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటులేని పచ్చిక కోర్టులపై మ్యాచ్‌లను నిర్వహించడం భారత్‌కు సానుకూలాంశం. ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్ అదే జోరు కొనసాగించి... డబుల్స్‌లో బోపన్న–దివిజ్ జంట మెరిస్తే భారత్ సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోవద్దు. వ్యక్తిగత ర్యాంక్‌లతో సంబంధం లేకుండా డేవిస్ కప్‌లో పలువురు భారత ఆటగాళ్లు అద్భుత విజయాలు సాధించారు. కోల్‌కతా సౌత్ క్లబ్‌లోని పచ్చిక కోర్టులపై నిర్వహిస్తున్న ఈ వేదికపై భారత్ గెలుపోటముల రికార్డు 8–2తో ఉంది. ఇదే వేదికపై చివరిసారి ఇటలీతో 1985 వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో ఆడిన భారత్ 3–2తో విజయాన్ని అందుకుంది. ఓవరాల్ ముఖాముఖి రికార్డులో భారత్ 1–4తో వెనుకబడి ఉంది. చివరిసారి ఇటలీతో 1998లో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో తలపడిన భారత్ 1–4తో పరాజయం పాలైంది. ఈ ఏడాది నుంచి డేవిస్ కప్‌ను కొత్త ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. ముందుగా 24 జట్ల మధ్య 12 స్థానాల కోసం క్వాలిఫయర్స్ జరుగుతాయి. క్వాలిఫయింగ్‌లో గెలిచిన 12 జట్లు నవంబర్ 18 నుంచి 24 వరకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో 18 జట్ల మధ్య జరిగే ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. గతేడాది సెమీఫైనల్స్ చేరిన క్రొయేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా జట్లతోపాటు ‘వైల్డ్ కార్డు’ పొందిన అర్జెంటీనా, బ్రిటన్ నేరుగా ఫైనల్స్ టోర్నీలో ఆడతాయి. ఫైనల్స్ టోర్నీలో 18 జట్లను ఆరు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ నిర్వహిస్తారు. కొత్త ఫార్మాట్ ప్రకారం ఇక నుంచి డేవిస్ కప్ మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ సెట్స్ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ సెట్స్ పద్ధతిలో ఆడిస్తారు. -
గుండె గుడిలో ఆ దీపం వెలగాలి
ఒక్కొక్కప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేకపోవచ్చు. విచారించనవసరం లేదు. మీరు కష్టపడ్డారు. త్రికరణశుద్ధిగా కృషి చేసారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే తప్పు కాదు. కానీ అసలు లక్ష్యం లేకపోవడం మాత్రం దారుణం. జీవితంలో లక్ష్యం ఉండి తీరాలి. దాన్ని సాధించగలనన్న నమ్మకం ఉండాలి. అందుకే అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత తరువాత ప్రతిజ్ఞగా ‘‘నేను నా విశ్వాసం అంత యువకుడను. సందేహమంత వృద్ధుడను. కాబట్టి నా హృదయంలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగిస్తాను’’ అని ప్రమాణం చేయించారు.మనిషికి విశ్వాసం, సందేహం పక్కపక్కనే ఉంటాయి. ఈ పని నేను చేయగలననుకుంటాడు. ఆ మరు క్షణంలోనే ‘చేయగలనా?’ అనుకుంటాడు. అందుకే నమ్మకం దృఢంగా ఉండాలి. ఒకప్పుడుకలాంగారిని ఇరాన్ నుంచి వచ్చిన కొందరు దివ్యాంగులయిన విద్యార్థులు కలిసారు. వారిలో ఆత్మ స్థయిర్యాన్ని నింపడానికి కలాంగారు ఒక కవిత రాసి వినిపించారు. ‘‘మీ శరీరంలో అక్కడక్కడా వైక్లబ్యాలు ఉండవచ్చు. కానీ మీలో భగవంతుడున్నాడు. మీకు ఎప్పుడు ఏది అవసరమో దానిని ఆయన ఎప్పుడూ భర్తీచేసి కాపాడుతూ ఉంటాడు.’’ అని చెపుతుండగా కాళ్ళు సవ్యంగా లేని ఒక విద్యార్థి చేతికర్రల సాయంతో వచ్చి కలాం గారి పక్కన నిలబడి తాను రాసిన ఒక కవితను ఆయన చేతికిచ్చాడు. అందులో ఇలా ఉంది –‘‘నాకు కాళ్ళు సరిగా లేవు. వంచలేను. కానీ ఎంతటి గొప్పవాడు నా ఎదురుగా ఉన్నా, మహారాజయినా వారి ముందు వంగవలసిన అవసరాన్ని నాకా భగవంతుడు కల్పించలేదు’’ అని ఉంది. ఆ కుర్రవాడి ఆత్మస్థయిర్యం చూసి కలాంగారు చలించి పోయారు.చేతులు తెగిపోయినా, కాళ్ళు రెండూ పూర్తిగా లేకపోయినా వారి పనులు వారు చేసుకోవడమే కాదు, చిత్రకళలవంటి కళల్లో, క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. కష్టపడి చదివి పరీక్షకు వెళ్ళేముందు క్షణంలో తండ్రి చనిపోతే, గుండె దిటవు చేసుకుని తండ్రి ఆకాంక్షలను నెరవేర్చడానికి వెళ్ళి పరీక్షలు రాసి వచ్చిన పిల్లలున్నారు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం చెదిరిపోనంత కాలం మిమ్మల్ని పడగొట్టడం ఎవరికీ సాధ్యంకాదు.మీరు ఎంత ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయాణం మొదలు పెట్టిన తరువాత ప్రతిబంధకాలు వచ్చి తీరుతాయి. అవి లేకుండా ఎవరి జీవితమూ గడవదు. సానబెడితే తప్ప వజ్రానికి కాంతి రాదు. అగ్నితప్తం చేసి సాగదీస్తే తప్ప బంగారం కూడా ఆభరణం కాదు. కష్టాలు అనుభవిస్తేనే రాణించి ప్రకాశించేది. సూర్యుడి కాంతిని అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ ఆపలేరు. ధర్మంతో ముందుకెడుతున్న వాడిని ఆపగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. వాడు ప్రకాశించి తీరతాడు. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్... ఇలా గొప్పవాళ్ళయిన వారంతా జీవితంలో భయంకరమైన కష్టాలు అనుభవించి వచ్చినవారే. మొక్క పెరుగుతున్నప్పుడు పైన ఏదో అడ్డువచ్చిందని ఆగిపోదు, దిశ మార్చుకుని పెరుగుతూ అడ్డు తొలగంగానే తిరిగి నిటారుగా పైకి లేస్తుంది. సీతాకోక చిలుకల్లా రంగులతో ఎగరాలంటే గొంగళి పురుగు దశ దాటాల్సిందే. బురదలోంచి వచ్చిన తామరపువ్వు సువాసనలు వెదజల్లుతూ వికసించినట్లుగానే మీరంతా ఆత్మ విశ్వాసంతో వికసనం చెందాలి. అటువంటి ధైర్యంతో, పూనికతో మీరంతా ముందుకు నడవాలన్న బలమైన ఆకాంక్షతోనే కలాంగారు విద్యార్థులతో ఈ ప్రతిజ్ఞలు చేయించారు. -
ప్రపంచ హాకీ చాంప్ ఆసీస్‌కు భారత్ షాక్
మెల్బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు భారత పురుషుల హాకీ జట్టు షాకిచ్చింది. యువ స్ట్రరుుకర్ ఆఫ్ఫాన్ యూసుఫ్ (19వ నిమిషంలో) రెండు ఫీల్డ్ గోల్స్‌తో చెలరేగడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో భారత్ 3-2తో గెలిచింది. డ్రాగ్ ఫ్లికర్ రఘునాథ్ (44) మరో గోల్ చేశాడు. ఆసీస్ నుంచి విల్లీస్ (36), మిట్టన్ (43) గోల్స్ సాధించారు. అత్యంత పటిష్ట జట్టుగా పేరు తెచ్చుకున్న ఆసీస్‌ను భారత్ ఆది నుంచే కట్టడి చేసింది. 19వ నిమిషంలో యూసుఫ్ తొలి గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత వెంటనే మరో ఫీల్డ్ గోల్‌తో ఆసీస్‌కు షాకిచ్చాడు. దీం తో తొలి అర్ధభాగంలోనే జట్టు 2-0తో పైచేరుు సాధించింది. కానీ ద్వితీయార్ధంలో ఆసీస్ రెండు గోల్స్‌తో మ్యాచ్‌లో నిలిచింది. ఆరుుతే వారికి ఈ ఆనందం ఎంతోసేపు నిలవకుండానే రఘునాథ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. నేడు చివరిదైన రెండో మ్యాచ్ జరుగుతుంది. -
లక్ష్యం దిశగా ‘హరితహారం’
► ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ముందంజ ► రంగారెడ్డి, హైదరాబాద్‌లో నత్తనడక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. రెండో విడత హరితహారం ప్రారంభమై నెలరోజులైంది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో సగం పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. నర్సరీల్లో ప్రజల డిమాండ్‌కు అనువైన పండ్ల మొక్కలు లేకపోవడం, ప్రభుత్వ యంత్రాం గం కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల కొద్దిరోజులుగా మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినస్థాయిలో సాగడంలేద ని అధికారులు అంటున్నారు. మూడేళ్లలో రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులు, చెట్లు ఉండాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష. అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుకు కూడా హరితహారాన్నే గీటురాయిగా తీసుకుంటున్నట్లు తరచూ అధికారుల సమావేశాల్లో సీఎం స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 8న సీఎం హరితహారంపై సమీక్షించి వర్షాకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. గ్రేటర్లో నత్తనడక హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో హరితహారం నత్తనడకన సాగుతోంది. హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు లేక కార్యక్రమం ఆశించినస్థాయిలో సాగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మొక్కలు పెంచేందుకు అనువుగా వందల ఎకరాల ఖాళీస్థలాలు, అనుకూలమైన వాతావరణమున్నా అధికారయంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనే మూడేసి కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు ప్రభుత్వలెక్కలు చెబుతున్నాయి. ఈ జిల్లాలు మాత్రమే వరుసగా మొదటి, రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. -
పుణేకు మరో విజయం
పుణే: ఐఎస్ఎల్ రెండో సీజన్లో ఎఫ్‌సీ పుణే సిటీ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. శుక్రవారం నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. దీంతో ఆరు పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో నిలిచింది. ద్వితీయార్ధం 78వ నిమిషంలో నార్త్ఈస్ట్ డిఫెండర్ జోమింగ్లియానా రాల్టే సెల్ఫ్ గోల్ చేయడంతో పుణే గట్టెక్కింది. మరోవైపు నార్త్ఈస్ట్కిది రెండో పరాజయం. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో పలు అవకాశాలు దక్కినా పుణే సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక చివర్లో రాల్టే తప్పిదంతో జట్టు కొంప ముంచాడు. -
భారత్‌ను గెలిపించిన ధరమ్వీర్
మూడో హాకీ టెస్టులో కివీస్ ఓటమి క్రైస్ట్‌చర్చ్: మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ధరమ్వీర్ సింగ్ సూపర్ గోల్ చేసి డ్రా ఖాయమనుకున్న మ్యాచ్‌ను భారత్ వశం చేశాడు. ఫలితంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో హోరాహోరీగా జరిగిన మూడో టెస్టులో భారత్ 3-2తో విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇరు జట్ల మధ్య చివరి టెస్టు జరుగుతుంది. భారత్‌కు 10వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు. రెండో క్వార్టర్ 22వ నిమిషంలో భారత డిఫెన్స్‌ను ఏమార్చుతూ కివీస్ తొలి గోల్ సాధించింది. అయితే 41వ నిమిషంలో ఆకాశ్‌దీప్ పాస్‌ను అందుకున్న రమణ్‌దీప్ ఫీల్డ్ గోల్‌తో స్కోరును పెంచాడు. నాలుగో క్వార్టర్లో భారత గోల్ అవకాశాలను కివీస్ అడ్డుకుంది. 52వ నిమిషంలో స్టీవ్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్‌తో స్కోరు 2-2తో సమమైంది. ఇక మ్యాచ్ మరో 40 సెకన్లలో ముగుస్తుందనగా ధరమ్వీర్ అద్భుత గోల్‌తో భారత్ నెగ్గింది. -
'ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణమే లక్ష్యం'
-
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
- వార్షిక లక్ష్యం రూ.11936.07 కోట్లు విజయవాడ : 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11,936కోట్ల రూపాయలు జిల్లా వార్షిక రుణ ప్రణాళికగా నిర్ధేశించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ బాబు.ఏ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి 11936.07కోట్ల రూపాయలు వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించి వివిధ రంగాలకు కేటాయించామన్నారు. ప్రాథమిక రంగాలకు 9,393.65 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా 9,34,568 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ గా కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2442.42 కోట్ల రూపాయలు కేటాయించి సుమారు 7.40లక్షల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరే విధంగా వార్షిక రుణప్రణాళికలో కేటాయింపులు జరి గాయన్నారు. ఇతర ప్రాధాన్యతా రం గాలకు 2085.07 కోట్ల రూపాయలు కేటాయింపులతో వార్షిక రుణప్రణాళిక సంప్రదింపుల కమిటీ సమావేశం లో కలెక్టర్ విడుదల చేశారు. పెలైట్ ప్రాజెక్టుగా జిల్లాలో సామాజిక భద్ర తా పింఛన్లును ఇంటర్ ఆపరబుల్ విధానంలో మల్టీచానల్ సింగిల్ అకౌంట్ మోడల్‌గా సుమారు 25వేల కు పైగా పింఛన్లు ఈ నెల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కెనరాబ్యాంకుల ద్వారా బిజి నెస్ కరస్పాండెట్లతో పంపిణీ చేయనున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి గా జిల్లాలో పెలై ట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన మల్టీచానల్ అకౌంట్ మోడల్, ఇంటర్ ఆఫరబుల్ మైక్రో ఎటిఎం విధానం ద్వారా భద్రతా పింఛన్లును పంపిణీ చేసేందుకు నిర్దేశించిన ప్రాజెక్టుకు బ్యాంకుల నిర్వహణపట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జేసీ గంధం చంద్రుడు, డీఆర్డీఏ పీడీ డి. చంద్రశేఖర్ రాజు, ఆర్.బి.ఐ. డీజీఎం ఎ.ఎస్. వి. కామేశ్వరరావు, ఇండియన్ బ్యాం కు డీజీఎం రఘునందనరావు, ఎల్.డి.ఎం. నరసింహారావు పాల్గొన్నారు. -
లక్ష్యానికి పది సూత్రాలు :సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల... ఈ పేరు తాజాగా ప్రపంచమే స్మరిస్తోంది. కలలు కనడమే కాదు... ఆ కలలను సాకారం చేసుకుని తన జీవన మార్గాన్ని సుసంపన్నం చేసుకున్నారాయన. లక్షలాది యువతకు దిక్సూచిలా నిలిచారు. ఆ.. ఇంజినీరింగే కదా... అని తేలికగా తీసుకుంటున్న సమయంలో అబ్బో.. ఇంజినీరింగా అనే స్థారుుకి తీసుకువెళ్లారు. ఏడాదికి 112 కోట్ల వేతనంతో అగ్రగామిగా నిలిచారు. మనజిల్లాలో 18 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో నుంచి ఏటా 10 వేల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. ఈ అకడమిక్ సంవత్సరంలో 40 వేల మంది ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల జీవితాన్ని ఓ పాఠంగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే విద్యార్థుల కోసం పది సూత్రాలు.. - ఒంగోలు లక్ష్యం దాదాపు 22ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల ఏదో గాలివాటంలా వెళ్లి ఆ సంస్థలో చేరిపోలేదు. అది ఆయన కల. చదువు పూర్తయిన తరువాత ప్రముఖ సంస్థ ‘సన్ మైక్రో సిస్టమ్స్’లో చేరినప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీనే ఆయన లక్ష్యం. ఆ కలను నెరవేర్చుకున్నారు. పాఠం : నేటి ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో చాలామంది ఏదో ఉద్యోగం లేదా క్యాంపస్ ఇంటర్య్వూలో ఓ కొలువు దొరికితే చాలు అనుకుని సరిపెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంటే మనలోనూ ఎందరో సత్య నాదెళ్లలు ఎదుగుతారు. ప్రజాభిమానం సైబర్ ప్రపంచంలో సత్య నాదెళ్ల పేరు మార్మోగిపోతోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆయనను ప్రకటించగానే 50కోట్ల మంది నెటిజన్లు ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. ఇక గూగుల్ సెర్చ్‌లో సత్య నాదెళ్ల పేరు టైప్ చేయగానే అర సెకనులో దాదాపు 44 కోట్ల వెబ్ పేజీలు అందబాటులోకి వచ్చాయి. సెర్చ్ రికార్డుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (65కోట్లు), బిల్‌గేట్స్ (48కోట్లు), తరువాత మూడో వ్యక్తిగా సత్య నిలిచారు. పాఠం : ఉన్నత భవిష్యత్తే ప్రాతిపదికగా చేసుకుంటే ఎంతోమంది నెటిజన్ల కళ్లు మీ కోసం వెదుకుతాయి. శక్తిసామర్థ్యం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికవడం భారతీయ విద్యార్థుల సత్తాకు నిదర్శనం. అమెరికా, చైనాతో సమానంగా కొందరు భారతీయ విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను చూపుతున్నారు. లేదంటే 47 ఏళ్ల సత్యకు మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ సారథ్యం ఎలా లభిస్తుంది. పాఠం: ఆకాశమా నీవెక్కడ... అంటూ ముందే చతికిలపడిపోకూడదు. ఆకాశమే హద్దు అంటూ ఎదిగితే అవకాశం మీదే అని ఆచరణలో చాటి చెప్పారు నాదెళ్ల. ఏటా బయటకు వస్తున్న ఇంజినీర్లను చూసి అమెరికానే నోరెళ్ల పెడుతోంది. ఆత్మస్థైర్యం ‘ప్రపంచమంతా సాఫ్ట్వేర్ శక్తితో మున్ముందుకు దూసుకువెళ్తోంది. మైక్రోసాఫ్ట్ పగ్గాలను అందుకోవడం ద్వారా నవకల్పనలతో నాదైన ముద్రను వేయడానికి వీలవుతుందనే నేను ఈ అత్యున్నత పదవిని అధిష్టించేందుకు ముందుకొచ్చా. అయితే, ఈ అవకాశం వచ్చేముందు ఎందుకు సీఈవో కావాలనుకుంటున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నా. 1.3 లక్షల మంది మానవ మేధస్సులతో నిండిన మైక్రోసాఫ్ట్ వంటి అత్యుత్తమ కంపెనీకి సారథ్యం వహించడం ద్వారా మనమేంటో ప్రపంచానికి చాటి చెప్పగల అద్భుత అవకాశం లభించినట్టే. ఇదే నా అంతరాత్మ నాకు చెప్పింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నా సంసిద్ధతను వ్యక్తం చేశా.’ అని సత్య పేర్కొన్నారు. పాఠం : పెద్ద అవకాశాలు కళ్లముందున్నా... ఆ బాధ్యతకు నేను తగను. ఆ స్థాయి నాది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ సత్యం అలా అనుకోలేదు. ఆ పదవికి నేనే అర్హుడిని అనే ఆత్మస్థైర్యాన్ని స్వీకరించారు. ఆ ధైర్యం అందరూ అలవరుచుకోవాలి. నాయకత్వం ‘ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. ఇంజినీరింగ్ నేపథ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడిగా నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సత్యకు బాగా తెలుసు.’ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. పాఠం: ఎంత అదృష్టం. సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి కనిపించలేదంటూ సంస్థ అధినేతే ప్రశంస. ఏ సంస్థలో.. ఏ రంగంలో పనిచేసినా అధినేతల మెప్పును పొందాలంటే ఎంత కృషి... కఠోర శ్రమ కావాలి. ఆ స్ఫూర్తిని ఆయన్నుంచే తీసుకుంటే... విజయాలే మన వెంట. నైపుణ్యం సత్య అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలరు. సత్య నాదెళ్ల గొప్ప సీఈవో అవుతారన్న నమ్మకం నాకుంది. - స్టీవ్ బామర్, వైదొలుగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో పాఠం : సహజంగా ఆ స్థానాన్ని ఎవరైనా అధిరోహిస్తే అప్పటివరకు ఆ సీట్లో ఉన్నవాళ్లలో అసూయ ఆవహిస్తుంది. కానీ మాజీ సీఈవో బామర్ అలా అనుకోలేదు. ఆ సామర్థ్యం నాదెళ్లకే ఉందంటూ స్వాగ తించడం గొప్ప స్ఫూర్తిమంత్రం. చిన్న ఉద్యోగి నుంచి ఉన్నత వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సిన మంచి సూత్రం. నమ్మకం రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం కానుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్, సాఫ్ట్వేర్ ప్రాణం పోసుకుని మనం చేస్తున్న అనేక పనుల్లోకి, వ్యాపారాల్లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకి చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. - సత్య నాదెళ్ల పాఠం : ముందు చూపును చెబుతోంది ఈ సూత్రం. ఏ రంగం ఎంచుకున్నా ముందు తరాల్లోకి ఎలా దూసుకుపోతుందో ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం అని చెబుతోంది. పట్టుదల ‘మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అనుమానాన్ని దరిదాపుల్లోకి రానీయకూడదు. అప్పుడే చేయాల్సిన పనిపై స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతిభ పునాదిపై నవలోకాన్ని నిర్మిద్దాం.’ - సత్య నాదెళ్ల పాఠం: ఆదిలోనే హంసపాదులు ఎంచే వాళ్లు చాలామంది మనలో ఉన్నారు. చేసేది మంచి పని అయినప్పుడు అనుమానాల్సి దరిచేరనీయవ ద్దని చెబుతోంది ఈ సూత్రం. భయం ఉదయించినపుడే అపజయం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నేటి తరానికి. స్ఫూర్తి హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఓసారి క్రికెట్ మ్యాచ్‌లో నేను మామూలుగా బౌలింగ్ చేస్తున్నాను. వికెట్లు పడడం లేదు. ఆ క్షణంలో మా కెప్టెన్ తనే బాల్‌ను తీసుకుని వికెట్లు తీసి ఆ తరువాత మళ్లీ నాకు బౌలింగ్ ఇలా చేయ్ అంటూ బాల్‌ను చేతికిచ్చారు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇదేనా నాయకత్వం లక్షణం. - సత్య నాదెళ్ల పాఠం: ఆటలోనూ సందేశం అందిపుచ్చుకున్నారీయన. అలా కాదు ఇలా అని చెప్పేవాళ్లు మనకూ తారసపడతుంటారు. కానీ అక్కడితో అది మరిచిపోతుంటాం. అందులోంచి స్ఫూర్తి తీసుకోవాలంటున్నారు నాదెళ్ల. విజయం ఏడాదికి రూ.112 కోట్లు, పాత సీఈవో మూల వేతనం కన్నా ఆయనకు 70 శాతం ఎక్కువే. కంపెనీ అందించే మరిన్ని సౌకర్యాలు అదనం. పాఠం : నాదెళ్లవైపు ఇప్పుడు ప్రపంచమే చూస్తోంది. ఆ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తే అంతకాకపోయినా అందులో సగం దూరమైనా వెళ్లొచ్చు. యువతా.. బెస్ట్ ఆఫ్ లక్..