ప్రపంచ హాకీ చాంప్ ఆసీస్‌కు భారత్ షాక్ | Shock in Australia to the World Hockey Champ | Sakshi
Sakshi News home page

ప్రపంచ హాకీ చాంప్ ఆసీస్‌కు భారత్ షాక్

Nov 29 2016 11:58 PM | Updated on Sep 4 2017 9:27 PM

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు భారత పురుషుల హాకీ జట్టు షాకిచ్చింది.

మెల్‌బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు భారత పురుషుల హాకీ జట్టు షాకిచ్చింది. యువ స్ట్రరుుకర్ ఆఫ్ఫాన్ యూసుఫ్ (19వ నిమిషంలో) రెండు ఫీల్డ్ గోల్స్‌తో చెలరేగడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో భారత్ 3-2తో గెలిచింది. డ్రాగ్ ఫ్లికర్ రఘునాథ్ (44) మరో గోల్ చేశాడు. ఆసీస్ నుంచి విల్లీస్ (36), మిట్టన్ (43) గోల్స్ సాధించారు. అత్యంత పటిష్ట జట్టుగా పేరు తెచ్చుకున్న ఆసీస్‌ను భారత్ ఆది నుంచే కట్టడి చేసింది.

19వ నిమిషంలో యూసుఫ్ తొలి గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత వెంటనే మరో ఫీల్డ్ గోల్‌తో ఆసీస్‌కు షాకిచ్చాడు. దీం తో తొలి అర్ధభాగంలోనే జట్టు 2-0తో పైచేరుు సాధించింది. కానీ ద్వితీయార్ధంలో ఆసీస్ రెండు గోల్స్‌తో మ్యాచ్‌లో నిలిచింది. ఆరుుతే వారికి ఈ ఆనందం ఎంతోసేపు నిలవకుండానే రఘునాథ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. నేడు చివరిదైన రెండో మ్యాచ్ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement