పుణేకు మరో విజయం
పుణే: ఐఎస్‌ఎల్ రెండో సీజన్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. దీంతో ఆరు పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో నిలిచింది. ద్వితీయార్ధం 78వ నిమిషంలో నార్త్‌ఈస్ట్ డిఫెండర్ జోమింగ్లియానా రాల్టే సెల్ఫ్ గోల్ చేయడంతో పుణే గట్టెక్కింది.
మరోవైపు నార్త్‌ఈస్ట్‌కిది రెండో పరాజయం. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో పలు అవకాశాలు దక్కినా పుణే సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక చివర్లో రాల్టే తప్పిదంతో జట్టు కొంప ముంచాడు.